Ongole: ఆర్టీఏ అధికారుల తీరుపై సీఎం జగన్‌ సీరియస్‌ | CM YS Jagan Serious On Ongole RTA Officials Behavior | Sakshi
Sakshi News home page

Ongole: ఆర్టీఏ అధికారుల తీరుపై సీఎం జగన్‌ సీరియస్‌

Published Thu, Apr 21 2022 12:28 PM | Last Updated on Thu, Apr 21 2022 3:39 PM

CM YS Jagan Serious On Ongole RTA Officials Behavior - Sakshi

సాక్షి, ప్రకాశం జిల్లా: ఒంగోలులో ఆర్టీఏ అధికారుల తీరుపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీఏ అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సీఎం కాన్వాయ్‌ కోసం వాహనాలు సమకూర్చాలని సిబ్బంది ఒత్తిళ్లు తెస్తున్నారంటూ సీఎం వైఎస్‌ జగన్‌ దృష్టికి వార్తా కథనాలు వచ్చాయి. వాటిపై స్పందించిన సీఎం ప్రజలను ఇబ్బందులు పెడితే సహించబోమంటూ గట్టి సంకేతాలు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.

ఇద్దరు సస్పెన్షన్‌
ఈ ఘటనపై విచారణ జరిపిన ఉన్నతాధికారులు.. బాధ్యులపై చర్యలు చేపట్టారు. ఈమేరకు ఒంగోలు ఏఎంవీఐ సంధ్య, హోంగార్డ్‌ తిరుపాల్‌రెడ్డిలను ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది.
చదవండి: మన పంతం 'అవినీతి అంతం'

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement