
సాక్షి, అమరావతి : మంత్రి శిద్దా రాఘవరావుకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలంటూ టీడీపీ కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గురువారం దర్శి టీడీపీ కార్యకర్తలు చంద్రబాబు నివాసానికి వచ్చారు. ‘శిద్దాకు ఎంపీ వద్దు.. ఎమ్మెల్యే’ ముద్దు అంటూ ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. మంత్రి శిద్దా రాఘవరావును పార్లమెంట్ బరిలో నిలబెట్టాలని చంద్రబాబు నాయుడు నిర్ణయించిన సంగతి తెలిసిందే. గతంలో దర్శి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించిన శిద్దాను.. ఈసారి ఒంగోల్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేయాలంటూ అధిష్టానం నిర్ణయించింది.
అటు దర్శి అసెంబ్లీ నియోజకవర్గం అభ్యర్థిగా ఉగ్రనరసింహారెడ్డి పేరును టీడీపీ ప్రకటించింది. అయితే తాను ఎంపీగా పోటీ చేసేది లేదంటూ శిద్దా.. చంద్రబాబు నాయుడికి తేల్చి చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment