buses seized
-
ఆర్టీఏ తనిఖీలు..13 బస్సులు సీజ్
శంషాబాద్: రంగారెడ్డి జిల్లాలో ఆర్టీఏ అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి. శంషాబాద్లో ఆర్టీఏ అధికారులు బుధవారం తెల్లవారుజామున ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న 13 ప్రైవేటు ట్రావెల్ బస్సులను గుర్తించి, సీజ్ చేశారు. మరో 7 బస్సుల యజమానులపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. -
అధికారుల తనిఖీలు.. 20 బస్సులు సీజ్
షాద్నగర్: రంగారెడ్డి జిల్లాలోని షాద్నగర్ సమీపంలోని జాతీయ రహదారి-44పై ఓ టోల్ ప్లాజా వద్ద రవాణాశాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో అనుమతి లేకుండా నడుపుతున్న 20 ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను అధికారులు సీజ్ చేశారు. 20 ప్రైవేట్ బస్సుల యజమానులపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. -
ఎల్బీనగర్ లో ఆర్టీఏ తనిఖీలు
-
ఎల్బీనగర్ లో ఆర్టీఏ తనిఖీలు
-11 బస్సులు సీజ్ హైదరాబాద్: నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న బస్సులను ఎప్పటికప్పుడు ఆర్టీఏ అధికారులు తనిఖీలు చేస్తున్నప్పటికీ ట్రావెల్స్ బస్సుల యాజమాన్యాల తీరు మారటం లేదు. సరైన పత్రాలు లేకుండా, లెసైన్స్ లేని డ్రైవర్లు తో ట్రావెల్స్ బస్సులను నడుపుతున్నారు. ఆర్టీ కమిషనర్ ఆదేశాల మేరకు ఎల్బీ నగర్లో శుక్రవారం అధికారులు తనిఖీలు చేపట్టారు. సుమారు 100 ట్రావెల్స్ బస్సులను తనిఖీ చేశారు. అందులో 11 బస్సులకు సరైన పత్రాలు లేకపోవడంతో సీజ్ చేశారు. టాక్స్ చెల్లించని బస్సులకు జరిమానాలు విధించారు. -
27 ప్రైవేట్ బస్సులు సీజ్
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై ఆర్టీఏ అధికారులు శుక్రవారం తెల్లవారుజాము నుంచి ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా మొత్తం 27 బస్సులను సీజ్ చేశారు. గుంటూరు జిల్లాలో 10, విజయవాడలో 4, విశాఖపట్నం జిల్లాలో 3 తూర్పుగోదావరి జిల్లాలో 3 బస్సులను సీజ్ చేశారు. ఈ బస్సులు సరైన పత్రాలు లేకుండా ప్రయాణికులను తరలిస్తుందని ఆర్టీఏ అధికారులు తెలిపారు. అలాగే నెల్లూరు జిల్లా గూడూరు వద్ద ఆర్టీఏ అధికారుల దాడుల్లో 7 ప్రైవేట్ బస్సులను సీజ్ చేశారు. ఈ ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యం ప్రయాణీకుల నుంచి అధిక ఛార్జీలు వసూల్ చేశాయని ఆర్టీఏ అధికారులు తెలిపారు. దసరా పండగ సమయంలో రేట్టింపు ఛార్జీలను ప్రయాణికుల నుంచి వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఏకకాలంలో ఆర్టీఏ అధికారులు దాడులు నిర్వహించారు. -
30 బస్సులపై కేసులు... 20 బస్సులు సీజ్
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ వివిధ జిల్లాలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై ఆర్టీఏ అధికారులు గురువారం తెల్లవారుజామున ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా అధిక ఛార్జీలు వసూలు చేస్తున్న 30 బస్సులపై కేసులు నమోదు చేశారు. అలాగే సరైన పత్రాలు లేకుండా ప్రయాణికులను తరలిస్తున్న చేస్తున్న 20 బస్సులను సీజ్ చేశారు. కృష్ణా జిల్లా గరికపాడు వద్ద 7 ప్రైవేట్ బస్సులు, నెల్లూరు జిల్లాలో 5, గుంటూరు జిల్లాలో 5, విశాఖపట్నం జిల్లాలో 2 బస్సులపై కేసులు నమోదు చేశారు. దసరా పండగ సమయంలో రేట్టింపు ఛార్జీలను ప్రయాణికుల నుంచి వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఏకకాలంలో ఆర్టీఏ అధికారులు దాడులు నిర్వహించారు.