rta officials
-
ప్రైవేట్ ట్రావెల్స్ పై ఆర్టీఏ కొరడా
-
ఆర్టీఏ ఆఫీసులపై ఏసీబీ దాడులు
సాక్షి, హైదరాబాద్/సాక్షి నెట్వర్క్: అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా పలు రోడ్డు ట్రాన్స్పోర్ట్ అథారిటీ (ఆర్టీఏ) కార్యాలయాలు, చెక్పోస్టులపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు ఆకస్మిక దాడులు చేశారు. మంగళవారం ఏకకాలంలో 15 ఏసీబీ బృందాలు.. మొత్తం 12 ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టాయి. దాదాపు అన్ని కార్యాలయాల్లో అనధికారిక వ్యక్తులు ఇతరులకు చెందిన ధ్రువపత్రాలతో ఉన్నట్టు గుర్తించారు. పలు కార్యాలయాల్లో సిబ్బంది యూనిఫాం లేకుండానే విధులు నిర్వర్తిస్తున్నట్టు గమనించారు. ఏసీబీ అధికారులను చూసిన ఏజెంట్లు పరారయ్యారు. కార్యాలయాల సమీపంలోని తమ దుకాణాలను మూసివేశారు. కాగా దాడులు, తనిఖీల సందర్భంగా లెక్కల్లో చూపని రూ.2,70,720 నగదు స్వా«దీనం చేసుకున్నట్టు ఏసీబీ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ప్రాంతాల వారీగా వివరాలు వెల్లడించింది. బండ్లగూడలో రూ.48,370ను స్వాధీనం హైదరాబాద్ బండ్లగూడ కార్యాలయంలో జరిపిన సోదాల్లో రూ.48,370 స్వా«దీనం చేసుకున్నారు. మలక్‌పేట కార్యాలయంలో రూ.22 వేలు, టోలిచౌకి కార్యాలయంలో రూ.43,360, మణికొండలోని రంగారెడ్డి డీటీసీ కార్యాలయం రూ.23,710 స్వా«దీనం చేసుకున్నారు. ఇక నల్లగొండ కార్యాలయంలో రూ.12,200, నిజామాబాద్‌లోని సాలూర్ చెక్‌పోస్టులో రూ.13,500, ఆదిలాబాద్‌లోని భోర్జా చెక్‌పోస్టులో రూ.11,630, మహబూబాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో రూ.61,900, ఖమ్మంలోని అశ్వరావుపేట చెక్‌పోస్టులో రూ.34,050 స్వాదీనం చేసుకున్నారు. మహబూబ్‌నగర్, సిద్దిపేట, కరీంనగర్ కార్యాలయాల్లో సోదాల సందర్భంగా నగదు పట్టుబడనప్పటికీ పలువురు అనధికారిక వ్యక్తులు ఇతరులకు సంబంధించిన ధ్రువపత్రాలతో ఉన్నట్టు గుర్తించారు. కొన్నిచోట్ల కొందరు ఉద్యోగులు యూనిఫాం లేకుండానే విధులు నిర్వర్తిస్తున్నట్టు గుర్తించారు. మహబూబ్‌నగర్‌లో డ్రైవింగ్ టెస్టు ట్రాక్ దగ్గర ఒక ప్రైవేట్ కారు ఏర్పాటు చేసి ఒక్కొక్కరి దగ్గర రూ.200 వసూలు చేస్తున్నట్లు గుర్తించారు. ధ్రువపత్రాలపై ప్రత్యేక కోడ్ సిద్దిపేట ఆర్టీఏ కార్యాలయంలో పలువురు ప్రైవేటు వ్యక్తులు ప్రత్యేక కోడ్ నంబర్లు వేసి ఉన్న కొన్ని ధ్రువపత్రాలతో ఉన్నట్టు గుర్తించారు. నిజామాబాద్‌లోని సాలూరు చెక్‌పోస్టులో అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ విధులకు హాజరుకాలేదని గుర్తించారు. అశ్వారావుపేట చెక్‌పోస్టులో మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ మఫ్టీలో ఉండగా, ఏడుగురు ప్రైవేటు వ్యక్తులు వాహనాల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్టు గుర్తించారు. ఆదిలాబాద్‌లోని భోర్జా చెక్‌పోస్టులో ప్రైవేటు వ్యక్తులకు నెలకు రూ.8 వేల చొప్పున జీతం చెల్లిస్తూ వారితో లారీడ్రైవర్ల వద్ద నుంచి డబ్బులు వసూలు చేయిస్తున్నట్టు తనిఖీల్లో భాగంగా గుర్తించారు. మంగళవారం నాటి దాడుల సందర్భంగా వివిధ ఆర్టీఏ కార్యాలయాల్లో గుర్తించిన అక్రమాలపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రభుత్వానికి సమగ్ర నివేదిక పంపనున్నట్టు ఏసీబీ అధికారులు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే ఏసీబీ టోల్‌ఫ్రీ నంబర్ 1064లో ఫిర్యాదు చేయాలని ఉన్నతాధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. లారీ డ్రైవర్ల వేషధారణలో.. – అశ్వారావుపేట చెక్‌పోస్టుపై ఏసీబీ దాడులు – అదుపులో ఎంవీఐ, ప్రైవేటు సిబ్బంది అశ్వారావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట శివారులో ఉన్న రవాణా శాఖ చెక్‌పోస్టు వద్ద తనిఖీలకు ఏసీబీ అధికారులు లారీ డ్రైవర్ల వేషధారణలో వెళ్లారు. ఏపీకి సరిహద్దునే ఉన్న ఈ చెక్‌పోస్టు వద్ద సిబ్బంది లారీ డ్రైవర్ల నుంచి అక్రమంగా నగదు వసూలు చేస్తున్నట్టు గుర్తించారు. ప్రైవేట్ వ్యక్తులను నియమించి.. లారీ సామర్ధ్యాన్ని బట్టి పాసింగ్ పేరుతో డబ్బు వసూలు చేస్తున్నారు. 10 టైర్ల లారీకి ఒక రేటు, 12 టైర్ల లారీకి మరో ధర ఉంది. ఇందుకోసం చెక్‌పోస్టులో ఒక ట్రే పెట్టారు. లారీ డ్రైవర్లు తాము చెల్లించాల్సిన మొత్తాన్ని ఆ ట్రేలో వేసి వెళ్లాలి. లారీకి సంబంధించిన అన్ని పత్రాలు సక్రమంగా ఉన్నా సరే మామూళ్లు సమర్పించాల్సిందేనని తెలిసింది. ఏసీబీ అధికారులు ఉన్న సమయంలో కూడా కొందరు లారీ డ్రైవర్లు ఇలా డబ్బు ఇచ్చి వెళ్లారు. ఇక్కడ ప్రైవేట్ సిబ్బంది నుంచి రూ.28 వేలు, ట్రే లోని రూ.7 వేలు స్వా«దీనం చేసుకున్నామని ఏసీబీ అధికారులు చెప్పారు. విధి నిర్వహణలో ఉన్న ఎంవీఐ యూనిఫాం కూడా వేసుకోలేదని తెలిపారు. ఎంవీఐతో పాటు ప్రైవేట్ సిబ్బందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని చెప్పారు. -
ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై ఆర్టీఏ కొరడా
సాక్షి, హైదరాబాద్: మహబూబ్‌నగర్ బస్సు ప్రమాదం నేపథ్యంలో ఆర్టీఏ అధికారులు అప్రమత్తమయ్యారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై ఆర్టీఏ అధికారుల దాడులు నిర్వహించారు. ఎల్బీ నగర్ చింతలకుంట వద్ద అధికారుల తనిఖీలు నిర్వహించారు. నిబంధనకు విరుద్ధంగా తిరుగుతున్న 15 ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై కేసులు నమోదు చేశారు. బస్సుల్లో కనీసం ఫైర్ సేఫ్టీ కూడా పలు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల యాజమాన్యాలు పాటించడం లేదు. నిబంధనలను పాటించకుండా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడితే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. సంక్రాంతికి భారీగా సొంతూళ్లకు జనాలు వెళ్తున్నారు. పంతంగి టోల్ ఫ్లాజా వద్ద వాహనాల రద్దీ కొనసాగుతున్నారు. పంతంగి టోల్ ఫ్లాజా వద్ద హైదరాబాద్- విజయవాడ వైపు పది టోల్ బూత్‌లను జీఎంఆర్ ఓపెన్ చేసింది. నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలం కొర్ల పహాడ్ వద్ద రద్దీ కొనసాగుతోంది. కొర్లపహాడ్ వద్ద ఎనిమిది టోల్ బూత్‌లను సిబ్బంది తెరిచారు. -
