private bus operators
-
Sankranti Rush: ప్రయాణికుల జేబులు ఖాళీ చేస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్
పట్నంబజారు(గుంటూరుఈస్ట్): సంక్రాంతి పండుగను పురస్కరించుకుని గుంటూరు జిల్లాలోని ప్రైవేట్ ట్రావెల్స్ అడ్డుఅదుపూ లేకుండా దోచుకుంటున్నాయి. నిబంధనలను యథేచ్ఛగా అతిక్రమిస్తున్నారు. గుంటూరు జిల్లాలో సుమారు 150 వరకు ప్రైవేట్ ట్రావెల్స్ ఉన్నాయి. హైదరాబాద్, బెంగళూరు, చెన్నైతోపాటు ఇతర ప్రాంతాల నుంచి జిల్లాకు తరలివస్తున్నారు. ఏపీఎస్ఆర్టీసీ ధరలకు అనుగుణంగానే టికెట్ ధరలు ఉండాలనే రవాణాశాఖ అధికారుల సూచనలను ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు ఖాతరు చేయని పరిస్థితులు కనపడుతున్నాయి. బుక్ చేస్తే.. మరో ధర ప్రైవేట్ ట్రావెల్స్‌లో టికెట్లు బుక్ చేసుకునేందుకు అనేక రకాల యాప్‌లు అందుబాటులో ఉన్నాయి. ఆ యాప్‌లు ఓపెన్ చేయగానే ఒక ధర.. అన్ని ఆప్షన్స్ పూర్తి చేసిన తర్వాత బుక్ చేసుకునే సమయానికి మరో ధర వస్తోంది. మంగళగిరికి చెందిన ఓ విద్యార్థిని పండుగ నిమిత్తం బెంగళూరు నుంచి సొంత ఊరికి వచ్చేందుకు టికెట్ బుక్ చేసుకుంది. ముందు టికెట్ ధర రూ 1700 చూపించిన క్రమంలో బుక్ చేసే సరికి రూ.2400 అయింది. ఇంచుమించుగా యాప్‌ల్లో ఇదే పరిస్థితి కనపడుతోందని చెబుతున్నారు. ఆన్లైన్లోనే ఇదే విధంగా వ్యవహరిస్తే.. సాధారణంగా ఒక కార్యాలయానికి వెళ్లి టికెట్ బుక్ చేసుకునే వారి పరిస్థితి ఇక చెప్పాల్సిన పనిలేదు. ఆర్టీఓ అధికారులు సూచించిన ధరల కంటే అధికంగా దోచుకుంటున్నారు. సమావేశాలకే పరిమితం నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు చేపట్టాల్సిన ఆర్టీఓ అధికారులు మాత్రం మీనమేషాలు లెక్కిస్తున్నారు. అధిక ధరలతో ప్రయాణికులను దోపిడీ చేస్తున్నా.. తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. తనిఖీలు చేస్తున్నామని పేరుకే తప్ప.. ఎక్కడా పట్టించుకున్న పాపాన పోలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. మోటార్ వెహికల్ నిబంధనల ప్రకారం ఆర్టీసీ బస్టాండ్‌కు రెండు కిలోమీటర్ల లోపు ప్రైవేట్ బస్సులు ఉండకూడదని ఆదేశాలు ఉన్నప్పటీకీ ఆర్టీఓ అధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్నారనే వాదనలు లేకపోలేదు. మంగళవారం ప్రైవేట్ ట్రావెల్స్ యజమానులతో సమావేశం నిర్వహించి అధిక చార్జీలు వసూలు చేస్తే చర్యలు తీసుకుంటామని డీటీసీ హెచ్చరించారు. ఆర్టీసీ బస్టాండ్ వద్ద సాయంత్రం సమయంలో ప్రైవేట్ బస్సుల వలన ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలుగుతున్నప్పటీకీ కనీసం ట్రాఫిక్ పోలీసులు స్పందించకపోవటం