MLA ticket
-
తెలుగుదేశం పార్టీలో డబ్బు ఉంటేనే సీట్లు
-
వాడుకొని వదిలేయడం బాబుకు అలవాటే!
ఆక్ పాక్ కరివేపాక్ ఫిలాసఫీని అలానే కొనసాగిస్తున్నారు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు. కర్నూలు జిల్లాలో భూమా కుటుంబానికి కోలుకోలేని షాకిచ్చారాయన. నంద్యాల నియోజక వర్గం భూమా అఖిలప్రియ- భూమా బ్రహ్మానందరెడ్డిలో ఒకరికి ఇస్తానన్నట్లు చెబుతూ వచ్చిన చంద్రబాబు చివరకు ఎన్.ఎం.డి.ఫరూక్‌ను నియోజక వర్గ ఇన్ ఛార్జ్ ప్రకటించేశారు. వచ్చే ఎన్నికల్లో ఆయనకే టికెట్ ఖాయమని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇంతకాలం పార్టీకోసం కష్టపడితే ఇపుడు తమని పక్కన పెట్టి మోసం చేశారని భూమా బ్రహ్మానంద రెడ్డి లోలోనే కుత కుత లాడిపోతున్నారు. అవసరానికి వాడుకోవడం ఆ తర్వాత వదిలేయడం చంద్రబాబు నాయుడికి హెరిటేజ్ వెన్నతో పెట్టిన విద్య. కర్నూలు జిల్లాలో 2014 ఎన్నికల్లో నంద్యాల అసెంబ్లీ నియోజక వర్గం నుండి వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ తరపున భూమా నాగిరెడ్డి విజయం సాధించారు. ఎన్నికల తర్వాత కొంత కాలానికి ఆయన్ను రక రకాలుగా ప్రలోభాలు పెట్టి వేధించి టిడిపిలో చేరేలా చేసుకున్నారు చంద్రబాబు నాయుడు. ఆయనతో పాటు ఆయన కూతురు భూమా అఖిల ప్రియ కూడా టిడిపిలో చేరారు. వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ తరపున ఆళ్లగడ్డ నియోజక వర్గం నుంచి గెలిచిన అఖిల ప్రియ చంద్రబాబు ప్రలోభాలతో టిడిపిలో చేరారు. 2017లో భూమా నాగిరెడ్డి హఠాన్మరణంతో నంద్యాలకు ఉప ఎన్నిక అనివార్యం అయ్యింది. భూమా అఖిల ప్రియ సోదరుడు భూమా బ్రహ్మానంద రెడ్డికి టికెట్ ఇచ్చారు చంద్రబాబు. ఆ ఎన్నికల్లో బ్రహ్మానంద రెడ్డి విజయం సాధించారు. కాకపోతే 2019 ఎన్నికల్లో ఆయన ఓటమి చెందారు. అయినా టిడిపినే అంటిపెట్టుకుని ఉన్నారు. వచ్చే ఎన్నికల్లోనూ నంద్యాల నుండి తానే పోటీ చేయాలని బ్రహ్మానందరెడ్డి ఆశపడుతూ వచ్చారు. అయితే చంద్రబాబు మాత్రం జిల్లాలో భూమా కుటుంబం నుండి ఒకరికే టికెట్ ఇస్తామని చెబుతూ వచ్చారు. ఈ క్రమంలోనే భూమా అఖిల ప్రియ చేత నంద్యాలలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. బ్రహ్మానందరెడ్డి-అఖిల ప్రియ మధ్య రచ్చ రాజేసి ఇద్దరి మధ్య పోటీ పెట్టిన చంద్రబాబు నాయుడు ఇపుడు హఠాత్తుగా మాజీ ఎమ్మెల్యే ఎన్. ఎం.డి. ఫరూక్ ను నియోజక వర్గ ఇన్ ఛార్జ్ గా ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో ఫరూక్ కు టికెట్ కేటాయించినట్లే అంటున్నారు పార్టీ నేతలు. అయిదేళ్లుగా పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీ బలోపేతం కోసం తాను పార్టీలోనే ఉంటే ఇపుడు తనను పక్కన పెట్టడం ఏం న్యాయమని బ్రహ్మానంద రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు మరోసారి వెన్నుపోటుకు తెగబడ్డారని బ్రహ్మానంద రెడ్డి తన అనుచరులతో చెప్పుకుని బాధ పడుతున్నారట. ఫరూక్ కు టికెట్ ఇస్తే మాత్రం ఆయన్ను ఓడించడమే లక్ష్యంగా పనిచేస్తామని బ్రహ్మానందరెడ్డి తన కోటరీ సభ్యులతో అంటోన్నట్లు ప్రచారం జరుగుతోంది . మొత్తానికి వచ్చే ఎన్నికల్లోనూ నంద్యాల నియోజక వర్గం వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ ఖాతాలోనే పడుతుందని వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ వర్గాలతో పాటు టీడీపీ నేతలు కూడా భావిస్తున్నారు. -
దళిత అధికారిని కొట్టిన వ్యక్తికి టికెట్టా?
జైపూర్/జోథ్‌పూర్: దళితుల కోసం పనిచేస్తున్నామని చెప్పుకుంటున్న ప్రధాని మోదీ, దళిత ఇంజినీరింగ్ అధికారిపై దాడికి పాల్పడిన వ్యక్తికి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశమెలా ఇస్తారని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ప్రశ్నించారు. మలింగకు టిక్కెట్ ఇవ్వడం ద్వారా రాజస్తాన్ రాజకీయ చరిత్రలో బీజేపీ చీకటి అధ్యాయం లిఖించినట్లయిందని సీఎం అశోక్ గెహ్లోత్ విమర్శించారు. బారి అసెంబ్లీ నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే, కాంగ్రెస్‌కు చెందిన గిరిరాజ్ సింగ్ మలింగ విద్యుత్ శాఖ ఇంజినీరింగ్ అధికారిపై దాడికి పాల్పడినట్లు ఆరోపణలొచ్చాయి. దీంతో పార్టీ ఆయనకు టిక్కెట్ నిరాకరించింది. ఆ తర్వాత మలింగ బీజేపీలో చేరడం, ఆ పార్టీ తరఫున ఎన్నికల బరిలోకి దిగడం జరిగిపోయాయి. కాంగ్రెస్ చీఫ్ ఖర్గే, సీఎం గెహ్లోత్ శనివారం జైపూర్‌లోని ఎస్ఎంఎస్ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న బాధిత అధికారి హర్షాధిపతి వాల్మీకిని పరామర్శించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. ‘మలింగ చేసిన పనిని చూసి అతడిని మేం దూరంగా పెట్టాం. అతడికి టిక్కెట్టివ్వకుంటే ఏమవుతుంది? ఏ పార్టీ కూడా అలాంటి వారికి చోటివ్వరాదు. మరోవైపు, పేదల కోసం ఎంతో చేశామని బీజేపీ చెప్పుకుంటోంది. తనది పేదల పక్షమని ప్రధాని మోదీ స్వయంగా అంటున్నారు. వాస్తవం మాత్రం వేరుగా ఉంది. ఇతరులపై దాడులకు పాల్పడే వారికి మోదీ, అమిత్ షా అవకాశమిస్తున్నారు. మలింగకు బీజేపీ టిక్కెటివ్వడం సిగ్గుచేటు. దీనిని ఖండిస్తున్నాను’అని పేర్కొన్నారు. అనంతరం గెహ్లోత్ మాట్లాడుతూ..‘దళిత అధికారిపై దాడిని బీజేపీ ఖండించింది. కానీ, అందుకు కారకుడైన వ్యక్తిని అక్కున చేర్చుకుని, టిక్కెట్టిచ్చింది. అధికారం కోసం బీజేపీ ఎంతకైనా దిగజారుతుందని ఈ ఘటన రుజువు చేసింది. బీజేపీ వైఖరేంటో అర్థమవుతుంది. అది దళిత వ్యతిరేకి. దీనితో రాజస్తాన్ రాజకీయ చరిత్రలో బీజేపీ చీకటి అధ్యాయం లిఖించింది’అని పేర్కొన్నారు. అంతకు సుమారు రెండు గంటలకు ముందు ప్రధాని మోదీ భరత్‌పూర్‌లో జరిగిన ర్యాలీలో రాజస్తాన్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మహిళలు, దళితులపై దాడులు పెరిగిపోయాయంటూ చేసిన ఆరోపణలపై వారు పైవిధంగా స్పందించారు. గత ఏడాది మార్చిలో ధోల్పూర్ విద్యుత్ శాఖ కార్యాలయంలో ఎమ్మెల్యే మలింగ, అతడి మద్దతుదారులు చేసిన దాడిలో వాల్మీకి, మరో అధికారి తీవ్రంగా గాయపడ్డారు. అప్పటి నుంచి వాల్మీకి ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నారు. ఘటన అనంతరం ఎమ్మెల్యే మలింగ పోలీసులకు లొంగిపోయారు. ప్రస్తుతం ఆయన బెయిల్‌పై బయటకు వచ్చారు. -
జనగామ బీఆర్ఎస్ లో టికెట్ జగడానికి తెరపడినట్లేనా..?
-
బీజేపీలో బిగ్ ట్విస్ట్.. తన తండ్రికి టికెట్ ఇవ్వొదన్న కూతురు..
జైపూర్: ఈ ఏడాది చివరలో ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీలు ప్లాన్ చేస్తున్నాయి. ఈ క్రమంలో రాజస్థాన్‌లోని బీజేపీలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. తన తండ్రికి టికెట్ ఇవ్వొదంటూ బీజేపీ మాజీ ఎమ్మెల్యే కూతురు నిరసనలు తెలిపింది. దీంతో, అక్కడ పొలిటికల్ వాతావరణం హాట్ టాపిక్‌గా మారింది. వివరాల ప్రకారం.. రాజస్థాన్‌లో అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల ప్రకటనకు ముందే బీజేపీలో ట్విస్ట్ చోటుచేసుకుంది. మాజీ ఎమ్మెల్యే అయిన తన తండ్రికి పార్టీ టిక్కెట్ ఇవ్వద్దంటూ ఆయన కుమార్తెనే అధిష్ఠానానికి అల్టిమేటం ఇచ్చింది. ఒకవేళ టిక్కెట్ ఇస్తే తన తండ్రిపై రెబల్ అభ్యర్థిని బరిలోకి దింపి, ఇతర టిక్కెట్ ఆశావహులతో కలిసి ఓడిస్తానని హెచ్చరించడం రాజస్థాన్ రాజకీయాల్లో ప్రస్తుతం సంచలనంగా మారింది. మాజీ ఎమ్మెల్యే జయరామ్ జాటవ్ కూతురు మీనా జాటవ్ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిసి తన తండ్రికి టిక్కెట్ ఇవ్వవద్దని కోరారు. దీంతో, వీరి వ్యవహారం రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. మరోవైపు.. తన ఆస్తులను కొట్టేసేందుకు స్వయానా తన తండ్రే కుట్రలు చేస్తున్నారని ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు. అలాంటి వ్యక్తి సామాన్య ప్రజలకు ఏం న్యాయం చేస్తాడని ప్రశ్నించారు. అంతేకాకుండా తన కొడుకును కూడా చంపించాలని చూస్తున్నాడని మీనా జాటవ్ ఆరోపించారు. ఇదిలా ఉండగా, కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాజస్థాన్‌లో గెలుపే లక్ష్యంగా బీజేపీ ప్రణాళిక రచిస్తోంది. ఇప్పటికే ప్రధాని మోదీ సహా బీజేపీలోని పలువురు సీనియర్ నేతలు రాజస్థాన్‌లో పర్యటించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని ప్రజలకు కోరారు. ఇక, కాంగ్రెస్ నేతలు కూడా రాజస్థాన్‌లో పర్యటిస్తున్నారు. అక్కడ గెలుపే లక్ష్యంగా హస్తం నేతలు ప్లాన్స్ చేస్తున్నారు. ఇది కూడా చదవండి: గగన్‌యాన్‌లో కీలక ప్రయోగానికి ఇస్రో సిద్ధం -
బీఆర్ఎస్ టూ కాంగ్రెస్.. వాట్సాప్‌లో రౌడీషీట్ వైరల్
కరీంనగర్‌రూరల్: కరీంనగర్ మండలం బొమ్మకల్ సర్పంచు పురుమల్ల శ్రీనివాస్ కాంగ్రెస్‌పార్టీ టికెట్ కోసం చేస్తున్న ప్రయత్నాలతో జిల్లా రాజకీయాలు వేడెక్కుతున్నాయి. అధికార పార్టీ బీఆర్ఎస్లోనే ఉండి కరీంనగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే టికెట్ కోసం శ్రీనివాస్ దరఖాస్తు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ నెల 16న బీఆర్ఎస్కు రాజీనామా చేసిన సర్పంచు శ్రీనివాస్‌పై గతంలో కరీంనగర్‌రూరల్ పోలీసులు రౌడీషీట్ ఓపెన్ చేసిన సర్క్యులర్తోపాటు పలుకేసుల వివరాలు సోషల్‌మీడియాలో జోరుగా ప్రచారమైనాయి. ఈక్రమంలో శనివారం ఢిల్లీలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని కలిసి కాంగ్రెస్‌పార్టీలో చేరారు. టికెట్ కోసం చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ఆదివారం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేను సర్పంచు శ్రీనివాస్ కలుసుకోవడం జిల్లాలో ప్రాధాన్యతను సంతరించుకుంది. కరీంనగర్ టికెట్‌ను ఆశిస్తున్న పలువురు నాయకులు హైదరాబాద్ స్థాయిలో టీపీసీసీ నాయకులతో ప్రయత్నిస్తుండగా శ్రీనివాస్ ఏకంగా ఢిల్లీస్థాయిలో ప్రయత్నాలు చేయడం రాజకీయవర్గాల్లో సంచలనంగా మారింది. కాంగ్రెస్‌లో చేరిన మరుసటిరోజే టికెట్ కోసం ఏఐసీసీ అధ్యక్షుడిని కలుసుకునే అవకాశం రావడం పార్టీలోని మిగతా ఆశావహులను కలవరపరుస్తోంది. ఎది ఏమైనా శ్రీనివాస్ ఢిల్లీలో రెండు రోజులుగా చేస్తున్న ప్రయత్నాలు చర్చనీయాంశంగా మారాయి. -
రాయచూరులో చైత్రా బాధిత దంపతులు ?
రాయచూరు రూరల్: చైత్రా కుందాపూర్ గ్యాంగ్‌లో వంచనకు గురైన బాధితులు ఒక్కొక్కరే బయటకు వస్తున్నారు. బీజేపీ తరపున ఎమ్మెల్యే టికెట్ ఇప్పిస్తామని కోట్లు వసూలు చేసిన చైత్రాను ప్రస్తుతం పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెల్సిందే. తాజాగా రాయచూరు తాలుకా గిల్లేసుగూరు తిమ్మారెడ్డి భార్య గాయత్రి కొప్పళ జిల్లా కనకగిరి ఎస్సీ రిజర్వుడ్ క్షేత్రం నుంచి బీజేపీ తరఫున విధాన సభ ఎన్నికల్లో పోటీ చేయాలని ఆశించారు. ఈ నేపథ్యంలో ఢిల్లీకి చెందిన విశాల్ నాగ్, బెంగళూరు జీతు, గౌరవ్‌లు టికెట్ ఇప్పిస్తామని చెప్పి తిమ్మారెడ్డి నుంచి రూ. 21 లక్షలు తీసుకుని పరారయ్యారు. తమకు రాజకీయ పెద్దలు బాగా తెలుసని బాధిత దంపతులను నమ్మించి డబ్బులు వసూలు చేసుకున్నారు. బాధిత దంపతులు జూలై 19న బెంగళూరు అశోక్ నగర పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసు చైత్రా కుందాపూర్ మెడకు చుట్టుకునే అవకాశముంది. -
ఎమ్మెల్యే టికెట్ పేరుతో రూ.5 కోట్లు స్వాహా?
కర్ణాటక: బీజేపీ తరఫున ఎమ్మెల్యే టికెట్ ఇప్పిస్తానని పారిశ్రామిక వేత్తనుంచి కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు ఆరోపణలపై సామాజిక కార్యకర్త చైత్రా కుందాపురతో సహా ఆరుగురిని బుధవారం సీసీబీ పోలీసులు అరెస్ట్‌చేశారు. అదనపు పోలీస్‌కమిషనర్ సతీశ్‌కుమార్ కేసు వివరాలు వెల్లడించారు. ఏం జరిగిందంటే.. గత శాసనసభ ఎన్నికల సమయంలో బైందూరు నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున పోటీ చేసేందుకు పారిశ్రామికవేత్త గోవిందబాబుపూజారి ఆసక్తితో ఉన్నాడు. ఆ సమయంలోనే చైత్రాకుందాపురతో పరిచయమైంది. ఆర్ఎస్ఎస్ నేతలతో, పీఎంఓలో తనకు పరిచయాలు ఉన్నాయని చెప్పింది. చిక్కమగళూరుకు గోవిందబాబు పూజారిని తీసుకెళ్లి ఓ వ్యక్తిని పరిచయం చేసింది. ఈయన పేరు విశ్వనాథ్ అని, ఆర్ఎస్ఎస్లో పలుకుబడి ఉందని, టికెట్ ఇప్పిస్తారని చెప్పింది. అనంతరం మూడు విడతలుగా రూ.5కోట్ల నగదు తీసుకుంది. మార్చి 8న ఓ వ్యక్తి పారిశ్రామికవేత్తకు ఫోన్ చేసి విశ్వనాథ్ మృతిచెందారని తెలిపారు. అనుమానం వచ్చి కశ్మీరులో ఉన్న స్నేహితుడు విశ్రాంత ఆర్మీ అధికారి యోగేశ్‌కు ఫోన్ చేయగా విశ్వనాథ్ ఆర్ఎస్ఎస్లో ఎవరూలేరని తెలిపారు. చైత్రాకుందాపురకు ఫోన్ చేసి తన డబ్బు వెనక్కి ఇవ్వాలని కోరగా ఆత్మహత్యాయత్నం నాటకం ఆడింది. కొంత సమయం కావాలని అడిగింది. అనుమానం రావడంతో చైత్రాకుందాపుర, గగన్కడూరు, అభినవ హాలశ్రీస్వామీజీ, రమేశ్, ధనరాజ్, నాయక్, శ్రీకాంత్, ప్రసాద్బైందూరుపై బండెపాళ్య పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సీసీబీ పోలీసులు తీవ్రంగా గాలించి చైత్రా కుందాపుర, గగన్ కడూరు, శ్రీకాంత్‌నాయక్, ప్రసాద్, మరో ఇద్దరిని అరెస్ట్‌చేసి ఉడుపి నుంచి బెంగళూరు నగరానికి తరలించారు. బెంగళూరు నగర ఒకటో ఏసీఎంఎం కోర్టులో హాజరు పరిచి మరింత విచారణ కోసం ఈనెల 23 తేదీ వరకు కస్టడీలోకి తీసుకున్నారు. అజ్ఞాతంలోకి స్వామీజీ? మూడో నిందితుడిగా తనపై కేసు నమోదైనట్లు తెలియడంతో విజయనగర జిల్లా హూవినహడగలి తాలూకా హిరేహడగలి హాలుమత అభినవ హాలశ్రీ స్వామీజీ అజ్ఞాతంలోకి వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది. -
టీడీపీ టికెట్ నాకు వద్దు.. ఎవరు పోటీ చేసినా నాకు సంబంధం లేదు
సాక్షి, పుట్టపర్తి: అధినేత అరెస్టు కావడంతో ‘తమ్ముళ్ల’లో వణుకు పుట్టింది. రాబోవు ఎన్నికల్లో గెలవలేమని ఇప్పటికే స్పష్టమైన సంకేతాలు అందడంతో పోటీ చేయాలా? వద్దా? అనే సందేహంలో కొందరు సీనియర్ నాయకులు పడ్డారు. ఈ క్రమంలో బేరం కుదిరితే పొత్తుల పేరుతో జనసేన, కాంగ్రెస్ పార్టీలోని ఆశావహులకు టికెట్ త్యాగం చేసేందుకూ వెనుకాడడం లేదు. ఇవే అంశాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. మరికొన్ని చోట్ల టికెట్ ఆశిస్తున్న వారికే బాధ్యతలు ఇచ్చి తప్పుకోవాలని ప్రస్తుత ఇన్చార్జిలు భావిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. డీల్ కుదిరితే ఓకే.. ధర్మవరం, పెనుకొండ నుంచి టీడీపీ తరఫున పోటీ చేసేందుకు నాయకులు ముందుకు రావడం లేదు. ఈ క్రమంలోనే ఆశావహుల మధ్య జరిగిన బేరసారాల్లో డీల్ కుదరక అయోమయంలో పడినట్లు సమాచారం. ఇన్నాళ్లూ పెద్ద మొత్తంలో ఖర్చు చేశానని ఒకరు.. ఎన్నికల్లో ఖర్చు చేయాలని ఇంకొకరు.. బేరసారాలు చేస్తున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే ఎన్నికల్లో పోటీ చేయడం కన్నా టికెట్లు అమ్మడం, కొనడం చేయడమే ఈజీగా ఉంటుందని ‘తమ్ముళ్ల’ మధ్య కొన్ని రోజులుగా సంభాషణ జోరుగా జరుగుతోంది. ధర్మవరంలో పరిటాల శ్రీరామ్ ఇన్చార్జిగా ఉన్నప్పటికీ పోటీ చేసేందుకు సుముఖంగా లేనట్లు సమాచారం. మరో వైపు వరదాపురం సూరి (గోనుగుంట్ల సూర్యనారాయణ) ఏ పార్టీ తరఫున పోటీ చేస్తారో తెలియని పరిస్థితి. పొత్తులో భాగంగా ధర్మవరాన్ని జనసేనకు కేటాయిస్తే తాను బరిలో ఉంటానని చిలకం మధుసూదన్‌రెడ్డి ఇప్పటికే ముమ్మర ప్రచారం చేసుకుంటున్నారు. పోటీ చేయబోమంటూ.. ఎస్సీ రిజర్వుడు స్థానమైన మడకశిరలో టీడీపీ తరఫున పోటీ చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. గతంలో ఎమ్మెల్యేగా పని చేసిన ఈరన్నను కాదని.. బీసీ వర్గానికి చెందిన గుండుమల తిప్పేస్వామికి నియోజకవర్గ బాధ్యతలు అప్పజెప్పారు. దీంతో ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఎవరు పోటీ చేస్తారనే దానిపై స్పష్టత లేదు. గుండుమల తిప్పేస్వామి సూచించిన వారికి టికెట్ ఇచ్చేందుకు అధిష్టానం ఒప్పుకోలేదనే వాదనలూ వినిపిస్తున్నాయి. మరోవైపు ఈరన్న కూడా తనకు టికెట్ వద్దని.. ఎవరు పోటీ చేసినా తనకు సంబంధం లేదని అనుచరుల వద్ద తేల్చి చెప్పినట్లు సమాచారం. పోటీ చేస్తే గెలుస్తామనే నమ్మకం లేకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. స్పష్టత లేదాయె.. కదిరి, పుట్టపర్తి నియోజకవర్గాల్లో టీడీపీ తరఫున ఎవరు పోటీ చేస్తారనే దానిపై ఇప్పటికీ స్పష్టత లేదు. దీంతో కార్యకర్తలను కాపాడుకోవడంలో ఆయా నియోజకవర్గాలకు ఇన్చార్జిలుగా వ్యవహరిస్తున్న నాయకులు విఫలం అవుతున్నారు. ఫలితంగా ఉన్న క్యాడర్ కూడా ఊడిపోయింది. చంద్రబాబు అరెస్టుతో ధర్నాలు, నిరసనలు తెలపాలన్న అధిష్టానం ఆదేశాలను ఈ రెండు నియోజకవర్గాల్లోని కార్యకర్తలు బేఖాతరు చేశారు. నాయకులు తప్ప కార్యకర్తలు రాకపోవడంతో టీడీపీ నేతల బలం తేలిపోయింది. దీంతో టీడీపీలో సెకండ్ క్యాడర్లో ఉన్న నాయకులు కూడా ప్రత్యామ్నాయం వైపు చూస్తున్నారు. టీడీపీలో కొనసాగితే తమకు రాజకీయ భవిష్యత్తు ఉండదన్న భయం వారిని వెన్నాడుతోంది. జత కట్టేదెవరితో? వచ్చే ఎన్నికల్లో సొంతంగా పోటీ చేస్తే గెలవలేమని టీడీపీ అధిష్టానం గట్టి నమ్మకంతో ఉంది. దీంతో కాంగ్రెస్ లేదా, జనసేనతో జత కట్టేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని సమాచారం. దీంతో ఆ పార్టీలకు ఎన్ని సీట్లు ఇస్తారు? ఏయే స్థానాలు కట్టబెడతారు? అనే దానిపై పలు సందేహాలు ఉన్నాయి. దీంతో ప్రస్తుతం టీడీపీ తరఫున నియోజకవర్గ ఇన్చార్జిలుగా ఉన్నవారు పార్టీ బలోపేతానికి ఖర్చు చేసేందుకు ముందుకు రావడం లేదు. పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఆదేశించినా రోడ్డెక్కకుండా ఇంటికే పరిమితమితమవుతున్నారు. -
సాగర్ అభ్యర్థిని మార్చాలి.. లేదంటే!.. బీఆర్ఎస్ నేతల డిమాండ్
సాక్షి, నల్గొండ: ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా ప్రకటనతో అధికార బీఆర్ఎస్ అమ్మతి జ్వాలలు తీవ్ర స్థాయికి చేరాయి. నాగార్జున సాగర్ నియోజకవర్గంలో సిట్టింగ్‌లకు టికెట్టు ఇవ్వడంతో స్థానిక నేతలు అంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సాగర్ ఎమ్మెల్యే అభ్యర్థి నియమాకాన్ని వెనక్కి తీసుకోవాలిని వాదిస్తున్నారు. ఎమ్మెల్యే నోముల భగత్‌పై అసంతృప్తి నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. నాగార్జున సాగర్ సిట్టింగ్ ఎమ్మెల్యేను మార్చాలని స్థానిక బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ప్రజల్లో, నాయకుల్లో ఎమ్మెల్యేపై తీవ్ర వ్యతిరేక వ్యక్తమవుతోంది. ఈ మేరకు నాగార్జున సాగర్ ఎమ్మెల్యే టికెట్ ఆశావాహి మన్నెం రంజిత్ యాదవ్ మాట్లాడుతూ.. అందరం కలిసి కట్టుగా పనిచేసి నోముల భగత్‌ను ఉప ఎన్నికల్లో గెలిపించుకున్నామని తెలిపారు. అయితే ఇప్పటి వరకు పార్టీ సమావేశానికి స్థానిక నేతలను ఆహ్వానించడం లేదని మండిపడ్డారు. తండ్రి పేరుతో ఎమ్మెల్యేగా గెలిచారని, ఆయనకు కార్యకర్తలతో ఎలా మాట్లాడాలనేది కూడా తెలియదని విమర్శించారు. నియోజకవర్గంలోని గ్రామ గ్రామల్లో కొట్లాటలు జరుగుతున్నాయని, సమస్యలను పరిష్కరించడంలో నోముల భగత్ విఫలమయ్యారని అన్నారు. ఆయన వర్గానికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారని దుయ్యబట్టారు. భగత్‌ను కాకుండా స్థానిక వ్యక్తికి అవకాశం ఇవ్వాలని తెలిపారు. భగత్‌ను మార్చకపోతే ఇండిపెండెంట్ అభ్యర్థిని నిలబెడతామని ముక్తకంఠంతో తెలిపారు. -
కార్యాచరణపై రేపు మైనంపల్లి భేటీ
అల్వాల్: ఇటీవల చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణ రూపకల్పన కోసం పార్టీ శ్రేణులు, అనుచరులతో శనివారం మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు సమీక్ష సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. నాలుగు రోజుల క్రితం తిరుపతిలో ఆయన చేసిన వ్యాఖ్యలతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. తనతోపాటు కుమారుడికి ఎమ్మెల్యే టికెట్ కేటాయించాలని డిమాండ్ చేస్తూ మంత్రి హరీశ్ వైఖరి పట్ల ఘాటు విమర్శలు చేసిన సంగతి విదితమే. ఈ వ్యాఖ్యల పట్ల మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత తమదైన శైలిలో స్పందించారు. పార్టీ అభ్యర్థుల ప్రకటన అనంతరం జరుగున్న ఈ సమావేశంలో తాను తీసుకునే నిర్ణయాన్ని పార్టీ శ్రేణులు, అనుచరులకు మైనంపల్లి వెల్లడించే అవకాశం ఉంది. పార్టీ మారుతారనే ఊహగానాలు వస్తున్న నేపథ్యంలో జరుగుతున్న సమావేశంపై అంతటా ఆసక్తి నెలకొంది. శనివారం 10 గంటలకు దూపల్లిలోని తన నివాసం వద్ద ఉదయం 10 గంటలకు సమావేశం నిర్వహించనున్నట్లు అందరు హాజరు కావాలని పార్టీ శ్రేణులకు ఆయన సమాచారం అందించారు. దీంతోపాటు మైనంపల్లికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న సొంత పార్టీ నేతలపై మైనంపల్లి అనుచరులు ఎదురు దాడికి దిగుతున్నారు. -
ఎమ్మెల్సీ కవితను కలిసిన జాన్సన్‌నాయక్
ఖానాపూర్: బీఆర్ఎస్ ఖానాపూర్ అభ్యర్థిగా ఎంపిక అనంతరం బుక్యా జాన్సన్‌నాయక్ ఇప్పటికే జిల్లా మంత్రి ఐకేరెడ్డితో పాటు జి ల్లాలోని పార్టీ ఎమ్మెల్యేలు, అభ్యర్థులను రా ష్ట్ర సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. మంగళవారం హైదరాబాద్‌లో ఎమ్మెల్సీ కవితను ఆమె నివాసంలో కలిసి పు ష్పగుచ్ఛం అందజేసి ప్రత్యేక కృతజ్ఞతలు తె లిపారు. తనపై నమ్మకంతో ఎమ్మెల్యే టికె ట్ను కేటాయించిన సీఎం కేసీఆర్‌తో పా టు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు జాన్సన్ నాయక్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మంత్రిని కలిసిన అనిల్ జాదవ్ నిర్మల్‌టౌన్: జిల్లా కేంద్రంలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో మంగళవారం మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డిని బోథ్ ని యోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి అనిల్ జాదవ్ మర్యాదపూర్వకంగా కలిశా రు. ఈ సందర్భంగా మంత్రిని శాలువా, పుష్పగుచ్ఛంతో సన్మానించారు. -
కారు పార్టీ ఎమ్మెల్యేలను ఆ బ్రిడ్జీలు ముంచేస్తాయా? విపక్షాలకు సంబరమెందుకు!
నియోజకవర్గాల్లో అభివృద్ధి బాగానే చేశారు. అయినా ఆ ఎమ్మెల్యేలను భయం వెంటాడుతోంది. ఈసారి ఎన్నికల్లో గెలుస్తామా? లేదా? అని సందేహిస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆ నలుగురు ఎమ్మెల్యేల భయానికి కారణం ఏంటి? ఎమ్మెల్యేలకు ఓడిపోతామనే భయం ఎందుకు పీడిస్తోంది? కారణాలేంటో చూద్దాం.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నిర్మాణం పూర్తికాని అసంపూర్తి బ్రిడ్జీలు నలుగురు అధికార పార్టీ ఎమ్మెల్యేలకు గుబులు పుట్టిస్తున్నాయి. వారంతా తమ నియోజకవర్గాల్లో ప్రగతిని పరుగులు పెట్టించారు. కాని అసంపూర్తిగా ఆగిపోయిన బ్రిడ్జీల్ని పూర్తి చేయడంలో విఫలం అయ్యారు. మూడోసారి కోనప్ప ఆ వైఫల్యమే వారిపట్ల ప్రజల్లో వ్యతిరేకతను పెంచుతోంది. కుమ్రంబీమ్ జిల్లా సిర్పూర్ టి నియోజకవర్గానికి రెండుదఫాలుగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు కోనేరు కోనప్ప. ముచ్చటగా మూడోసారి అసెంబ్లీలో అడుగు పెట్టాలన్న ఆయన కోరిక పెద్దవాగుపై కూలిపోయిన వంతెన వల్ల నెరవేరదేమోనని భయపడుతున్నారు. కాగజ్‌నగర్-దహేగామ్ మండలాలను కలిపే ఆ వారధి గత ఏడాది భారీ వర్షాలకు దెబ్బ తిని కూలిపోయింది. బ్రిడ్జి కూలిపోవడంతో దహేగామ్ మండలంలోని పద్దేనిమిది గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఏడాదిగా అక్కడి ప్రజలు పడరాని పాట్లు పడుతున్నారు. బ్రిడ్జి నిర్మాణానికి టెండర్లు పిలిచినా పనులు మాత్రం సాగడంలేదు. కూలిపోయిన వంతెన స్థానంలో కొత్తదాని నిర్మాణం ప్రారంభం కాకపోవడానికి ఎమ్మెల్యే కోనప్ప వైఫల్యమే కారణమని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇప్పుడు ఆ వంతెన తన పుట్టి ముంచుతుందేమోనని కోనప్ప ఆందోళన చెందుతున్నారు. (చదవండి: మాజీ మంత్రి జూపల్లికి షాక్..!) రేఖ నాయక్‌కు షాకిచ్చేందుకు సిద్ధం? నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గ ప్రజలకు గంగాపూర్ బ్రిడ్జి కలగా మిగిలిపోయింది. కడెం నదిపై బ్రిడ్జి లేక గంగాపూర్ పరిసర ప్రాంతాల్లోని పది గ్రామాల ప్రజలు వర్షకాలంలో తెప్పలపై ప్రయాణం సాగిస్తున్నారు. అనేకసార్లు ప్రమాదాలు జరిగి ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. ఇక్కడ వంతెన నిర్మాణానికి పనులు ప్రారంభించారు. కాని ఆ పనులు పిల్లర్ల దశ దాటలేదు. అసంపూర్తిగా ఉన్న బ్రిడ్జి ఎప్పుడు పూర్తవుతుందో తెలియకుండా ఉంది. రాకపోకలకు ప్రజలు ఇంత కష్టపడుతున్నా ఎమ్మెల్యే రేఖనాయక్ పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. దీంతో ఎమ్మెల్యే తీరుపై ప్రజల్లో వ్యతిరేకత తీవ్రంగా ఉందట. వంతెన నిర్మిస్తామని చెప్పి మాట తప్పిన ఎమ్మెల్యేకు ఎన్నికలలో బుద్ది చెప్పాలని ప్రజలు నిర్ణయించుకున్నారట. ఆత్రం సక్కు తీరుపై ఆగ్రహం.. కుమ్రంబీమ్ జిల్లా ఆసిఫాబాద్ నియోజకవర్గంలో గుండేగామ్ గ్రామానికి పక్కనే ఉన్న వాగుపై దశాబ్దం క్రితం వంతెన నిర్మాణం ప్రారంభించారు. ఇన్నేళ్ళయినా ఆ వంతెన పనులు పిల్లర్ల దశ దాటలేదు. వంతెన లేకపోవడంతో గ్రామస్థులు పుట్టి, తెప్పలపై ప్రయాణం సాగిస్తున్నారు. వాగుకు వరద వచ్చినపుడు ప్రమాదాల బారినపడుతున్నారు. అదేవిధంగా కెరమెరి మండలం కరంజీవాడ వాగుపై కూడా వంతెన లేదు. వంతెన కోసం పునాదులు తవ్వి వదిలేశారు. ఈ ప్రాంతంలో పది గ్రామాల ప్రజలు దశాబ్దాలుగా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. వర్షాలు పడినపుడు రోజుల తరబడి ఈ గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలుండవు. ప్రజల కష్టాలు తెలిసినప్పటికీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు పట్టించుకోవడంలేదని ఆ ప్రాంత ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. వంతెన కోసం అవసరమైతే ఎన్నికలు బహిష్కరించాలన్న ఆలోచనతో ఉన్నారని టాక్ నడుస్తోంది. (చదవండి: మంత్రి శ్రీనివాస్ గౌడ్‌పై రేవంత్ సంచలన ఆరోపణలు) కష్టాలకు బదులివ్వడం ఖాయమా.. ఇక ఆదిలాబాద్ నియోజకవర్గంలోని జైనథ్ మండలం తరోడాలో అంతరాష్ట్ర రహదారిపై ఉన్న వాగుపై ఓ వంతెన ఉంది. పగుళ్లుబారి ప్రమాదకరమైన స్థితికి చేరడంతో దానిపై రాకపోకలు నిలిపివేశారు. దీంతో ఈ మార్గంలో ప్రయాణించేవారు నానా కష్టాలు పడుతున్నారు. నియోజకవర్గంలోని జైనథ్, బేల మండలాల ప్రజలకు ఈ వంతెన ఎంతో ముఖ్యమైనది. వంతెన నిర్మాణానికి నిధులు మంజూరైనా పనులు చేయించడంతో ఎమ్మెల్యే జోగు రామన్న విఫలమయ్యారని అక్కడి ప్రజలు, విపక్షాలు ఆయనపై నిప్పులు చెరుగుతున్నారు. ప్రజలకు అవసరమైన పనులు చేయించలేని ఎమ్మెల్యేకు బుద్ధి చెప్పాలని ప్రతిపక్షాలు పిలుపునిస్తున్నాయి. ఈ వంతెనే అధికార పార్టీని ఓడించబోతోందని, తమను గెలిపించబోతోందని విపక్ష నేతలు సంబరపడుతున్నారు. ఇదిలా ఉంటే విపక్షాల విమర్శలను అధికార పార్టీ నేతలు కొట్టిపారేస్తున్నారు. వంతెనలు నిర్మించడం అంటే నిచ్చెనలు వేసినంత సులువుకాదంటున్నారు. బ్రిడ్జిల నిర్మాణానికి నిధులు మంజూరు చేయించినా తమ మీద అనవసరంగా విమర్శలు చేస్తున్నారని, నియోజకవర్గాల్లో తాము సాధించిన అభివృద్ధి పనులే మరోసారి తమను గెలిపిస్తాయని గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. - పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ -
ఎలక్షన్స్ వచ్చినపుడే టికెట్ అనేది పాత ముచ్చట.. మా ముచ్చట ఇనుకోండ్రి!
ఉమ్మడి నల్గొండ జిల్లాలో పార్టీలకు అతీతంగా బీసీ నేతలు ఏకమవుతున్నారా? తమకూ ఒక అవకాశం ఇవ్వాలని తమ పార్టీలను కోరుతున్నారా? పోటీ చేయడానికి తగిన గ్రౌండ్ చేసుకుంటున్నారా? ఇంతకీ టిక్కెట్లు ఆశిస్తున్న బీసీ నేతలు ఎవరు? ఎవరెవరు ఏ పార్టీలో ఉన్నారు? పార్టీలు బీసీ నేతల్ని ప్రోత్సహించడానికి సిద్దంగా ఉన్నాయా? వివరాలేంటో చూద్దాం.. ఉమ్మడి నల్గొండ రాజకీయంగా ఎంతో చైతన్యం ఉన్న జిల్లా. అయితే ఇక్కడ పార్టీ ఏదైనా రెడ్డి సామాజికవర్గానిదే పై చేయిగా ఉంటుంది. అయితే జిల్లాలోని కొందరు బీసీ నేతలు తమకూ ఓ ఛాన్స్ ఇవ్వాలని కోరుతున్నారట. అప్పటికప్పుడు ఎమ్మెల్యే టికెట్ కోరితే లాభం ఉండదనే ఉద్దేశంతో రెండు మూడేళ్లుగా గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారట. సామాజిక కార్యక్రమాలతో ప్రజల్ని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారట. ఈ నేపథ్యంలో కొన్ని నియోజకవర్గాల్లో టికెట్ కోసం పోటీ పడుతున్న బీసీ నేతల సంఖ్య పెరిగిపోయిందట. అధికార బీఆర్ఎస్లోనే బీసీ నేతల పోటీ ఎక్కువగా ఉన్నట్లు టాక్ నడుస్తోంది. బీర్లకు చేయి అందిస్తే.. యాదాద్రి జిల్లాలోని ఆలేరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ టికెట్ తనకే ఇవ్వాలని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బీర్ల అయిలయ్య కోరుతున్నారు. గత మూడున్నరేళ్లుగా నియోజకవర్గ కాంగ్రెస్‌కు అన్నీ తానై వ్యవహరిస్తున్నానని ఆయన అంటున్నారు. పార్టీ కార్యక్రమాలతో పాటు నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలపై పనిచేస్తున్నారు. తన పేరుతో ఫౌండేషన్ ఏర్పాటు చేసి సామాజిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. మరోవైపు కులవృత్తులవారికి పనిముట్లను పంపిణీ చేస్తూ వారి మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బీసీలకు కేటాయించే స్థానం ఆలేరు ఒక్కటే అన్న ప్రచారం సాగుతోంది. మిగతా నియోజకవర్గాల్లో ఇప్పటికే ఓసీ సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నేతలు ఉండటంతో వారిని కాదని అక్కడ బీసీలకు సీటు ఇచ్చే అవకాశం లేదు. ఇది అయిలయ్యకు కలిసి వచ్చే అంశంగా చెబుతున్నారు. (మణిపూర్ ఘటనే కనిపిస్తోందా?.. పార్లమెంట్ ఎదుట బీఆర్ఎస్ ఎమ్మెల్యే బాధితురాలు) మునుగోడుపై రవి ఆశలు మునుగోడు నియోజకవర్గంలో బీఆర్ఎస్ నుంచి నారబోయిన రవి టికెట్ ఆశిస్తున్నారు. ఇప్పటికే ఆయన భార్య జెడ్పీటీసీ సభ్యురాలిగా కొనసాగుతున్నారు. ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన రవి ఉప ఎన్నికల సందర్భంలో కూడా టిక్కెట్ ఆశించారు. ఆశావహుల లిస్ట్‌లో కూడా ఆయన పేరు ప్రముఖంగానే వినిపించింది. నియోజకవర్గంలో తన సామాజిక వర్గానికి 38 వేల వరకు ఓట్లు ఉన్నాయని తనకు అవకాశం ఇవ్వాలని జిల్లా మంత్రితో పాటు అధిష్టాన పెద్దలను కూడా నారబోయిన రవి కోరుతున్నారట. ఇప్పటికే ఆయన నియోజకవర్గం అంతా వాల్ రైటింగ్ విస్తృతంగా రాయించడంతో పాటు పోస్టర్లు కూడా ఖాళీ లేకుండా అతికిస్తూ జనాలను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. ఉత్తమ్ కాదంటే నాకే! కోదాడ నియోజకవర్గంలో మొదటి నుంచి గులాబీ టికెట్ ఆశిస్తున్నవారిలో వనపర్తి లక్ష్మీనారాయణ ఒకరు. ఈయన పెరిక సామాజిక వర్గంలో బలమైన నేతగా ఉన్నారు. లక్ష్మీనారాయణ భార్య శిరీష కోదాడ మున్సిపల్ చైర్ పర్సన్‌గా కొనసాగుతున్నారు. గత నాలుగేళ్లుగా కోదాడ టికెట్ ఆశిస్తూ లక్ష్మీనారాయణ అనేక కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు. మరోవైపు నియోజకవర్గంలో ఆయన సామాజిక వర్గపు ఓట్లు కూడా నిర్ణయాత్మకంగా ఉండటంతో తనకు టికెట్ ఇస్తే ఖచ్చితంగా గెలుస్తానని లక్ష్మీనారాయణ నమ్మకం. కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య పట్ల ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉందని, ఆయన్ను మార్చి మరో వ్యక్తికి టికెట్ ఇస్తారని ప్రచారం సాగుతోంది. ఒకవేళ మల్లయ్యను మారిస్తే మాత్రం తనను పరిగణలోకి తీసుకోవాలని పార్టీ పెద్దల వద్ద లక్ష్మీనారాయణ ప్రస్తావిస్తున్నారట. టికెట్ ఇవ్వకపోతే.. సెపరేట్ రూట్ హుజూర్ నగర్లో పిల్లుట్ల రఘు అనే సామాజిక కార్యకర్త కూడా ఎప్పటి నుంచో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. ఆ ప్లాన్ లో భాగంగానే నియోజకవర్గంలో గత నాలుగేళ్లుగా అనేక సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల్లో ఎవరు టికెట్ ఇచ్చినా పోటీ చేసేందుకు ప్రణాళిక తయారు చేసుకుంటున్నారట. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో కీలక నేతలను కలిసి తన కోరిక వెలిబుచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఈ నియోజకవర్గం నుంచి ఉత్తమ్‌కుమార్‌ను కాదని రఘుకు టికెట్ ఇచ్చే పరిస్థితి ఉండదనేది బహిరంగ విషయమే. (చదవండి: ఆగస్టు 3 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు) ఒకవేళ కుటుంబంలో ఒకరికే టికెట్ అనే కాంగ్రెస్ సూత్రంలో భాగంగా ఉత్తమ్ ఫ్యామిలీలో ఒకరికే టికెట్ ఆయన హుజూర్ నగర్లో కాకుండా కోదాడలో పోటీ చేయొచ్చని.. అలా జరిగితే తనకు అవకాశం ఇవ్వాలని రఘు కోరుతున్నారట. కాంగ్రెస్ నాయకత్వం ఆయన అభ్యర్థనను ఏవిధంగా తీసుకుంటుదనేది కీలకంగా మారనుంది. మరోవైపు మిగిలిన పార్టీల నేతలను కూడా కలిసి తాను చేసిన సామాజిక కార్యక్రమాలను చెప్తూ టికెట్ ఇవ్వాలని కోరుతున్నారట. ఏ పార్టీ నుంచి అవకాశం రాకపోతే ఇండిపెండెంట్‌గా అయినా బరిలో దిగేందుకు ఆయన ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో పార్టీలకు అతీతంగా బీసీ నేతలు టికెట్ రేసులోకి దూసుకువస్తున్నారు. పార్టీలు అవకాశం ఇవ్వకపోతే ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తామని ప్రకటించడంతో జిల్లా రాజకీయాలు రంజుగా మారనున్నాయి. -సాక్షి, పొలిటికల్ డెస్క్. -
ఎమ్మెల్యేలకు టికెట్ టెన్షన్ !
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో టికెట్ల కేటాయింపు అధికార పార్టీ ఎమ్మెల్యేల్లో గుబులు రేపుతోంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ మళ్లీ టికెట్ వస్తుందా? రాదా? అనే మీమాంసలో ఉన్నారు. తమకే టికెట్లు మళ్లీ వచ్చేలా ప్రజల్లో గ్రాఫ్ పెంచుకునే పనిలో ఉన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలకే మళ్లీ బీ ఫాం ఇస్తారా? లేక కొత్త వారిని ఎంపిక చేస్తారా? అనే చర్చ జిల్లా రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. జిల్లాలో నాలుగు నియోజకవర్గాలైన మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూరు, ఖానాపూర్(జన్నారం) పరిధిలోని ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీకి చెందిన వారే. ఇందులో ముగ్గురు ఎమ్మెల్యేలు రెండేసి, మూడేసి సార్లు గెలుపొందిన వారే. చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ మాత్రమే తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచారు. అంతకుముందు పెద్దపల్లి ఎంపీగా ఉన్నారు. ఈ క్రమంలో మళ్లీ ఈ నలుగురికే టికెట్లు ఇస్తారా? లేదా? అని ప్రతిపక్ష నాయకుల్లో చర్చ సాగుతోంది. వివాదాల్లో చిన్నయ్య.. బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య వ్యక్తిగతంగా పలు వివాదాల్లో చిక్కుకున్నారు. ఎన్నికలకు ముందే ‘ఆరిజిన్ డెయిరీ’ వివాదం ఆయనను వెంటాడుతోంది. నియోజకవర్గంలో తన అనుచరుల భూ కబ్జాలు, సెటిల్మెంట్లు, అభివృద్ధి పనుల్లో కమీషన్ల ఆరోపణలు వచ్చాయి. బెల్లంపల్లిలో జరిగిన ప్రగతి నివేదన సభలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ చిన్నయ్యపై ప్రశంసలు కురిపించారు. నియోజకవర్గంలో అనేక అభివృద్ధి పనులు చేస్తున్నారని కొనియాడారు. మళ్లీ గెలుపించుకోవాలని ఇక్కడి ప్రజలను కోరారు. ఈ మాటలతో మళ్లీ తనకే టికెట్ అని ఎమ్మెల్యే అనుచరులు నమ్ముతున్నారు. ఇక్కడ మార్పు ఉంటుందని, అనేక ఆరోపణల నేపథ్యంలో కొత్త వారికి అవకాశం ఉంటుందనే వాదనలు ఉన్నాయి. సుమన్‌కు కేసీఆర్ అండ చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్‌కు సీఎం కేసీఆర్‌తో ఉన్న సాన్నిహిత్యంతో మళ్లీ టికెట్ ఖాయమని అనుచరులు చెప్పుకుంటున్నారు. రూ.వందల కోట్ల నిధుల తెచ్చి చెన్నూరును తన అడ్డాగా మార్చుకుంటున్నారని, ఇక్కడి నుంచే పోటీ చేస్తారని, సీటు ఖాయమని అంటున్నారు. 2018ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే నల్లాల ఓదేలును కాదని ఎంపీగా ఉన్న సుమన్‌కు టికెట్ ఇచ్చారు. జిల్లాలో చెన్నూరు ఒక చోట మాత్రమే సిట్టింగ్ ఎమ్మెల్యేను మార్చారు. కింది స్థాయి నాయకుల్లో సుమన్‌పై వ్యక్తమవుతున్న అసంతృప్తి, టికెట్ కేటాయింపులో ప్రభావం చూపనుందా? అనేది తేలాల్సి ఉంది. ఇక ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్‌పై వ్యతిరేకత ఉండడంతో ఇక్కడ మార్పు ఉంటుందని బీఆర్ఎస్లోని ఓ వర్గం నాయకులే ప్రచారం చేస్తున్నారు. తమకే మళ్లీ అవకాశం వస్తుందని ఎమ్మెల్యే గట్టి నమ్మకంతో ఉన్నారు. జిల్లాలో ఒకరిద్దరి మార్పు? జిల్లాలో నలుగురు ఎమ్మెల్యేలపై ప్రజ ల్లో మద్దతు, వ్యతిరేకత, అవినీతి, అక్రమాల ఆరో పణలు, వ్యక్తిగత విమర్శలు టికెట్ల కేటాయింపులో ఎంతమేరకు ప్రభావం చూపుతాయన్నది కీలకంగా మారింది. మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు జిల్లాలో సీనియర్ నాయకులుగా ఉన్నారు. బీఆర్ఎస్ నుంచి వరసగా రెండుసార్లు, అంతకుముందు కాంగ్రెస్ నుంచి గెలిచిన చరిత్ర ఉంది. ఆయనతోపాటు కొడుకు విజిత్‌రావు సైతం రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. కింది స్థాయి నాయకులు కొందరు విజిత్‌రావును ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రచారం చేస్తున్నారు. విజిత్‌రావు గ్రామాల్లో పర్యటిస్తూ, పార్టీ కార్యకలాపాల్లో పాల్గొంటున్నారు. ఇటీవల జరిగిన సీఎం సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమ్మెల్యే దివాకర్‌రావు గురించి ఎటువంటి ప్రస్తావన తీసుకు రాలేదు. సభ వేదికపై శాలువా కప్పేందుకు ప్రయత్నించగా వద్దని వారించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రత్యర్థులు పలు రకాలుగా ఈ వీడియోను ప్రచారం చేశారు. తాజా పరిస్థితుల్లో తండ్రి, కొడుకుల్లో ఎవరికి టికెట్? లేక మార్పు ఉంటుందా? అనే ప్రశ్నలు వస్తున్నాయి. ఎమ్మెల్యేలపై నివేదికలు ఎమ్మెల్యేలకు ప్రజల్లో బలం, ఆర్థిక స్థితిగతులు, వీరిని కాదని కొత్త వారికి అవకాశం ఇస్తే ఎలా ఉంటుందనే కోణాల్లో సర్వేలు జరిగాయి. అదే సమయంలో మార్చే చోట పార్టీలో గెలిచే సత్తా ఉన్న నాయకులు ఉన్నారా? అని ఆరా తీసినట్లు సమాచారం. టికెట్లు ఇవ్వకపోతే ఎమ్మెల్యేలను ఎలా సంతృప్తి పరచాలి? ఎవరైనా పార్టీ మారేందుకు ప్రతిపక్షాలతో టచ్‌లో ఉంటున్నారా? అనే కోణాల్లో ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే నియోజకవర్గాల వారీగా సిట్టింగ్ ఎమ్మెల్యేతోపాటు ఇంకో ముగ్గురు నాయకుల పేర్లతో సర్వేలు చేయించారు. ఇందులో ఇద్దరి పేర్లు మాత్రమే పాజిటివ్‌గా ఉన్నట్లు సమాచారం. ఎన్నికల షెడ్యూల్‌కు ముందే మరోసారి నివేదికలు తెప్పించుకుని ఆయా నియోజకవర్గాల్లో ప్రతిపక్ష అభ్యర్థుల బలం, సిట్టింగ్ ఎమ్మెల్యే గ్రాఫ్‌ను బట్టి టికెట్లు ఖరారు చేస్తారని సమాచారం. అప్పటి వరకు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ టెన్షన్ మాత్రం తప్పేలా లేదు. -
మద్దిపాటికి టికెట్ ఇస్తే ఇస్తే అంతే! చిత్తుగా ఓడిస్తాం కబర్దార్!
