శంషాబాద్ : శంషాబాద్ మండలం గగన్ పహాడ్ వద్ద ఆర్టీఏ అధికారులు గురువారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తున్న సుమారు 100 బస్సులను తనిఖీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న 12 ప్రైవేట్ బస్సులపై ఆర్టీఏ అధికారులు కేసులు నమోదు చేశారు. అలాగే రెండు బస్సులను సీజ్ చేశారు.