ప్రైవేట్ ట్రావెల్స్ పై కొనసాగుతున్న ఆర్టీఏ దాడులు
-
నిలువు దోపిడీ! కారు ధరలకు చేరువగా ఆటో రిక్షాలు
సాక్షి, హైదరాబాద్: ఆటోరిక్షా ప్రస్తుత షోరూమ్ ధర రూ.2.20 లక్షలు. కానీ అది ఆటోడ్రైవర్ చేతికొచ్చేసరికి రూ.4.25 లక్షలకు చేరుతుంది. అంటే సాధారణ ధరపైన రూ.2 లక్షలు అదనంగా చెల్లించవలసి వస్తుంది. వేల కొద్దీ ఆటో పర్మిట్లను తమ గుప్పెట్లో పెట్టుకొన్న ఫైనాన్షియర్లు నిరుపేద ఆటోడ్రైవర్లపై సాగిస్తున్న నిలువుదోపిడీ ఇది. గ్రేటర్ హైదరాబాద్‌లో కొత్త ఆటో పరి్మట్లపైన ఆర్టీఏ ఆంక్షలు విధించింది. దీంతో పాత ఆటో రిక్షాల స్థానంలో మాత్రమే కొత్తవి కొనుగోలు చేయాల్సి ఉంటుంది. కాలం చెల్లిన పాత ఆటోలను తుక్కుగా మార్చి ఆ పర్మిట్పైన కొత్త ఆటో కొనుగోలు చేయవచ్చు. సుమారు 80 వేలకు పైగా పరి్మట్లు ఫైనాన్షియర్ల చేతుల్లోనే ఉన్నాయి. ఫైనాన్స్ సంస్థల నుంచి అప్పులు తీసుకొని ఆటోలు కొనుగోలు చేసిన డ్రైవర్లు చివరకు ఆ అప్పులు చెల్లించలేకపోతున్నారు. దీంతో వారి నుంచి సదరు ఫైనాన్స్ సంస్థలు ఆటోలను జఫ్తు చేసుకొని ఆ పరి్మట్లను మరో డ్రైవర్‌కు కట్టబెడుతున్నాయి. ఇలా సుమారు 500 మంది చిన్న, పెద్ద ఫైనాన్షియర్లు, ఫైనాన్స్ సంస్థలు నగరంలోని లక్ష మందికిపైగా ఆటోడ్రైవర్లను తమకు శాశ్వత రుణగ్రస్తులుగా మార్చుకొని రూ.వందల కోట్ల మేర వ్యాపారాలను కొనసాగిస్తున్నారు. కోవిడ్ కారణంగా గత రెండేళ్లుగా నిలిచిపోయిన కార్యకలాపాలు తాజాగా తిరిగి మొదలయ్యాయి. భారీగా పెరిగిన పర్మిట్ ధరలు... కోవిడ్ ఆంక్షలన్నీ తొలగిపోయి ఇంచుమించు సాధారణ పరిస్థితులు నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో నగరానికి తిరిగి వలసలు మొదలయ్యాయి. అప్పట్లో కోవిడ్ కారణంగా అప్పులు చెల్లించలేక ఆటోరిక్షాలు, క్యాబ్‌లను ఫైనాన్స్ సంస్థలకు అప్పగించి సొంత ఊళ్లకు వెళ్లిన వేలాది మంది డ్రైవర్లు ఇప్పుడు తిరిగి ఉపాధి కోసం నగరానికి చేరుకుంటున్నారు. ఆటోల కోసం ఫైనాన్షియర్లను ఆశ్రయిస్తున్నారు. దీంతో వారు పాత ఆటో పరి్మట్ల ధరలను అమాంతంగా పెంచేసి డ్రైవర్లకు కట్టబెడుతున్నారు. కోవిడ్‌కు ముందు కేవలం రూ.75 వేలు ఉన్న పాత ఆటో పరి్మట్‌ను ఇప్పుడు ఏకంగా రూ.1.75 లక్షలకు పెంచారు. నిజానికి పర్మిట్లకు ఎలాంటి ధర ఉండదు. నగరంలో కొత్తవి కొనుగోలు చేసేందుకు అవకాశం లేకపోవడం వల్ల పాతవాటి స్థానంలో కొత్తవి తీసుకొనేందుకు మాత్రమే అనుమతి ఉంటుంది. ఇలాంటి పాత పర్మిట్లపైన కొత్త ఆటో కోసం మరో 2.20 లక్షలు చెల్లించవలసి వస్తుంది. అంటే ఒక ఆటో ధర ఏకంగా రూ.4 లక్షలకు చేరుతుంది. దీనికి మరి కొంత సర్వీసు చార్జీలను కలిపి ఫైనాన్స్ సంస్థలు రూ.4.25 లక్షలకు విక్రయిస్తున్నారు. ‘అప్పు చేసి ఆటోలు కొనుగోలు చేస్తున్న డ్రైవర్లు మరోసారి రుణగ్రస్తులుగా మారాల్సి వస్తుందని.’ కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దోపిడీని ఆపేదెవరు... కొత్త పర్మిట్లపైన ఆంక్షలు విధించిన రవాణా శాఖ పాత పర్మిట్ ధరలను మాత్రం నియంత్రించడం లేదు. పర్మిట్ అంటే ఒక డ్రైవర్ ఆటో నడిపేందుకు ఇచ్చే అనుమతి పత్రం (ప్రొసీడింగ్స్). కానీ ఈ పత్రాలే ఫైనాన్షియర్లకు కాసులు కురిపిస్తున్నాయి. ఫైనాన్స్ సంస్థల ఈ నిలువు దోపిడీ పోలీసులకు, ఆర్టీఏ అధికారులకు, అన్ని ప్రభుత్వ విభాగాలకు తెలిసిందే. కానీ అది తమ పరిధిలోని అంశం కాదంటూ అందరూ చేతులెత్తేయడం గమనార్హం. అంతిమంగా నిరుపేద ఆటోడ్రైవర్ సమిధగా మారుతున్నాడు. (చదవండి: ఉచిత బియ్యం ఉఫ్! సాక్షాత్తు లబ్ధి దారులే అమ్ముకుంటున్నారు) -
Ongole: ఆర్టీఏ అధికారుల తీరుపై సీఎం జగన్ సీరియస్
సాక్షి, ప్రకాశం జిల్లా: ఒంగోలులో ఆర్టీఏ అధికారుల తీరుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీఏ అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సీఎం కాన్వాయ్ కోసం వాహనాలు సమకూర్చాలని సిబ్బంది ఒత్తిళ్లు తెస్తున్నారంటూ సీఎం వైఎస్ జగన్ దృష్టికి వార్తా కథనాలు వచ్చాయి. వాటిపై స్పందించిన సీఎం ప్రజలను ఇబ్బందులు పెడితే సహించబోమంటూ గట్టి సంకేతాలు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఇద్దరు సస్పెన్షన్ ఈ ఘటనపై విచారణ జరిపిన ఉన్నతాధికారులు.. బాధ్యులపై చర్యలు చేపట్టారు. ఈమేరకు ఒంగోలు ఏఎంవీఐ సంధ్య, హోంగార్డ్ తిరుపాల్‌రెడ్డిలను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. చదవండి: మన పంతం 'అవినీతి అంతం' -
లగ్జరీ కార్ల కేసు: ట్యాక్స్ చెల్లించకుండా తిరుగుతున్న కార్లు ఇవే
సాక్షి, హైదరాబాద్: లగ్జరీ కార్ల కేసుల్లో పోలీసుల విచారణ కొనసాగుతోంది. పన్ను చెల్లించకుండా తిరుగుతున్న లగ్జరీ కార్లపై అధికారులు కొరడా ఝుళిపిస్తున్నారు. తాజాగా ట్యాక్స్ చెల్లించకుండా తిరుగుతున్న లగ్జరీ కార్లను అధికారులు గుర్తించారు. అవి.. ► కిషన్ లోహియా (హురాకన్ లంబోర్గిని) ►నిశాంత్ సాబు (హురాకన్ లంబోర్గిని) ►అమీర్‌శర్మ (ఫెరారీ 488) ►సికిందర్ దారేడియా (హురకిన్ లంబర్గిని) ►ముజీబ్ (రోల్స్ రాయిసి) ►నితిన్‌రెడ్డి (ఫెరారీ) ►రాహుల్ (ఫెరారీ) ►నిఖిల్ (ఫెరారీ) చదవండి: హైదరాబాద్‌లో 11 హై ఎండ్ లగ్జరీకార్లు సీజ్, ఇదే తొలిసారి కాగా పన్ను ఎగవేసి తిరుగుతున్న హై ఎండ్ లగ్జరీ కార్లపై ఆర్టీఏ కొరడా దాడులు నిర్వహించి స్వాధీనం చేసుకుంటున్న విషయం తెలిసిందే. డిప్యూటీ ట్రాన్స్‌పోర్టు కమిషనర్ కె.