గమనార్హం. తనిఖీలు నిర్వహిస్తున్నాం జిల్లా వ్యాప్తంగా తనిఖీలు నిర్వహిస్తున్నాం. మంగళగిరి టోల్ ప్లాజా, పేరేచర్ల మరిన్ని ప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్నాం, వాటిని మరింత ముమ్మరం చేస్తాం. స్పెషల్ డ్రైవ్ చేపట్టి అధిక ధరలకు టికెట్ విక్రయాలు లేకుండా చేస్తాం. ప్రయాణికులు సైతం అధిక ధరలు డిమాండ్ చేస్తే మా దృష్టికి తీసుకుని రావాలని కోరుతున్నాం. – షేక్ కరీం, డీటీసీ -
పండగ మాటున దండుడు దందా
అమలాపురం : ఉపాధి కోసం సుదూర ప్రాంతాలకు వెళ్లినవారు సంక్రాంతి వచ్చిందంటే చాలు..స్వస్థలాలకు వచ్చేస్తుంటారు. ఇలా వచ్చేవారిలో సగం మంది ఉమ్మడి రాజధాని హైదరాబాద్ నుంచే వస్తారు. విశాఖ, విజయవాడ, తిరుపతి తదితర ప్రాంతాల నుంచి వచ్చేవారూ ఉంటారు. సంక్రాంతి రద్దీని రవాణా సంస్థలు సొమ్ము చేసుకుంటున్నాయి. ప్రైవేట్ బస్ ఆపరేటర్లు టిక్కెట్ల అమ్మకాలు నిలిపి, కృత్రిమ డిమాండ్ సృష్టించి, రేట్లు పెంచేస్తుండగా ఆర్టీసీ ప్రత్యేక బస్సుల పేరుతో టిక్కెట్ ధరను 30 శాతం పెంచి ప్రయాణికుల జేబులను కొల్లగొడుతోంది. హైదరాబాద్ నుంచి అమలాపురం 17 వరకు ప్రత్యేక బస్సులు వేశారు. సాధారణ రోజుల్లో డీలక్సు బస్సు టిక్కెట్ ధర రూ.495 కాగా, ప్రత్యేకం పేరుతో రూ. 685 వరకు వసూలు చేస్తున్నారు. సూపర్ లగ్జరీ టిక్కెట్ రూ.540 ఉండగా ఇప్పుడు రూ.790 చొప్పున వసూలు చేస్తున్నారు. విజయవాడ, విశాఖపట్నాలకు వేసిన ప్రత్యేక బస్సుల టిక్కెట్ ధరలు సైతం 30 శాతం చొప్పున పెంచారు. రైల్వేలో ఇటీవల తత్కాల్ టిక్కెట్‌కు డిమాండ్‌ను బట్టి ధర పెంచుకునే సౌకర్యం కల్పించి, నాజూకుగా ప్రయాణికులపై భారం వేస్తున్నారు. ఎన్ని ప్రత్యేక రైళ్లు, ప్రత్యేక బస్సులు వేసినా చాలని పరిస్థితుల్లో ప్రయాణికులు ప్రైవేట్ బస్సులపై ఆధారపడక తప్పదు. ఇదే అదనుగా ప్రైవేట్ ఆపరేటర్లు పండుగ రోజుల్లో టిక్కెట్ల అమ్మకాలు దాదాపు నిలిపివేశారు. రద్డీ ఎక్కువ ఉన్న రోజుల్లో టిక్కెట్ ధరను రూ.రెండు వేల వరకు పెంచి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ ఏడాది సంక్రాంతి 14న బుధవారం భోగి, 15న గురువారం సంక్రాంతి, 16న శుక్రవారం కనుమ, 17న శనివారం ముక్కనుమ వచ్చాయి. హైదరాబాద్‌లో ఉండే కొందరు శనివారం రాత్రే బయలుదేరి రాగావారి నుంచి ప్రైవేట్ ఆపరేటర్లు టిక్కెట్‌కు రూ.1,200 వసూలు చేశారు. ఇక 13న మంగళవారం రాత్రి టిక్కెట్ ధర రూ.1,500 వరకు పలికేలా ఉంది. శనివారంతో పండుగ ముగుస్తున్నా మర్నాడు ఆదివారం కావడంతో ఆ రోజే తిరిగి వెళ్లనున్నారు. ప్రయాణం ఖర్చే అధికం జిల్లాలోని రాజమండ్రి, కాకినాడ, అమలాపురం తదితర ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు టిక్కెట్ రూ.600 నుంచి రూ.700 వరకు ఉండగా, సంక్రాంతి రోజుల్లో రూ.1,500 వరకు పెంచేస్తున్నారు. తుని వంటి సుదూర ప్రాంతాలకైతే ధర రూ.