హైదరాబాద్:స్కూల్ అసిస్టెంట్లు, సెకండరీ గ్రేడ్ టీచర్లు(ఎస్‌జీటీ) వేతనాల్లో భారీ వ్యత్యాసం ఉండడంపై ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. తెలంగాణలోని దాదాపు 80 వేలమంది ఎస్‌జీటీల వేతన వ్యత్యాసం భారీగా ఉంది. స్కూల్ అసిస్టెంట్లతో పోల్చితే ప్రతి పీఆర్‌సీకి పెద్ద మొత్తంలో అంతరం ఏర్పడుతోందని ఉపాధ్యాయ సంఘాలు పేర్కొంటున్నాయి.ఒకే రకమైన పని చేస్తున్న టీచర్ల వేతనాల్లో భారీ వ్యత్యాసం పెరుగుతుండటాన్ని సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి.
పదో పీఆర్‌సీలోనైనా ఈ వేతన వ్యత్యాసాలను తొలగించాలని పీఆర్‌టీయూ-తెలంగాణ అధ్యక్షుడు హర్షవర్ధన్‌రెడ్డి కోరారు. ఈ మేరకు సోమవారం పీఆర్‌సీ హైపవర్ కమిటీ చైర్మన్ ప్రదీప్‌చంద్రను కలసి వేతన వ్యత్యాసాలను తగ్గించాలని డిమాండ్ చేశారు.