సాక్షి, రాజమహేంద్రవరం/దేవరపల్లి: టీడీపీ గోపాలపురం నియోజవర్గ నేతల్లో విభేదాలు తారస్థాయికి చేరాయి. మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు, పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి మద్దిపాటి వెంకట్రాజు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతూండటంతో ఇరు వర్గాల మధ్య కుమ్ములాటలు మొదలయ్యాయి. పార్టీ వ్యవహారాల్లో ఇద్దరికీ పొసగడం లేదు. వరికి వారే అన్న చందంగా వేరు కుంపట్లు పెట్టారు. మద్దిపాటిని ఇన్చార్జి బాధ్యతల నుంచి తప్పించి ముప్పిడి కట్టబెట్టాలన్న డిమాండ్ తెర పైకి వస్తోంది. దీని కోసం ఎంతవరకై నా వెళ్లేందుకు ముప్పిడి వర్గం సిద్ధంగా ఉంది. చివరికి పార్టీ అధినేతతో తాడోపేడో తేల్చుకునేందుకై నా వెనుకాడటం లేదు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి దేవరపల్లి మండలం గౌరీపట్నంలో గోపాలపురం నియోజకవర్గంలోని నాలుగు మండలాలకు చెందిన ముప్పిడి వర్గీయులు, కార్యకర్తలు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రాత్రి 9 గంటలకు ప్రారంభమైన భేటీ అర్ధరాత్రి 12 గంటల వరకూ కొనసాగింది. మద్దిపాటి వర్గాన్ని ఎదుర్కోవడం, ముప్పిడికి ఇన్చార్జి బాధ్యతలు అప్పగించాలనే డిమాండ్‌పై ప్రధానంగా చర్చ జరిగింది. విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లాలని నిర్ణయించారు. అక్కడ గ్రీన్ సిగ్నల్ రాకపోతే ఎలా వ్యవహరించాలన్న విషయమై భవిష్యత్ కార్యాచరణ రూపొందించినట్టు సమాచారం. గ్రామానికి 50 మంది చొప్పున కార్యకర్తలను ఎంపిక చేసి, ముప్పిడికి మద్దతుగా భారీ స్థాయిలో ఆందోళనలు నిర్వహించాలని, మద్దిపాటి ఒంటెద్దు పోకడను చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లాలని నిర్ణయించారు. వచ్చే ఎన్నికల్లో మద్దిపాటికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తే తీవ్ర పరిణామాలు తప్పవని, ఆయనను చిత్తుగా ఓడించేందుకై నా వెనుకాడరాదని నిర్ణయించినట్టు తెలిసింది. అనంతరం గ్రామ కమిటీలు ఏర్పాటు చేసి మద్దిపాటికి టికెట్ ఇవ్వవద్దంటూ వివరించాలని తీర్మానం చేశారు. దేవరపల్లి మండల మాజీ అధ్యక్షుడు కొయ్యలమూడి చినబాబు, సుంకర దుర్గారావు, ఏలేటి సత్యనారాయణ (నల్లజర్ల), మేడ్ని సుధాకర్ (గోపాలపురం), సుంకవల్లి బ్రహ్మయ్య (ద్వారకా తిరుమల), పలువురు నాయకులు, కార్యకర్తలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఆది నుంచీ అదే గతి టీడీపీ అధినేత చంద్రబాబు తీరుతో గోపాలపురం నియోజకవర్గంలోని తెలుగు తమ్ముళ్లు విసిగిపోతున్నారు. ముందు నుంచీ పార్టీ కోసం పని చేస్తున్న ముప్పిడి వెంకటేశ్వరావును నియోజకవర్గ ఇన్చార్జి పదవి నుంచి తొలగించి, ఈ విభేదాలకు చంద్రబాబు ఆజ్యం పోశారు. అప్పటి నుంచీ ఎస్సీ సామాజికవర్గ నేతలు గుర్రుగా ఉన్నారు. పార్టీ ఇన్చార్జిగా మద్దిపాటి వెంకట్రాజును నియమించారు. అంతటితో ఆగకుండా వచ్చే ఎన్నికల్లో ఆయనే పోటీ చేస్తారని ప్రకటించారు. దీంతో అగ్గి మరింత రాజుకుంది. తమ నేతను ఎందుకు తప్పించారో స్పష్టం చేయాలని ముప్పిడి వర్గం చంద్రబాబును నిలదీసింది. ముప్పిడి వెంకటేశ్వరావుకు జెడ్పీ మాజీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు మద్దతుగా నిలిచారు. ఈ పంచాయితీ చంద్రబాబు దృష్టికి వెళ్లింది. పరిస్థితిని చక్కదిద్దాల్సిన ఆయన సైతం మద్దిపాటికి మద్దతు తెలపడంతో నియోజకవర్గంలో రెండు గ్రూపుల మధ్య ఆధిపత్య పోరు నేటికీ కొనసాగుతూనే ఉంది. అప్పుడు మొదలైన ముసలం ఇప్పటికీ సమసిపోవడం లేదు. ముప్పిడి, మద్దిపాటిది తలోదారైంది. పార్టీ కార్యకర్తలు, నాయకులు సైతం రెండు వర్గాలుగా విడిపోయారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం, ఎన్టీఆర్ వర్ధంతి, జయంతి కార్యక్రమాలు సైతం ఎవరికి వారు నిర్వహిస్తున్నారు. ఫలితమివ్వని బాబు యాత్ర టీడీపీ ఉనికిని కాపాడుకునేందుకు, వైఎస్సార్ సీపీపై బురద జల్లేందుకు టీపీడీ అధినేత చంద్రబాబు తూర్పు గోదావరి జిల్లాలో ‘రాష్ట్రానికి ఇదేం ఖర్మ’లో కార్యక్రమం నిర్వహించారు. ఆ సందర్భంగా సైతం పార్టీలోని అంతర్గత కుమ్ములాటలు చల్లార్చే ప్రయత్నం చేయలేదు. అప్పట్లో కొవ్వూరు, నిడదవోలు నియోజకవర్గాల్లో పర్యటించిన చంద్రబాబు.. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిపై విమర్శలు గుప్పించడం తప్ప చేసిందేమీ లేదు. కనీసం ఆయన పర్యటించిన నియోజకవర్గాల పరిధిలోనైనా పార్టీ కుమ్ములాటలను చక్కదిద్దిన పాపాన పోలేదు. తమ్ముళ్ల తగవులు తీర్చలేక చేతులెత్తేశారు. కార్యకర్తలు, నాయకులతో రహస్య సమావేశాలు పెట్టుకుని మరీ కలసికట్టుగా ఉండాలని హితబోధ చేసినా నేతల్లో ఎలాంటి మార్పూ లేదు. -
భట్టికే చెమట్లు పట్టించారు.. కాంగ్రెస్ నుంచి గెంటేసుకున్న పొన్నాల, కొమ్మూరి
ఆయన ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. కీలక మంత్రిగా హవా నడిపారు. పార్టీకి అధికారం పోయింది. పదవులు చేజారిపోయాయి. ఇప్పుడు టిక్కెట్ తెచ్చుకోవడమే ఆ మాజీ పీసీసీ చీఫ్‌కు కష్టమంటున్నారు. గత ఎన్నికల్లో తనకు ప్రచారం చేసిన నేతే ఇప్పుడు ఆయనకు అడ్డుపడుతున్నాడు. మాజీ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాపరెడ్డి నేనేంటే నేనే అంటూ ఒకరి మీద ఒకరు కత్తులు నూరుకుంటున్నారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర జనగామలో పోరు యాత్రగా మారింది. రెండు వర్గాలు ఒకరిని మరొకరు కుమ్మేసుకున్నారు. తోసుకున్నారు. తిట్టుకున్నారు. పట్టణంలో ఉద్రిక్త పరిస్థితులు సృష్టించారు. పాదయాత్రలో లొల్లి షురూ.. భట్టి విక్రమార్కకే చెమట్లు పట్టించారు పొన్నాల, కొమ్మూరి. ఎమ్మెల్యే టిక్కెట్ కోసం ఇరువర్గాల నాయకులు, కార్యకర్తలు ఆధిపత్య పోరు ప్రదర్శించారు. ఇద్దరు నేతల మధ్య కొనసాగుతున్న అంతర్గత విభేదాలతో పార్టీ శ్రేణులు అయోమయానికి గురవుతున్నాయి. గత ఎన్నికల్లో పొన్నాల ఓటమితో ఈసారి కొమ్మూరి టిక్కెట్‌పై ఆశలు పెంచుకున్నారు. దీంతో ఇద్దరి మధ్యా వార్ మొదలైంది. చాన్నాళ్ళుగా సైలెంట్ ఉన్న వ్యవహారం భట్టి పాదయాత్ర సందర్భంగా రోడ్డున పడింది. ఈ తరుణంలో పొన్నాల అనుచరుడైన డిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మాసనపల్లి లింగాజీ కొమ్మూరిని పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు. ఇక నుంచి కొమ్మూరికి కాంగ్రెస్ పార్టీతో ఎలాంటి సంబంధంలేదని చెప్పారు. అదే సమయంలో కొమ్మూరి అనుచరులు పొన్నాలనే పార్టీ నుంచి తొలగించినట్లు ప్రకటించారు. ఓడిన తర్వాత నియోజకవర్గాన్ని, పార్టీని పట్టించుకోకుండా అధికార పార్టీకి కోవర్ట్ గా మారి జనగామలో హస్తం పార్టీని అస్తవ్యస్తం చేస్తున్నాడని హైకమాండ్‌కు ఫిర్యాదు చేశారు. పోటా పోటీ ఫిర్యాదులతోపాటు భట్టి పాదయాత్రలో తమ సత్తా చాటేందుకు యత్నించారు. భట్టి కూడా ఈ న్యూసెన్స్ ఏంటని ఇరువర్గాలను తీవ్రంగా మందలించారు. (హైదరాబాద్‌లో మళ్లీ ఉగ్ర కదలికలు.. 16 మంది అరెస్ట్) సైడయిపోయిన కొమ్మూరి కొమ్మూరి వస్తే పాదయాత్రకు సహకరించబోనని పొన్నాల స్పష్టం చేయడంతో.. ఒకదశలో భట్టి రెండు చేతులు జోడించి ముందుకు వెళ్ళమని కొమ్మూరికి విజ్ఞప్తి చేశారు. దీంతో కొమ్మూరి పాదయాత్ర నుంచి నిష్క్రమించారు. నర్మెట్టలో కార్నర్ మీటింగ్ పెట్టేందుకు పొన్నాల ఏర్పాటు చేయగా కొమ్మూరి వర్గీయులు నిరసన వ్యక్తం చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. చేసేది లేక భట్టి కార్నర్ మీటింగ్ ను క్యాన్సల్ చేసుకుని ముందుకు సాగారు. దీంతో పొన్నాల అగ్గిమీద గుగ్గిలమయ్యారు. కొమ్మూరి అనుచరులను సభా వేదిక వద్దకు ఎలా అనుమతిచ్చారంటూ పోలీసులపై ఫైర్ అయ్యారు. కొమ్మూరి మాత్రం పార్టీపై ఉన్న అభిమానంతో భట్టి పాదయాత్ర సక్సెస్ కావాలని పొన్నాల సైకోయిజం వల్లనే పాదయాత్ర కు దూరంగా ఉంటున్నట్లు ప్రకటించారు. నియోజకవర్గంలో మూడు రోజులపాటు భట్టి పాదయాత్ర సాగగా ఫస్ట్ డే మాత్రమే భట్టితో కొమ్మూరి కనిపించారు. పొన్నాల మాత్రం ఆది నుంచి అంతం వరకు అన్నీ తానై భట్టిని నడిపించారు. ఉల్టా పల్టా గత ఎన్నికల్లో ఓటమి తర్వాత పొన్నాల నియోజకవర్గానికి దూరం కాగా.. కొమ్మూరి మాత్రం అక్కడ పార్టీ కార్యక్రమాలను నిర్వహించారు. ప్రజలతో మమేకమ్యారు. పార్టీలో రేవంత్‌రెడ్డి వర్గంగా పేరు తెచ్చుకున్నారు. కొమ్మూరికి చెక్ పెట్టాలని నిర్ణయించుకున్న పొన్నాల.. భట్టి విక్రమార్క పాదయాత్రను తనకు అనుకూలంగా ఉపయోగించుకున్నారు. ఒకప్పుడు తన చేతితో అభ్యర్థులకు టిక్కెట్ ఇచ్చిన పొన్నాల ఇప్పుడు తనకు టిక్కెట్ వస్తుందో రాదో అన్న దీనస్థితికి దిగజారిపోయారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. (కూతురు ఫిర్యాదుపై స్పందించిన ఎమ్మెల్యే ముత్తిరెడ్డి.. ఏమన్నారంటే!) -
ఎమ్మెల్యేగా సీతక్క కొడుకు పోటీ ఇక్కడి నుంచేనా..?
తెలంగాణ రాజకీయాల్లో ఆమె ఫైర్ బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్నారు. ఆదివాసీలతో మమేకమై వారి కోసమే శ్రమిస్తారు. నిరంతరం ప్రజల మధ్యే ఉంటూ తిరుగులేని నేతగా ఎదిగారు. ఇప్పుడామె తన వారసుడి కోసం నియోజకవర్గాన్ని రెడీ చేస్తున్నారు. పార్టీ పెద్దల మద్దతుతో పక్క జిల్లా నుంచి కొడుకుని ఎన్నికల బరిలో దించాలని ప్లాన్ చేస్తున్నారు. ములుగు ఎమ్మెల్యే సీతక్క అంటే తెలియని వారు ఉండరు. రాజకీయాల్లో సీతక్క చెరగని ముద్ర వేసుకున్న ఆమె మావోయిస్టు ఉద్యమం నుంచి తెలుగుదేశం ద్వారా బహిరంగ రాజకీయాల్లోకి వచ్చారు. 2009లో ములుగు నుంచి గెలిచాక ఒక వెనుదిరిగి చూడలేదు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక కాంగ్రెస్‌లో చేరి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ప్రజల తలలో నాలుకలా వారి కష్టసుఖాల్లో పాలుపంచుకునే సీతక్క కాంగ్రెస్ అగ్ర నేతలతో కూడా సాన్నిహిత్యం పెంచుకున్నారు. తన రాజకీయ జీవితం సక్సెస్‌ఫుల్‌గా సాగుతున్న దశలోనే తన కుమారుడు సూర్యను కూడా ఎమ్మెల్యే చేయాలని అనుకుంటున్నారు. ఇందుకు ఉమ్మడి ఖమ్మం జిల్లా పినపాకను ఎంచుకున్నారు. అక్కడి నుంచి కుమారుడిని పోటీ చేయించడానికి ప్లాన్ చేస్తున్నారు. పినపాక నుంచి కాంగ్రెస్ తరపున గెలిచిన రేగా కాంతారావు గులాబీ గూటికి చేరడంతో అతనికి వచ్చే ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని కాంగ్రెస్ నిర్ణయించుకుంది. ఈ దశలో సీతక్క కొడుకు సూర్య గత రెండేళ్లుగా పినపాక నియోజకవర్గంలోనే మకాం పెట్టారు. నియోజకవర్గంలోని కాంగ్రెస్ శ్రేణులతో సీతక్కకు ఉన్న సత్సంబధాలతో ఎమ్మెల్యే పార్టీ మారినా కేడర్ దూరం కాకుండా కాపాడుకుంటు వచ్చారు. ఈ నేపథ్యంలో సూర్య పార్టీ సమావేశాలు నిర్వహిస్తూ కేడర్‌కు దగ్గరయ్యారు. సీతక్క సైతం తరచుగా పినపాకకు వెళ్లి వస్తున్నారు. ఒకదశలో సీతక్క పినపాక నుంచి పోటి చేస్తుందనే ప్రచారం జరిగింది. పినపాక ఎమ్మెల్యే రేగా కాంతరావుకు చెక్ పట్టేందుకు రేవంత్ రెడ్డి వ్యూహత్మకంగా సూర్యను బరిలో దించే ప్రయత్నాలు చేస్తున్నారనే టాక్ వినబడుతోంది. రేగా కాంతారావు బీఆర్ఎస్ లోకి రావటంతో మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు గులాబీ గూటిలో ఇమడలేక పోతున్నారు. ఆయననే కాంగ్రెస్ నుంచి బరిలో దించుతారని ప్రచారం జరిగింది. కాంగ్రెస్ అధిష్టానాన్ని ఒప్పించి సూర్యకు గ్రీన్ సిగ్నల్ ఇప్పించే బాధ్యత కూడా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీసుకున్నారని కాంగ్రెస్ పార్టీలో టాక్ నడుస్తోంది. ములుగు ఎమ్మెల్యే సీతక్క దూకుడుకు చెక్ పెట్టేందుకు బీఆర్ఎస్ కసరత్తు చేస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లోని ఏజెన్సీ ప్రాంతాల్లోని ఆదివాసీల్లో సీతక్క ప్రభావం పెరుగుతుండటంతో గులాబీ పార్టీలో గుబులు రేపుతుంది. కనీసం పది, పదిహేను స్థానాల్లో సీతక్క ప్రభావం ఉంటుందని అంచనా వేస్తున్నారు. దీంతో వ్యూహాత్మకంగా ములుగుకే సీతక్కను పరిమితం చేసేందుకు బీఆర్ఎస్ ప్రయత్నాలు మొదలుపెట్టింది. చదవండి: గులాబీ ఎమ్మెల్యే ఎందుకు టెన్షన్లో ఉన్నారు?.. అక్కడ ఇదే హాట్ టాపిక్ అయితే ములుగులో సీతక్కను ఢీ కొట్టగల సరైన అభ్యర్థి బీఆర్ఎస్కు కానరావడం లేదు. దీంతో ములుగు నుంచి రెండు సార్లు గెలిచి ప్రస్తుతం భద్రాచలం ఎమ్మెల్యేగా ఉన్న పోదెం వీరయ్యకు గులాబీ పార్టీ గాలం వేసింది. పలుమార్లు చర్చలు కూడా జరిపినట్లు సమాచారం. అయితే కాంగ్రెస్ అధిష్టానం ఒత్తిడితో వీరయ్య వెనక్కి తగ్గినట్లుగా తెలుస్తోంది. ఒకవేళ వీరయ్య బీఆర్ఎస్లోకి రాకపోతే మంత్రి సత్యవతి రాథోడ్‌ను ములుగు బరిలో దించాలని గులాబీ పార్టీ భావిస్తోంది. అంతేకాకుండా మావోయిస్టు కుటుంబ నేపథ్యం ఉన్న ములుగు జడ్పీ వైస్ చైర్పర్సన్ బడే నాగజ్యోతి పేరు కూడా వినిపిస్తోంది. ఏజెన్సీ ఏరియాలో సీతక్క ప్రభావం పెరుగుతుండటం.. ఆమె వారసుడు రాజకీయ అరంగేట్రం చేస్తుండటంతో ఏజెన్సీ ప్రాంతంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. చదవండి: సిద్దిపేట: టీఆర్ఎస్ పేరుతో మరో కొత్త పార్టీ.. -
గులాబీ ఎమ్మెల్యే ఎందుకు టెన్షన్లో ఉన్నారు?.. అక్కడ ఇదే హాట్ టాపిక్
ఆ గులాబీ ఎమ్మెల్యే ఆత్మరక్షణలో పడ్డారా? వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ రాదని అనుమానిస్తున్నారా? తనవెనుక ఉన్నవారే తనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని ఆందోళన చెందుతున్నారా? అత్యంత ఆత్మీయుల సమ్మేళనాలు నిర్వహిస్తున్నా ఆ ఎమ్మెల్యే మళ్ళీ పుంజుకోగలరా? గులాబీ దళపతి ఆదరణ పొంది టిక్కెట్ సంపాదించగలుగుతారా? ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎస్సీ నియోజకవర్గాల్లో ఒకటైన చొప్పదండి ఎమ్మెల్యేగా అధికార బీఆర్ఎస్ నుంచి సుంకె రవిశంకర్ కొనసాగుతున్నారు. ప్రజల్లో, పార్టీలో ఆయనకు ఆదరణ తగ్గిందని.. అందువల్ల వచ్చే ఎన్నికల్లో ఆయనకు సీటు రాదనే చర్చ నియోజకవర్గంలో హాట్ టాపిక్‌గా మారింది. స్వయంగా ఎమ్మెల్యే రవిశంకర్‌కే తనకు టిక్కెట్ రాదనే అనుమానం గట్టిగా పీడిస్తోందని టాక్ నడుస్తోంది. నియోజకవర్గంలో ఆయన ఎవరినీ కలుపుకొనిపోవడంలేదన్న భావన కొందరిలో కనిపిస్తుండగా.. చొప్పదండి బీఆర్ఎస్ నేతలు మూడు వర్గాలుగా చీలిపోయి ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారని కేడర్ అభిప్రాయపడుతోంది. సిటింగ్ ఎమ్మెల్యేకు గత ఎన్నికల్లో ఆర్థికంగా, సామాజికపరంగా ఉపయోగపడ్డ కొందరు అగ్రవర్ణాల నేతలు ఈసారి రవిశంకర్‌పై గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో పాటు.. కరీంనగర్ కు చెందిన ఒక కార్పోరేటర్..బోయినపల్లి ఎంపీపీ సహా మరికొందరు నేతలు చొప్పదండి సీటుపై కన్నేసినట్లుగా ప్రచారం సాగుతోంది. గులాబీ పార్టీ అధిష్ఠానం నిర్వహించిన సర్వేల్లోనూ ప్రస్తుత ఎమ్మెల్యే రవిశంకర్ పరిస్థితిపై సానుకూలత కనిపించడంలేదని టాక్. స్థానికంగా పార్టీలో నెలకొన్న తలనొప్పులు.. ప్రస్తుత ఎమ్మెల్యేకు పోటీగా టిక్కెట్ కోసం ప్రయత్నం చేస్తున్న నేతల తీరుతో సిట్టింగ్ తల పట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందట. ఓ వైపు బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనాలతో వచ్చే ఎన్నికలకు సంసిద్ధమవుతుంటే.. చొప్పదండి సిటింగ్ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అత్యంత ఆత్మీయ సమ్మేళనాలనూ నిర్వహిస్తున్నారట. సోషల్ మీడియాలో తగ్గేదేలే.. అందులో తనకు టిక్కెట్ వచ్చే అవకాశాలకు ఎక్కడా గండి పడకుండా మనవాళ్లంతా ప్రయత్నించాలని కోరినట్టుగా కూడా ఇప్పుడు ఓ చర్చ ప్రచారంలోకొచ్చింది. పైగా సోషల్ మీడియాలో తగ్గేదేలే అన్నట్టుగా కౌంటర్ అటాక్స్ కు కూడా సిద్ధం కావాలని.. ఎక్కడా గులాబీబాస్ దృష్టిలో తక్కువ కాకుండా ఉండేలా అన్నివిధాలా తమ నడవడిక ఉండాలని కోరినట్టు తెలుస్తోంది. తన వ్యవహారశైలితో అటు అధిష్టానం దృష్టిలో..ఇటు స్థానిక నేతలు, కార్యకర్తల దృష్టిలో నెగెటివ్ మార్కులు తెచ్చుకున్న సుంకె రవిశంకర్ తిరిగి ఒడ్డుకు చేరుకోగలుగుతారా? పార్టీ అధినేతతో టిక్కట్ తనకే ఇస్తామనే పరిస్థితి క్రియేట్ చేసుకోగలుగుతారా? పార్టీలోని ప్రత్యర్థులను దారికి తెచ్చుకోగలరా? ఇప్పుడు చొప్పదండి నియోజకవర్గంలో ఎమ్మెల్యే తీరుపైన, ఆయన భవిష్యత్ పైనా హాట్ హాట్‌గా చర్చ జరుగుతోంది. చదవండి: ఒక్కలిగల కంచుకోటలో పాగా ఎవరిదో...! -
కాంగ్రెస్ కంచుకోటలో ఆధిపత్య పోరు.. పార్టీని ముంచుతారా?
రెండు రాష్ట్రాలకు సరిహద్దుగా ఉన్న ఆ నియోజకర్గం ఒకప్పుడు కాంగ్రెస్‌కు కంచుకోట. రాష్ట్రంలో అధికారం లేకపోయినా.. ఎమ్మెల్యే సీటు ఓడినా హస్తం పార్టీలో కుమ్ములాటలు మాత్రం ఆగలేదు. ఆది నుంచి రెండు కుటుంబాల మధ్యే కాంగ్రెస్ పార్టీ పంచాయతీ నడుస్తోంది. ఎన్నికల సమయంలో మరోసారి ఆ ఇద్దరి మధ్యా పోరు తీవ్రమైంది. ఇంతకీ ఆ నియోజకవర్గం ఎక్కడుంది? ఆ రెండు కుటుంబాల కథేంటి? స్వాతంత్ర్యం వచ్చినప్పటినుంచి కాంగ్రెస్ తమదే అనే రీతిలో నారాయణఖేడ్ నియోజకవర్గంలోని షేట్కర్ వంశస్తులు వ్యవహరిస్తున్నారు. షేట్కర్ల శిష్యుడుగా రాజకీయ అరంగ్రేటం చేసిన పట్లోళ్ల కిష్టా రెడ్డి మూడు సార్లు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తరువాత శివరాజ్ షేట్కార్ కుమారుడు సురేష్ కుమార్ షేట్కార్ రాజకీయ ప్రవేశంతో పట్లోళ్ల కిష్టారెడ్డి, షేట్కార్ కుటుంబాల మధ్య ఆధిపత్య పోరు మొదలైంది. ఇరు కుటుంబాలు కాంగ్రెస్‌లోనే కొనసాగుతుండటంతో రాజకీయ పలుకబడి కలిగిన శివరావు షేట్కార్ ఢిల్లీ పెద్దల్ని ఒప్పించి తన కొడుకుకు సురేష్ షేట్కార్‌కు ఎమ్మెల్యే టికెట్ ఇప్పించుకున్నారు. అప్పటి నుండి కాంగ్రెస్ ను అంటిపెట్టుకున్న తమకే టికెట్ వస్తుందన్న ధీమాలో షెట్కార్ కుటుంబ సభ్యులు ఉన్నారు. 2018లో కాంగ్రెస్ ఎమ్మెల్యే టికెట్ రాకపోవడంతో పట్లోళ్ల కృష్ణారెడ్డి కుమారుడైన సంజీవరెడ్డి బీజేపీలో చేరి టికెట్ సాధించడంతో వారి మధ్య వైషమ్యాలు తీవ్రస్థాయికి చేరాయి. 2019 పార్లమెంట్ ఎన్నికల సమయంలో సంజీవరెడ్డి మళ్ళీ కాంగ్రెస్ గూటికి చేరారు. గత సంవత్సరం నిర్వహించిన రచ్చబండ కార్యక్రమాన్ని సంజీవరెడ్డి, సురేష్ షేట్కార్ వేరు వేరుగా గ్రామస్థాయిల్లో నిర్వహించారు. నారాయణఖేడ్ నియోజకవర్గంలో కాంగ్రెస్ వర్గాల ప్రత్యక్ష పోరుకు రచ్చబండే వేదికైంది. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో కూడా ఎడమొహం పెడమొహంగానే ఉంటూ ఎవరి స్థాయిలో వారు జన సమీకరణ చేసి తమ ఉనికిని చాటుకునే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం పీసీసీ చీఫ్ పిలుపు మేరకు జరుగుతున్న హాత్ సే హాత్ జోడో కార్యక్రమాలను కూడా ఎవరికి వారే నిర్వహిస్తున్నారు. ఇటీవల కాంగ్రెస్ అధిష్టానం ఇచ్చిన పిలుపుమేరకు రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వ రద్దుకు నిరసనగా చేసిన ధర్నా కార్యక్రమం కూడా వేరువేరు చోట్ల ఒకే రోజు నిర్వహించి వారి మధ్య విభేదాలను మరోసారి కేడర్‌కు చూపించారు. వీరిద్దరి మద్య జరుగుతున్న ఆధిపత్య పోరుతో గ్రామస్థాయిలోని కేడర్ అయోమయానికి గురవుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో అధికార బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కోవాలంటే కాంగ్రెస్ నేతలంతా సమష్టిగా కృషి చేయాలని కార్యకర్తలు బాహాటంగానే నాయకులకు సూచిస్తున్నారు. ఇద్దరు నాయకుల తీరు చూస్తుంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్కరికి కాంగ్రెస్ టికెట్ వస్తే మరొకరు రెబల్ అభ్యర్థిగా నిలబడే అవకాశాలు పుష్కలంగా కనబడుతున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నారాయణ ఖేడ్‌లో కాంగ్రెస్ జండా ఎగరేయడానికి కృషి చేస్తారో తమ ఆధిపత్యం నిరూపించుకోవడానికి పార్టీని బలిచేసుకుంటారో చూడాలనే కామెంట్స్ రాజకీయ వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. చదవండి: బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు తగ్గిన ఆదరణ!.. వచ్చే ఎన్నికల్లో సీటు కష్టమేనా? -
ఆ పోస్టర్ల వెనుక మాజీ మంత్రి గంటా హస్తం ఉందా?.. ఇంతకీ ఆమె కథేంటి?