పాపారావు నేతృత్వంలో మోటారు వాహన తనిఖీ అధికారులు, సహాయ మోటారు వాహన తనిఖీ అధికారులతో ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందాలు నగరంలోని వివిధ ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించాయి. ఇతర రాష్ట్రాల్లో రిజిస్ట్రర్ అయిన ఈ లగ్జరీ కార్లు రవాణా శాఖకు జీవితకాల పన్ను చెల్లించకుండా హైదరాబాద్‌లో తిరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఆర్నెల్లుగా ఇలాంటి వాహనాలపై పక్కా నిఘా పెట్టి పథకం ప్రకారం దాడులు నిర్వహించి 11 కార్లను సీజ్ చేశారు. చదవండి: పన్ను ఎగవేసి విదేశాల నుంచి లగ్జరీ కార్ల దిగుమతి పట్టుబడితే 200 శాతం కట్టాల్సిందే.. సాధారణంగా ఇతర రాష్ట్రాల్లో నమోదైన బైక్‌లు, కార్లు, తదితర వాహనాలు కనీసం నెల రోజుల కంటే ఎక్కువ కాలం ఇక్కడ తిరిగితే తప్పనిసరిగా జీవితకాల పన్ను చెల్లించాల్సి ఉంటుంది. వాహనదారులు స్వచ్ఛందంగా ఈ పన్ను చెల్లించాలి. కానీ చాలా మంది వాహనదారులు తాము పొరుగు రాష్ట్రాల్లో చట్టబద్ధంగానే వాహనాలను నమోదు చేసుకున్నట్లు భావించి ఇక్కడ చెల్లించేందుకు నిరాకరిస్తున్నారు. అధికారులు దీనిని నిబంధనల ఉల్లంఘనగా పరిగణించి కేసులు నమోదు చేస్తున్నారు. ‘వాహనదారులే స్వచ్ఛందంగా పన్ను చెల్లిస్తే నిబంధనల మేరకు వసూలు చేస్తాం. ఆర్టీఏ దాడుల్లో పట్టుబడితే మాత్రం 200 శాతం వరకు పెనాల్టీల భారం పడుతుంది’ అని రవాణాశాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. మరోవైపు తాజా దాడుల్లో లభించిన సమాచారం ఆధారంగా హైఎండ్ లగ్జరీ వాహనాలపైన దాడులను మరింత ఉధృతం చేయనున్నట్లు డీటీసీ పాపారావు తెలిపారు. అవసరమైతే వాహనదారుల ఇళ్ల వద్దకు వెళ్లి తనిఖీలు నిర్వహిస్తామన్నారు. అయితే హైదరాబాద్‌లో ఖరీదైన వాహనాల పైన 14 శాతం వరకు జీవితకాల పన్ను విధించారు. అంటే రూ.2 కోట్ల ఖరీదైన వాహనంపైన సుమారు రూ.70 లక్షల వరకు పన్ను కట్టాల్సివుంటుంది. ఈ పన్నును ఎగ్గొట్టేందుకే వాహనదారులు ఇతర రాష్ట్రాలకు పరుగులు తీస్తున్నారు. హర్యానా, ఢిల్లీ, పాండిచ్చేరి, తదితర చోట్ల కేవలం రూ.30లక్షలలోపు జీవిత కాలపన్నుతో వాహనాలు నమోదు కావడంతో నగరవాసులను ఆ రాష్ట్రాలను ఎంపిక చేసుకుంటున్నారు. -
ఖైరతాబాద్‌లో ఆర్టీఏ అధికారుల తనిఖీలు
-
ఆర్టీఏ కొరడా.. బస్సులు సీజ్
-
ఆర్టీఏ కొరడా.. బస్సులు సీజ్
హైదరాబాద్: నగరంలో ఆర్టీఏ అధికారులు కొరడా ఝుళిపిస్తున్నారు. పలు ఏరియాలలో ఆర్టీఏ విస్తృత తనిఖీలు చేపట్టింది. ఇందులో భాగంగా ఎల్బీనగర్ లో తనిఖీలు చేపట్టిన ఆర్టీఏ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న నాలుగు ప్రైవేటు బస్సులను సీజ్ చేశారు. మరో 10 ప్రైవేట్ బస్సుల యజమానులపై కేసులు నమోదుచేశారు. వారి వద్ద ఎలాంటి అనుమతి పత్రాలు లేవని అందుకే చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. -
ఆర్టీఏ తనిఖీలు..13 బస్సులు సీజ్
శంషాబాద్: రంగారెడ్డి జిల్లాలో ఆర్టీఏ అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి. శంషాబాద్‌లో ఆర్టీఏ అధికారులు బుధవారం తెల్లవారుజామున ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న 13 ప్రైవేటు ట్రావెల్ బస్సులను గుర్తించి, సీజ్ చేశారు. మరో 7 బస్సుల యజమానులపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. -
25 ప్రైవేట్ వాహనాలు సీజ్
హైదరాబాద్: నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న 25 ప్రైవేట్ వాహనాలను ఆర్టీఏ అధికారులు శనివారం ఉదయం సీజ్ చేశారు. నగరంలోని హయత్‌నగర్ సమీపంలోని విజయవాడ జాతీయ రహదారిపై ఆర్టీఏ అధికారులు శనివారం ఉదయం వాహనాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ప్రయాణికులను చేరవేస్తున్న 25 వాహనాలను సీజ్‌చేశారు. తనిఖీలు ఇంకా కొనసాగుతున్నాయి. -
వికారాబాద్‌లో ఆటో బోల్తా..ఐదుగురికి గాయాలు
వికారాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని మారుతీ నగర్ వద్ద ఓ ఆటో బోల్తాపడింది. వివరాలు..మారుతీ నగర్ వద్ద ఆర్టీఏ అధికారులు తనిఖీలు చేస్తుండగా ఓ ఆటో డ్రైవర్ ఆపమన్నా ఆపకుండా వెళ్లిపోతుండటంతో కానిస్టేబుల్ వెంబడించాడు. ఈ క్రమంలో కానిస్టేబుల్ ఆటో డ్రైవర్‌ను బయటకు లాగడంతో ఆటో అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో ఓ బాలుడికి కాళ్లూ చేతులూ విరిగాయి. దీంతో బాలుడిని హైదరాబాద్‌కు తరలించారు. గాయపడిన మరో నలుగురికి స్థానికంగా ఉన్న ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఘటన అనంతరం ఆర్టీఏ అధికారులు అక్కడి నుంచి జారుకున్నారు. -
ఆర్టీఏ అధికారుల నిర్వాకం
♦ తనిఖీల పేరుతో ఆటోను వెంబడించిన కానిస్టేబుల్ ♦ వేగం పెంచిన డ్రైవర్.. వాహనం బోల్తా ♦ ప్రయాణికులకు తీవ్ర గాయాలు వికారాబాద్ రూరల్: ఆర్టీఏ అధికారుల నిర్వాకంతో ఓ ఆటో అదుపుతప్పి బోల్తాపడడంతో ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన వికారాబాద్ మున్సిపల్ పరిధిలో మంగళవారం చోటు చేసుకుంది. క్షతగాత్రుల కథనం ప్రకారం.. వికారాబాద్ పట్టణంలోని తెలంగాణ చౌరస్తా నుంచి మన్నెగూడ వెళ్లే ఆటోలో డ్రైవర్ అబ్దుల్ కరీం ప్రయాణికులను ఎక్కించుకుని బయలు దేరారు. శివారెడ్డిపేటకు చెందిన బాలుడు శివ(16), మన్నెగూడకు చెందిన లక్ష్మి, ఈశ్వరమ్మ, మల్లమ్మ ఆటోలో ఎక్కారు. రైల్వే బ్రిడ్జి దాటిన తర్వాత మారుతీనగర్ గేటు సమీపంలో ఆర్టీఏ అధికారులు వాహనాల తనిఖీలు చేపట్టారు. బ్రిడ్జి దిగుతూనే ఆర్టీఏ తనిఖీలను గమనించిన ఆటో డ్రైవర్ కరీం వాహనం వేగం పెంచాడు. ఈక్రమంలో మారుతీనగర్ గేటువైపు ఆటోను తిప్పాడు. ఆర్టీఏకు చెందిన కానిస్టేబుల్ ఆటో డ్రైవర్‌ను చెయ్యి పట్టి బయటకు లాగాడు. దీంతో ఒక్కసారిగా ఆటో అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో బాలుడు శివ రెండు కాళ్లు విరిగి పోయాయి. ఆటోలో ఉన్న మహిళలకు స్వల్ప గాయాలు అయ్యాయి. ఆటో డ్రైవర్ అబ్దుల్ రహీంకు చేతికి గాయమైంది. ఉడాయించిన ఆర్టీఏ అధికారులు ప్రమాదం జరిగిన విషయాన్ని గమనించిన ఆర్టీఏ అధికారులు వెంటనే అక్కడి నుంచి ఉడాయించారు. ప్రయాణికులు, స్థానికులు సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం శివను హైదరాబాద్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే, ప్రమాదానికి కారణమైన ఆర్టీఏ అధికారులుపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు. -
