
ఫీజు చెల్లించలేదని..
* విద్యార్థులను ఇంటికి పంపించిన స్కూల్ యాజమాన్యం
* మండల కేంద్రంలో ఘటన
డిచ్‌పల్లి : ఫీజు చెల్లించలేదన్న కారణంలో ఓ పాఠశాల యాజ మాన్యం విద్యార్థులను బడినుంచి ఇంటికి పంపించింది. వివరాలిలా ఉన్నాయి. మీడియా విజన్ చానల్‌లో వీడి యో జర్నలిస్ట్‌గా పనిచేసే ఘన్‌పూర్‌కు చెందిన అప్సర్ పిల్లలు అమేర్ పాషా(9వ తరగతి), అస్రా జబిన్ (6వ), ఒవెస్(3వ) మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ హైస్కూల్ లో చదువుతున్నారు. సోమవారం అర్ధవార్షిక పరీక్షలు ప్రారంభమయ్యాయి.
పరీక్షలు రాయడానికి వెళ్లిన ముగ్గురినీ పాఠశాల యాజమాన్యం ఫీజు కట్టలేదన్న కారణంతో ఇంటికి పంపించింది. జిల్లాలోని వర్కింగ్ జర్నలిస్టుల పిల్లలకు ఫీజులో 50 శాతం రాయితీ ఇవ్వాలని జిల్లా విద్యాశాఖాధికారి (డీఈఓ) శ్రీనివాసాచారి గతంలో ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విషయాన్ని పాఠశాల యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని, మొత్తం ఫీజు చెల్లిం చాల్సిందేనని పేర్కొన్నారని అప్సర్ తెలిపారు.
డీఈఓ ఇచ్చిన ఉత్తర్వుల కాపీని చూపించినా నిర్లక్ష్యంగా మాట్లాడారన్నారు. ఈ విషయాన్ని ఎంఈఓ సాయిలు దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదన్నారు. డీఈఓ ఉత్తర్వులను అమలు చేయకుండా, ఫీజు చెల్లించలేదన్న కారణంతో విద్యార్థులను బయటికి పంపించిన పాఠశాల యాజమాన్యంపై డీఈఓకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.