పార్టీ ఏదైనా..తమ నేతను గెలిపిస్తాం అని కేడర్ చెబుతుంది. కానీ ఒక చోట టీడీపీ స్థానిక నేతలు, కార్యకర్తలు మాత్రం ఆ అభ్యర్థి అయితే ఓడించడం ఖాయం అంటున్నారట. తమ అభ్యంతరాలు కాదని ఆమెకే సీటిస్తే ఓటమి తథ్యమని ముందే ప్రకటించేశారట. ఇంతకీ ఆ కథేంటో మీరే చదవండి తెలుగుదేశం పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఒక్కసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కానీ పాయకరావుపేట నియోజకవర్గంలోని నేతలతో ఆమెకు ఉన్న గొడవలు అన్నీ ఇన్నీ కావు. పార్టీ అధికారంలో ఉన్నపుడు ఎమ్మెల్యే కావడంతో అధికారాన్ని అడ్డుపెట్టుకుని అడ్డదిడ్డంగా సంపాదించేశారని ఆమెపై తీవ్ర ఆరోపణలున్నాయి. అనిత అవినీతిని వ్యతిరేకించిన నాయకులుపై కక్ష సాధింపు చర్యలకు దిగారని స్థానిక పార్టీ నేతలే చెబుతారు. తనను గెలిపించిన నియోజకవర్గంలో నచ్చని నేతలపై తప్పుడు కేసులు పెట్టించారట. అనిత తప్పుడు కేసులతో విసిగిపోయిన టీడీపీ నేతలు గతంలోనే ఆమెపై తిరుగుబాటు చేశారు. 2019 ఎన్నికలకు ముందు అనిత వద్దు.. టీడీపీ ముద్దు అంటూ నియోజకవర్గం మొత్తం ప్రచారం చేశారు. పాయకరావుపేటలో అనితకు సీటు ఇస్తే ఓడిస్తామని పార్టీ అధినేతకే నేరుగా వార్నింగ్ ఇచ్చారు. పార్టీలోనే తనకున్న వ్యతిరేకతను తట్టుకోలేక అనిత పాయకరావుపేటని వదిలి పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరులో పోటీ చేశారు. అక్కడ పరాజయం పాలవడంతో మళ్లీ పాయకరావుపేటకు మకాం మార్చారు. వచ్చే ఎన్నికల్లో ఇక్కడి నుంచే పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు. పరాయిచోటుకు వెళ్ళి ఓడిపోయి.. తిరిగి సొంత నియోజకవర్గం పాయకరావుపేటకు చేరుకున్న అనిత తన పాత లక్షణాలను ఏమాత్రం వదులుకోలేదు. స్థానిక టీడీపీ నేతలపై వేధింపులు పర్వం కొనసాగిస్తున్నారు. గతంలో తనపై వ్యతిరేక గళం వినిపించిన నాయకులను ఒక్కొక్కరిని పార్టీ నుండి సస్పెండ్ చేయిస్తున్నారు. ఇటీవల పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా నియోజకవర్గంలో కొంతమంది నేతలు పోస్టర్స్ వేయించారు. ఆ పోస్టర్స్ లో పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఫొటోలు మినహా ఎక్కడా అనిత ఫోటోలు లేవు. ఈ పోస్టర్ల వెనక మాజీ మంత్రి గంటా హస్తం ఉందని అనిత అనుమానిస్తున్నారు. తన నియోజకవర్గంలో కొంతమంది కాపు నేతలను గంటా ప్రోత్సహిస్తున్నారని ఆమె భావిస్తున్నారు. దీంతో గంటాతో సన్నిహితంగా మెలిగే కాపు నాయకులను గుర్తించిన ఆమె వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేయించారు. గతంలో అనిత వద్దు.. టీడీపీ ముద్దు అని ఎవరైతే తనకి వ్యతిరేకంగా ప్రచారం చేశారో ఇప్పుడు ఈ పోస్టర్ల వెనక వారే ఉన్నారని అనిత భావిస్తున్నారు. ఈ పోస్టర్ల వ్యవహారాన్ని పార్టీ నాయకత్వం దృష్టికి అనిత తీసుకెళ్ళారు. తన వ్యతిరేకులుగా భావించిన ఇద్దరిని పార్టీ నుంచి అనిత సస్పెండ్ చేయించారు. అనిత సస్పెండ్ చేయించిన ఆ ఇద్దరు కాపు సామాజికవర్గానికి చెందినవారు కావడంతో ఇప్పుడు పాయకరావుపేట టీడీపీ రాజకీయం మరింత వేడెక్కింది. పాయకరావుపేట ఎస్సీ రిజర్వుడ్ అయినప్పటికీ అక్కడ చక్రం తిప్పేది కాపు సామాజిక వర్గ నాయకులే. ఇప్పుడు ఇద్దరిని సస్పెండ్ చేయించడంతో అనిత మీద ఆగ్రహంతో ఉన్న కాపు సామాజిక వర్గ టీడీపీ నేతలు వచ్చే ఎన్నికల్లో తమ తడాఖా ఏంటో చూపిస్తామని హెచ్చరిస్తున్నారు. అనితను ఓడించడమే కాకుండా మంచి రిటర్న్ గిఫ్ట్ కూడా ఇస్తామని సెటైర్లు వేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ టిక్కెట్ అనితకు ఇస్తే ఊరూరు తిరిగి ఆమెకు వ్యతిరేకంగా ప్రచారం చేసి ఓడిస్తామంటూ సవాళ్ళు విసురుతున్నారు. స్థానిక పార్టీ నేతల హెచ్చరికల నేపథ్యంలో అనితకు పాయకరావుపేటలో మళ్లీ సీటు ఇస్తారో లేక గతంలో మాదిరిగా మరో చోటకు మార్చుతారో చూడాలి. -పొలిటికల్ ఎడిటర్, సాక్షి వెబ్ డెస్క్ చదవండి: ఎస్.. వైనాట్ 175.. ఏపీలో వైఎస్సార్సీపీ క్లీన్‌స్వీప్ -
కర్నూలు టీడీపీలో ముసలం.. నాలుగు స్తంభాల ఆట మొదలైంది
కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీలో ముసలం మొదలైంది. పార్టీ అధిష్టానంతో సంబంధం లేకుండా టికెట్ నాదంటే..నాదే అని పోటీ పడుతున్నారు. టికెట్ కోసం నాలుగు స్తంభాలాట మొదలైంది. దీనితో ఆలూరు టిడిపిలో వర్గపోరు తారాస్థాయికి చేరుకుంది. వైఎస్సార్ కాంగ్రెస్‌ని ఢీకొనే సత్తా లేకున్నా టిడిపిలో బలమైన నాయకుల కోసం చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారు. జిల్లా టీడీపీలో జరుగుతున్న పరిణామాలను ఒకసారి పరిశీలిద్దాం.. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో తెలుగుదేశం నాయకుల మధ్య విభేదాలు భగ్గుమంటున్నాయి. గతంలో టిడిపికి ఈ నియోజకవర్గం కంచుకోటగా ఉండేది. టీడీపీ ఆవిర్భావం నుండి 30 ఏళ్ళపాటు టిడిపి తన పట్టు కాపాడుకుంది. వైఎస్ జగన్ నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆవిర్భవించిన తర్వాత చరిత్ర తిరగరాసారు. గత ఎన్నికల్లో అయితే జిల్లాలోనే టీడీపీకి అడ్రస్సే లేకుండా పోయింది. మరో ఏడాదిలో ఎన్నికలు రానుండటంతో తిరిగి పుంజుకోవడానికి టిడిపి ప్రయత్నాలు చేస్తునే ఉంది. ఆలూరు నియోజకవర్గంలో టిడిపి నాయకుల మధ్య ఐకమత్యం లేకపోవడం, పార్టీ అధినేత చంద్రబాబు తీసుకుంటున్న నిర్ణయాలతో తిరిగి కోలుకోలేని విధంగా తుడిచిపెట్టుకొని పోయింది. ఆలూరులో తొలినుంచీ టీడీపీ బలంగా ఉన్నప్పటికీ...2009 ఎన్నికల్లో పొత్తులో భాగంగా సీపీఐకి కేటాయించగా...ఓటమి ఎదురైంది. ఆ తర్వాత 2014, 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభంజనంతో తెలుగుదేశం పత్తా లేకుండా పోయింది. 2009 నుంచి చంద్రబాబు కారణంగానే టీడీపీ ఓడిపోతోందని ఆ పార్టీ నేతలే చర్చించుకుంటున్నారు. 2019 ఎన్నికల్లో అప్పుడే టిడిపిలోకి వచ్చిన కోట్ల సుజాతమ్మకు సీటు ఇవ్వడంతో ఇక్కడ వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. 2014లో పోటీ చేసి ఓడిపోయిన వీరభద్ర గౌడ్ ను కాదని... కోట్ల సుజాతమ్మకు టికెట్ ఇవ్వడంతో ఆమెకు వీరభద్రగౌడ్ వర్గం సహకరించలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ బలం ముందు కోట్ల సుజాతమ్మ నిలవలేకపోయారు. మళ్ళీ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో ఆలూరులో నాలుగు స్తంభాల ఆట మొదలైంది. ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడమే కాకుండా బహిరంగంగా విమర్శలు చేసుకోవడంతో టిడిపిలో వర్గ విభేదాలు ఏస్థాయిలో ఉన్నాయో అందరికీ అర్దమవుతోంది. చంద్రబాబు ఆలూరు పర్యటనలోనే విభేదాలు భగ్గుమన్నాయి. ఆలూరు నియోజకవర్గంలోనే నాలుగు టిడిపి కార్యాలయాలు ఏర్పాటయ్యాయి. ఎవరికి వారే యమునాతీరే అన్నట్లుగా కార్యక్రమాలు చేసుకుంటున్నారు. వీరభద్రగౌడ్, కోట్ల సుజాతమ్మ వర్గాల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితి తయారైంది. మరోవైపు వైకుంఠం శివప్రసాద్, వైకుంఠం మల్లికార్జున వేరు వేరుగా కార్యక్రమాలు చేస్తున్నారు. దీంతో తెలుగు తమ్ముళ్లులో కన్ ఫ్యూజన్ మొదలైంది. ఆలూరులో ఇంత గందరగోళం ఏర్పడటానికి పార్టీ అధినేత చంద్రబాబే కారణం అంటూ అక్కడి నాయకులే విమర్శిస్తున్నారు. చంద్రబాబు తీసుకుంటున్న నిర్ణయాల వల్లే పార్టీ దెబ్బతిన్నదని..పార్టీ నాయకులకే న్యాయం చెయ్యలేని బాబు ప్రజలకు ఏమి చెయ్యగలడని టిడిపి నాయకులే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
డామిట్, మాట జారిపోయింది.! తప్పయిపోయింది సారీ! ఆ ఎమ్మెల్యే పరేషాన్
ఎప్పుడూ మంత్రి కాలేదు. కాని మంత్రి కంటే ఎక్కువగానే అధికారాలు అనుభవించారు. ప్రత్యేక రాష్ట్రం రాగానే రాజకీయ గురువుకు సున్నం పెట్టాడు. గెలిపించిన పార్టీకి పంగనామాలు పెట్టి అధికార పార్టీలో చేరిపోయాడు. మూడోసారి పోటీ చేయడానికి రెడీ అవుతున్న ఆ నేత ఇటీవల పదే పదే జనానికి సారీ చెబుతున్నాడు. అనవసరపు చిక్కులు కొని తెచ్చుకుంటున్నాడు. సీనియర్ ఎమ్మెల్యేకు సారీ చెప్పాల్సిన అవసరం ఎందుకొచ్చింది? ఇంతకీ ఆ నేత ఎవరు? కాంగ్రెస్‌కు చేయిచ్చి.. ఆ వెంటనే కారెక్కి.! ఎంతటి నాయకులైనా నోరు జారితే తిరిగి వెనక్కు తీసుకోలేరు. ఒక ఎమ్మెల్యే స్థాయి నేత పబ్లిక్‌లో ఇష్టారీతిన కామెంట్స్ చేస్తే అటు ఆయనకు.. ఇటు పార్టీకి కూడా నష్టం తప్పదు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కరరావుకు ఇప్పుడదే జరిగింది. గతంలో రెండు దశాబ్ధాల పాటు కాంగ్రెస్ సీనియర్ నేత కుందూరు జానారెడ్డికి షాడోగా వ్యవహరించిన వ్యక్తి. ఆయన అండదండలతో.. 2014లో రాజకీయాల్లోకి వచ్చీరాగానే.. మిర్యాలగూడ నుంచి కాంగ్రెస్ టికెట్ పొందారు. ఎమ్మెల్యే కాగానే గురువును వదిలేసి గులాబీ పార్టీలో చేరిపోయారు భాస్కరరావు. 2018లో బీఆర్ఎస్ నుంచి టికెట్ తెచ్చుకుని మరోసారి పోటీ చేసి గెలిచారు. ఇంత వరకు బాగానే ఉంది. కానీ ఈ మధ్య ఎమ్మెల్యే భాస్కరరావు చేస్తున్న వ్యాఖ్యలు ఆయనతో పాటు గులాబీ పార్టీని కూడా ఇబ్బందులకు గురిచేసేలా ఉన్నాయనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. రోడ్లతో రాజకీయమా? ఆ మధ్య అడవిదేవులపల్లి మండలం నర్సాపూర్ గ్రామంలో..సీసీ రోడ్ల ప్రారంభోత్సం సందర్భంగా ఆయన మాట్లాడిన మాటలు రాజకీయంగా దుమారం రేపాయి. మేము వేయించిన రోడ్లపై నడవద్దు, మేము ఇచ్చే సంక్షేమ పథకాలు తీసుకోవద్దని.. తాను తలుచుకుంటే ఐదు నిమిషాల్లో డ్యాన్సులు చేయిస్తానంటూ ప్రతిపక్షాలే లక్ష్యంగా ఆయన మాట్లాడిన మాటలు ఆయనకు..పార్టీకీ డ్యామేజ్ చేసేవిగా మారాయి. జరిగిన నష్టం గమనించిన ఆయన తన వ్యాఖ్యలకు సంజాయిషీ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఆ ఘటన మరిచిపోకముందే మరో కార్యక్రమంలోనూ ఇదేరకంగా నోటి దురుసును ప్రదర్శించారాయన. మిర్యాలగూడలో జరిగిన దళిత బంధు యూనిట్ల పంపిణీ కార్యక్రమం సందర్బంగా ఎంపీపీ సరళపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా రెండు కులాల పేర్లను ప్రస్తావిస్తూ... ఆ వర్గాలు చేసే పనులు కూడా నేనే చేయాలా అంటూ తీవ్ర స్వరంతో మాట్లాడారు. ఈ వీడియోలు బయటకు రావడం, వైరల్ కావడంతో మరోసారి మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కరరావు నోటి దురుసు గురించి చర్చ మొదలైంది. బీసీ సంఘాలు ఆయనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. కొందరైతే ఎమ్మెల్యేకు ఫోన్లు చేసి నిరసన వ్యక్తం చేశారట. రెండు రోజులపాటు ఎప్పుడు ఏ ఫోన్ వస్తుందో.. ఎవరికి క్షమాపణలు చెప్పాల్సి వస్తుందోనన్న ఆందోళన ఆయనలో కన్పించిందని అనుచరులే చెప్పారు. సారీ.. ఆ ఒక్కటి పట్టించుకోవద్దు దీంతో పరిస్థితి చేయిదాటిపోతుందని గ్రహించిన భాస్కరరావు క్షమాపణలు చెప్తూ వీడియో విడుదల చేశారు. తాను కావాలని ఆ వ్యాఖ్యలు చేయలేదని మరోసారి సంజాయిషీ ఇచ్చుకున్నారు. ఎప్పుడూ వివాదాలకు దూరంగా ఉండే ఎమ్మెల్యే.. కొంతకాలంగా పదే పదే నోరు జారడానికి ఆయనలో పెరుగుతున్న టెన్షన్ కారణం కావచ్చనే వాదనలు వినిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో టికెట్ వస్తుందా? రాదా? అన్న అనుమానం ఒకటైతే.. సీపీఎంతో పొత్తు కుదిరితే మిర్యాలగూడ కేటాయించాల్సి వస్తే తన రాజకీయ భవిష్యత్తు ఏమౌతుందోనని భాస్కరరావు ఆందోళన చెందుతున్నారట. దీంతో పాటు ఈసారి తన వారసుడిని రాజకీయాల్లోకి తీసుకురావాలని కూడా ఆయన అనుకుంటున్నారట. ఈ నేపథ్యంలో సీటు సీపీఎంకు కేటాయిస్తే.. ఇటు తన రాజకీయ జీవితం ప్రశ్నార్థకంగా మారడంతో పాటు కొడుకు రాజకీయ అరంగేట్రం కూడా ఆలస్యం అవుతుందన్న ఆందోళనే ఆయన నోరు జారుడుకు కారణంగా విశ్లేషిస్తున్నారు. పైగా తరచుగా వివాదాల్లో చిక్కుకోవడంతో పార్టీలో ఆయన వ్యతిరేక వర్గం నేతలు సంబరాలు చేసుకుంటున్నారట. ఓ నేత అయితే ఏకంగా తన అనుచరులకు పార్టీ ఇచ్చారని మిర్యాలగూడలో ప్రచారం సాగింది. ఒకనాడు జానారెడ్డి అధికారాన్ని అడ్డం పెట్టుకుని చక్రం తిప్పిన నల్లమోతు భాస్కరరావు ఇప్పుడు ప్రతీ దానికి.. ఫోన్ చేసిన ప్రతీ వ్యక్తికి క్షమాపణలు చెప్పాల్సి రావడం అంటే.. ఆయన స్వయంకృతాపరాధమని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఎమ్మెల్యే నోటి దురుసుతనానికి తగిన మూల్యం చెల్లించుకుంటున్నారని ప్రత్యర్థులు పండుగ చేసుకుంటున్నారు. -పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ -
ఎమ్మెల్యే టికెట్లపై తేల్చేసిన కేసీఆర్, తగ్గేదేలే! అంటున్న బొంతు?
ముందస్తు ఎన్నికల ఊహాగానాల నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ గులాబీ కోటలో గ్రూపులు బయల్దేరుతున్నాయి. టిక్కెట్లు ఆశించేవారు గళం విప్పుతున్నారు. సిటింగ్ ఎమ్మెల్యేలకే సీట్లు అని గులాబీ బాస్ ప్రకటించిన తర్వాత కూడా ఆశావహులు ఆగడంలేదు. తమ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. దీంతో కొన్ని సెగ్మెంట్లలో నాయకులు కులాలవారీగా విడిపోతున్నారు. గ్రేటర్‌లోని ఓ నియోజకవర్గంలో గులాబీ పార్టీ గ్రూపుల గురించి చూద్దాం. గులాబీ ముళ్లు హైదరాబాద్ మహానగరంలోని ఉప్పల్ నియోజకవర్గంలోని గులాబీ పార్టీలో గ్రూప్ కలహాలు మితిమీరుతున్నాయి. పార్టీలో కొత్తగా కులాల కుంపట్లు రాజుకుంటున్నాయి. లోకల్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి వర్సెస్ గ్రేటర్ హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ అన్నట్లుగా రాజకీయాలు సాగుతున్నాయి. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల వేడి రాజుకోవడంతో ఎవరికి వారు టికెట్ల కోసం ప్రయత్నాలు తీవ్రం చేశారు. మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ ఈ సారి ఎలాగైనా ఉప్పల్ టికెట్ సాధించాలని ప్రగతి భవన్ నుంచే చక్రం తిప్పుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అసెంబ్లీలో అడుగు పెట్టాలని ఆయన ఉవ్విళ్ళూరుతున్నారు. (చదవండి: సీబీఐ విచారణ తర్వాత తొలిసారి స్పందించిన కవిత) రాజకీయాల మధ్య కులం ఉప్పల్ లో మాజీ మేయర్ బొంతు దూకుడును కట్టడి చేయాలని అక్కడి ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి పావులు కదుపుతున్నారు. మాజీ మేయర్ సతీమణి బొంతు శ్రీదేవి నియోజకవర్గ పరిధిలోని చర్లపల్లిలో కార్పొరేటర్ గా ఉన్నారు. పుట్టినరోజు వేడుకలు, ఇతర కార్యక్రమాల పేరుతో నియోజకవర్గంలో బొంతు దంపతులు చేస్తున్న హడావిడిని ఎమ్మెల్యే భరించలేకపోతున్నారట. ఇరు వర్గాల మధ్య గొడవ ముదురుతుండటంతో... కార్పొరేటర్, మాజీ మేయర్ సతీమణి బొంతు శ్రీదేవి మీడియాకు ఎక్కారు. కార్పొరేటర్ గా ఉన్న తనను కులం పేరుతో ఎమ్మెల్యే అవమానిస్తున్నారని ఆమె ఆరోపించారు. మూడేళ్ళుగా భరిస్తున్నానని ఇంక భరించలేనని అంటున్నారు కార్పొరేటర్ శ్రీదేవి. ఉప్పల్ ఎమ్మెల్యే తనను చంపిస్తానని కూడా బెదిరిస్తున్నాడని ఆరోపించారామె. దీంతో వీరిద్దరి పంచాయతీ కాస్తా మున్సిపల్ మంత్రి కేటీఆర్ దగ్గరకు వెళ్ళింది. (చదవండి: ఉండేదెవరు.. పోయేదెవరు..?.. గులాబీ బాస్ ఏం చేయబోతున్నారు?) సిట్టింగ్ హామీ ఏమవుతుంది? కార్పొరేటర్ బొంతు శ్రీదేవి ఆరోపణల్ని ఎమ్మెల్యే భేతి సుభాష్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. కేవలం సానుభూతి కోసమే ఆమె తనపై ఆరోపణలు చేస్తున్నారని ఎమ్మెల్యే అంటున్నారు. సిటింగ్‌లకే సీట్లని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన తర్వాత కూడా కొందరు ఆశావహులు తమ ప్రయత్నాలు ఆపలేదు. పరిస్థితిని బట్టి సిటింగ్‌లను కాదని వేరేవారికి టిక్కెట్లు ఇచ్చిన సందర్భాలు గత ఎన్నికల్లో కూడా ఉన్నాయి. దాన్ని దృష్టిలో ఉంచుకునే ఏమో తనకూ బీసీ కోటాలో ఛాన్స్ తగులుతుందేమో అనుకుంటూ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ గట్టిగా ప్రయత్నిస్తున్నారు. మరోవైపు ఉప్పల్ టికెట్ కోసం బండారి లక్ష్మారెడ్డి కూడా ప్రయత్నాలు చేసుకుంటున్నారు. రెడ్డి సామాజిక వర్గం కోణంలో భేతి సుభాష్ రెడ్డి.. బండారి లక్ష్మారెడ్డి ఒక్కటయ్యారని.. బీసీ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే ఉప్పల్ పంచాయితీ ప్రగతి భవన్‌కు చేరింది. ఇక పార్టీ నాయకత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది ప్రస్తుతానికి సస్పెన్స్‌గా మారింది. -పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
బీజేపీ నేతకు టోకరా.. ఎమ్మెల్యే టికెట్ ఇప్పిస్తానని రూ.50 లక్షలు మోసం
తిరువొత్తియూరు: అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ తీసిస్తామని బీజేపీ నేత వద్ద రూ.50 లక్షలు తీసుకుని మోసం చేసిన కేంద్ర మంత్రి మాజీ సహాయకుడు నరోత్తమన్, అతని తండ్రిని పోలీసులు అరెస్టు చేశారు. తిరువణ్ణామలై జిల్లా ఆరణి జయలక్ష్మినగర్‌కు చెందిన బీజేపీ నేత భువనేష్ కుమార్ (29) చెన్నై పాండిబజార్ పోలీస్‌స్టేషన్‌లో ఈ ఏడాది జూలైలో ఓ ఫిర్యాదు చేశారు. అందులోని వివరాల మేరకు.. “మా చిన్నాన్న కుమార్తె వసంతికి ఆరణి టికెట్ కోసం పెరంబూరుకు చెందిన విజయరాఘవన్ సంప్రదించాం. అతని ద్వారా బీజేపీ రాష్ట్ర ఎన్నికల ఇన్చార్జ్గా ఉన్న కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సహాయకుడు నరోత్తమన్‌ను కలిశాం. అతను ఎమ్మెల్యే టికెట్ తీసివ్వడానికి రూ.కోటి ఇవ్వాలని కోరారు. తొలుత రూ.50 లక్షలు ఇవ్వాలని.. అభ్యర్థుల జాబితా వచ్చిన తర్వాత మిగిలిన రూ.50 లక్షలు ఇవ్వాలని తెలిపాడు. దీంతో నగదు ఇచ్చాను. జాబితాలో పేరు లేకపోవడంతో నగదు తిరిగి ఇవ్వమని కోరినా పట్టించుకోలేదు. ఈ వ్యవహారంలో నరోత్తమన్‌తో పాటు అతని తండ్రి చిట్టిబాబు, విజయరాఘవన్‌పై చర్యలు తీసుకుని నగదు ఇప్పించాలని’ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ క్రమంలో కేంద్రమంత్రి నరోత్తమన్‌ను తొలగించారు. పాండిబజార్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరిపారు. హైదరాబాద్‌లో ఉన్నట్లు తెలుసుకుని నరోత్తమన్, చిట్టబాబును అరెస్టు చేసి శనివారం చెన్నైకి తీసుకొచ్చారు. -
కాంగ్రెస్, బీజేపీ నుంచి ఆఫర్: కంగనా
ఏ విషయం గురించి అయినా ముక్కుసూటిగా.. కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడతారు హీరోయిన్ కంగనా రనౌత్. అలానే మోదీకి మద్దతుగా మాట్లాడటంలో కూడా ముందుంటారు కంగనా. దాంతో ఆమె రాజకీయాల్లోకి వస్తారని.. అందుకే మోదీకి మద్దతు ఇస్తున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. దీనిపై స్పందించిన కంగనా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలు తనకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చాయని తెలిపారు. గ్యాంగ్‌స్టర్ చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టినప్పటి నుంచి పలు పార్టీలు తనకు టికెట్ ఇవ్వడానికి ప్రయత్నించాయని తెలిపారు కంగనా. అయితే తాను రాజకీయాల్లోకి రాకూడదని నిర్ణయించుకున్నాను అన్నారు. ఈ మేరకు కంగనా శనివారం ట్వీట్ చేశారు. మోదీకి మద్దతివ్వడంపై స్పందించారు. ‘నేను రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటున్నందువల్లనే మోదీ జీకి మద్దతు ఇస్తున్నానని భావించే ప్రతి ఒక్కరికీ ఒక విషయం స్పష్టంగా చెప్తున్నాను. మా తాత వరుసగా 15 సంవత్సరాలు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచారు. నా కుటుంబం రాజకీయాల్లో బాగా ప్రాచుర్యం పొందింది. గ్యాంగస్టర్ చిత్రం తరువాత దాదాపు ప్రతి సారి కాంగ్రెస్ పార్టీ నుంచి నాకు ఎమ్మెల్యే టికెట్ ఆఫర్ వచ్చేది’ అంటూ ట్వీట్ చేశారు కంగనా. అంతేకాక ‘కాంగ్రెస్ నుంచే కాక, అదృష్టవశాత్తూ మణికర్ణిక చిత్రం తర్వాత బీజేపీ నుంచి కూడా నాకు ఎమ్మెల్యే టికెట్ ఆఫర్ వచ్చింది. ఒక ఆర్టిస్ట్‌గా నా పని అంటే నాకు ఎంతో ప్రేమ. రాజకీయాల గురించి నేను ఎప్పుడూ ఆలోచించలేదు. ఎవరికి మద్దతు ఇవ్వాలి అనేది పూర్తిగా నా వ్యక్తిగత విషయం. ఇకనైనా ఈ ట్రోలింగ్లు ఆపితే మంచిది’ అంటూ కంగనా ట్వీట్ చేశారు. (నా కోసం కూడా అవార్డు కొనాలి కదా!) This is to set the records straight for everyone who thinks I support Modi ji because I want to join politics,my grandfather has been congress MLA for consecutive 15 years,my family is so popular in politics back home that after Gangster almost every year I got offers (cont )1/2 — Team Kangana Ranaut (@KanganaTeam) August 15, 2020 నరేంద్ర మోదీ రెండో సారి ప్రధానిగా విజయం సాధించడంతో కంగన వేడుక చేసుకున్నారు. ‘మోదీజీ ఆలోచనలు ఆశయాలు, దృక్పథాలు చాలా బలమైనవి. ఆయన పాలనతో భారత్ ఎంతో అభివృద్ధి చెందుతుందని నా నమ్మకం’ అంటూ ట్వీట్ చేశారు. అప్పటి నుంచి అడపాదడపా మోదీని పొగుడుతుంటారు కంగనా. ఈ నేపథప్యంలో ఆమె రాజకీయాల్లోకి వస్తారనే వార్తలు వెలువడుతున్నాయి. -
ఎమ్మెల్యే టికెట్ కోసం రూ.3 కోట్లు అడిగారు’
మెదక్ జోన్: కాంగ్రెస్ పార్టీలో అవినీతి రాజ్యమేలుతోందని, ఎమ్మెల్యే టికెట్ అడిగితే రూ.3 కోట్లు డిమాండ్ చేశారని మెదక్ మున్సిపల్ మాజీ చైర్మన్ తొడుపునూరి చంద్రపాల్ ఆరోపించారు. ఆదివారం మెదక్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. 38 ఏళ్లపాటు పార్టీకి సేవ చేశానని, అసెంబ్లీ ఎన్నికల్లో మెదక్ ఎమ్మెల్యే టికెట్ అడిగితే ఓ రాష్ట్రస్థాయి నేత రూ.3 కోట్లు డిమాండ్ చేశారన్నారు. ఎవరు డబ్బులిస్తే వారికి అంగడి సరుకుల్లా టికెట్లు అమ్ముకోవడం బాధాకరమన్నారు. లోక్‌సభ ఎన్నికల్లోనూ ధనవంతులకే పార్టీ టికెట్ దక్కిందన్నారు. ఇందిరా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, పీవీ నర్సింహారావు, వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలోనే కాంగ్రెస్ పార్టీకి పేరుండేదని, ప్రస్తుతం సరైన నాయకుడే లేకుండా పోయాడన్నారు. సీఎం కేసీఆర్ దేశంలో ఎక్కడా లేనివిధంగా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారన్నారు. బంగా రు తెలంగాణలో తాము సైతం భాగస్వాములం కావాలన్న తపనతో మాజీ మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి సమక్షంలో సోమవారం టీఆర్ఎస్లో చేరుతున్నట్లు ప్రకటించార -
రెండో జాబితాలోనూ ఆమెకు టికెట్ అనుమానమే..!
సాక్షి, పశ్చిమ గోదావరి : టీడీపీలో అసంతృప్త జ్వాలలు ఎగసిపడుతున్నాయి. తొలి జాబితాలో తనకు సీటు దక్కకపోవడంతో టీడీపీ మాజీ మంత్రి పీతల సుజాత తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. చింతలపూడి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న సుజాతకు టీడీపీ తొలి జాబితాలో టికెట్ దక్కలేదు. ఆమె స్థానంలో కర్రా రాజారావుకు టీడీపీ కేటాయించింది. అయితే, మంత్రి జవహర్‌కు వ్యతిరేకంగా కొవ్వూరులో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆ సీటునైనా కేటాయించాలని సుజాత చంద్రబాబును ప్రాధేయపడినా ఫలితం లేకుండా పోయింది. ఆ సీటును వంగలపూడి అనితకు కేటాయించినట్టు తెలిసింది. కాగా, టీడీపీ తొలి జాబితాలో జిల్లాలో ఉన్న 11 స్థానాల్లో 9 మంది సిట్టింగ్‌లకు మరోసారి అవకాశం కల్పించారు. సుజాతకు టికెట్ కేటాయించే విషయంలో మాగంటి వర్గం వ్యతిరేకతతో ఉన్నట్టు సమాచారం. వ్యతిరేక వర్గం ఒత్తిడితోనే సుజాతకు టికెట్ దక్కలేదని వార్తలు వినిపిస్తున్నాయి. అవినీతి ఎమ్మెల్యేలు, మంత్రులకు టికెట్ కేటాయించిన చంద్రబాబు తనకు మాత్రం అన్యాయం చేశాడని సుజాత ఆవేదన వ్యక్తం చేశారు. రెండో జాబితాలో కూడా ఆమెకు టికెట్ దక్కడం అనుమానమేనని పలువురు టీడీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. చంద్రబాబు మార్కు రాజకీయాలతో సుజాత భవితవ్యం డోలాయమానంలో పడింది. -
శిద్దాకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలంటూ కార్యకర్తలు డిమాండ్
-
‘శిద్దాకు ఎంపీ వద్దు.. ఎమ్మెల్యే ముద్దు’
సాక్షి, అమరావతి : మంత్రి శిద్దా రాఘవరావుకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలంటూ టీడీపీ కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గురువారం దర్శి టీడీపీ కార్యకర్తలు చంద్రబాబు నివాసానికి వచ్చారు. ‘శిద్దాకు ఎంపీ వద్దు.. ఎమ్మెల్యే’ ముద్దు అంటూ ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. మంత్రి శిద్దా రాఘవరావును పార్లమెంట్ బరిలో నిలబెట్టాలని చంద్రబాబు నాయుడు నిర్ణయించిన సంగతి తెలిసిందే. గతంలో దర్శి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించిన శిద్దాను.. ఈసారి ఒంగోల్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేయాలంటూ అధిష్టానం నిర్ణయించింది. అటు దర్శి అసెంబ్లీ నియోజకవర్గం అభ్యర్థిగా ఉగ్రనరసింహారెడ్డి పేరును టీడీపీ ప్రకటించింది. అయితే తాను ఎంపీగా పోటీ చేసేది లేదంటూ శిద్దా.. చంద్రబాబు నాయుడికి తేల్చి చెప్పారు. -
టికెట్ దక్కేదెవరికో..?
ప్రొద్దుటూరు నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి ఖరారు ఆ పార్టీ అధిష్టానానికి తల నొప్పిగా తయారైంది. ఇక్కడ ఇప్పటికే ఇద్దరు మాజీ ఎమ్మెల్యేల మధ్య టిక్కెట్ కోసం పోరు నడుస్తుండగా కొద్దికాలం క్రితం మధ్యలో రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ తన కుటుంబీకులను ఇక్కడి నుంచి పోటీ చేయించాలని చూశారు. ఈ వ్యవహారం ఇలా ఉండగానే తాజాగా నాలుగో కృష్ణుడిలా పొరుగు నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి పేరు తెర ముందుకు రావడం చర్చనీయాంశంగా మారింది. దీంతో టికెట్ అంశం మరింత పీఠముడిగా తయారైంది. సాక్షి ప్రతినిధి కడప: ప్రతిష్టాత్మకమైన జమ్మలమడుగు వ్యవహారాన్ని ఛేదించిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రొద్దుటూరు టికెట్ తేల్చడం కష్టంగా మారింది. పార్టీ సర్వేలు, నిఘా వ్యవస్థల నివేదికలకు అనుగుణంగా టికెట్ కేటాయిస్తే కేడర్ సహకరించే పరిస్థితి కనిపించడం లేదు. నిఘా వర్గాల నివేదికలను పక్కన పెట్టి టికెట్ కేటాయిద్దామంటే, మిగిలిన వారికి ఆ స్థాయి వ్యక్తిగత వర్గీయులు లేరు. దాంతో దిక్కుతోచని స్థితి ఏర్పడింది. ఈ క్రమంలో ఓ మాజీ ఎమ్మెల్యే ప్రొద్దుటూరు టికెట్ తనకు కేటాయిస్తే మాజీలు ఇరువురు సహకరిస్తారని, ఆమేరకు తాను సత్సంబంధాలు నెరపగలనని మంత్రి ఆదికి ఉప్పందించారు. అందుకు వ్యక్తిగతంగా సహాయ సహకారాలు ఉంటాయని అమాత్యులకు వివరించారు. అప్పటికే ఎటూ తేల్చలేక పలు రకాల ఆలోచనల్లో ఉన్న టీడీపీ అధిష్టానం చెం తకు ఈ వ్యవహారం చేరింది. దాంతో ఒక్కమారుగా ప్రొద్దుటూరు రాజకీయం వేడెక్కింది. తెరపైకి వచ్చిన మాజీ ఎమ్మెల్యే వీరశివా.. ప్రొద్దుటూరు టీడీపీ అభ్యర్థిత్వంపై కమలాపురం మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి పేరు తెరపైకి వచ్చింది. అక్కడి టీడీపీ వర్గాలు ఒక్కమారుగా అప్రమత్తమయ్యాయి. ప్రొద్దుటూరు నియోజకవర్గాల వాసులకు టీడీపీ అభ్యర్థిగా పోటీచేసే స్థాయి.. అర్హత లేదా...ఏందబ్బా..! కనగా కనపడుతోందా..!! చెడిపోయినోడికి చెండ్రాయుడి దేవళం అన్నట్లుగా వ్యవహారం ఉందంటూ సోషల్ మీడియాలో మెసేజ్‌లు హల్చల్ చేశాయి. కమలాపురం టికెట్ ఆశించి భంగపాటుకు గురైన వీరశివారెడ్డికి టికెట్ కేటాయించా లని అనుకోవడం వెనుక మీ ఉద్దేశం ఏమిటి? అంటూ నిలదీస్తూ వాట్సాప్‌లో మెసేజ్ చక్కర్లు కొట్టింది. మరుసటి రోజు సోమవారం మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి మీడియా సమావేశం నిర్వహించి ప్రొద్దుటూరు టికెట్ నాదేనంటూ ప్రకటించారు. సీఎం నుంచి తనకు ఆమేరకు హామీ ఉందని వివరించారు. మంగళవారం మరో మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డి తనకంటే పార్టీలో సీనియర్ లేరని, గెలిచే సీటు తనకు ఇవ్వకుండా వరదకు ఇచ్చి ఓడిపోయారని, ఈమారు టికెట్ తనదేనని తేల్చిచెప్పారు. తన వెనుకనున్న స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల బలాన్ని సైతం వివరించారు. ఈ పరిస్థితుల్లో టికెట్ ఇవ్వకుంటే సహకరించేదీ లేదని తేల్చి చెప్పారు. మాజీ ఎమ్మెల్యేలు ఇరువురికి ప్రొద్దుటూరు టికెట్ తనదంటే తనదే అని చెప్పుకోవాల్సిన పరిస్థితి దాపురించింది. వ్యక్తిగత ప్రయోజనాలే పీఠముడికి కారణం.... ప్రొద్దుటూరు టీడీపీలో మూడు వర్గాలు ఆరు గ్రూపులు అన్నట్లు పరిస్థితి ఉంది. అందుకు ప్రధాన కారకులు రాజ్యసభ సభ్యుడు రమేష్‌నాయుడు, మంత్రి ఆదినారాయణరెడ్డిలేనని పలువురు వివరిస్తున్నారు. ప్రొద్దుటూరులో అడుగుపెట్టి పార్టీ నాయకత్వాన్ని తన కుటుంబానికి అప్పగించాలనే తలంపుతో ఎంపీ రమేష్‌నాయుడు వ్యవహరించి, వర్గాలను ప్రోత్సహించారని కొందరు ఆరోపిస్తున్నారు. ఉన్న ఇరువురు మాజీ ఎమ్మెల్యేలకు దీటుగా తన సోదరుడు సీఎం సురేష్‌ను ఆ స్థానంలో చూడాలన్న ఉద్దేశం కూడా లేకపోలేదని పరిశీలకులు వెల్లడిస్తున్నారు. పార్టీలోకి ప్రవేశించి అనూహ్యంగా మంత్రి పదవిని చేజిక్కించుకున్న ఆదినారాయణరెడ్డిలో కూడా పార్టీ ఉన్నతి కోసం పాటుపడాలనే చిత్తశుద్ధి కరువైందని ఆ కారణంగా మరో వర్గాన్ని పోషించారని టీడీపీ శ్రేణులు వివరిస్తున్నాయి. అలా ఎవరికి వారు వ్యక్తిగత ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇవ్వడమే ప్రొద్దుటూరు అభ్యర్థి వ్యవహారం పీఠముడికి కారణమని పలువురు పేర్కొంటున్నారు. తాజాగా కమలాపురం మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి ప్రొద్దుటూరు అభ్యర్థిత్వం రేసులో ఉన్నారు. శ్రీకృష్ణ రాయబారం నాటకంలో నాలుగో కృష్ణుడి పాత్రతో సరిపోలే విధంగా ఆయన పేరు తెరపైకి రావడం విశేషం. మాజీ ఎమ్మెల్యే వీరశివా వెనుక మంత్రి ఆది ఉన్నారని ఆ పార్టీ సీనియర్ నాయకుడు ఒకరు సాక్షి ప్రతినిధికి వెల్లడించారు. ఈ వ్యవహారం వెనుక పార్టీ ప్రయోజనాల కంటే మంత్రి స్వప్రయోజనాలే అధికంగా ఉన్నాయని వివరించారు. కాగా ప్రొద్దుటూరు టికెట్ వ్యవహారం అమావాస్య తర్వాత తేలుస్తామని అధిష్టానం పార్టీ శ్రేణులకు స్పష్టం చేసినట్లు సమాచారం. రెండు పిల్లులు రొట్టె కోసం పోట్లాడుతుంటే కోతి రాయబేరం నెరిపి రొట్టె ముక్క కాజేసినట్లుగా టీడీపీ నాయకుడు వ్యవహరించాలనుకున్నాడు. ఆ కానీ ప్రయత్నం కాస్తా బెడిసికొట్టింది ప్రొద్దుటూరు టీడీపీ టికెట్ విషయంలో. ముగ్గురుంటుండగానే తానైతే ‘ది బెస్ట్’ అంటూ మరో నాయకుడు తెరపైకి వచ్చారు. అందుకు తెరవెనుక మంత్రి ఆది సహకారం లభించింది. ఊహించని విపత్కర పరిస్థితిని పసిగట్టిన మాజీ ఎమ్మెల్యేలు టికెట్ నాదంటే... నాదే అంటూ ఏకరువు పెట్టాల్సిన దుస్థితి ఏర్పడింది. వెరసి పీఠముడి పడ్డ ప్రొద్దుటూరు అభ్యర్థిత్వం కోసం నాలుగో కృష్ణుడు తెరపైకి వచ్చారు. -
ఆ అవినీతి మంత్రి .. మాకొద్దు
సాక్షి, అమరావతి: ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ఏపీ అధికార టీడీపీలో టిక్కెట్ల రగడ రోజు రోజుకు ముదురుతోంది. పశ్చిగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గంలో శుక్రవారం టీడీపీ సమీక్షా సమావేశం నిర్వహించింది. సభలో మంత్రి జవహర్‌కు వ్యతిరేకంగా టీడీపీ శ్రేణులు, కార్యకర్తలు నినాదాలు చేయడంతో సభలో గందరగోళం నెలకొంది. జవహర్‌కు టిక్కెట్ ఇవ్వొద్దని టీడీపీ శ్రేణులు, కార్యకర్తలు డిమాండ్ చేశారు. మంత్రి జవహర్‌కు టిక్కెట్ ఇస్తే కేటాయిస్తే అతడిని ఖచ్చితంగా ఓడిస్తామని హెచ్చరించారు. జిల్లాలోమంత్రి జవహర్ భారీగా అవినీతికి పాల్పడ్డారని అన్నారు. ఇసుక, మద్యం కుంభకోణల్లో కోట్ల రూపాయలు సంపాదించారు. దీంతో సమావేశంలో అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. -
జలీల్‌ఖాన్ కూతురికి టీడీపీ టికెట్..!
సాక్షి, అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు విజయవాడ పశ్చిమ సీటును తన కుమార్తె షాబానాకు కేటాయించారని ఆ నియోజకవర్గ ప్రస్తుత ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ ప్రకటించారు. జలీల్‌ఖాన్ మంగళవారం తన కుమార్తె షాబానాతో కలిసి ఉండవల్లిలో చంద్రబాబును కలిశారు. పశ్చిమ నియోజకవర్గానికి తన స్థానంలో తన కూతురుకు సీటివ్వాలని అధినేతను కోరారు. దీనిపై చంద్రబాబు.. నియోజకవర్గంలో తిరగాలని, బాగా పనిచేయాలంటూ షాబానాకు సూచించారు. అనంతరం జలీల్‌ఖాన్ బయటికొచ్చి మీడియాతో మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో తన కుమార్తెకు చంద్రబాబు సీటు ఖరారు చేశారని చెప్పారు. విజయవాడలోని తన ఇంటివద్ద తన కుమార్తెకు సీటు వచ్చిందంటూ టపాసులు కాల్చి హడావుడి చేశారు. ఈ విషయం తెలిసిన చంద్రబాబు.. తాను సీటు ఎక్కడ ఖరారు చేశానంటూ జలీల్‌పై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. -
ఎమ్మెల్యే టికెట్ మనకే కావాలి!
సాక్షి ప్రతినిధి, కడప: ‘‘ఎమ్మెల్యే టికెట్ మనకే కావాలి. దానికోసం అందరం కలిసికట్టుగా పోరా టం చేద్దాం. అవకాశం కోల్పోతే ద్వితీయశ్రేణి నాయకులుగా మిగలాల్సి వస్తోంది. ఎంపీకి పోటీచేసి చేసేదేమీ ఉండదు. ఎలాగైనా ఎమ్మెల్యే టికెట్ తీసుకోవాలి’’ అని మంత్రి ఆదినారాయణరెడ్డికి ముఖ్యకార్యకర్తలు సూచించారు. సోమవారం మంత్రి స్వగ్రామం దేవగుడిలో ముఖ్య అనుచరులతో సమావేశమయ్యారు. విశ్వసనీయ సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. అత్యధిక మంది గ్రామ, మండలస్థాయి నాయకులు ఎమ్మెల్యే టికెట్ తీసుకోవాలని సూచించినట్లు సమాచారం. ఎమ్మెల్యే టికెట్ రాకపోతే స్థానికంగా తమ వర్గం ప్రభావం తగ్గిపోయే అవకాశం ఉందని, దాంతో పాటు రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్న ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి వర్గంబలం పుంజుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. అంతే కాకుండా ప్రతి గ్రామంలో ఎమ్మెల్సీ వర్గానిదే పైచేయి అయ్యే అవకాశం ఉందని వాపోయారు. లేదంటే ఎమ్మెల్యే, ఎంపీ టికెట్లు రెండూ తీసుకుని పోటీచేస్తే తాము కూడా గట్టిగా పనిచేయడానికి అవకాశం ఉందంటూ మంత్రికి వివరించినట్లు తెలుస్తోంది. చూద్దాం.. సీఎం మాట ఆలకించాల్సిందే జమ్మలమడుగు ముఖ్య నాయకుల అభిప్రాయాలు తెలుసుకున్న అనంతరం మంత్రి ఆది మాట్లాడుతూ ‘‘మీరు చెప్పేదంతా వాస్తవమే. అయితే సీఎం ఎంపీగా పోటీ చేయమని ఆదేశించారు. చూద్దాం పరిస్థితి అనుకూలంగా వస్తే రెండు టికెట్లు మనమే దక్కించుకుందాం. టిక్కెట్ విషయమై ముఖ్య మంత్రి చంద్రబాబునాయుడు వద్ద చర్చ కొనసాగుతోంది. కాగా ప్రతిసారి కుటుంబ సభ్యులందరితో కలిసి సీఎం వద్దకు వెళ్లకపోవడంతో ఆ సాకు చూపెట్టి ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి అధిష్టానం వద్ద ఫిర్యాదు చేస్తున్నారు. పీఆర్‌పై సుప్రీంకోర్టులో కేసు ఉంది. ముఖ్యమంత్రి పిలిపించి ఆ కేసు రాజీ కావాలని సూచించడంతో ఓప్పుకున్నా. మా కుటుంబ సభ్యులు అంతా కలిసికట్టుగా నిర్ణయం తీసుకున్నాం’’ అని వివరించారు. ఇవన్నీ కాదు, ఎంపీ టికెట్‌కు పోటీచేస్తే సాధించేదేమీ లేదు, ఎమ్మెల్యే టికెట్ తీసుకోవాలని మంత్రి ప్రసంగానికి అనుచరులు అడ్డు తగిలినట్లు సమాచారం. సమావేశానికి హాజరుకాని మంత్రి సోదరులు మంత్రి ఆదినారాయణరెడ్డి తన స్వగ్రామంలో నిర్వహించిన కార్యకర్తలతో సమావేశానికి ఆయన సోదరులు మాజీ ఎమ్మెల్సీ నారాయణరెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు శివనాథరెడ్డి హాజరుకాలేదు. అందుకు ప్రధాన కారణం ఇటీవల సీఎం సమావేశం సందర్భంగా మంత్రి తన సోదరులు గురించి చేసిన వ్యాఖ్యలేనని తెలుస్తోంది. అప్పట్లో కేసు రాజీ పడుతాం, ఎమ్మెల్సీ పదవికీ రామసుబ్బారెడ్డి రాజీనామా చేసి, ఆ పదవి తమ కుటుంబ సభ్యులకు ఇవ్వాలనే అభ్యర్థనను మంత్రి ప్రతిపాదించారు. అందుకు పీఆర్ అంగీకరిస్తూనే, రాజకీయంగా ప్రధాన భూమిక పోషించిన మాజీ ఎమ్మెల్సీ నారాయణరెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు శివనాథరెడ్డి, మైలవరం జెడ్పీటీసీ సభ్యుడు భూపేష్‌రెడ్డి గైర్హాజర్ అయిన విషయాన్ని ప్రస్తావించారు. రేపొద్దున మంత్రిని కాదని వారు అడ్డు నిలిస్తే చేసేదేమీ ఉండదని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. ఆ సందర్భంగా మంత్రి ఆది తన సోదరులు కుటుంబ సభ్యుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు, ఆ విషయం కుటుంబ సభ్యులకు తెలిసి ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆమేరకే మంత్రి చర్యలు, నిర్ణయాల పట్ల వారు వ్యతిరేకంగా ఉన్నట్లు పరిశీలకులు వెల్లడిస్తున్నారు. మంత్రి ఏకపక్ష నిర్ణయాలు ఓ వైపు, సోదరులకు ప్రాధాన్యత లేకపోగా, తోడల్లుడు, కుమారుడికి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వడాన్ని జీర్ణించుకోలేని అంశంగా పలువురు వివరిస్తున్నారు. తామంతా ఐక్యంగా ఉన్నామని ముఖ్య నాయకులకు మంత్రి వివరించినా, ఆ సమావేశానికి సోదరులు హాజరు కాకపోవడం కొసమెరుపు. -
పొన్నాల ఎఫెక్ట్.. కాంగ్రెస్‌కు భారీ షాక్!
సాక్షి, జనగామ: కాంగ్రెస్ ప్రకటించిన రెండు జాబితాల్లో టీపీసీసీ మాజీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్యకు చోటుదక్కక పోవడాన్ని నిరసిస్తూ 13 మంది కౌన్సిలర్లు, ఏడు మండలాల పరిధిలో 28 వేల మంది కార్యకర్తలు బుధవారం తమ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తూ టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్‌రెడ్డికి లేఖ పంపించారు. జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పట్టణ అధ్యక్షులు చెంచారపు బుచ్చిరెడ్డి అధ్యక్షతన బుధవారం జరిగిన సమావేశంలో నియోజకవర్గ ఇన్చార్జి చెంచారపు శ్రీనివాస్‌రెడ్డి, మునిసిపల్ ఫ్లోర్ లీడర్ ఎండి అన్వర్లు మాట్లాడారు. ఏడు మండలాల పరిధిలో మండల, జిల్లా బాధ్యులతో పాటు అనుబంధ సంఘాల అధ్యక్షులు, రాష్ట్ర కమిటీ ప్రతినిధులు, బూత్ కమిటీ సభ్యులు, జనగామ మునిసిపల్ కౌన్సిలర్లు రాజీనామా చేసిన వారిలో ఉన్నట్లు పేర్కొన్నారు. వచ్చే జాబితాలో పొన్నాల పేరు ప్రకటించని పక్షంలో ఆందోళనలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. నాలుగు దశాబ్దాలుగా జనగామకు పెద్ద దిక్కుగా ఉంటూ.. కాంగ్రెస్‌కు వన్నె తీసుకు వచ్చిన పొన్నాలపై పార్టీలోని ఓ వర్గం కుట్ర పూరితంగా వ్యవహరించడం పద్ధతి కాదన్నారు. పొన్నాలను కాదని కూటమి తరుపున ఎవరు పోటీ చేయాలని ప్రయత్నించినా కాంగ్రెస్ పార్టీ శ్రేణుల నుంచి ఎలాంటి సహకారం ఉండదని తేల్చి చెప్పారు. బీసీ నేత అని చిన్నచూపు చూస్తే ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కొత్త కరుణాకర్‌రెడ్డి, ధర్మపురి శ్రీనివాస్, మేడ శ్రీనివాస్, మల్లేశం, సర్వల నర్సింగారావు, చిర్ర సత్యనారాయణ రెడ్డి, మహేందర్, అభిగౌడ్, రఘుఠాకూర్, సంపత్‌నాయక్, మజార్ షరీఫ్, శ్రీనివాస్, సత్యం తదితరులు పాల్గొన్నారు. -
కూటమిలో ‘హుస్నాబాద్’ చిచ్చు..!
సాక్షిప్రతినిధి, కరీంనగర్: హుస్నాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం మహాకూటమిలో వివాదానికి కారణమవుతోంది. పొత్తుల్లో భాగంగా హస్నాబాద్‌ను సీపీఐకి కేటాయించాలని మొదటి నుంచి పట్టుబడుతున్నారు. హుస్నాబాద్ సీటుపై తేల్చకుండా కేవలం మూడు స్థానాలనే కేటాయించనున్నట్లు వస్తున్న లీకులపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. హుస్నాబాద్‌పై ఏమీ తేల్చకుండా కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న లీకులపై అసహనంతో రగిలారు. మహాకూటమిలో భాగంగా కాంగ్రెస్ వైఖరిపై ఆయన ఏకంగా మీడియాకెక్కారు. ఆదివారం హైదరాబాద్ సీపీఐ రాష్ట్ర కార్యవర్గం ఏర్పాటు చేసి జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డిని ఆహ్వానించారు. ఈనెల 4న నిర్వహించే అత్యవసర సమావేశం భవిష్యత్ కార్యాచరణను ప్రకటించనున్నట్లు చాడ పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది. మహాకూటమిలోని భాగస్వామ్య పక్షాల మధ్య ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండాలని, ప్రస్తుతం ఆ పరిస్థితి లేదని ఈ సందర్భంగా చాడ అభిప్రాయపడటంతో పరిస్థితి అదుపుతప్పే వరకు వచ్చినట్లుగా అవగతమవుతోంది. అత్యధిక సార్లు సీపీఐదే విజయం.. హుస్నాబాద్‌గా మారినా అందుకే పట్టు.. 1957 నుంచి 2004 వరకు మొత్తం 11 పర్యాయాలు ఎన్నికలు జరగగా, ఆరు సార్లు సీపీఐ, ఒకసారి పీడీఎఫ్ అభ్యర్థులు ఇందుర్తి నియోజకవర్గం నుంచి గెలుపొందారు. అలాగే మూడుసార్లు కాంగ్రెస్, ఒక్కసారి కాంగ్రెస్ (ఐ)లు కైవసం చేసుకున్నాయి. 1957లో పి.చొక్కారావు (పీడీఎఫ్), 1962, 1967లలో వరుసగా బొప్పరాజు లక్ష్మీకాంతారావు (కాంగ్రెస్), 1972లో బద్దం ఎల్లారెడ్డి (సీపీఐ), 1978లో దేశిని చిన్నమల్లయ్య విజయం సాధించగా, 1983లో మళ్లీ బి.లక్ష్మీకాంతారావే గెలిచారు. 1985, 1989, 1994లలో వరుసగా సీపీఐ అభ్యర్థిగా గెలుపొందిన దేశిని చిన్న మల్లయ్య హ్యాట్రిక్ సాధించారు. 1999లో బొమ్మా వెంకటేశ్వర్ (కాంగ్రెస్), 2004లో గెలుపొందిన చాడ వెంకటరెడ్డి (సీపీఐ) ఆ పార్టీ శాసనసభ పక్షనేతగా కూడా వ్యవహరించారు. 2009లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా కమలాపూర్, ఇందుర్తి, హుస్నాబాద్ కలిపి హుజూరాబాద్, హుస్నాబాద్లుగా మారాయి. హుజూరాబాద్, వీణవంక, జమ్మికుంట, కమలాపూర్ మండలాలతో హుజూరాబాద్, హుస్నాబాద్, సైదాపూర్, ఎల్కతుర్తి, భీమదేవరపల్లి, చిగురుమామిడి, కోహెడ మండలాలతో హుస్నాబాద్ నియోజకవర్గాలు ఏర్పడ్డాయి. పునర్విభజన తర్వాత 2009లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి టీఆర్ఎస్ అభ్యర్థి కెప్టెన్ వి.లక్ష్మీకాంతారావు గెలుపొందారు. ఈ ఎన్నికల్లో పీఆర్పీ అభ్యర్థిగా పోటీ చేసిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి, సీపీఐ అభ్యర్థి వెంకటరెడ్డి మూడు, నాలుగు స్థానాలకు చేరారు. 2014లో టీఆర్ఎస్ అభ్యర్థి, కెప్టెన్ లక్ష్మీకాంతారావు తనయుడు వొడితెల సతీష్‌కుమార్ చేతిలో కాంగ్రెస్ అభ్యర్థిగా ఎ.ప్రవీణ్‌రెడ్డి ఓటమి పాలయ్యారు. ఉమ్మడి కరీంనగర్లో పట్టున్న ఏకైక స్థానం.. రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న చాడ వెంకటరెడ్డి పోటీకి ఆసక్తి చూపుతుండటంతో కూటమిలో ఇప్పుడు ‘హుస్నాబాద్’ చిచ్చు రగులుతోంది. 4న రాష్ట్ర కార్యవర్గం అత్యవసర భేటీ.. ‘కూటమి’లో భవిష్యత్ కార్యాచరణ కలకలం.. పొత్తుల్లో సీపీఐకి కేటాయించే స్థానాలు తేలకపోగా, మూడంటే మూడంటూ కాంగ్రెస్ పార్టీ లీకులు ఇస్తోందంటూ శుక్రవారం చాడ వెంకటరెడ్డి మీడియా సమావేశంలో పేర్కొనడం కూటమిలో కలకలంగా మారింది. సంబంధం లేకుండా అబద్ధాలతో లీకేజీలు ఇస్తున్నారని మండిపడిన వెంకటరెడ్డి, ఈ విషయాన్ని టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ, టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. భాగస్వామ్య పక్షాల మధ్య సీట్ల సర్దుబాటు, ఉమ్మడి అజెండా ఉండాలని.. గౌరవప్రదమైన ఒప్పందం జరగాలని భావిస్తే.. కూటమిగా ఏర్పడి దాదాపు 50 రోజులు గడిచాయని, ఉమ్మడి అజెండా ఖరారైనా అడుగు ముందుకు పడకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. లీకేజీలతో తమ పార్టీ శ్రేణుల్లో గందరగోళం నెలకొంటోందని ఆందోళన వ్యక్తం చేసిన ఆయన 4న అత్యవసర రాష్ట్ర కార్యవర్గం ఏర్పాటు చేయడం.. ఆ సమావేశానికి జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డిని ఆహ్వానించడంతో పరిస్థితి సీరియస్‌గా మారింది. కాగా.. ఈ అత్యవసర సమావేశంలో కూటమిలో కొనసాగాలా..? వద్దా? అనే అంశంపై సీపీఐ కీలక నిర్ణయం తీసుకోనుందన్న ప్రచారం ఇప్పుడు కూటమి భాగస్వామ్య పార్టీలలో చర్చనీయాంశంగా మారింది. -
నన్ను క్షమించండి! : కసిరెడ్డి
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : ఉమ్మడి జిల్లాలోని కల్వకుర్తిలో నెలకొన్న టీఆర్ఎస్ అసమ్మతి కథ సుఖాంతమైంది. నెలన్నర రోజులుగా అనేక మలుపుల నేపథ్యంలో ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి వెనక్కి తగ్గారు. కసిరెడ్డి కోసం గతంలో మంత్రి కేటీఆర్ స్వయంగా రంగంలోకి దిగి పలుమార్లు చర్చలు జరిపినా సమస్య కొలిక్కి రాలేదు. తాజాగా బుధవారం రాత్రి, గురువారం ఉదయం రెండు సార్లు చర్చలు జరపడంతో పాటు స్వయంగా సీఎం కేసీఆర్ కూడా ఫోన్లో మాట్లాడటంతో ఆయన మెత్తబడ్డారు. కల్వకుర్తిలో గురువరం ఏర్పాటు చేసిన ‘ప్రజా ఆశీర్వాద సభ’కు ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి హాజరు కావడంతో అసమ్మతి సద్గుమణిగినట్లయింది. పార్టీ తీసుకున్న నిర్ణయానికి కట్టుబడుతానని, ఎమ్మెల్యే అభ్యర్థి జైపాల్‌యాదవ్ విజయానికి కృషి చేస్తానని ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు. నన్ను క్షమించండి! ప్రజాఆశీర్వాద సభా వేదికపై కసిరెడ్డి నారాయణరెడ్డి మాట్లాడుతూ తనను అభిమానించే నేతలు, కార్యకర్తలు క్షమిం చాలని వేడుకున్నారు. తనకు పార్టీ టికెట్ నిరాకరించిన నాటి నుంచి అండగా పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, నేతలు నిలిచారన్నారు. వారందరూ కూడా ఎన్నికల బరిలో నిలవాలని పట్టుబట్టినా.. కేసీఆర్ ప్రభుత్వం మరోసారి రావాలనే ఆలోచనతో తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు చెప్పారు. కల్వకుర్తిలో పార్టీ అభ్యర్థి గెలిస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందనే ఆలోచనతో మనసు మార్చుకున్నానని వివరించారు. రైతుల కళ్లలో ఆనందం నిండాలన్నా.. ఈ ప్రాంతం పచ్చబడాలన్నా టీఆర్ఎస్ అభ్యర్థి గెలవాల్సిన అవసరం ఉందన్నారు. తనను అభిమానించే వారి మనస్సు నొప్పించినందుకు క్షమించాలంటూ కసిరెడ్డి విన్నవించారు. ప్రచారానికి హాజరయ్యేనా? ప్రస్తుతం వెనక్కి తగ్గిన ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి... పార్టీ అభ్యర్థి జైపాల్‌యాదవ్‌కు మద్దతుగా ప్రచారంలో పాల్గొంటారా అనేది ఇప్పటికీ టీఆర్ఎస్ శ్రేణులను ఆలోచింప చేస్తోంది. ముఖ్యంగా కల్వకుర్తి నియోజకవర్గంలో త్రిముఖ పోరు నేపథ్యంలో పార్టీ శ్రేణులందరూ తీవ్రంగా శ్రమించాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే ఇప్పటి వరకుపార్టీకి అంటిముట్టనట్లుగా వ్యవహరించిన కసిరెడ్డి మున్ముందు ఎలాంటి పాత్ర పోషించనున్నారనేది నియోజకవర్గంలో హాట్‌టాపిక్‌గా మారింది. ప్రజా ఆశీర్వాద సభకు కసిరెడ్డి హాజరైనప్పటికీ అతని అనుచరగణం మాత్రం దూరంగా ఉండిపోయింది. తన వర్గంగా ముద్రపడిన వారందరితో కూడా ఒకసారి మాట్లాడాల్సిందిగా కేటీఆర్‌ను కోరినట్లు కసిరెడ్డి సభా వేదికగా ప్రకటించారు. దీంతో కసిరెడ్డి వర్గంతో కేటీఆర్ చర్చలు జరిపితే పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆగమేఘాలపై ఫ్లెక్సీపై ఫొటో ప్రజా ఆశీర్వాద సభకు ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి గైర్హాజరవుతారనే ఉద్దే శంతో స్టేజ్‌పై ఏర్పాటు చేసిన ప్లెక్సీలో ఆయన ఫొటో ఏర్పాటు చేయలేదు. కేవలం సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డి, ఎంపీ కల్వకుంట్ల కవిత ఫొటోలతో పాటు నియోజకవర్గానికి చెందిన నేతలవి మాత్రమే ముద్రించారు. కసిరెడ్డితో ఉదయం జరిపిన చర్చలు ఫలప్రదం కావడంతో పాటు సమావేశానికి కూడా మంత్రి కేటీఆర్‌తో కలిసి వస్తున్నట్లు సభా నిర్వాహకులకు సమాచారం అందింది. దీంతో ఆగమేఘాల మీద కసిరెడ్డి ఫొటోను ఆ ఫ్లెక్సీపై అతికించారు. -
కాంగి‘రేస్’లో ఎవరు?
‘మెదక్’ టికెట్‌పై రోజుకో ప్రచారం సాగుతోంది. గజ్వేల్‌కు చెందిన నాయకుడు నర్సారెడ్డికి టికెట్ వస్తుందన్న ప్రచారంతో ఆశావహుల్లో తీవ్ర ఆందోళన మొదలైంది. దీంతో ఒక్కసారిగా స్థానికత అంశం తెరపైకి తీసుకొచ్చారు. నిన్నటి వరకు టికెట్ నాదం టే నాది అన్న ఆశావహులు, నేడు స్థానికులమైన తమలో ఒకరికి టికెట్ ఇవ్వాలని, ఎవరికి వచ్చినా కలిసి పనిచేస్తామని అధిష్టానానికి తమ నిర్ణయాన్ని తెలియజేస్తున్నారు. హామీ మేరకే నర్సారెడ్డి కాంగ్రెస్‌లో చేరారన్న అనుచరల మాటలు నాయకులను మరింత కలవర పెడుతున్నాయి. సాక్షి, మెదక్: మెదక్ నియోజకవర్గ కాంగ్రెస్ టికెట్ అంశం రోజుకో మలుపు తిరుగుతోంది. నెల రోజులుగా ఎమ్మెల్యే టికెట్‌పై ఉత్కంఠ సాగుతోంది. ఇది వరకే 13 మంది అభ్యర్థులు ఈ స్థానం కోసం పోటీ పడుతున్న విషయం తెలిసిందె. దీనికితోడు స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి బరిలో దిగుతుందా? అన్న ప్రశ్న కూడా వేధిస్తోంది. స్క్రీనింగ్ కమిటీ జాబితా కూడా ఏఐసీసీకి చేరడంతో టికెట్ రాజకీయాలు హస్తినను తాకాయి. ఆశావహులు ఎవరికివారే టికెట్ కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది ఇలా కొనసాగుతుండగానే తాజాగా తెరపైకి గజ్వేల్ నియోజకవర్గానికి చెందిన తూంకుంట నర్సారెడ్డి పేరు వచ్చింది. టీఆర్ఎస్ను వీడి శనివారం ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ సమక్షంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న ఆయన మెదక్ ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. కాంగ్రెస్ పెద్దలుకూడా మెదక్ ఎమ్మెల్యే టికెట్ ఇస్తామని హామీ ఇచ్చిన తర్వాతే నర్సారెడ్డి కాంగ్రెస్‌లో చేరేందుకు అంగీకరించారని ఆయన అనుచరులు చెబుతున్నారు. మెదక్ నుంచి నర్సారెడ్డి పోటీ చేస్తారని సోషల్ మీడియాలోనూ పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. ఇది నియోజకవర్గంలోని కాంగ్రెస్‌లో కలవరం రేపుతోంది. 13 మంది అభ్యర్థులు పోటీ పడుతుంటే స్థానికేతరుడైన నర్సారెడ్డికి పేరు తెరపైకి రావడాన్ని ఆశావహులు జీర్ణించుకో లేకపోతున్నారు. గెలిచే వారికే.. గజ్వేల్ నియోజకవర్గానికి చెందిన నర్సారెడ్డికి మెదక్ టికెట్ ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వొద్దని ఆశావహులంతా పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డితోపాటు అధిష్టానం పెద్దలపై వత్తిడి తీసుకువస్తున్నారు. శుక్రవారం రాత్రి పీసీసీ చీఫ్ ఉత్తమ్‌ను కలిశారు. శనివారం ఆశావహులు మాజీ ఎంపీ, స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి నివాసంలో సమావేశమయ్యారు. కాంగ్రెస్ నేతలు బట్టి జగపతి, సుప్రభాతరావు, తిరుపతిరెడ్డి, బాలకృష్ణ తదితరులంతా సమావేశమై స్థానికులమైన తమలో ఎవరికైనా ఒకరికి టికెట్ ఇవ్వాలని, ఎవ్వరికి టికెట్ ఇచ్చినా అందరం కాంగ్రెస్ గెలుపుకోసం పనిచేస్తామని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. విజయశాంతితో సమావేశమైన వీరంతా నర్సారెడ్డికి టికెట్ ఇచ్చే విషయమై ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. స్థానికులకే టికెట్ వచ్చేలా చూడాలని ఆశావహులంతా ఆమెను కోరినట్లు సమాచారం.‘ కాంగ్రెస్ అధిష్టానం ఎలాంటి షరతులు లేకుండా నర్సారెడ్డిని కాంగ్రెస్‌లో చేర్చుకుందని, స్థానికులు గెలిచే అభ్యర్థులకు మాత్రమే అధిస్టానం టికెట్ ఇస్తుందని’ ఆశావహులకు విజయశాంతి భరోసా ఇచ్చినట్లు తెలిసింది. ఇదిలా ఉంటే కాంగ్రెస్ పార్టీలో ఆయోమయం సృష్టించేందుకే టీఆర్ఎస్ పార్టీ నర్సారెడ్డికి కాంగ్రెస్ టికెట్ వస్తుందంటూ తప్పుడు ప్రచారం చేస్తోందని ఓ కాంగ్రెస్ నేత అన్నారు. ఇదిలా ఉంటే నర్సారెడ్డికి టికెట్ ఇవ్వడాన్ని కొంత మంది ఆశావహులు స్వాగతిస్తున్నారంటూ సాగుతున్న ప్రచారాన్ని కొట్టిపారేశారు. కాగా నర్సారెడ్డి మెదక్ ఎంపీ టికెట్ కోరుతున్నారన్న ప్రచారం కూడా సాగుతోంది. అధిష్టానం మదిలో ఏముందో..? ఈ విషయంలో అధిష్టానం మదిలో ఏముందో తెలియక ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్న నేతలు, కాంగ్రెస్ శ్రేణులు సతమతం అవుతున్నాయి. టికెట్ ఎవరికి దక్కుతుందా అన్న ఉత్కంఠ నెలకొంది. నవంబర్ 3 తర్వాత ఎమ్మెల్యే టికెట్లపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే మహాకూటమిలో భాగంగా మెదక్ టికెట్‌పై తెలంగాణ జన సమితి కూడా ఆశలు పెట్టుకుంది. మెదక్ టికెట్ తమకే వస్తుందని ఆ పార్టీ నేతలు గట్టి చెబుతుండటంతోపాటు ఇటీవల సంబరాలు సైతం చేసుకోవటం కాంగ్రెస్ నాయకులను మరింత కలవరపరుస్తోంది. కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ ఎమ్మెల్యే ఆశావహులతో రెండు మూడురోజుల్లో భేటీ కానుంది. ఈ భేటీలో మెదక్ ఎమ్మెల్యే టికెట్ విషయమై స్పష్టత వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. -
‘నాయినికి ఇంతటి అవమానమా’
సాక్షి, హైదరాబాద్ : ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి విమర్శలు గుప్పించారు. ఉద్యమకారుడు, నీతి నిజాయితీ అని గొప్పలు చెప్పుకునే కేసీఆర్ నియోజకవర్గానికి 10కోట్లు ఖర్చు పెట్టడానికి సిద్ధపడ్డారని ఆరోపించారు. 2014 ఎన్నికల్లో ఖర్చుని భరిస్తానని కేసీఆర్ నాయినికి హామినిచ్చిన విషయాన్ని స్వయంగా ఆయనే గురువారం మీడియాకు వెల్లడించారని అన్నారు. ముషీరాబాద్ సీటును అల్లుడికి ఆశించిన నాయినికి కేసీఆర్ కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వకపోవడం దారుణమన్నారు. మొదటి నుంచి టీఆర్ఎస్ను వెన్నంటి ఉన్న నాయినికి నెలరోజులుగా అపాయింట్మెంట్ ఇవ్వలేదంటే అది అవమానం కాదా...? అని ప్రశ్నించారు. 2014 ఎన్నికల్లో ఎల్బీనగర్లో పోటీ చేస్తే 10 కోట్లు ఇస్తానని కేసీఆర్ చెప్పిన విషయాన్ని నాయిని పత్రికాముఖంగా చెప్పారనీ, దీన్ని సుమోటాగా తీసుకుని ఎన్నికల సంఘం కేసు నమోదు చేయాలన్నారు. ఈడీ దాడులు మోడీ, కేసీఆర్ కనుసన్నల్లోనే జరుగుతున్నాయని వ్యాఖ్యానించారు. -
సమాధానం చెప్పలేకపోతున్నా!
సాక్షి,హైదరాబాద్: ‘యాడికి పోయినా పార్టీ కార్యకర్తలు, శ్రేయోభి లాషులు, బంధువులు నన్ను బాగా ఇబ్బంది పెడుతున్నరు. నువ్వుండగా ముషీరాబాద్ టికెట్ పెండింగ్‌ల ఎందుకున్నది? సీఎంకు నువ్వు బాగా దగ్గరటగద అని అడుగుతున్నరు. ఈ ప్రశ్నలకు జవాబు చెప్పలేక చాలా ఇబ్బంది పడుతున్నా. చాలా బాధ అయితున్నది. అల్లుడు శ్రీనివాస్ రెడ్డి కూడా బాగా అప్సెట్ అయిండు’అని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అల్లుడి కోసం ముషీరాబాద్ టికెట్ ఆశించినా.. ఇప్పటివరకూ ప్రకటించకపోవడంపై ఆయన నిర్వేదం వ్యక్తం చేశారు. గురువారం చిక్కడపల్లిలోని ఓ జిమ్ ప్రారంభానికి అల్లుడి తో కలిసి వచ్చిన నాయిని.. ముషీరాబాద్ టికెట్ విషయంలో మీడియా ప్రశ్నించగా ఈ విధంగా స్పందించారు. ‘ముఖ్యమంత్రి కేసీఆర్ 105 సీట్లు ప్రకటించి నెల రోజులైంది. అందులో ముషీరాబాద్ ఎందుకు ఆపారని చర్చ జరుగుతుంది. అమావాస్య తర్వాత ఆపిన 14 సీట్లు ప్రకటిస్తారని వార్తలు వచ్చాయి. అమావాస్య కూడా అయిపోయింది. ముషీరాబాద్ టికెట్ గురించి నేను ఇంట్రెస్ట్‌గా ఉన్నాను’అని నాయిని పేర్కొన్నారు. కేసీఆర్ ఎప్పుడో మాటిచ్చారు ‘ముషీరాబాద్ గురించి ఆర్గనైజ్ చేసుకోమని సీఎం చాలా రోజుల క్రితమే నాకు చెప్పాడు. ఆయన మాట మీద విశ్వాసంతో.. అల్లుడు ముషీరాబాద్ నియోజకవర్గంలో తిరుగుతూ కార్యకర్తలను సమీకరించాడు. ఇప్పటికిప్పుడు శ్రీనివాస్ రెడ్డి పిలిస్తే 1000 మంది వచ్చే నెట్వర్క్ తయారైంది. అందుకే సీఎంను కలవడానికి ప్రయత్నిస్తున్నాను’అని నాయిని తెలిపారు. కేసీఆర్ కూడా ‘నర్సన్నకు చెప్పు.. ఆయనతో మాట్లాడాకే ముషీరాబాద్ టికెట్ డిక్లేర్ చేస్తా. తొందరపడొద్దు’అని కేటీఆర్ ద్వారా చెప్పించారన్నారు. ఆ తర్వాత రెండుసార్లు కలిసినా.. కేటీఆర్ ఇదే విషయాన్ని చెప్పారన్నారు. ఈమధ్య పేపర్లు, టీవీల్లో వచ్చే వార్తల్లోనూ తమ పేర్లు కనిపించడం లేదని వాపోయారు. ‘ఈరోజే కాదు.. నాలుగైదురోజుల తర్వాత పేర్లు ప్రకటించినా ఇబ్బందిలేదు. శ్రీనివాస్ రెడ్డికి టికెట్ ఇస్తే సంతోషమే. లేకుంటే నేనే పోటీ చేస్తానని చెప్పాను. ముషీరాబాద్ నియోజకవర్గంలో 1978 నుంచి ఆర్గనైజ్ చేసుకుంటూ వస్తున్నా. నా కార్యకర్తలు చాలా మంది బాధపడుతున్నారు. మీరు రండి గెలిపిస్తామంటూ అహ్వానిస్తున్నారు’అని నాయిని పేర్కొన్నారు. అప్పుడు ఎల్బీ నగర్ నుంచి.. 2014లో నేను ముషీరాబాద్ నుంచి పోటీ చేస్తానంటే ‘వద్దు నర్సన్నా నిను గతంలో ఓడగొట్టారు. నువ్వు ఈసారి ఎల్బీ నగర్ నుంచి పోటీచెయ్. సర్వేలో స్థానిక నాయకులకంటే నీకు ఎక్కువ మార్కులు వచ్చాయి’అని కేసీఆర్ అన్నారని నాయిని గుర్తుచేశారు. దానికి సమయం 15 రోజులే ఉంది బాగా డబ్బున్న సుధీర్ రెడ్డి మీద కోట్లాడేంత డబ్బు నా దగ్గర లేదంటే ‘నీ తమ్ముడిని నేనున్నా రూ.10 కోట్లు ఇస్తా పోటీచెయ్’అన్నాడన్నారు. ఎల్బీ నగర్లో పోటీకి విముఖత చూపడంతో.. ఎమ్మెల్సీ ఇచ్చి కేబినెట్లో చోటిచ్చాడని నాయిని చెప్పారు. ‘ఇప్పటికైనా కేసీఆర్ నాకు అనుకూ లంగానే నిర్ణయం తీసుకుంటారనే నమ్మక ముంది. మా ఇద్దరిలో (మామా అల్లుళ్లలో) ఎవరికి అవకాశం ఇచ్చినా.. భారీ మెజార్టీతో గెలవడం ఖాయం. మంగళవారం కేటీఆర్‌ను కలిసి కూడా ఇదే విషయం చెప్పాను. సీఎంను కలిసేందుకు ప్రయత్నిస్తున్నాను. మరో రెండేళ్లపాటు నా ఎమ్మెల్సీ పదవీకాలం ఉంది. దీన్ని ముషీరాబాద్ టీఆర్ఎస్ టికెట్ ఆశిస్తున్న వ్యక్తికి ఇచ్చి.. నాకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తే బాగుంటుంది’అని ఆయన అన్నారు. అయితే, పార్టీ నిర్ణయమే శిరోధార్యమని.. మామా అల్లుళ్లు కాంగ్రెస్‌లోకి వెళ్తున్నారంటూ తప్పుడు ప్రచారం జరుగుతోందన్నారు. సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి నాయిని -
శోభా..? రవిశంకరా?
