కడప టౌన్: నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న బస్సులను గుర్తించేందుకు జిల్లా ఆర్టీఏ విభాగం సిద్ధమైంది. ఈ చర్యల్లో భాగంగా సోమవారం జిల్లా వ్యాప్తంగా ఉన్న పలు స్కూల్ బస్సులను ఆర్టీఏ అధికారులు పరిశీలిస్తున్నారు. ఫిట్‌నెస్ సర్టిఫికేట్ లేకుండా స్కూల్ బస్సులను నడిపితే చట్టపరంగా చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే కడప నగరంలో రెండు బస్సులను వారు గుర్తించి సీజ్ చేసినట్లు సమాచారం. జిల్లా వ్యాప్తంగా దాడులు కొనసాగుతున్నాయి.