షాద్‌నగర్: రంగారెడ్డి జిల్లాలోని షాద్‌నగర్ సమీపంలోని జాతీయ రహదారి-44పై ఓ టోల్ ప్లాజా వద్ద రవాణాశాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో అనుమతి లేకుండా నడుపుతున్న 20 ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను అధికారులు సీజ్ చేశారు. 20 ప్రైవేట్ బస్సుల యజమానులపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.