సాక్షిప్రతినిధి, కరీంనగర్: గులాబీ దళపతి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించి నెలరోజులు గడిచినా.. చొప్పదండి బరిలో నిలిచే గులాబీ నేత ఎవరు? అన్న సస్పెన్స్‌కు ఇంకా తెరపడ లేదు. ఉమ్మడి కరీంనగర్లో 12 అసెంబ్లీ స్థానాలకు 11 మందిని ఖరారు చేసిన అధినేత ఎస్సీ రిజర్వుడు స్థానం చొప్పదండిని మాత్రం హోల్డ్‌లో పెట్టారు. అటు తాజా మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభకు ఇవ్వమని చెప్పడం లేదు.. ఇటు కొత్త అభ్యర్థి పేరునూ ప్రకటించడం లేదు. దీంతో ఈ స్థానం నుంచి టికెట్ ఆశించే వారి జాబితాలో రోజుకో పేరు చేరుతోంది. ప్రధానంగా ఆ నియోజకవర్గంలో పలువురు ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యులు, ముఖ్యనేతల ఫిర్యాదుతో శోభకు టికెట్ నిలిపివేయగా.. ఫిర్యాదు చేసిన నేతలే సుంకె రవిశంకర్ పేరు తెరపైకి తెచ్చారు. టిక్కెట్లు ప్రకటించి నెల రోజులు గడిచిపోగా.. ఈ ఇద్దరిలో ఎవరి పేరును ఇంకా ప్రకటించ లేదు. దీంతో ఇదే స్థానం నుంచి మాజీ మంత్రి గడ్డం వినోద్, రిటైర్డు డీఆర్వో బైరం పద్మయ్య, వొల్లాల వాణి, గుర్రం సంధ్యారాణి పేర్లు తెరపైకి రావడం చర్చనీయాంశం అవుతోంది. వినూత్నరీతిలో బొడిగె శోభ ప్రచారం.. విరుగుడుగా అసంతృప్తుల ప్రచారం.. చొప్పదండి తాజా మాజీ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ నాయకురాలు బొడిగె శోభ ట్రెండ్ మార్చారు. ఓ వైపు పార్టీ టిక్కెట్ దక్కుతుందో లేదో తెలియక.. అధినేత మదిలో ఏముందో అర్థం కాక మదన పడుతున్నారు. మరోవైపు తాను నమ్ముకున్న ప్రజలను కలిసేందుకు గ్రామాల్లోకి వెళ్ళి కన్నీటి పర్యంతమవుతూ వారిని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. పేద దళిత మహిళను కావడం.. కొందరి ఫిర్యాదులతోనే తనకు టిక్కెట్ ఇవ్వడంలో జాప్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ కొంగుచాచి విరాళాలు సేకరిస్తున్నారు. ఇదే సమయంలో టీఆర్ఎస్ నీడలో, కేసీఆర్ ఆశీస్సులతో ఎదిగిన తనకే పార్టీ అధినేత మళ్లీ అవకాశం ఇస్తారని కూడా చెప్తున్నారు. కాగా.. శోభ ప్రయత్నానికి విరుగుడుగా గులాబీ శ్రేణులు, స్థానిక నాయకులు ఐక్యంగా నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం చేపట్టి ప్రజా ఆశీర్వాద సభలతో హడావిడి చేస్తున్నారు. శోభ వైఖరితో ఇప్పటికే అగ్గిమీద గుగ్గిలంలా మండిపడుతున్న గులాబీ శ్రేణులు తాజా పరిణామాలతో ఆమెకు వ్యతిరేకంగా ప్రచారం ముమ్మరం చేశారు. శోభ వెళ్లిన గ్రామాల్లోకి వెళ్లి భారీ ర్యాలీ నిర్వహించి ప్రజా ఆశీర్వాద సభతో జనాన్ని ఆకట్టుకున్నారు. చొప్పదండి నియోజకవర్గ ప్రజలు ఆదరించి ఎమ్మెల్యేగా గెలిపిస్తే పార్టీ శ్రేణులను పట్టించుకోకుండా అగౌరవ పరిచేలా వ్యవహరించారని ఆరోపిస్తున్నారు. శోభకు కాకుండా పార్టీ ఎవ్వరికి టిక్కెట్ ఇచ్చినా గుండెల్లో పెట్టుకుని గెలిపించుకుంటామని హడావుడి చేస్తున్నారు. రసకందాయంలో రాజకీయం.. చివరకు అభ్యర్థి ఎవరో మరి.. ఎన్నికల షెడ్యూల్ నాటికి కూడా పంచాయితీ తెగకపోవడంతో పోటాపోటీ ప్రచారాలతో చొప్పదండి రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. అటు ప్రతిపక్షాల్లోనూ, ఇటు స్వపక్షంలోనూ చొప్పదండి రాజకీయాలు రక్తికట్టిస్తున్నాయి. ముఖ్యంగా అధికార పార్టీ టీఆర్ఎస్లో స్వపక్షమే విపక్షంగా మారి పోటాపోటీగా ప్రచారం సాగిస్తున్నాయి. అసెంబ్లీని రద్దు చేసిన వెంటనే 105 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన గులాబీ దళపతి కేసీఆర్, చొప్పదండి అభ్యర్థి ఎంపికను సస్పెన్స్‌లో పెట్టారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న బొడిగె శోభ వ్యవహార శైలిపై టీఆర్ఎస్ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు అధినేత కేసీఆర్‌కు పిర్యాదు చేయడంతోనే శోభ అభ్యర్థిత్వాన్ని ప్రకటించకుండా పెండింగ్‌లో పెట్టారని ప్రచారం సాగింది. నెలరోజులు దాటినా అభ్యర్థిని ఎంపిక చేయకపోవడం, శోభకు వ్యతిరేకంగా స్థానిక టీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు జోరుగా ఎన్నికల ప్రచారం సాగిస్తుండడంతో ఇంతకాలం వేచిచూసే ధోరణి అవలంబించిన శోభ ఒక్కసారిగా ట్రెండ్ మార్చారు. కాట్నపల్లి, రాగంపేటను సందర్శించిన శోభ తన అనుచరులతో సమావేశమై కన్నీటిపర్యంతమయ్యారు. పార్టీలో జరుగుతున్న అవమానాన్ని తలచుకుంటూకన్నీరుమున్నీరుగా విలపించిన శోభను చూసిన స్థానికులు ఆమె పట్ల జాలి చూపారు. చొప్పదండి నియోజకవర్గం ఎస్సీ రిజర్వుడుగా ఉన్నంతకాలం శోభక్కను తమ ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామని వారు తీర్మానం కూడా చేశారు. అంతటితో ఆగకుండా శోభకు రెండు కులసంఘాలు పది నుంచి 15 వేలు సమకూర్చాయి. మొత్తంగా చొప్పదండి రాజకీయాలు రసకందాయంలో పడగా, చొప్పదండి పరిణామాలను నిశ్చింతంగా గమనిస్తున్న గులాబీ దళపతి కేసీఆర్, అభ్యర్థి ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తున్నారని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బొడిడె శోభ, సుంకె రవిశంకర్‌లలో ఎవరు అభ్యర్థి అవుతారనే చర్చ సర్వత్రా సాగుతోంది. -
ఆ ముగ్గురు అభ్యర్థులు వద్దే వద్దు
సాక్షిప్రతినిధి, కరీంనగర్: గులాబీ దండులో అసంతృప్తి జ్వాల చల్లారడం లేదు. వేములవాడ, రామగుండంలలో అభ్యర్థుల మార్పు.. చొప్పదండిలో కొత్త వారికి టికెట్ కోసం లొల్లి సద్దుమణగడం లేదు. జగిత్యాలలో డాక్టర్ సంజయ్‌కుమార్ అభ్యర్థిత్వాన్ని సైతం పలువురు వ్యతిరేకిస్తుండగా, పెద్దపల్లిలో చాపకింది నీరులా అసంతృప్తి రగులుతూనే ఉంది. తెలంగాణ ఉద్యమానికి, కేసీఆర్ సెంటిమెంట్ జిల్లా.. ఉమ్మడి కరీంనగర్లో అసమ్మతి రోజురోజుకూ రాజుకుంటోంది. నాలుగున్నరేళ్లలో చేసిన అభివృద్ధిని ప్రచారాస్త్రంగా మలుచుకొని అధికారం చేపట్టాలని తహతహలాడుతున్న టీఆర్ఎస్లో పలుచోట్ల అంటుకున్న అంతర్గత పోరు చల్లారడం లేదు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రెండు ఎంపీ స్థానాలతోపాటు 13 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. 2014 ఎన్నికల్లో జగిత్యాల అసెంబ్లీ స్థానం మినహా రెండు పార్లమెంట్, 12 అసెంబ్లీ స్థానాల్లో గులాబీ జెండా ఎగురవేశారు. ఈసారి జరిగే ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లోనూ అదే ట్రెండ్ కొనసాగించాలనుకుంటోంది. అందుకే చొప్పదండి మినహా 12 నియోజకవర్గాలకు అభ్యర్థులను ముందస్తుగా ప్రకటించగా.. పలుచోట్ల అసంతృప్తులు అధిష్టానం అంచనాలకు గండి కొడుతున్నారు. ఆ ముగ్గురు వద్దే వద్దు.. టీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటన వెలువడి 25 రోజులు కావస్తున్నా.. అధికార టీఆర్ఎస్ పార్టీలో కొందరు అభ్యర్థులను మార్చాలంటూ ఇంకా పట్టుపడుతూనే ఉన్నారు. వేములవాడ, రామగుండంలలో చెన్నమనేని రమేష్‌బాబు, సోమారపు సత్యనారాయణను మార్చాలంటున్నారు. చొప్పదండి తాజా మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభకు టికెట్ నిలిపి వేయగా, ఆ స్థానాలలో వేరొకరికి అవకాశం కల్పించాలంటున్నారు. వేములవాడ నియోజకవర్గంలో అయితే ‘జర్మనీ బాబు’ను మార్చాలంటూ బహిరంగంగానే ఆయన వ్యతిరేకులు సభలు పెట్టి సవాల్ చేస్తున్నారు. పాదయాత్రలు, «ర్యాలీలు, నిరసన ప్రదర్శనలతో రోజూ వేములవాడ అట్టుడుకుతోంది. వేములవాడ అభ్యర్థిపై అసమ్మతి సెగ పతాక స్థాయికి చేరుకుంది. అభ్యర్థిత్వం ఖరారైన రోజే రమేష్ బాబు వ్యతిరేక వర్గం వెయ్యి మంది కార్యకర్తలతో సమావేశమైంది. రమేశ్‌బాబును తప్పించడమే లక్ష్యంగా ఆ పార్టీకి చెందిన వారంతా అదే వేదిక నుంచి బాహాటంగా ప్రకటించారు. ఎన్నో ఏళ్లుగా పార్టీని నమ్ముకుని, జెండాలు మోసి, పార్టీ కోసమే పనిచేస్తున్న తమపై ఎమ్మెల్యే కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నాడని ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన సోమారపు సత్యనారాయణ ప్రజలకు ఇచ్చిన హామీలను ఏమాత్రం నెరవేర్చలేదని, ఉద్యమ సమయంలో పార్టీలో పని చేసిన నాయకులను, కార్యకర్తలను పూర్తిగా విస్మరించి తన చెప్పుచేతల్లో ఉన్న కొంతమందితోనే రాజకీయం చేస్తున్నారని ఆయన వ్యతిరేకవర్గం బయటకు వచ్చి బాహాటంగానే ఆరోపణలు చేస్తోంది. కోరుకంటి చందర్, కొంకటి లక్ష్మీనారాయణ తదితరులు ఓ గ్రూపుగా ఏర్పడి సత్యనారాయణ టికెట్ రద్దు చేయాలని, లేదంటే రెబల్‌గా పోటీ చేస్తామంటున్నారు. చొప్పదండి విషయానికి వస్తే బొడిగె శోభ స్థానంలో సుంకె రవిశంకర్‌కు అవకాశం ఇవ్వాలని ఆ నియోజకవర్గంలోని మెజార్టీ నాయకులు తిరుగుబాటు చేశారు. మంగళవారం కూడా నియోజకవర్గంలో ర్యాలీలు, నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. అయితే.. శోభ మాత్రం టీఆర్ఎస్ అధిష్టానం తనకే అవకాశం కల్పిస్తుందన్న ధీమాతో ఉన్నారు. జగిత్యాలలోనూ అసమ్మతి సెగలు.. పెద్దపల్లిలో చాపకింద నీరులా.. జగిత్యాల నియోజకవర్గంలో సీనియర్ నాయకు డు డాక్టర్ సంజయ్‌కుమార్‌కు టికెట్ కేటాయించగా, అదే నియోజకవర్గానికి చెందిన ఓరుగంటి రమణారావు సైతం టికెట్‌ను ఆశించి భంగపడ్డారు. దీంతో రెబల్‌గా పోటీ చేయాలంటూ తన అనుచరులు ఒత్తిడి చేయడంతో పోటీకి సన్నద్ధమయ్యారు. నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత రంగ ప్రవేశం చేసి ఇరువురికి రాజీ కుదర్చడంతో సద్దుమణిగినట్లు కనిపించిన అసమ్మతి మరో రూపంలో బయటపడింది. అభ్యర్థి సంజయ్‌కుమార్ సమీప బంధువు పార్టీ నాయకుడు ఎం.జితేందర్రావుతోపాటు, బండ భాస్కర్‌రెడ్డి, ము స్కు గంగారెడ్డి, టీఆర్ఎస్ మున్సిపల్ ఫ్లోర్‌లీడర్ తాటిపర్తి సరళాదేవి, న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు శంకర్ జగిత్యాల అభ్యర్థిని మార్చాల్సిందేనని అల్టిమేటం జారీ చేయడంతో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. అదేవిధంగా పెద్దపల్లి నియోజకవర్గంలో టికెట్లు ఆశించి దక్కని నేతలు కొందరు దాసరి మనోహర్‌రెడ్డిపై అసంతృప్తి చర్యలు సాగిస్తూనే ఉన్నారు. టికెట్ ఆశించి భంగపడిన నేతలు ‘అసమ్మతి వర్గం’గా జట్లు కడుతున్నారు. ఆరు నూరైనా.. నూరు ఆరైనా.. బరిలో ఉంటామని తెగేసి చెబుతున్నారు. తమకు ఇదే ఆఖరి మోఖా అని, చావో రేవో తేల్చుకుంటామని కూడా స్పష్టం చేస్తుండటం అక్కడ కూడా సమస్యగా మారింది. ఇదిలా వుండగా 2014 ఎన్నికల సమయంలో కొత్త వాళ్లకు టికెట్లు ఇస్తే ఊరుకునేది లేదని.. సామూహికంగా రాజీనామాలు చేస్తామని మంథని మాజీ ఎమ్మెల్యే చందుపట్ల రాంరెడ్డి హెచ్చరించారు. ఆయనతోపాటు ఆయన తనయుడు చందుపట్ల సునీల్‌రెడ్డి కూడా అప్పుడు పార్టీకి సారథ్యం వహిస్తున్నారు. తమకే టికెట్ వస్తుందనే నమ్మకంతో వారికి అప్పటికే మాజీ జెడ్పీటీసీగా ఉన్న పుట్ట మధుకు కేటాయించడం ఇబ్బందికరంగా మారింది. ఈసారి కూడా సునీల్‌రెడ్డి టికెట్ ఆశించినప్పటికీ పుట్ట మధుకే కేటా యించడం కొంత అసంతృప్తికి కారణమవుతోంది. మానకొండూరు, కోరుట్లలో కూడా కొంత కిరికిరి జరిగినా.. చివరికి సర్దుకుంది. మిగతా స్థానాల్లో అభ్యర్థుల పరిస్థితి బాగానే ఉంది. ఆ మూడు స్థానాల్లో అభ్యర్థులను మార్చాలన్న ఆందోళనలు అధిష్టానానికి తలనొప్పిగా మారింది. -
చొప్పదండి టికెట్.. మాకేనండి..!!
చొప్పదండి నియోజకవర్గం ఉత్తర తెలంగాణలో హాట్‌టాపిక్‌గా మారింది. టీఆర్ఎస్ సహా అన్ని పార్టీలు అభ్యర్థులను ఖరారు చేయడంలో జాప్యం చేస్తుండడంతో ఆశావహుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. తమకెందుకులే అన్న వారు కూడా టికెట్ వేటలో పడుతున్నారు. చొప్పదండి టికెట్ తమకే వస్తుందంటూ ఎవరికి వారు ప్రచారం మొదలు పెట్టారు. క్షేత్రస్థాయిలోకి ఎవరూ వెళ్లకపోయినా తమ అనుచరులతో మంతనాలు జరుపుతూ.. చొప్పదండి టు హైదరాబాద్, హైదరాబాద్ టు చొప్పదండికి చక్కర్లు కొడుతూ తమకున్న పరిచయాలు పలుకుబడిని ఉపయోగించి టిక్కెట్ల వేటలో పడ్డారు. అధికార టీఆర్ఎస్ పార్టీ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 12 మంది అభ్యర్థిత్వాలు ఖరారు చేసి ఒక్క చొప్పదండికి మాత్రం అభ్యర్థిని ప్రకటించకపోవడంతో ఎవరికి వారు టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ప్రజల నాడి పట్టుకుని ఫలితాన్ని ఖచ్చితంగా రాబట్టా లనే ఉద్దేశంతో ప్రతిపక్షాలు సైతం టీఆర్ఎస్ పార్టీ టికెట్ కేటాయించే వరకు వేచిచూడాలనే ధోరణిలో ఉన్నట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్ పార్టీ ఎవరిని అభ్యర్థిగా నామినేట్ చేస్తుందనే ఉత్కంఠకు తెరతీయక ముందే తాజా మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ పార్టీని వీడుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. అయితే.. ఆమె మాత్రం అధిష్టానంపై భారం వేసి ఇంకా తన ప్రయత్నాలను కొనసాగిస్తున్నానని కార్యకర్తలకు భరోసా ఇస్తున్నారు. సాక్షిప్రతినిధి, కరీంనగర్: చొప్పదండి నియోజకవర్గం రిజర్వుడ్ కావడంతో ఉమ్మడి జిల్లాకు చెందిన ఇతర ప్రాంతాలకు చెందిన నేతలు సైతం చొప్పదండిపై కన్నేసి టికెట్లు ఆశిస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీ నుంచి రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షుడు సుంకె రవిశంకర్, మాజీ మంత్రి గడ్డం వినోద్, ఇటీవలే ఆర్డీవోగా పదవీ విమరణ పొందిన బైరం పద్మయ్య, తెలంగాణ గాయని వొల్లాల వాణి, గుర్రం సంధ్యారాణి, గజ్జెల స్వామి టికెట్ కోసం పోటీ పడుతున్నారు. ఎవరికి వారుగా హైదరాబాద్ వెళ్లి అధినేత దృష్టిలో పడేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే.. టికెట్‌పై ఇప్పుడిప్పుడే సస్పెన్స్ వీడేలా లేదు. ఇక కాంగ్రెస్‌లో కూడా టికెట్ పోటీ తీవ్రంగానే ఉంది. 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి చొప్పదండి నియోజకవర్గం శాసనసభకు పోటీ చేసి ఓటమి చెందిన మేడిపల్లి సత్యం ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. రేవంత్‌రెడ్డితో కలిసి చేరికలు జరిగిన రోజే పార్టీ సత్యంకు టికెట్ ఇచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేసిందని ఆయన అనుచరులు చెబుతున్నారు. కాగా.. గత ఎన్నికలకు ముందు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకొని పోటీకి దిగిన మాజీ మంత్రి సుద్దాల దేవయ్య సైతం ఈసారి టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇక గత ఎన్నికల్లో చొప్పదండి టికెట్ ఆశించి భంగపడడంతోపాటు కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన ప్రజా సంఘాల జేఏసీ చైర్మ న్ గజ్జెల కాంతం కూడా తీవ్ర ప్రయత్నాలు చేస్తూ, టికెట్ కేటాయింపు ఖాయమనే ధీమాలో ఉన్నారు. టీఆర్ఎస్ను ఓడించేందు కు మహాకూటమిగా ఏర్పడ్డప్పటికీ చొప్పదండి టికెట్‌ను కాంగ్రెస్ పార్టీకే కేటాయించే అవకాశాలు కన్పిస్తున్నాయి. తలనొప్పిగా ‘చొప్పదండి’.. ఉమ్మడి జిల్లాలో 13 నియోజకవర్గాలకు 12 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన టీఆర్ఎస్ ఒక్క చొప్పదండిని మినహాయించింది. అదేవిధంగా కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఐల పొత్తుల కూటమి నుంచి ఈ స్థానంపై ఇ తర పార్టీలు అంతగా దృష్టి సారించడం లేదు. దీంతో కాంగ్రెస్ పార్టీకే ఈ స్థానం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో చొప్పదండిలో టీఆర్ఎస్ తోపాటు కాంగ్రెస్ పార్టీల్లో టికెట్ల కోసం తీవ్ర పోటీ నడుస్తోంది. అయితే.. ఆశావహులంతా తమ గాడ్ఫాదర్లను, పార్టీ ముఖ్యులను రం గంలోకి దింపి టికెట్ వేటలో పడ్డారు. దీంతో ఎవరికి టికెట్ కేటాయించాలనే సందిగ్ధం మొ దలైంది. టీఆర్ఎస్ పార్టీలో తాజా మాజీ ఎమ్మెల్యేకు అభ్యర్థిత్వం ఖరారు చేయకపోవ డం వల్లే అధికార పార్టీలో ఈ పరిస్థితి వచ్చిన ట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌లో గతంలో జరిగిన వలసల సమయంలో హామీలపై స్ప ష్టత లేకపోవడంతో మిగతా నేతలు సైతం తీవ్ర ప్ర యత్నాలు చేస్తున్నారు. దీంతో ఆయా పార్టీల అధిష్టానాలకు టికెట్ల కేటాయింపు తలనొప్పిగా మారింది. ఇదిలా వుండగా వైఎస్ఆర్సీపీ ఈసారి కూడా చొప్పదండి నియోజకవర్గం నుంచి బరిలోకి దిగనుండగా, ఇక్కడి నుంచి ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి అక్కెన్నపల్లి కుమార్ పేరును ఆ పార్టీ అధిష్టానం పరిశీలిస్తోంది. దాదాపుగా ఆయనకే గ్రీన్‌సిగ్నల్ ఇవ్వనున్న ట్లు కూడా చెప్తున్నారు. అదేవిధంగా, భారతీ య జనతా పార్టీ, బహుజన లెఫ్ట్ ఫ్రంట్ (బీఎల్ఎఫ్), బీఎస్పీ తదితర పార్టీలు కూడా ఇంకా అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. -
ఆగని.. లొల్లి!
