హైదరాబాద్: ఎల్బీనగర్‌లో స్కూల్, కాలేజీ బస్సులపై ఆర్టీసీ అధికారులు దాడులు నిర్వహించారు. నిబంధనలకు విరుద్దంగా రోడ్లపై తిరుగుతున్న నాలుగు కాలేజీ బస్సులను సీజ్ చేశారు. మరో రెండు బస్సులపై కేసులు నమోదు చేశారు. అంతేకాక 60ఏళ్ల పైబడిన డ్రైవర్.. ఓ స్కూల్ బస్ ను నడుపుతుండగా ఆర్టీసీ అధికారులు గుర్తించారు. అతనిపై కేసు నమోదు చేసి బస్సును సీజ్ చేశారు. ఈ దాడులు కొనసాగుతాయని ఇబ్రహీంపట్నం ఆర్టీఏ అధికారి తెలిపారు. వేలకు వేలు ట్రాన్స్‌పోర్ట్ ఫీజులు వసూలు చేస్తున్న స్కూల్ యాజమాన్యాలు... బస్సుల ఫిట్‌నెస్ గురించి కూడా ఆలోచించాలంటున్నారు అధికారులు. లేనిపక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు.