రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రైవేట్ బస్సులు సీజ్ | RTA Officials became alert; Private Buses seized all over the state | Sakshi
Sakshi News home page

రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రైవేట్ బస్సులు సీజ్

Published Tue, Jan 21 2014 10:04 AM | Last Updated on Sat, Sep 2 2017 2:51 AM

RTA Officials became alert; Private Buses seized all over the state

రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న ప్రైవేట్ ట్రావెల్స్కు చెందిన బస్సులపై ఆర్టీఏ అధికారులు మంగళవారం దాడులు నిర్వహించారు. ఎల్ బీ నగర్లో 10 బస్సులను సీజ్ చేశారు. అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరు - కలపర్రు టోల్గేటు వద్ద ఆర్టీఏ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్బంగా మేఘనా ట్రావెల్స్కు చెందిన బస్సును సీజ్ చేశారు. వీటితోపాటు కర్నూలు జిల్లాలోని పుల్లూరు టోల్గేట్ వద్ద ఆర్టీఏ అధికారులు తనిఖీలు నిర్వహించారు.

 

ఈ సందర్బంగా మూడు బస్సులను సీజ్ చేశారు. గతేడాది చివరిలో మహబూబ్నగర్ జిల్లాలోని కొత్తకోట మండలం పాలెం వద్ద బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తున్న జబ్బార్ ట్రావెల్స్ బస్సు దగ్ధమైంది. ఆ ఘటనలో 45 మంది అగ్నికి ఆహుతి అయ్యారు. దాంతో ఆర్టీఏ అధికారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అదికాక ప్రభుత్వ వైఫల్యం వల్లే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు అగడాలు రోజురోజూకు అధికమవుతున్నాయని పలువురు ఆరోపణలు చేస్తున్నారు. దాంతో ఆర్టీఏ అధికారులు ప్రైవేట్ ట్రావెల్స్పై దాడులు ముమ్మరం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement