పాలెం బస్సు దుర్ఘటన నేపథ్యంలో ఆర్టీఏ అధికారులు ప్రైవేట్ ట్రావెల్స్పై దాడులు ఆదివారం కూడా కొనసాగాయి. నగర శివారుల్లోని పటాన్చెరువు ఔటర్ రింగ్ వద్ద నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ఐదు బస్సులను ఆర్టీఏ అధికారులు పట్టుకున్నారు. అనంతరం వాటిని సీజ్ చేశారు. అలాగే కర్నూలు జిల్లాలో పుల్లూరు టోల్ప్లాజా వద్ద ఆర్టీఏ తనిఖీలు నిర్వహించింది. ఆ తనిఖీలలో ఏడు ప్రైవేట్ బస్సులను సీజ్ చేశారు.
మహబూబ్నగర్ జిల్లా కొత్తకోట మండలం పాలెం సమీపంలో బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అగ్నికి ఆహుతి అయింది. ఆ ఘటనలో 45 మంది ప్రయాణికులు సజీవ దహనమైయ్యారు. అప్పటి వరకు నిద్ర మత్తులో జోగుతున్న రవాణ శాఖ ఆ ఘటనతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అంతేకాకుండా ఆ దుర్ఘటనపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తాయి. దాంతో ప్రైవేట్ ట్రావెల్స్పై రవాణ శాఖ చర్యలకు ఉపక్రమించింది.