రెండు వేల వరకు ఉంటోంది. పండుగ నాడు వేసుకునే కొత్తదుస్తులు, పిండి వంటల ఖర్చుకన్నా ప్రయాణాల ఖర్చే ఎక్కువ అవుతోంది. అయినా స్వస్థలంపై, స్వజనంపై ఉండే మమకారంతో వారు ఎన్ని వ్యయప్రయాసలకైనా సిద్ధపడుతుంటారు. అదే అవకాశంగా ఆర్టీసీ, ప్రైవేట్ బస్ యాజ మాన్యాలు సొమ్ములు దండుకుంటున్నాయి. ఈ ఏడాది పండుగల సమయంలో ప్రత్యేక బస్సుల టిక్కెట్లు ధర పెంచమని, ప్రైవేట్ ఆపరేటర్లు టిక్కెట్ ధర పెంచితే పర్మిట్‌ను రద్దు చేస్తామని ఇటీవల రవాణా శాఖమంత్రి శిద్ధా రాఘరావు చేసిన హెచ్చరిక గాలిలో కలిసిపోయింది. -
27 ప్రైవేట్ బస్సులు సీజ్
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై ఆర్టీఏ అధికారులు శుక్రవారం తెల్లవారుజాము నుంచి ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా మొత్తం 27 బస్సులను సీజ్ చేశారు. గుంటూరు జిల్లాలో 10, విజయవాడలో 4, విశాఖపట్నం జిల్లాలో 3 తూర్పుగోదావరి జిల్లాలో 3 బస్సులను సీజ్ చేశారు. ఈ బస్సులు సరైన పత్రాలు లేకుండా ప్రయాణికులను తరలిస్తుందని ఆర్టీఏ అధికారులు తెలిపారు. అలాగే నెల్లూరు జిల్లా గూడూరు వద్ద ఆర్టీఏ అధికారుల దాడుల్లో 7 ప్రైవేట్ బస్సులను సీజ్ చేశారు. ఈ ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యం ప్రయాణీకుల నుంచి అధిక ఛార్జీలు వసూల్ చేశాయని ఆర్టీఏ అధికారులు తెలిపారు. దసరా పండగ సమయంలో రేట్టింపు ఛార్జీలను ప్రయాణికుల నుంచి వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఏకకాలంలో ఆర్టీఏ అధికారులు దాడులు నిర్వహించారు. -
పండుగ సాకుతో దండుడు
సాక్షి, రాజమండ్రి :వేసవి సెలవుల అనంతరం పిల్లలకు లభించే పెద్ద ఆటవిడుపు దసరా సెలవలే. పదిరోజుల వరకూ ఉండే ఈ వ్యవధిలో తల్లిదండ్రులూ వెసులుబాటు చేసుకుని పండుగ ప్రయాణాలకు సన్నద్ధమవుతారు. అదిగో.. ఆ రద్దీనే అవకాశంగా మార్చుకుని సొమ్ము చేసుకుంటున్నాయి రవాణా సంస్థలు. ఈ లాభాలవేటలో ప్రైవేట్ బస్సు ఆపరేటర్లూ, ఆర్టీసీ వారూ పోటీ పడుతున్నారు.ప్రైవేట్ ఆపరేటర్లు ఇష్టారాజ్యంగా రేట్లు వసూలు చేస్తుండగా, ఆర్టీసీ ప్రత్యేక బస్సుల పేరుతో టిక్కెట్ ధరలు పెంచేస్తోంది. జిల్లా మీదుగా పలు ప్రత్యేక రైళ్లు నడుపుతున్నా వాటికి సంబంధించిన రిజర్వేషన్లు ఎన్నడో అయిపోయాయి. జిల్లాలోని రాజమండ్రి, కాకినాడ, సామర్లకోట స్టేషన్లకు కేటాయించిన బెర్తులు, సీట్లు 60 రోజుల ముందే భర్తీ అయ్యాయి. దక్షిణమధ్య రైల్వే