కూకట్‌పల్లిలో ఆర్టీఏ అధికారుల తనిఖీలు
కూకట్‌పల్లిలో మంగళవారం ఉదయం ఆర్టీఏ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న 7 ప్రైవేటు స్కూలు బస్సులపై కేసులు నమోదు చేసి జరిమానా విధించారు. మూడు బస్సులను సీజ్ చేశారు. తనిఖీలు ఇంకా కొనసాగుతున్నాయి. -
ఎల్బీనగర్లో ఆర్టీఏ అధికారుల తనిఖీలు
హైదరాబాద్: నగరంలోని ఎల్బీనగర్ చౌరస్తాలో సోమవారం తెల్లవారుజామున ఆర్టీఏ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో భాగంగా నిబంధనలు పాటించని పలు ట్రావెల్స్ బస్సులకు జరిమానా విధించారు. అలాగే మూడు బస్సులను సీజ్ చేసినట్టు అధికారులు పేర్కొన్నారు. -
13 ప్రైవేటు బస్సులపై కేసులు
హైదరాబాద్: నిబంధనలను తుంగలో తొక్కి ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటాలాడుతున్న ప్రైవేటు బస్సులపై ఆర్టీఏ అధికారులు కొరడా ఝళిపించారు. శనివారం అర్ధరాత్రి ఎల్బీ నగర్ సమీపంలో 65వ నంబర్ జాతీయ రహదారిపై దాడులు నిర్వహించిన అధికారులు నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న 13 బస్సులను గుర్తించి వాటిపై కేసులు నమోదు చేశారు. -
అన్నిటికీ అడ్వాన్స్ బుకింగే
రవాణా శాఖలో అన్ని సేవలకు స్లాట్ విధానం సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయం.. వివిధ పనుల కోసం వారం కింద ఒకే రోజు 779 మంది ఇక్కడికి వచ్చారు. అదే మూడు రోజుల కింద కేవలం 49 మంది వచ్చారు. జనం భారీగా ఉన్న రోజు తొక్కిసలాట పరిస్థితి.. అదే మామూలు రోజుల్లో సిబ్బంది గోళ్లు గిల్లుకునే పరిస్థితి.. దీనంతటికీ కారణం ఓ పద్ధతి అంటూ లేకుండా ఆర్టీఏ కార్యాలయాలకు జనం రావడమే. దీని వల్ల ప్రజలకు అందించే సేవలకు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ఈ పరిస్థితి నుంచి బయటపడేందుకు ఆర్టీఏ అధికారులు సరికొత్త ఆలోచన చేశారు. తేదీ, సమయం ముందుగానే ఫిక్స్ చేసుకునేలా ‘స్లాట్’ విధానాన్ని ప్రవేశపెట్టాలని ఆర్టీఏ అధికారులు నిర్ణయించారు. ఆర్టీఏ వెబ్సైట్లో ముందుగా స్లాట్ బుక్ చేసుకుని ఆ సమయం ప్రకారం వచ్చిన వారికే సిబ్బంది పనిచేసిపెడతారు. లేదంటే తిప్పి పంపుతారు. దీంతో పనులు సజావుగా జరగడమే కాకుండా, సిబ్బందికి కూడా రద్దీ బాధ తప్పుతుందని అధికారులు పేర్కొంటున్నారు. ఇటీవలే వాహనాల లెసైన్సుల జారీకి ఈ విధానం ప్రవేశపెట్టగా, ఇప్పుడు అన్ని రకాల సేవలకు విస్తరించనున్నారు. దాదాపు 17 రకాల సేవలను స్లాట్ విధానం పరిధిలోకి తీసుకురావాలని నిర్ణయించారు. ఈ విధానాన్ని జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. దీని అమలు, ఉపయోగాలు వంటి అంశాలపై అవగాహన కల్పించేందుకు రవాణా శాఖ కమిషనర్ సందీప్‌కుమార్ సుల్తానియా ఆదివారం సదస్సు నిర్వహించారు. అన్ని జిల్లాల నుంచి సిబ్బంది హాజరయ్యారు. అంతా పకడ్బందీగా.. : ఈ ప్రక్రియ మొత్తం ఆన్లైన్ ద్వారా జరిగిపోతుంది. కార్యాలయానికి ఏ పని మీద వెళుతున్నారో ఆర్టీఏ వెబ్సైట్ (telangana. transport.gov.in)లో దరఖాస్తు చేసుకోవాలి. దీనికి సంబంధించి దరఖాస్తు ఫార్మాట్ కూడా వెబ్సైట్లో ఉంటుంది. ఈ ప్రకారం దరఖాస్తుదారుడికి వీలైన రోజు, సమయం ఎంచుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఆ రోజు కనుక ఖాళీ లేకుంటే మరో రోజును ఎంచుకోవాల్సి ఉంటుంది. ఎంచుకున్న రోజు, సమయంలో దరఖాస్తుదారుడు సంబంధిత రవాణా కార్యాలయానికి వెళ్లి పని పూర్తి చేసుకోవాలి. ఆ రోజు వెళ్లలేని పరిస్థితి ఉంటే మళ్లీ స్లాట్ బుక్ చేసుకోవాలి. అదే రోజు ఎంచుకున్న సమయానికి వెళ్లలేకపోతే చివర్లో సిబ్బంది అందుబాటులో ఉంటారు. అవినీతికి అడ్డుకట్ట పడేనా...! ఆర్టీఏ కార్యాలయాల్లో డబ్బులు ముట్టజెప్పనిదే పనులు జరగవనేది బహిరంగ రహస్యమే. చేతులు తడిపితే పనులు ఆగమేఘాల మీద జరుగుతాయి. బ్రేకులు లేని వాహనాలకు కూడా డబ్బులిస్తే ఫిట్నెస్ సర్టిఫికెట్లు నిమిషాల్లో సిద్ధమవుతాయి. ఇపుడు ఈ స్లాట్ బుకింగ్ విధానంతో లంచాలను కట్టడి చేయడం సాధ్యమా అనేది అనుమానమే. అత్యవసర పనుల మీద స్లాట్ బుకింగ్ చేసుకోకుండా వచ్చే వారి నుంచి డబ్బులు వసూలు చేసే అవకాశం కూడా ఉంది. మరి ఈ రకమైన సిబ్బందిని ఎలా నియంత్రిస్తారో వేచి చూడాల్సిందే. -
ఆర్టీఏ కార్యాలయాల్లో ఏసీబీ తనిఖీలు
కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్ జిల్లాల్లో.. సాక్షి నెట్వర్క్: కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్ జిల్లాల్లోని ఆర్టీఏ కార్యాలయాలపై సోమవారం ఏసీబీ అధికారులు దాడులు చేశారు. కరీంనగర్ కార్యాలయానికి ఏసీబీ అధికారులు రావడంతో రికార్డు అసిస్టెంట్ రామమూర్తి పరారీకాగా, అతని కౌంటర్లో రూ. 4 వేలు అదనంగా లభించాయి. అలాగే, ఓ ఏజెంట్ వద్ద రూ. 25 వేలు, మరో ఏజెంట్వద్ద రూ. 13 వేలు స్వాధీనం చేసుకున్నారు. అలాగే, ఫైళ్లు స్వాధీనం చేసుకున్నారు. ఖమ్మం కార్యాల యంపై దాడి చేసి అక్కడున్న 9 మంది ఏజెంట్లను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ. 1.13 లక్షల నగదు ను, వాహనదారుల దరఖాస్తులను స్వాధీనపరుచుకున్నా రు. కార్యాలయంలోని ఓ ఉద్యోగి వద్ద ఉండాల్సిన దాని కన్నా రూ. 995 తక్కువగా ఉండడంతో వాటినీ స్వాధీనం చేసుకున్నారు. ఫైళ్లను స్వాధీనం చేసుకున్నారు. నిజామాబాద్ ఉప రవాణా కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు చేసే సమయంలో 28 మంది ఏజెంట్లు కార్యాలయంలో ఉండగా, వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.50,910 స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్‌లో పట్టుపడిన ఉద్యోగి కొత్త వాహనాలకు అనుమతినిచ్చే విషయంలో లంచం తీసుకుంటూ హైదరాబాద్ రవాణా కమిషనర్ కార్యాలయానికి చెందిన ఒక ఉద్యోగి సోమవారం రెడ్‌హ్యాండెడ్‌గా ఏసీబీకి పట్టుబడ్డాడు. ఖైరతాబాద్‌లోని తెలంగాణ రవాణా కమిషనర్ ప్రధాన కార్యాలయంలో అడ్మినిస్ట్రేటివ్ అధికారిగా పని చేస్తున్న ఎ.నరేందర్ పంజాబ్‌కు చెందిన కెఎస్ ఆగ్రోటెక్ సంస్థకు చెందిన హార్వర్డ్ న్యూ మాన్యుఫ్యాక్చర్ వాహనానికి తెలంగాణలో అనుమతినిచ్చేందుకు సదరు సంస్థకు చెందిన ఏరియా మేనేజర్ వెంకటేశ్ వద్ద నుంచి డబ్బులు డిమాండ్ చేశాడు. నిబంధనల మేరకు కొత్త వాహనాల అనుమతి కోసం రూ.5,000 చెల్లించి దరఖాస్తు చేసుకున్న వారంరోజుల్లో అనుమతినివ్వాల్సి ఉం టుంది. ఈ క్రమంలో రూ.8 వేలు ఇచ్చేందుకు వెంకటేశ్ అంగీకరించాడు. నరేందర్ సూచన మేరకు ఆ డబ్బులు తమ జూనియర్ అసిస్టెంట్ మురళికి ఇస్తుండగా అప్పటికే అక్కడికి చేరుకున్న ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. -
హెల్మెట్‌పై ఆర్టీఏ వినూత్న ప్రచారం
గులాబీలతో నిరసన స్వాగతం శిరస్త్రాణం వినియోగంపై వాహనదారులకు అవగాహన సాక్షి,సిటీబ్యూరో : హెల్మెట్ వాడకంపై వాహనదారులకు అవగాహన కల్పించేందుకు రవాణాశాఖ వినూత్న ప్రచారం చేపట్టింది. హెల్మెట్ ధరించకుండా ఆర్టీఏ కార్యాలయాల్లోకి వచ్చే వారికి గాంధీగిరి తరహాలో గులాబీలతో నిరసన స్వాగతం పలికింది. బుధవారం ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో హైదరాబాద్ సంయుక్త రవాణా కమిషనర్ టి.రఘునాథ్ హెల్మెట్ లేని వాహనదారులకు గులాబీలను అందజేశారు. హెల్మెట్‌తో వచ్చిన వారికి అభినందనలు తెలిపారు. అలాగే వాహనదారుల్లో అవగాహన కల్పించేందుకు కరపత్రాలను అందజేశారు. రహదారి భద్రతను దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని కోరారు. ఈ ఏడాది జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 25 శాతానికి పైగా ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ పెట్టుకోకపోవడంతోనే మృత్యువాత పడ్డారని జేటీసీ ఆవేదన వ్యక్తం చేశారు. కొత్తగా వాహనాలను రిజిస్ట్రేషన్ చేసుకొనేవారు వాహనంతో పాటు హెల్మెట్ కూడా తీసుకోవాలని రఘునాథ్ సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీఓలు జీపీఎన్ ప్రసాద్, దశరథం పాల్గొన్నారు. కాగా, ఖైరతాబాద్‌తో పాటు సికింద్రాబాద్, మలక్‌పేట, ఉప్పల్, అత్తాపూర్, మేడ్చల్ తదితర ఆర్టీఏ కార్యాలయాల్లోను హెల్మెట్‌పై అవగాహన కోసం అధికారులు విస్తృత ప్రచార కార్యక్రమాలు చేపట్టారు. 18 నుంచి హెల్మెట్ ఉంటేనే రిజిస్ట్రేషన్ హెల్మెట్‌పై ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళ్తున్న ఆర్టీఏ అధికారులు ఈ నెల 18 నుంచి హెల్మెట్ లేకుండా వచ్చే వాహనదారులను ఆర్టీఏ కార్యాలయాల్లోకి అనుమతించకుండా నిలిపివేయాలని నిర్ణయించారు. హెల్మెట్ ధరించని వారికి వాహన రిజిస్ట్రేషన్‌తో పాటు ఇతర పౌరసేవలను కూడా అందజేయబోమని జేటీసీ స్పష్టం చేశారు. -
పిల్లల ప్రాణం.. గాల్లో దీపం
స్కూలు యాజమాన్యాల నిర్లక్ష్యం... అధికారుల కాసుల కక్కుర్తి... వెరసి బడి పిల్లల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఫిట్నెస్ లేని బస్సుల్లో చిన్నారులను కుక్కేసి... వాటిని యథేచ్ఛగా రోడ్లపైకి వదిలేస్తున్న యాజమాన్యాలకు... పరీక్షించి సీజ్ చేయాల్సిన ఆర్టీఏ అధికారులు ‘రైట్’ చెబుతున్నారు. ఒకటీ అర కాదు... జిల్లాలో 207 బస్సులు నిబంధనలకు విరుద్ధంగా ఫిట్నెస్ లేకుండా తిరిగేస్తున్నాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. - ఫిట్నెస్ లేని 207 బడి బస్సులు - తీరు మారని ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలు - నిద్రావస్థలో ఆర్టీఏ అధికారులు జిల్లాలో ఇప్పటికి 207 బడి బస్సులు ఫిట్నెస్ లేకుండా తిరుగుతున్నాయి. కళ్ల ముందే ఇన్ని బస్సులు రయ్యిన పోతున్నా... ఆర్టీఏ అధికారులకు మాత్రం కనిపంచడం లేదు పాపం. ఏదో ప్రమాదం జరిగినప్పుడు తనిఖీలంటూ హడావుడి చేసి... హెచ్చరికలు జారీ చేసి.. ఆ తరువాత నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం వారికి పరిపాటిగా మారిపోయింది. ఫిట్నెస్ లేని బస్సుల్లో పిల్లలను పరిమితికి మించి కుక్కుతున్నారు. అనుభవం లేని డ్రైవర్లతో పని కానిస్తున్నారు. పిల్లల భద్రత గురించి కానీ, వారి ప్రాణాల గురించి కానీ ఆలోచించే పరిస్థితిలో ఇటు యాజమాన్యాలు కానీ, అటు అధికారులు కానీ లేకపోవడం బాధాకరం. నిబంధనలకు పాతర... ఈ ఏడాది జూన్ 12న ఈ విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే నాటికి జిల్లాలో మొత్తం ప్రైవేట్ పాఠశాలల బస్సులు 1050. నిబంధనల ప్రకారం అప్పటికి 670 బస్సులు మాత్రమే ఫిట్నెస్ పొందాయి. ప్రస్తుతం మొత్తం బస్సుల సంఖ్య 1123కు చేరింది. వీటిలో నేటికి ఫిట్నెస్ సర్టిఫికెట్ పొందినవి 916 మాత్రమే. మిగిలినవి నిబంధనలకు విరుద్ధంగా పిల్లలతో రోడ్డెక్కేస్తున్నాయి. ప్రమాణాలు లేని బస్సుల వల్ల గతంలో ఘోర ప్రమాదాలెన్నో జరిగినా... విలువైన చిన్నారుల ప్రాణాలు గాల్లో కలిసిపోయినా... అధికారు తీరు మాత్రం దున్నపోతు మీద వాన కురిసినట్టే ఉంది. వారికసలు ఎలాంటి పట్టింపూ లేకుండా పోయింది. ఇక యాజమాన్యాల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. వెల్దుర్తి మండలంలోని మాసాయిపేట వద్ద స్కూలు బస్సును రైలు ఢీకొని 16 మంది చిన్నారులు బలయిన దుర్ఘటన ఇంకా కళ్ల ముందు మెదులుతూనే ఉంది. ప్రమాదాలు జరుగుతున్నా... స్కూళ్లు ప్రారంభమయిన మరుసటి రోజు నుంచే బస్సు ప్రమాదాలు ప్రారంభమయ్యాయి. జూన్13న రేగోడ్ మండలంలోని మేడికుందలో సెయింట్ డాన్‌బాస్కో పాఠశాల రెండు బస్సులు ప్రమాదానికి గురయ్యాయి. అదృష్టవశాత్తూ పిల్లలకు ఎలాంటి గాయాలూ కాలేదు. జూన్ 14న గజ్వేల్ పరిధిలోని సంగాపూర్ వద్ద కృష్ణవేణి టాలెంట్ స్కూల్ బస్సు చక్రం ఊడింది. తృటిలో ప్రమాదం తప్పింది. ఫిట్నెస్ పొందిన మరుసటి రోజు టైరు ఊడిపోవడం గమనార్హం! ఈ ఘటన తరువాత ప్రస్తుతం పిట్నెస్ పొందిన 916 బ స్సుల్లో భద్రత పైనా అనుమానాలు రేకెత్తుతున్నాయి. మొక్కుబడిగా ఫిట్నెస్ పరీక్షలు నిర్వహిస్తున్నారనడానికి ఇంతకంటే ఉదాహరణ అక్కర్లేదేమో. అధికారులు, యాజమాన్యాల తీరుపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
ఆర్టీఏ అధికారులు తనిఖీలు: ప్రైవేట్ బస్సులు సీజ్
హైదరాబాద్ : నిబంధనలు పాటించని బస్సులపై ఆర్టీఏ అధికారులు కొరడా ఝుళిపిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ మండలం పెద్ద అంబర్‌పేట వద్ద జాతీయ రహదారిపై అధికారులు మంగళవారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా రోడ్డు ట్యాక్స్ చెల్లించని నాలుగు ప్రైవేట్ వాహనాలను అధికారులు సీజ్ చేశారు. అనంతరం బస్సులను ఆర్టీఏ కార్యాలయానికి తరలించారు. -
పర్మిట్ లేదు... అనుభవం లేదు
కాకినాడ : తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి మోరంపూడి జంక్షన్లో బీభత్సం సృష్టించిన స్కూల్ బస్సుకు పర్మిట్ లేదని ఆర్టీఏ అధికారులు మంగళవారం రాజమండ్రిలో స్పష్టం చేశారు. ఆ ప్రమాదానికి కారణమైన డ్రైవర్‌కు ఆరు నెలలే అనుభవం ఉందని తెలిపారు. దీంతో డ్రైవర్‌కు స్కూల్ బస్సు నడిపేందుకు అర్హత లేదన్నారు. రాజమండ్రి మోరంపూడి జంక్షన్‌లోని 16వ నంబరు జాతీయ రహదారిపై స్కూల్ బస్సు బీభత్సం సృష్టించింది. వేమగిరి వైపు వెళ్తున్న ఈ బస్సు బ్రేకులు ఫెయిల్ కావడంతో అదుపు తప్పి ఒక కారును, మూడు ద్విచక్ర వాహనాలను ఢీకొని, పక్కనే ఉన్న డ్రైనేజీలోకి దూసుకుపోయి, హై టెన్షన్ విద్యుత్ స్తంభాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో మండపేట గొల్లపుంతకు చెందిన ఇనపకోళ్ల దుర్గాప్రసాద్ (13), రాజమండ్రి గాంధీపురం-3కి చెందిన ర్యాలి వెంకన్న (55) అక్కడికక్కడే మృతి చెందారు. ఆస్పత్రికి తరలిస్తుండగా కాకినాడ రూరల్ కరప మండలం కోదాడకు చెందిన శివనేని మహాలక్ష్మి (70) మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన నలుగురు ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. -
ఇక్కడింతే!
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ఇక్కడ పనిచేసిన కొందరు ఎంవీఐలు అవకాశాన్ని బట్టి తమ సామాజికవర్గానికి చెందిన ఏసీబీ అధికారులు, ప్రభుత్వ పెద్దల పేర్లను వాడుకుంటూ బయటపడుతున్నారన్న ఆరోపణలున్నాయి. అంతేగాకుండా, సదరు అధికారులు ఆ చెక్పాయింట్లలో పనిచేసే ఏఎంవీఐ, కానిస్టేబుళ్లపై స్వారీ చేస్తుండటం పరిపాటిగా మారింది. తాజాగా బుధవారం రాత్రి నుంచి గురువారం తెల్లవారుజాము వరకు హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు ఏసీబీ డీఎస్పీల ఆధ్వర్యంలో అధికారులు దాడులు జరిపి అవినీతి సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. విధులలో ఉన్న సిబ్బందిపై కేసులు నమోదు చేశారు. ఏడాదిలో మూడుసార్లు కామారెడ్డి ఎంవీఐ కార్యాలయం పరిధిలోకి వచ్చే పొందుర్తి చెక్‌పాయింట్‌లో ఏళ్లుగా అక్రమ వసూళ్ల దందా జరుగుతున్నా, దానిని నియంత్రించడం ఇటూ ఏసీబీకి, అటు ప్రభుత్వానికి సవాల్‌గా మారుతోంది. పైస్థాయిలో పలుకుబడి కలిగి, ఉద్యోగ సంఘం నేతలు, సామాజిక నేపథ్యాలుగా చక్రం తిప్పగల అధికారులే ఇక్కడ తరచూ ఇన్చార్జులుగా నియమితులు కావడమే ఇందుకు కారణమనే విమర్శలున్నాయి. ఈ చెక్‌పాయింట్‌పై ఈ ఏడాదిలో మూడుసార్లు ఏసీబీ దాడులు జరిగాయి. అదేమిటో గాని, దాడులు జరిగిన ప్రతీసారి ఏఎంవీఐలు, పోలీసు కానిస్టేబుళ్లు, డ్రైవర్లు మాత్రమే చిక్కుతున్నారు. వసూళ్లలో పెద్దవాటా ఉన్నవారు దొరికిన దాఖలాలు తక్కువ. 2013 జూన్ ఐదున జరిగిన ఏసీబీ దాడిలో రూ.1,44,220 స్వాధీనం చేసుకున్నారు. ఏఎంవీఐ అశోక్‌కుమార్, హెడ్‌కానిస్టేబుల్ పి.మోహన్‌రావు, కానిస్టేబుల్ మారుతి అధికారుల చేతికి చిక్కారు. ఈ ఏడాది జనవరి 18న ఏసీబీ దాడిలో, ఉండాల్సిన డబ్బు కంటే అధికంగా రూ.57,820 లభ్యమయ్యా యి. అప్పుడు సైతం ఏఎంవీఐ సురేం దర్‌రెడ్డి, కానిస్టేబుళ్లు కె.మధుసూదన్, జి.బాల్‌రెడ్డి పైనే కేసులు నమోదయ్యాయి. తాజాగా హైదరాబాద్ నుంచి వచ్చిన ఏసీబీ డీఎస్పీలు మధుసూదన్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి బృందం జరిపిన దాడులలో రూ.52,310 స్వాధీనం చేసుకున్నారు.ఉండాల్సిన డబ్బు కంటే రూ.12,210 అదనంగా లభించడంతో ఏఎంవీఐ రవీందర్‌తో పాటు డ్రైవర్ ఎల్లంరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. రూ.లక్షల్లో ప్రభుత్వ ఆదాయానికి గండి పొందుర్తి చెక్ పాయింట్ రవాణా శాఖ అధికారులకు కాసులు కురిపించే కల్పతరువుగా మారింది. రెండు దశాబ్దాలుగా సాగుతున్న ఈ చెక్‌పాయింట్‌లో ఎంవీఐలు, ఏఎంవీఐలుగా కొనసాగాలంటే భారీగా లంచాలు చెల్లించే పరిస్థితి ఏర్పడింది. ఒక పోలీసు సబ్ డివిజనల్ అధికారి ఎంత చెల్లిస్తాడో, ఈ చెక్‌పాయింట్‌లో పనిచేసేందుకు ఎంవీఐలు అంత మొత్తం లో సమర్పించుకుంటారని ఆ శాఖలో పనిచేసే కొం దరు బాహాటంగానే చెబుతున్నారు. రోజుకు దాదాపు మూడు వేల వాహనాలు నిత్యం ఈ చెక్‌పాయింట్ ద్వారా తిరుగుతుంటాయి. ఇందులో రవాణా వాహనాలు వెయ్యి వరకు ఉంటాయని అంచనా.ఇక్కడ ఏఎంవీఐ స్థాయి అధికారితో పాటు రవాణా శాఖకు చెందిన ముగ్గురు సిబ్బంది ఉండాలి. వారికి తోడుగా ప్రైవేటు వ్యక్తులు ఇద్దరి నుంచి నలుగురు వరకు ఉంటారు. గతంలో ఈ చెక్ పాయింట్‌పై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించిన సమయంలో ప్రైవేటు వ్యక్తుల ద్వారా డబ్బులు వసూలు చేస్తున్నట్టు నిర్ధారణ అయ్యింది. రోజుకు కనీసం రూ. 50 వేల నుంచి రూ.లక్ష వరకు వసూలవుతాయని అంచనా. ఇక్కడ పనిచేసే సిబ్బంది వంతులవారీగా విధులు నిర్వహిస్తుంటారు. జిల్లాలోని ఇతర ప్రాంతాలకు చెందిన ఏఎంవీఐలకు కూడా ఇక్కడ డ్యూటీలు వేస్తారు. రవాణా శాఖకు అంతగా ఆదాయం లేని రోజులలో చెక్ పాయింట్లు నిర్వహించేవారని, తరువాత కాలంలో వీటిని నిబంధనలకు విరుద్ధంగా కొనసాగిస్తు వస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వ ఖజానాకు కొంత మాత్రమే చేరుస్తూ, పెద్దమొత్తం తమ ఖాతాలలో వేసుకుంటున్నారని అంటున్నారు. -
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న ఆర్టీఏ దాడులు
-
రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రైవేట్ బస్సులు సీజ్
రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న ప్రైవేట్ ట్రావెల్స్‌కు చెందిన బస్సులపై ఆర్టీఏ అధికారులు మంగళవారం దాడులు నిర్వహించారు. ఎల్ బీ నగర్లో 10 బస్సులను సీజ్ చేశారు. అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరు - కలపర్రు టోల్‌గేటు వద్ద ఆర్టీఏ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్బంగా మేఘనా ట్రావెల్స్‌కు చెందిన బస్సును సీజ్ చేశారు. వీటితోపాటు కర్నూలు జిల్లాలోని పుల్లూరు టోల్గేట్ వద్ద ఆర్టీఏ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్బంగా మూడు బస్సులను సీజ్ చేశారు. గతేడాది చివరిలో మహబూబ్‌నగర్ జిల్లాలోని కొత్తకోట మండలం పాలెం వద్ద బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తున్న జబ్బార్ ట్రావెల్స్ బస్సు దగ్ధమైంది. ఆ ఘటనలో 45 మంది అగ్నికి ఆహుతి అయ్యారు. దాంతో ఆర్టీఏ అధికారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అదికాక ప్రభుత్వ వైఫల్యం వల్లే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు అగడాలు రోజురోజూకు అధికమవుతున్నాయని పలువురు ఆరోపణలు చేస్తున్నారు. దాంతో ఆర్టీఏ అధికారులు ప్రైవేట్ ట్రావెల్స్‌పై దాడులు ముమ్మరం చేశారు. -
హయత్‌నగర్‌లో10 ప్రైవేట్ ట్రావెల్స్ సీజ్
రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో ఆర్టీఏ అధికారులు ప్రైవేట్ ట్రావెల్స్‌పై చేపట్టిన దాడులు మంగళవారం కూడా కొనసాగుతున్నాయి. హైదరాబాద్ నగరంలోని హయత్ నగర్ సమీపంలో 10 బస్సులు, ఎల్బీ నగర్ వద్ద 5, ఉప్పల్ వద్ద మరో 5 బస్సులను ఆర్టీఏ అధికారులు సీజ్ చేశారు. గుంటూరు జిల్లా బాపట్లలో కూడా నాలుగు ప్రైవేట్ ట్రావెల్స్‌కు చెందిన బస్సులను అధికారులు సీజ్ చేశారు. దాంతో ఆ ట్రావెల్స్‌లోని ప్రయాణికులు తమను నడిరోడ్డుపై దించేయడం ఏమిటని అధికారులను ప్రశ్నించారు. దీంతో ప్రయాణికులను బాపట్ల ఆర్టీసీ బస్టాండ్ వద్ద అధికారులు దింపివేశారు. ఇటీవల మహబూబ్‌నగర్ జిల్లా కొత్తకోట మండలం పాలెం వద్ద వోల్వో బస్సు దగ్ధమైంది. ఆ ఘటనలో 45 మంది ప్రయాణికులు అగ్నికి ఆహుతి అయ్యారు. ఆ ఘటనతో నిద్రాణంలో ఉన్న ఆర్టీఏ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. దాంతో ప్రైవేట్ ట్రావెల్స్‌పై వరసగా దాడులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. -
రాష్ట్రవ్యప్తంగా ఆర్టీఎ తనిఖీలు ముమ్మరం
-
ఆర్టీఏ దాడులు, ఆరు ప్రైవేట్ బస్సులు సీజ్
మహబూబ్‌నగర్‌లో జిల్లాలోని పాలెం దుర్ఘటన నేపథ్యంలో ప్రైవేట్ ట్రావెల్స్ పై రవాణాశాఖ అధికారులు చేపట్టిన తనిఖీలు కొనసాగుతున్నాయి. అందులోభాగంగా హైదరాబాద్‌లోని శంషాబాద్ సమీపంలోని షాపూర్ ఆర్టీఏ చెక్‌పోస్ట్ వద్ద నిబంధనలకు విరుద్దంగా నడుస్తున్న ఐదు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను ఆర్టీఏ అధికారులు సీజ్ చేశారు. అలాగే రంగారెడ్డి జిల్లాలోని హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై ఆరు బస్సులను ఆర్టీఏ అధికారులు మంగళవారం ఉదయం సీజ్ చేశారు. టూరిస్ట్ కారియర్లుగా పర్మిట్ తీసుకుని స్టేజ్ కారియర్లుగా తిప్పుతున్నారని ఆర్టీఏ అధికారులు వెల్లడించారు. దాంతో ఆ బస్సులను సీజ్ చేసినట్లు ఆర్టీఏ ఉన్నతాధికారులు వివరించారు. అలాగే గుంటూరు జిల్లాలోని చిలకలూరిపేటలో ఆర్టీఏ అధికారులు నిర్వహించిన దాడుల్లో నాలుగు ప్రైవేట్ ట్రావెల్స్‌ను సీజ్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా నడుపుతు ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ ఆగడాలను ఎట్టిపరిస్థితుల్లో ఉపేక్షించబోమని ఆర్టీఏ అధికారులు హెచ్చరించారు. గత నెలలో మహబూబ్‌నగర్ జిల్లా కొత్తకోట మండలం పాలెం సమీపంలో బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అగ్నికి ఆహుతి అయింది. ఆ ఘటనలో 45 మంది మరణించారు. దాంతో ఆర్టీఏ ప్రైవేట్ ట్రావెల్స్‌పై కొరడ ఝుళిపించింది. దాంతో రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలను ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న దాదాపు వెయ్యి బస్సులను ఆర్టీఏ సీజ్ చేసింది. -
ఆర్టీఏ తనిఖీలు: 12 బస్సులు సీజ్
శంషాబాద్, న్యూస్‌లైన్: ఇటీవల వోల్వో బస్సుల్లో తరచూ ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో ఆర్టీఏ అధికారులు తనిఖీలు కొనసాగిస్తున్నారు. శుక్రవారం ఉదయం గగన్‌పహాడ్ చౌరస్తా వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను నిలిపి తనిఖీలు చేశారు. మొత్తం పన్నెండు బస్సులను సీజ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. బస్సుల్లో సామర్థ్యానికి మించి ప్రయాణికులను తరలిస్తున్నారని, కొన్ని బస్సుల్లో నిబంధనలకు విరుద్ధంగా ఒకే డ్రైవర్ ఉండడంతో సీజ్ చేశారు. అధికారులు వాహనాలను సీజ్ చేయడంతో బస్సుల్లో ఉన్న కొందరు ప్రయాణికులు వారితో తీవ్ర వాగ్వాదానికి దిగారు. తనిఖీలతో తాము తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని వారు వాపోయారు. -
ఎల్బీనగర్ లో ఆర్టీఏ అధికారుల తనిఖీలు, 8 బస్సులు సీజ్
-
93 బస్సులు సీజ్
ప్రైవేటు బస్సులపై ఆర్టీఏ అధికారుల దాడులు సాక్షి నెట్వర్క్: మహబూబ్‌నగర్ జిల్లాలో బస్సు దుర్ఘటన నేపథ్యంలో రాష్ట్ర రవాణాశాఖలో కదలిక వచ్చింది. ఇన్నిరోజులుగా చోద్యం చూస్తున్న ఆర్టీఏ అధికారులు.. ప్రైవేటు ట్రావెల్స్ బస్సులపై దాడులు ప్రారంభించి, నిబంధనలకు విరుద్ధంగా ఉన్నవాటిని సీజ్ చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం 93 బస్సుల్ని సీజ్ చేసి, 70 బస్సులపై కేసులు నమోదు చేశారు. ఆందోళనకర విషయం ఏమిటంటే.. తనిఖీ చేసిన బస్సుల్లో చాలా వాటిల్లో అగ్నిప్రమాదాల నియంత్రణకు ఏర్పాట్లు లేవు. ప్రథమ చికిత్స బాక్సులు ఒక్క బస్సులోనూ కనిపించలేదు. హైదరాబాద్‌లోని ఎల్బీనగర్ రింగురోడ్డు, సాగర్ రింగురోడ్డు, చింతలకుంట సమీపంలో 8 బస్సులను సీజ్ చేశారు. అందులో కేశినేని, ఎస్వీఆర్ఎస్, శ్రీకృష్ణ, గౌతమి ట్రావెల్స్‌తోపాటు కర్ణాటకకు చెందిన 3 బస్సులున్నాయి. విశాఖ శివార్లలో శుక్రవారం ఉదయంనుంచే తనిఖీలు చేపట్టిన అధికారులు నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న 18 బస్సుల్ని సీజ్ చేశారు. తూర్పుగోదావరి జిల్లాలో 7 బస్సులను సీజ్ చేశారు. 21 బస్సుల రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. కోనసీమలో 13 బస్సులపై కేసులు నమోదు చేశారు. విజయనగరం జిల్లాలో 3 బస్సులపై కేసులు నమోదు చేసి, ఒకదాన్ని సీజ్ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక బస్సును సీజ్ చేసిన అధికారులు.. 24 బస్సులపై కేసులు పెట్టారు. శ్రీకాకుళం జిల్లాలో 3 బస్సుల్ని సీజ్ చేశారు. కృష్ణా, గుంటూరు, ప్రకా శం, నెల్లూరు జిల్లాల్లో గురు, శుక్రవారాల్లో కలిపి 33 బస్సులను సీజ్ చేశారు. దాదాపు 20 బస్సులపై కేసులు పెట్టారు. అనంతపురంలో ఆర్టీఏ అధికారులు 4 బస్సుల్ని సీజ్ చేసినట్లు ప్రకటించారు. కానీ 20కిపైగా బస్సుల్ని స్వాధీనం చేసుకోగా.. ముడుపులు తీసుకుని వదిలేసినట్లు ఆరోపణలొస్తున్నాయి. కర్నూలు జిల్లాలో 12 బస్సులపై కేసులు నమోదు చేయగా.. 4 బస్సుల్ని సీజ్ చేశారు. -
ఆర్టీఏలో అవినీతి బాగోతం?
నిబంధనలు ఇలా... కొనుగోలు చేసిన ప్రతీ వాహనానికి రిజిస్ట్రేషన్ తప్పనిసరి. నాన్ ట్రాన్స్‌పోర్టు వాహనాలకు పూర్తి వివరాలను రిజిస్ట్రేషన్ కార్డుపై ముద్రించి ఆర్టీఏ కార్యాలయం నుంచి యజమానికి అందజేస్తారు. ఒరిజినల్ కార్డును ఒకసారి మాత్రమే జారీచేస్తారు. అది పోతే పోలీస్‌స్టేషన్ నుంచి సర్టిఫికెట్ తీసుకొస్తే నిబంధనల మేరకు మరోకార్డుపై డూప్లికేట్ అని ముద్రించి జారీచేస్తారు. జరుగుతోంది ఇలా... వివిధ ఫైనాన్స్‌ల నుంచి రుణం తీసుకుంటూ వాహనాలు కొనుగోలు చేస్తున్న వారు ఎందరో ఉన్నారు. ఫైనాన్స్ సాయంతో కొనుగోలు చేసినా వాటికి సంబంధించిన రిజిస్ట్రేషన్ కార్డులు యజమాని వద్దనే ఉంటాయి. డబ్బులు చెల్లించకుంటే ఆ వాహనాలను ఫైనాన్స్ నిర్వాహకులు సీజ్‌చేసి విక్రయిస్తుంటారు. ఇలాంటి వాహనాలను కన్సల్టెన్సీ వారు తక్కువ ధరకు టెండర్లో తీసుకుంటారు. వాటికి సంబంధిం చిన ఒరిజి నల్ ఆర్సీ కార్డు యజమాని వద్ద ఉండడంతో డూప్లికేట్‌ను తీసుకుని వాహనాలు విక్రయించాల్సి ఉంటుంది. కార్డు పోయిందని గతంలో పోలీస్‌స్టేషన్ నుంచి గంటల వ్యవధిలో సర్టిఫికెట్‌ను కన్సల్టెంట్లు తీసుకునేవారు. ప్రస్తుతం సర్టిఫికెట్ కావాలంటే మొదట మీ సేవలో ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వీటిని ఎస్సై లేదంటే సీఐ పరిశీలించి అప్రూవల్ చేస్తే మీ సేవ నుంచి సర్టిఫికెట్ జారీ అవుతుంది. దీనికి కనీసం వారం సమయం పడుతుంది. అది కాకుండా ప్రస్తుత రవాణాశాఖ డెప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ వాహన యజమాని వచ్చి అమ్మినట్లు సంతకం చేస్తేనే అది చెల్లుతుం దని నిబంధన పెట్టారు. ఈ రెండు కష్టతరమని నిర్ధారించుకున్న కొందరు... రిజిస్ట్రేషన్ కార్డులు సులువుగా పొందేందుకు వక్రమార్గాలు వెతికినట్లు తెలుస్తోంది. పోలీస్‌స్టేషన్‌తో సంబంధం లేకుండా గతంలో మాదిరిగానే అన్ని డాక్యుమెంట్ల ను కార్యాలయంలో సమర్పించి ఎలాంటి లావాదేవీలు జర పకుండా నేరుగా రిజిస్ట్రేషన్ కార్డులు కొనుగోలుదారుల పేరనే కొందరు బయటకు తీసుకొస్తున్నట్లు ఆరోపణలున్నాయి. దీనికి సంబంధించి ఆర్టీఏ కార్యాలయంలో ఉద్యోగుల సహకారంతో కొందరు ఏజెంట్లు ఈ దందా కొనసాగిస్తున్నట్లు సమాచారం. గత పదిహేను రోజుల్లో సుమారు 40 కార్డులు బయటకు వచ్చాయని ప్రచారం జరుగుతోంది. కార్యాలయంలో ఆన్లైన్లో లావాదేవీలు చేయకుండా, కార్డుల్లో డూప్లికేట్ అని లేకుండా ఎలా ముద్రించి బయటకు వచ్చాయనేది ప్రధాన ప్రశ్న. ఎవరికీ కాని పనులు కొందరికే ఎలా అవుతున్నాయని మరి కొందరి వాదన. ఇటీవల ఓ కన్సల్టెంట్ జిల్లా కలెక్టర్‌తోపాటు ఆర్టీవో నుంచి ట్రాన్స్‌పోర్టు కమిషనర్ వరకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. అందులో వాహనాలకు సంబంధించి పది రిజిస్ట్రేషన్ నంబర్లు, కొన్ని ఆర్సీ కార్డులను సైతం అధికారులకు సమర్పించినట్లు తెలిసింది. వీటిపై ఉన్నతాధికారులు పూర్తిస్థాయిలో విచారణ జరిపితే వాస్తవాలు బయటపడే అవకాశముంది. మా దృష్టికి వచ్చింది రిజిస్ట్రేషన్ కార్డుల వ్యవహారం మా దృష్టికి వచ్చింది. అయితే ఒకే వాహనానికి రెండు కార్డులుంటే వెంటనే తప్పని చెప్పవచ్చు. మూడు వాహనాలకు సంబంధించి మా వద్దకు ఒక్కొక్క కార్డులే వచ్చాయి. ఈ విషయాన్ని ఐటీ విభాగం జాయింట్ కమిషనర్ దృష్టిలో పెట్టాం. ఆర్టీఏ కార్యాలయంలో టూ టైర్ సర్వర్‌ను సీజ్ చేశాం. వీటిపై విచారణ జరుపుతున్నాం. తర్వాతే అసలు విషయం తెలుస్తుంది. - మీరా ప్రసాద్, డీటీసీ