► నిబంధనలు ఉల్లంఘిస్తే వాహనాల సీజ్ - డీటీసీ
► 70 వాహనాలు సీజ్, రూ. 2.50 లక్షలు జరిమానా
కడప: జిల్లా వ్యాప్తంగా నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న వాహనాలపై రవాణా శాఖ అధికారులు డీటీసీ మల్లేపల్లె బసిరెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం దాడులు నిర్వహించారు. కడప నగరంలోని బిల్టప్ సమీపంలో నిర్వహించిన దాడుల్లో డీటీసీ స్వయంగా పాల్గొన్నారు. ఎఫ్‌సీ లేని కారణంగా జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన దాడుల్లో 70 వాహనాలను రవాణా శాఖ అధికారులు సీజ్ చేసి రూ.2.50లక్షలు జరిమానా విధించారు. ప్రధానంగా వీటిల్లో 16 వివిధ విద్యాసంస్థల బస్సులు ఉన్నాయి. 10 రిజిస్ట్రేషన్ లేని మోటార్ సైకిళ్లు సీజ్ చేశారు.
మిగిలిన 44 వాహనాల్లో ఒక పొక్లైనర్, ఆటోలు, ట్రాక్టర్లు ఉన్నాయి. ఈ సందర్భంగా డీటీసీ మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా వాహనాలను నడిపితే సీజ్ చేస్తామని హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా 1051 విద్యాసంస్థల బస్సులు ఉంటే వాటిలో 606 బస్సులకు మాత్రమే ఎఫ్‌సీలు పూర్తయ్యాయన్నారు. మిగిలిన 445 విద్యాసంస్థల బస్సులకు ఎఫ్‌సీలు, ఇతర రికార్డులు లేవన్నారు. వెంటనే విద్యాసంస్థల యాజమాన్యాలు స్పందించి తమ వాహనాలకు ఎఫ్‌సీలు చేయించుకోవాలన్నారు. ఈ దాడుల్లో ఎంవీఐ శ్రీనివాసులు, ఏ ఎంవీఐ జగదీష్ పాల్గొన్నారు.
ప్రైవేటు స్కూలు బస్సులపై ఆర్టీఏ దాడులు
Published Wed, Jun 15 2016 9:15 AM | Last Updated on Mon, Sep 4 2017 2:33 AM
Advertisement