హైదరాబాద్‌కు కాకినాడ నుంచి ఆరు, విశాఖ నుంచి మూడు ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. శనివారంతో వీటిలో సీట్లు కూడా అయిపోయాయి. దీంతో జిల్లా వాసులకు కేవలం బస్సు ప్రయాణమే దిక్కవుతోంది. హైదరాబాద్‌కు నాన్ ఏసీ చార్జి రూ.1500 రాజమండ్రి నుంచి హైదరాబాద్‌కు మామూలుగా రూ.600 నుంచి రూ.800 వరకు చార్జి చేసే ప్రైవేట్ బస్సుల వారు పండుగ రద్దీ సాకుతో రూ.1000 నుంచి రూ.1200 వరకు వసూలు చేస్తున్నారు. అత్యవసరంగా ప్రయాణించాల్సిన వాళ్ల నుంచి అదే అవకాశంగా నాన్ ఏసీ బస్సు టిక్కెట్‌కే రూ.1500 వసూలు చేస్తున్నట్టు ఓ ప్రైవేట్ బస్సు నిర్వాహకుడే చెప్పారు. కండిషన్ సరిగ్గా లేని బస్సులను సైతం పండుగ స్పెషల్ సర్వీసులుగా నడుపుతూ వాటికి కూడా స్పెషల్ రేట్లు వసూలు చేస్తున్నారు. విశాఖపట్నం నుంచి వచ్చే వాటితో కలిపి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు సుమారు 60 బస్సులను ప్రైవేట్ ఆపరేటర్లు తిప్పుతున్నారు. వీటి నుంచే పండుగ పేరుచెప్పి అదనంగా దండుకునేందుకు చూస్తున్నారు. రద్దీని బట్టి అప్పటి కప్పుడు ఖాళీగా ఉన్న టూరిస్టు సర్వీసులను సిద్ధంచేసి జనాన్ని తరలించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. బస్సులు కాదు.. చార్జీలే ప్రత్యేకం కాగా ఆర్టీసీ జిల్లాలో వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు మామూలుగా నడిపే సర్వీసులతో పాటు పండుగ సందర్భంగా మొత్తం వంద ప్రత్యేక బస్సులను నడుపుతోంది. ఇవి శనివారం నుంచి అక్టోబర్ ఒకటి వరకూ కాకినాడ, అమలాపురం, రాజమండ్రి ఇతర ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు నడుస్తాయి. తిరిగి రెండు నుంచి ఆరు వరకూ అదే సంఖ్యలో ప్రత్యేక సర్వీసులు హైదరాబాద్ నుంచి జిల్లాలోని వివిధ ప్రాంతాలకు నడుస్తాయి. ఈ ప్రత్యేక బస్సుల్లో ప్రయాణించే వారిపై ఆర్టీసీ అదనపు భారం మోపుతోంది. ప్రస్తుతం ఉన్న చార్జికి 50 శాతం అదనంగా వసూలు చేస్తోంది. రాజమండ్రి నుంచి హైదరాబాద్‌కు ప్రస్తుతం సూపర్ లగ్జరీ చార్జి రూ.441 కాగా స్పెషల్ సర్వీసుల్లో రూ.660 వరకూ ఉంటోంది. కాగా జిల్లా సర్వీసులుగా తిరిగే బస్సుల్లోనే కొన్నింటిని ఆర్టీసీ విజయవాడ, విశాఖలకు ప్రత్యేక బస్సులుగా మళ్లిస్తోంది. ప్రయాణికుల రద్దీని బట్టి అప్పటికప్పుడు నడుపుతున్న ఈ ప్రత్యేక సర్వీసులకూ అదనపు చార్జీలనే వసూలు చేస్తోంది. -
పండక్కి బస్సు ఛార్జీలు పెరగకుండా చర్యలు
