private buses seized
-
ప్రైవేట్ ట్రావెల్స్‌పై ఆర్టీఏ కొరడా
కడప: వైఎస్సార్ జిల్లా కడప నగర శివారులో ఆర్టీఏ అధికారులు గురువారం ఉదయం తనిఖీలు నిర్వహించారు. అనుమతి లేకుండా అక్రమంగా తిరుగుతున్న 67 ప్రైవేటు బస్సుల యజమానులపై కేసులు నమోదుచేశారు. అధిక చార్జీలు వసూలు చేస్తున్న మూడు బస్సులను ఈ తనిఖీలలో భాగంగా సీజ్ చేశారు. అలాగే టాక్స్ చెల్లించకుండా సర్వీసులు నడుపుతున్న 13 బస్సులపై కేసులు నమోదుచేయడంతో పాటు రూ.6లక్షల రూపాయల జరిమానా వసూలుచేశారు. -
ఆర్టీఏ తనిఖీలు : రెండు బస్సులు సీజ్
శంషాబాద్ : శంషాబాద్ మండలం గగన్ పహాడ్ వద్ద ఆర్టీఏ అధికారులు గురువారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తున్న సుమారు 100 బస్సులను తనిఖీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న 12 ప్రైవేట్ బస్సులపై ఆర్టీఏ అధికారులు కేసులు నమోదు చేశారు. అలాగే రెండు బస్సులను సీజ్ చేశారు. -
రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రైవేట్ బస్సులు సీజ్
రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న ప్రైవేట్ ట్రావెల్స్‌కు చెందిన బస్సులపై ఆర్టీఏ అధికారులు మంగళవారం దాడులు నిర్వహించారు. ఎల్ బీ నగర్లో 10 బస్సులను సీజ్ చేశారు. అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరు - కలపర్రు టోల్‌గేటు వద్ద ఆర్టీఏ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్బంగా మేఘనా ట్రావెల్స్‌కు చెందిన బస్సును సీజ్ చేశారు. వీటితోపాటు కర్నూలు జిల్లాలోని పుల్లూరు టోల్గేట్ వద్ద ఆర్టీఏ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్బంగా మూడు బస్సులను సీజ్ చేశారు. గతేడాది చివరిలో మహబూబ్‌నగర్ జిల్లాలోని కొత్తకోట మండలం పాలెం వద్ద బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తున్న జబ్బార్ ట్రావెల్స్ బస్సు దగ్ధమైంది. ఆ ఘటనలో 45 మంది అగ్నికి ఆహుతి అయ్యారు. దాంతో ఆర్టీఏ అధికారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అదికాక ప్రభుత్వ వైఫల్యం వల్లే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు అగడాలు రోజురోజూకు అధికమవుతున్నాయని పలువురు ఆరోపణలు చేస్తున్నారు. దాంతో ఆర్టీఏ అధికారులు ప్రైవేట్ ట్రావెల్స్‌పై దాడులు ముమ్మరం చేశారు. -
అనంతపురంలో16 వోల్వో బస్సులు సీజ్
అనంతపురం : రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీఏ అధికారులు తనిఖీలు కొనసాగుతున్నాయి. నిబంధనలకు విరుద్దంగా తిరుగుతున్న వాహనాలను పలు జిల్లాల్లో సుమారు 50కి పైగా బస్సులను అధికారులు సీజ్ చేశారు. ఒక్క అనంతపురం జిల్లాలోనే 16 బస్సులను అడ్డుకున్నారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళుతున్న 16 వోల్వో బస్సులను ఆర్టీఏ అధికారులు సోమవారం అనంతపురం వద్ద సీజ్ చేశారు. దాంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక చిత్తూరు జిల్లాలోనూ అయిదు ప్రయివేటు బస్సులను అధికారులు సీజ్ చేసి కేసులు నమోదు చేశారు. మరోవైపు పశ్చిమ గోదావరి జిల్లా కలపర్రు టోల్గేట్ వద్ద డీటీసీ శ్రీదేవి ఆధ్వర్యంలో రవాణా శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆరు ప్రయివేట్ బస్సులతో పాటు, ఓవర్ లోడ్‌తో వెళుతున్న ఆరు లారీలను సీజ్ చేశారు. -
20 ప్రైవేట్ బస్సులను సీజ్ చేసిన రవాణ శాఖ
మహబూబ్‌నగర్ జిల్లాలోని పాలెం బస్సు దుర్ఘటన నేపథ్యంలో రవాణశాఖ అధికారులు చేపట్టిన దాడులు బుధవారం కూడా కొనసాగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 20 బస్సులు సీజ్ చేసినట్లు ఆ శాఖ అధికారులు వెల్లడించారు. హైదరాబాద్ నగరంలో 9, కర్నూలులో 2, అనంతపురంలో 5,గుంటూరులో 4 బస్సులను సీజ్ చేసినట్లు తెలిపారు. రంగారెడ్డి జిల్లాలోని ఆరంగళ్ చౌరస్తాలో నాలుగు బస్సులను ఆర్టీఏ అధికారులు సీజ్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా నడిపే ప్రైవేట్ వాహనాలపై కఠిన చర్యలు తప్పవని డిప్యూటీ ట్రాన్‌పోర్ట్ కమిషనర్ సుందర్ బుధవారం ప్రైవేట్ ట్రావెల్స్ యజమానులను హెచ్చరించారు. గత నెలలో మహబూబ్ నగర్ జిల్లాలోని కొత్తకోట మండలం పాలెంలో బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తున్న ప్రైవేట్ బస్సు అగ్నికి ఆహుతి అయింది. ఆ ఘటనలో 46 మంది మరణించారు. ఆ ఘటనతో నిద్రావస్థలో ఉన్న రాష్ట్ర రవాణ శాఖ కొద్దిపాటి ఉలికిపాటుకు గురైంది. ఈ నేపథ్యంలో ప్రైవేట్ ట్రావెల్స్ పై దాడులు రవాణశాఖ దాడులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. -
ఎల్బీ నగర్లో 11 ప్రైవేట్ బస్సులు సీజ్
-
ఎల్బీ నగర్లో 11 ప్రైవేట్ బస్సులు సీజ్
మహబూబ్‌నగర్ జిల్లాలో ఇటీవల బస్సు దగ్ధమైన నేపథ్యంలో రవాణాశాఖ అధికారులు రాష్ట్రంలోని ప్రైవేట్ బస్సులపై కొరడ ఝుళిపిస్తున్నారు. అందులోభాగంగా నగరంలోని ఎల్బీనగర్లో ప్రాంతంలో గురువారం తెల్లవారుజామున 11 బస్సులను సీజ్ చేసినట్లు ఆర్టీఏ అధికారి ప్రసాద్ వెల్లడించారు. పర్మిట్, ఫిట్నెస్లు లేకుండా ఆ బస్సులు నడుపుతున్నారని ఆయన తెలిపారు. కల్యాణి, ఎస్వీఆర్, కావేరి, అజంత, మేఘన, అంజన, కాలేశ్వరి, మూన్లైట్, శ్రీ ట్రావెల్స్ సీజ్ చేసిన ట్రావెల్స్‌లో ఉన్నాయని ఆయన వివరించారు. అలాగే శంషాబాద్ సమీపంలోని షాపూర్ వద్ద 8 బస్సులను కూడా అధికారులు సీజ్ చేశారు. గత గురువారం నుంచి రాష్ట్రంలో చేపట్టిన తనిఖీల్లో ఇప్పటి వరకు 376 ప్రైవేట్ బస్సులను సీజ్ చేసినట్లు రవాణా శాఖ ఉన్నతాధికారులు వెల్లడించారు. గుంటూరు జిల్లాలో ఈ రోజు నిర్వహించిన ఆర్టీఏ దాడుల్లో ఆరు బస్సులను సీజ్ చేశారు. గత ఐదురోజులుగా జిల్లాలోని పలు ప్రాంతాల్లో చేసిన దాడుల్లో ఇప్పటి వరకు 33 బస్సులను సీజ్ చేసినట్లు జిల్లా రవాణాశాఖ ఉన్నతాధికారులు వెల్లడించారు. గత బుధవారం తెల్లవారుజామున మహబూబ్‌నగర్ జిల్లాలోని కొత్తకోట మండలం పాలెం వద్ద బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తున్న ప్రైవేట్ బస్సు అగ్ని ప్రమాదానికి గురైంది. ఆ ఘటనలో 45 మంది అగ్నికి ఆహుతి అయ్యారు. ఆ ఘటనతో మొద్దు నిద్రలో ఉన్న రవాణ శాఖ ఒక్కసారిగా ఉలికిపాటికి గురైంది. దాంతో రాష్ట్రంలోని ప్రైవేట్ ట్రావెల్స్‌పై కొరడా ఝుళిపించింది.