పండక్కి బస్సు ఛార్జీలు పెరగకుండా చర్యలు
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వందరోజుల పాలన సంతృప్తినిచ్చిందని ఆ రాష్ట్ర రావాణా శాఖ మంత్రి శిద్దా రాఘవరావు తెలిపారు. బుధవారం హైదరాబాద్లో ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... ఆర్టీసీ 2,300 కోట్ల నష్టాల్లో ఉందన్నారు. ఆ నష్టాలను అధిగమించేందుకు చర్యలు చేపట్టినట్లు చెప్పారు. వచ్చేయేడాది నుంచి గతుకులు లేని రోడ్లు నూరుశాతం నిర్మిస్తామని స్పష్టం చేశారు.
దసరా సీజన్లో ప్రైవేట్ బస్సు ఛార్జీలు పెరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. అందుకోసం ప్రైవేట్ బస్సు యాజమాన్యాలతో సమావేశం ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఆర్టీసీ బస్సు ఛార్జీలపై నిర్ణయం తీసుకోలేదన్నారు. 100 రోజుల్లో 450 ప్రేవేట్ స్కూళ్ల బస్సులను సీజ్ చేశామని తెలిపారు.ఆర్టీసీ విభజనకు రెండు నెలల సమయం పడుతుందని... షీలాబిడే కమిటీ నివేదిక తర్వాతే విభజన పూర్తవుతుందన్నారు.