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వందరోజుల పాలన సంతృప్తినిచ్చిందని ఆ రాష్ట్ర రావాణా శాఖ మంత్రి శిద్దా రాఘవరావు తెలిపారు. బుధవారం హైదరాబాద్‌లో ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... ఆర్టీసీ 2,300 కోట్ల నష్టాల్లో ఉందన్నారు. ఆ నష్టాలను అధిగమించేందుకు చర్యలు చేపట్టినట్లు చెప్పారు. వచ్చేయేడాది నుంచి గతుకులు లేని రోడ్లు నూరుశాతం నిర్మిస్తామని స్పష్టం చేశారు. దసరా సీజన్లో ప్రైవేట్ బస్సు ఛార్జీలు పెరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. అందుకోసం ప్రైవేట్ బస్సు యాజమాన్యాలతో సమావేశం ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఆర్టీసీ బస్సు ఛార్జీలపై నిర్ణయం తీసుకోలేదన్నారు. 100 రోజుల్లో 450 ప్రేవేట్ స్కూళ్ల బస్సులను సీజ్ చేశామని తెలిపారు.ఆర్టీసీ విభజనకు రెండు నెలల సమయం పడుతుందని... షీలాబిడే కమిటీ నివేదిక తర్వాతే విభజన పూర్తవుతుందన్నారు. -
ప్రైవేటు బస్సుల ఆగడాల్ని అడ్డుకోండి!
హైకోర్టులో జనవిజ్ఞాన వేదిక పిల్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నిబంధనలకు విరుద్ధంగా స్టేజ్ క్యారేజీ వాహనాలుగా తిరుగుతున్న అన్ని ప్రైవేటు బస్సుల్ని నిరోధించాలని, నిబంధనలు ఉల్లంఘిస్తున్న ప్రైవేటు బస్సు ఆపరేటర్లైపై కఠిన చర్యలు తీసుకోవాలని.. రాష్ట్రప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి. రాష్ట్రంలో రవాణా వ్యవస్థ తీరు తెన్నులపై అధ్యయనానికి హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి నేతృత్వంలో నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కూడా వాటిలో కోరారు. జన విజ్ఞాన వేదికతోపాటు హైదరాబాద్‌కు చెందిన జె.కె.రాజు వేర్వేరుగా వీటిని దాఖలు చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రవాణాశాఖ ముఖ్యకార్యదర్శి, హోంశాఖ ముఖ్య కార్యదర్శి, రవాణా కమిషనర్, డీజీపీ, ఆర్టీసీ ఎండీ తదితరులను ప్రతివాదులుగా పేర్కొన్న ఈ పిటిషన్లను సోమవారం చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించనున్నది. అక్టోబర్ 30న మహబూబ్‌నగర్ జిల్లా, పాలెం వద్ద 45 మంది సజీవదహనానికి కారణమైన వోల్వో బస్సు నిబంధనలకు విరుద్ధంగా స్టేజ్ క్యారేజీగా తిరుగుతోందని పిటిషనర్లు తెలి పారు. రాష్ట్రంలో ఈ ఏడాది మార్చి 31 నాటికి కాంట్రాక్ట్ క్యారేజీ అనుమతి పొందిన బస్సులు 6,530 ఉన్నాయని, దాదాపు అవన్నీ స్టేజ్ క్యారేజీ వాహనాలుగా తిరుగుతున్నాయని తెలిపారు. అధికారుల అలసత్వంతో ప్రైవేటు బస్సు ఆపరేటర్లు యథేచ్ఛగా నిబంధనలను ఉల్లంఘిస్తున్నారన్నా రు. మోటారు వాహన చట్టంలోని నిబంధనలను కఠినంగా అమలు చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని అభ్యర్థించారు. -
కెమికల్స్ రవాణా చేస్తున్న ప్రైవేటు బస్సు ఆఫరేటర్లు