27 ప్రైవేట్ బస్సులు సీజ్
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై ఆర్టీఏ అధికారులు శుక్రవారం తెల్లవారుజాము నుంచి ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా మొత్తం 27 బస్సులను సీజ్ చేశారు. గుంటూరు జిల్లాలో 10, విజయవాడలో 4, విశాఖపట్నం జిల్లాలో 3 తూర్పుగోదావరి జిల్లాలో 3 బస్సులను సీజ్ చేశారు. ఈ బస్సులు సరైన పత్రాలు లేకుండా ప్రయాణికులను తరలిస్తుందని ఆర్టీఏ అధికారులు తెలిపారు.
అలాగే నెల్లూరు జిల్లా గూడూరు వద్ద ఆర్టీఏ అధికారుల దాడుల్లో 7 ప్రైవేట్ బస్సులను సీజ్ చేశారు. ఈ ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యం ప్రయాణీకుల నుంచి అధిక ఛార్జీలు వసూల్ చేశాయని ఆర్టీఏ అధికారులు తెలిపారు. దసరా పండగ సమయంలో రేట్టింపు ఛార్జీలను ప్రయాణికుల నుంచి వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఏకకాలంలో ఆర్టీఏ అధికారులు దాడులు నిర్వహించారు.