శంషాబాద్: రంగారెడ్డి జిల్లాలో ఆర్టీఏ అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి. శంషాబాద్‌లో ఆర్టీఏ అధికారులు బుధవారం తెల్లవారుజామున ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న 13 ప్రైవేటు ట్రావెల్ బస్సులను గుర్తించి, సీజ్ చేశారు. మరో 7 బస్సుల యజమానులపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.