సాక్షిప్రతినిధి, నల్లగొండ : టీఆర్ఎస్లో అసమ్మతి మంటలు ఇంకా చల్లారడం లేదు. ఉమ్మడి జిల్లాలో ఆరు నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ అధినాయకత్వం ప్రకటించిన టికెట్లపై లొల్లి షురూ అయ్యింది. గులాబీ టికెట్లు దక్కించుకున్న వారి అభ్యర్థిత్వాలను రద్దు చేయాలని, అభ్యర్థులను మార్చాలని డిమాండ్లు మొదలయ్యాయి. ఉమ్మడి జిల్లాలోని పన్నెండు స్థానాల్లో కోదాడ, హుజూర్నగర్ మినహా పది చోట్ల టీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించగా, ఇందులో ఆరు చోట్ల అసమ్మతి తలనొప్పి మొదలైంది. రోజుకో చోట అసమ్మతి నాయకుల భేటీలు, ఆ తర్వాత ర్యాలీలు, సభలు జరుగుతున్నాయి. దీనికి విరుగుడుగా పార్టీ సీనియర్లందరినీ ఒకచోటకు చేర్చే పనిలో అధినాయకత్వం పడింది. దీనికి పార్టీలో ముందు నుంచీ ఉన్న సీనియర్లకే బాధ్యత అప్పజెప్పింది. దీంతో అసమ్మతి నాయకుల సమావేశాలను హైకమాండ్ సీరియస్‌గానే తీసుకుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అసమ్మతికి కౌంటర్‌గా నిర్వహించస్తున్న ఆత్మీయ సమావేశాలకు ప్రాధాన్యం ఏర్పడింది. చల్లారని అసంతృప్తి మంటలు.. మునుగోడులో అభ్యర్థిని మార్చాలని డిమాండ్ చేస్తున్న అసంతృప్త నేతలు ఈ నెల 21వ తేదీన చండూరులో బహిరంగ సభను నిర్వహించను న్నారు. టికెట్ ఆశించి భంగపడిన వేనేపల్లి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఈ సభ జరగనుంది. ఆయన ఆధ్వర్యంలోనే హైదరాబాద్‌లో పార్టీ ముఖ్య కార్యకర్తలు, నాయకులతో సన్నాహక సమావేశం జరిగింది. ఆ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకే చండూరులో సభ జరపాలని నిర్ణయించారు. నియోజకవర్గంలోని ఆరు మండలాల నుంచి జన సమీకరణ జరిపి భారీస్థాయిలో నిర్వహించేలా అడుగులు వేస్తున్నారు. పార్టీ అభ్యర్థిపై నియోజకవర్గంలో ఎంత వ్యతిరేకత ఉందో ఈ సభ ద్వారా అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నామని అసమ్మతి నేతలు చెబుతున్నారు.సోమవారం జిల్లా కేంద్రంలో నల్లగొండ నియోజకవర్గం అసమ్మతి సభ జరగనుంది. పార్టీ అభ్యర్థి కంచర్ల భూపాల్‌రెడ్డిని మార్చకుంటే కాంగ్రెస్ సునాయాసంగా గెలుస్తుందని, పార్టీ నేతలంతా ఒక్కటిగా కలిసి పనిచేయాలంటే సీనియర్లను పరిగణనలోకి తీసుకుని టికెట్ మార్చాలని వీరు డిమాండ్ చేస్తున్నారు. నియోజకవర్గ మాజీ ఇన్చార్జి దుబ్బాక నర్సింహారెడ్డి నేతృత్వంలో నార్కట్‌పల్లిలో ఇప్పటికే సన్నాహక సమావేశం జరిగింది. మరో నాయకుడు చకిలం అనిల్‌కుమార్ శుక్రవారం తిప్పర్తి మండలంలో సొంతంగా ప్రచారం కూడా చేశారు. సోమవారం జరగనున్న అసమ్మతి సభపై పార్టీ పెద్దలు దృష్టిపెట్టి సమాచారం సేకరిస్తున్నారు. నాగార్జునసాగర్‌లో అక్కడి అభ్యర్థి నోముల నర్సింహయ్యను మార్చి స్థానికులకే టికెట్ ఇవ్వాలన్న డిమాండ్ నుంచి అక్కడి అసమ్మతి నాయకులు వెనక్కి తగ్గడం లేదు. పార్టీ కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్న స్థానిక నాయకులను పక్కన పెట్టి స్థానికేతరులను తమ నెత్తిన రుద్దవద్దని వీరు పార్టీ నాయకత్వాన్ని కోరుతున్నారు. ఇక్కడ పార్టీ నేత ఎంసీ కోటిరెడ్డి ఆధ్యర్యంలో పార్టీ శ్రేణులు టికెట్ మార్పుపై గట్టిగా కొట్లాడుతున్నాయి. పార్టీ అగ్ర నాయకత్వం తమకు సానుకూల ఏదో ఒక నిర్ణయం తీసుకుంటుందన్న అభిప్రాయం వీరిలో వ్యక్తం అవుతోంది. అసమ్మతికి కౌంటర్‌గా ఆత్మీయ సమావేశం! పార్టీ నాయకత్వం తెరవెనుక ఉండి అసమ్మతి నేతలకు చెక్‌పెట్టే వ్యూహాలను రచిస్తోంది. ప్రధానంగా నల్లగొండ నియోజకవర్గంలో బహుళ నాయకత్వం ఉండడం, ఏడాది కిందట పార్టీలో చేరిన టీడీపీ నేత కంచర్ల భూపాల్‌రెడ్డితో వీరికి పొసగక పోవడంతో వేరు కుంపటి పెట్టుకున్నారు. ఇందులో పార్టీలో మొదటి నుంచి ఉన్న వారు, మధ్యలో కాంగ్రెస్ నుంచి వచ్చి చేరినవారు, కంచర్ల కంటే ముందే టీడీపీ నుంచి వచ్చి గులాబీ గూటికి చేరిన వారున్నారు. తనతో పాటు పార్టీ మారిన వారికే కంచర్ల ప్రాధాన్యం ఇస్తున్నారన్న అభిప్రాయం బలంగా వ్యక్తం అవుతోంది. దీంతో అభ్యర్థి గట్టున పడాలంటే, అసమ్మతికి చెక్‌పెట్టాలని పార్టీ అగ్రనాయకత్వం ఆలోచించిందని, దానిలో భాగంగానే శనివారం జిల్లా కేంద్రంలో పార్టీ సీనియర్ల ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారని చెబుతున్నారు. ఉమ్మడి జిల్లాకు అధ్యక్షుడిగా పనిచేసిన అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ బండా నరేందర్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ కిషన్‌రెడ్డి పేర పార్టీ శ్రేణులకు ఆహ్వానం కూడా వెళ్లింది. వీరి పేరునే ప్రకటన కూడా జారీ అయ్యింది. అసమ్మతి శిబిరంలో ఉన్న వారందరినీ పార్టీ తమవైపు తిప్పుకునేందుకు ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేసిందని చెబుతున్నారు. మొత్తంగా జిల్లా వ్యాప్తంగా ఇంకా అసమ్మతి మంటలు చల్లారకపోవడం పార్టీ నాయకత్వాన్ని కలవరానికి గురిచేస్తోందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. -
వీడని సస్పెన్స్!
సాక్షి, వికారాబాద్: వికారాబాద్ నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యర్థి ఖరారుపై సస్పెన్స్ కొనసాగుతోంది. కొంతకాలంగా తాజా మాజీ ఎమ్మెల్యే సంజీవరావుకు టికెట్ రాదనే ప్రచారం జోరుగా సాగింది. ఇదే విషయాన్ని నిజం చేస్తూ పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించిన అసెంబ్లీ అభ్యర్థుల జాబితాలో ఎమ్మెల్యేకు చోటు దక్కలేదు. ఈ స్థానాన్ని పెండింగ్‌లో పెట్టిన అధిష్టానం ఇప్పటికీ టికెట్‌ను ఎవరికీ ఖరారు చేయలేదు. దీంతో వికారాబాద్ నుంచి ఎవరు పోటీచేస్తారనే విషయంలో సందిగ్ధం వీడలేదు. ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎవరి పేరు ప్రకటిస్తారోననే ఉత్కంఠ పార్టీ శ్రేణుల్లో రోజురోజుకూ పెరుగుతోంది. ఇదిలా ఉండగా జిల్లా కేంద్రంలో గెలుపు గుర్రాలపై గులాబీ ప్రముఖులు దృష్టిసారించినట్లు సమాచారం. నాకే ఇవ్వాలి... త్వరలో జరిగే ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున పోటీచేసే అభ్యర్థుల జాబితాలో తన పేరు లేకపోవడంతో ఖంగుతిన్న తాజా మాజీ ఎమ్మెల్యే సంజీవరావు మొదటి మూడు రోజుల పాటు స్తబ్దుగా ఉన్నారు. దీంతో ఆయనపై నాయకులు, కార్యకర్తల్లో సానుభూతి వ్యక్తమైంది. జాబితాలో పేరు లేనప్పటికీ ఇతరులకు టికెట్ కేటాయించకపోవడంతో ప్రయత్నాలు ముమ్మరం చేద్దామని అనుచరులు, అభిమానులు పేర్కొనడంతో.. పార్టీలోని ప్రముఖులను కలుస్తూ తనకే అవకాశమివ్వాలని అభ్యర్థిస్తున్నారు. నాలుగు రోజులక్రితం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తన మద్దతుదారులు, పార్టీ నేతలతో సమావేశమై అధిష్టానంపై ఒత్తిడి పెంచాలని తీర్మానించారు. మరుసటి రోజునే సంజీవరావు తన మద్దతుదారులతో కలిసి టీఆర్ఎస్ అగ్రశ్రేణి నేతలు కేటీఆర్, హరీశ్‌రావు, మహేందర్‌రెడ్డి తదితరులను కలిసి విన్నవించారు. పార్టీకి చెందిన నియోజకవర్గ నాయకులంతా తన వెంటే ఉన్నారని, కార్యకర్తల అండదండలు కూడా తనకే ఉన్నాయని ఆయన చెప్పినట్లు సమాచారం. టికెట్ విషయంలో సంజీవరావుకు అధిష్టానం ఇప్పటికీ హామీ ఇవ్వలేదు. గెలుపు గుర్రాల కోసం గులాబీ పార్టీ అన్వేషణ తీవ్రతరం చేసినట్లు వినికిడి. టికెట్ ఎవరికి ఇవ్వాలనే విషయంలో పార్టీ అధిష్టానం మల్లగుల్లాలు పడుతున్నట్లు సమాచారం. ఆశావహుల ప్రయత్నాలు... వికారాబాద్ టీఆర్ఎస్ టికెట్ విషయంలో సస్పెన్స్, థ్రిల్లింగ్ కొనసాగుతుండగా ఆశావహులు తమతమ స్థాయిల్లో పైరవీలు ముమ్మరం చేశారు. దాదాపు ఏడుగురికి పైగానే ఈ స్థానానికి పోటీ పడుతున్నారు. చేవెళ్ల టికెట్ కోసం పోటీపడి భంగపడిన మాజీ ఎమ్మెల్యే రత్నం పేరు కూడా పార్టీ తరఫున ప్రచారంలో ఉన్నప్పటికీ.. తాను టీఆర్ఎస్ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు బుధవారం ప్రకటించారు. మర్పల్లి మండలానికి చెందిన మదుగు రామేశ్వర్ పేరు సైతం వినిపిస్తోంది. ఈయన 1994 నుంచి రాజకీయాల్లో ఉన్నారు. టీడీపీలో పనిచేసిన రామేశ్వర్ 2002లో టీఆర్ఎస్లో చేరి క్రియాశీల రాజకీయాల్లో చురుగ్గా పనిచేస్తున్నారు. టీఆర్ఎస్లో ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. ప్రస్తుతం మర్పల్లి మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఈయన ఇటీవలే స్థానిక నేతలతో వెళ్లి ఆపద్ధర్మ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ నరేందర్‌రెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ సనగారి కొండల్‌రెడ్డిని కలిసి తనకు పోటీచేసే అవకాశం ఇస్తే ఎంతైనా సరే ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నట్లు తెలుస్తోంది. దీంతో అధిష్టానం రామేశ్వర్ పేరును కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం. అదే విధంగా టీఆర్ఎస్ కార్మిక విభాగం నాయకులు భూమనోళ్ల కృష్ణయ్య, స్థానిక వైద్యులు సబితాఆనంద్, విద్యాసాగర్, టి.ఆనంద్, టీచర్ దేవదాస్, కౌన్సిలర్ రమేష్ తదితరులు ఎవరికి తోచిన రీతిలో వారు ప్రయత్నాలు వేగవంతం చేశారు. కాగా పార్టీ టికెట్ ఎవరికి కేటాయించినా గెలిపించడానికి సిద్ధంగా ఉన్నామని, వికారాబాద్‌లో టీఆర్ఎస్ విజయం ఖాయమని గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ సనగారి కొండల్‌రెడ్డి పేర్కొంటున్నారు. అధిష్టానానికి ఇప్పటికే తమ నిర్ణయాన్ని తెలియజేశామని, ఒకటి రెండు రోజుల్లో నిర్ణయం వెలువడే అవకాశముందని ఆయన చెప్పారు. -
నారీ.. సారీ!
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) టికెట్ల కేటాయింపులో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా మహిళలకు మొండిచేయి చూపింది. కనీసం ఒక్కరికి కూడా టికెట్ ఇవ్వకుండా నిరాశ మిగిల్చింది. 2014 ఎన్నికల్లో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో అధికారి పార్టీ ఒక మహిళా అభ్యర్థికి అవకాశం కల్పించగా.. ఈసారి ఆ అభ్యర్థిత్వానికి కూడా కత్తెర పెట్టింది. రాజేంద్రనగర్ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి గత ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి స్వర్ణలతా భీమార్జున్‌రెడ్డి బరిలో నిలిచారు. ఆమెపై టీడీపీ అభ్యర్థి ప్రకాశ్‌గౌడ్ విజయం సాధించారు. అనంతరం రాజకీయ సమీకరణలతో ప్రకాశ్‌గౌడ్‌ను టీఆర్ఎస్ అక్కున చేర్చుకుంది. తాజా ఎన్నికల్లోనూ ఆయనకే టికెట్టును ఖరారు చేసింది. దీంతో స్వర్ణలత ఆశలపై నీళ్లుజల్లినట్లయింది. టికెట్టు కోసం చివరి వరకు ప్రయత్నించినప్పటికీ, సిట్టింగ్ శాసనసభ్యుడు కావడంతో ప్రకాశ్‌ను అదృష్టం వరించింది. ఉమ్మడి జిల్లా పరిధిలో 14 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉండగా.. ఇందులో ఇప్పటివరకు వికారాబాద్, మేడ్చల్, మల్కాజిగిరి మినహా మిగతా నియోజకవర్గాలకు అభ్యర్థులను టీఆర్ఎస్ ప్రకటించింది. వస్తే.. గిస్తే.. మహిళా కోటాలో ఎవరికైనా టికెట్టు ఇవ్వాలని గులాబీ అధినాయకత్వం భావిస్తే కేవలం పెండింగ్ సీట్లలోనే ఇవ్వాల్సివుంటుంది. వికారాబాద్, మేడ్చల్ నియోజకవర్గాల్లో అతివలెవరూ టికెట్టును ఆశించడం లేదు. కేవలం మల్కాజిగిరిలో మాత్రం అల్వాల్ కార్పొరేటర్ విజయశాంతి బరిలో దిగడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే చింతల కనకారెడ్డికి ఈ సారి టికెట్టు ఇవ్వకపోవడంతో ఆయన స్థానంలో విజయశాంతిని సర్దుబాటు చేస్తారనే ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ స్థానం నుంచి పోటీకి గ్రేటర్ హైదరాబాద్ టీఆర్ఎస్ అధ్యక్షుడు మైనంపల్లి హన్మంతరావు తీవ్ర ప్రయత్నాలు సాగిస్తున్నారు. స్థానికుడు కావడం.. గ్రేటర్ అధ్యక్ష హోదాలో టికెట్టు ఖరారు చేయాలని మైనంపల్లి కోరుతుండడంతో అధిష్టానం ఈ సీటుపై ఎటూ తేల్చుకోలేకపోతోంది. మహేశ్వరం సీటు కోసం పట్టుబట్టిన తీగల అనితారెడ్డి తన మామ, సిట్టింగ్ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డికి టికెట్టు ఖరారు కావడంతో మిన్నకుండిపోయారు. కాంగ్రెస్‌లో చెల్లెమ్మనే దిక్కు! మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాత్రమే కాంగ్రెస్‌కు పెద్దదిక్కుగా వ్యవహరిస్తున్నారు. మహిళా కోటాలో కూడా ఆమెకే టికెట్టు ఖరారయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. 2009 వరకు చేవెళ్ల, మహేశ్వరం నియోజకవర్గాల నుంచి ప్రాతినిథ్యం వహించిన ఆమె.. గత ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు. కుమారుడు కార్తీక్‌రెడ్డికి ఎంపీ టికెట్టు కోసం సిట్టింగ్(మహేశ్వరం) స్థానాన్ని త్యజించారు. ఈ సారి మాత్రం మహేశ్వరం నుంచి పోటీ చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. కాంగ్రెస్ తరఫున పోటీ చేసే మహిళ కూడా సబిత ఒక్కరే అయ్యే ఛాన్స్ ఉంది. రాజేంద్రనగర్ సీటుపై గంపెడాశ పెట్టుకున్న మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సదాలక్ష్మి.. తన పేరును పరిశీలించాలని, స్థానికేతరులకు టికెట్టు ఇవ్వకూడదని డిమాండ్ చేస్తున్నారు. కమలంలో సుమతి! భారతీయ జనతా పార్టీలోనూ కేవలం ఒకరిద్దరు ఆశావహులు మాత్రమే ఉన్నారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి ఉప్పరిగూడ మాజీ సర్పంచ్, మహిళా మోర్చా రాష్ట్ర కార్యదర్శి పోరెడ్డి సుమతీ అర్జున్‌రెడ్డి ఉవ్విళ్లూరుతున్నారు. మహిళా కోటాలో తమకు సీటు కేటాయించాలని అధిష్టానానికి విన్నవించుకున్నారు. ఇదే పార్టీ తరఫున మహేశ్వరం నుంచి రాధ ధీరజ్‌రెడ్డి కూడా తెరవెనుక ప్రయత్నాలు సాగిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. వైఎస్సార్ కాంగ్రెస్ నుంచి అమృతాసాగర్ ఇబ్రహీంపట్నం అసెంబ్లీ సెగ్మెంట్‌కు పోటీచేయడానికి పావులు కదుపుతున్నారు. కాగా, పార్టీకి ఒకరిద్దరు తప్ప ఆశావహులు కూడా లేకపోవడంతో మహిళల ప్రాతినిథ్యం చెప్పుకోదగ్గ స్థాయిలో లేకుండా పోయింది. -
ఉద్యోగం వదిలి ఉద్యమించినా టికెట్ ఇవ్వలేదు
ములుగు (వరంగల్): ‘తెలంగాణ రాష్ట్రం కోసం టీఆర్ఎస్ చేపట్టిన ఉద్యమంలో తొలి నుంచి భాగస్వామినై పోరాడాను. 2003 నుంచి పరోక్షంగా ఉద్యమంలో పాల్గొన్నా. ఉద్యమ స్ఫూర్తితో 2004లో నా టీచర్ ఉద్యోగానికి రాజీనామా చేసి పూర్తి స్థాయిలో పాల్గొన్నా. 2004 ఎన్నికల్లో టికెట్ అడిగినా టీఆర్ఎస్, కాంగ్రెస్ పొత్తుతో పొదెం వీరయ్యకు టికెట్ కేటాయించారు. 2009లో టీడీపీతో పొత్తు కారణంగా సీతక్కకు సీటు దక్కింది. అయినా పార్టీ ఉన్నతికి పాటుపడుతూనే ఉన్నా. శ్రమను గుర్తించి ఎన్నికల్లో టికెట్ కేటాయిస్తారని ఆశించినా ఫలితం దక్కకపోవడం బాధగా ఉంది’ అని టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, అబ్బాపురం ఎంపీటీసీ సభ్యుడు పోరిక గోవింద్‌నాయక్ తన ఆవేదనను వెలిబుచ్చారు. సోమవారం తన స్వగృహంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. టీఆర్ఎస్ను గ్రామ స్థాయిలో జెడ్పీటీసీ మాజీ సభ్యుడు బేతెల్లి గోపాల్‌రెడ్డి, మాజీ ఎంపీపీ నల్లెల్ల కుమారస్వామి, జలగం మోహన్‌రావుతో కలిసి బలోపేతం చేశామని, అప్పటి నుంచి రూ.50 లక్షల నుంచి 60 లక్షలను ఖర్చు చేశానన్నారు. ఆ తర్వాత ఆర్థికంగా చతికిలపడ్డానని ఆవేదన వ్యక్తం చేశారు. తన కు తగిన గుర్తింపు దక్కలేదని వాపోయారు. 20 14లో టికెట్ ఆశించినా టీఆర్ఎస్ తరఫున అజ్మీ రా చందూలాల్‌కు టికెట్ కేటాయించారని తెలి పారు. అయినా వెనుకడుగు వేయకుండా ముందుకు సాగినట్లు తెలిపారు. మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిని ఆశించినా చందూలాల్ కుమారుడు ప్రహ్లాద్‌కి ఇచ్చారని గుర్తు చేశారు. కేసీఆర్ దగ్గరికి వెళ్లడానికి ప్రయత్నించినా ఏ ఒక్కరూ సహకరించలేదని వాపోయారు. మళ్లీ చందూలాల్కి టికెట్ కేటాయించ డం బాధ కలిగించిందన్నారు. ఈ విషయాన్ని ప్రజలు గుర్తించాలని కోరారు. ఇప్పటికైనా అధిష్టానం తన గత పోరాటాలు, త్యాగాన్ని గుర్తిం చి ములుగు టికెట్ విషయంలో తన అభ్యర్థనను పరిశీలించాలని కోరారు. -
‘టీజేఏస్‌లో టికెట్ల అమ్మకం’
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ జనసమితిలో పార్టీ టికెట్లను అమ్ముకుంటున్నారని ఆ పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు తిరునగరి జ్యోత్స్న ఆరోపించారు. సోమవారం హైదరాబాద్‌లో మాట్లాడుతూ.. టికెట్ల అమ్మకాన్ని, వసూళ్ల వ్యవహారాన్ని మాజీ ఎమ్మెల్సీ దిలీప్‌కుమార్ నడుపుతున్నారని ఆరోపించారు. టీజేఎస్ రాజకీయపార్టీగా కాకుండా, వ్యాపార సంస్థగా నడస్తోందని విమర్శించారు. పార్టీ టికెట్ ఇవ్వకపోవడంతోనే పార్టీని వీడుతున్నట్లు వార్తలు రాయించారని, అది సరికాదన్నారు. టీజేఎస్‌లో దిలీప్‌తో పాటు మరో ఆరుగురు నేతలు వసూళ్లకు పాల్పడుతున్నారన్నారు. దిలీప్‌కుమార్‌కు రూ.2 లక్షలు ఇచ్చానని, దీనికి ఆధారాలు ఉన్నాయని పేర్కొన్నారు. టీజేఎస్ ప్రాథమిక సభ్యత్వానికి, పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. టికెట్లే ఖరారు కాలేదు: దిలీప్‌కుమార్ టికెట్లను పార్టీ ఇంకా ఖరారు చేయలేదని, డబ్బుల వసూళ్లంటూ ఆరోపణలు చేయడం సరికాదని టీజేఎస్ నేత దిలీప్‌కుమార్ అన్నారు. పార్టీ అవసరాలకోసం ఒక ఎన్ఆర్ఐ నుంచి 1.8 లక్షలు తనకు అందిన విషయం వాస్తవమేనని, వాటికి సంబంధించిన అన్ని లెక్కలు తన దగ్గర ఉన్నాయన్నారు. -
తెలంగాణ ‘కల్వకుంట్ల’ ఇల్లు కాదు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కల్వకుంట్ల వారి ఇల్లు కాదని... అలా మార్చాలనుకుంటే ప్రజలు ఊరుకోరని కేసీఆర్ కుటుంబంపై మాజీ మంత్రి కొండా సురేఖ మండిపడ్డారు. టీఆర్ఎస్ నుంచి తమను పొమ్మనలేక పొగబెడుతున్నారని, మంత్రి కేటీఆరే తనకు ఎమ్మెల్యే టికెట్ ఆపారని ఆరోపించారు. 105 మంది అభ్యర్థులతో టీఆర్ఎస్ ప్రకటించిన ఎన్నికల జాబితాలో నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తన పేరు లేకపోవడం ఆవేదన కలిగించిందన్నారు. దీని పై టీఆర్ఎస్ రెండు రోజుల్లో సమాధానం చెప్పాలని లేకుంటే బహిరంగ లేఖ రాసి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానన్నారు. తన భర్త, ఎమ్మెల్సీ కొండా మురళీధర్‌రావుతో కలసి కొండా సురేఖ శనివారం హైదరాబాద్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బీసీ మహిళను ఇలా అవమానిస్తారా? ‘గత ఎన్నికల్లో 55 వేల మెజారిటీతో గెలిచిన నన్ను టీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాలో ప్రకటించకపోవడం బాధ కలిగించింది. బీసీ మహిళనైన నన్ను ఇలా పక్కనపెట్టి పార్టీ నన్ను అవమానపరిచింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మొత్తం 12 స్థానాల్లో 11 నియోజకవర్గాల అభ్యర్థులను ప్రకటించి నా పేరు ప్రకటించకపోవడానికి కారణం చెప్పాలని టీఆర్ఎస్ను అడుగుతున్నా. గత ఎన్నికల్లో పరకాల నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలనుకుంటే టీఆర్ఎస్ పదేపదే మాకు వర్తమానాలు పంపి మాతో సంప్రదింపులు జరిపింది. పరకాల సీటు ఇస్తేనే వస్తామని చెప్పినా మీరు తప్పితే బస్వరాజు సారయ్యను ఎవరూ ఓడించలేరని చెప్పి కేసీఆర్ మా మీద ఒత్తిడి తెచ్చి వరంగల్ తూర్పు నుంచి నిలబడాలన్నారు. నాకు మంత్రి పదవి, కొండా మురళీకి ఎమ్మెల్సీ ఇస్తానని హామీ ఇచ్చారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక జిల్లాలో జరిగిన వివిధ ఎన్నికల్లో సొంత డబ్బుతోనే ప్రచారం చేశాం. కేసీఆర్ సూచన మేరకు వరంగల్ జిల్లా పరిషత్ చైర్మన్ పదవి టీఆర్ఎస్కు వచ్చేందుకు కాంగ్రెస్ క్యాంపులోని ముగ్గురు జెడ్పీటీసీ సభ్యులను మురళి తీసుకొచ్చారు. క్రమశిక్షణగల కార్యకర్తలుగా పార్టీ అభివృద్ధి కోసమే పని చేశాం. ఒక్క మహిళకూ మంత్రి పదవి ఇవ్వని ప్రభుత్వంగా టీఆర్ఎస్ సర్కారు చరిత్రలో నిలిచిపోయింది. బీసీలను ముఖ్యంగా తెలంగాణ మహిళలను అవమానపరిచారు. మహిళలు లేకుండా తెలంగాణ వచ్చిందా? మహిళల పోరాటంతోనే ఉద్యమం ఉధృతమైంది. మహిళలకు అన్యాయం చేయడం ఎంతవరకు సబబు. ఆరుగురు మహిళా ఎమ్మెల్యేల్లో ఎస్సీ, బీసీ మహిళలం అయిన బొడిగె శోభ, నాది ఆపారు. బాబూమోహన్, నల్లాల ఓదెల వంటి ఎస్సీలకు ఎందుకు అన్యాయం చేస్తున్నారు. దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత టీఆర్ఎస్పై ఉంది’అని కొండా సురేఖ డిమాండ్ చేశారు. అందరి సర్వే రిపోర్టులు బయట పెట్టాలి... గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన సారయ్యను, టీఆర్ఎస్కు వ్యతిరేకంగా పని చేసిన సుధారాణిని, తమకు వ్యతిరేకంగా ఉండే ఎర్రబెల్లి దయాకర్‌రావును టీఆర్ఎస్లోకి తీసుకునేటప్పుడు పార్టీ చెప్పలేదని కొండా సురేఖ ఆరోపించారు. తాము పార్టీ గుర్తుపై గెలిచామని, కానీ టీడీపీ నుంచి వచ్చిన ఎర్రబెల్లి ఎందుకు తీపి అయ్యాడని ప్రశ్నించారు. టికె ట్లు ఇచ్చిన అందరి సర్వే రిపోర్టులను బహిర్గతం చేయాలని, 105 మంది అభ్యర్థులకూ పార్టీ తరపున బీఫామ్ ఇస్తామని ప్రకటించాలని డిమాండ్ చేశారు. నేనే పోటీ చేస్తానని చెప్పినా... రెండు సీట్లు అడిగినందుకే తన పేరు ప్రకటించలేదని టీఆర్ఎస్ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని కొండా సురేఖ విమర్శించారు. రెండు రోజుల ముందు కేటీఆర్ తనకు ఫోన్ చేశారని, పరకాల, భూపాలపల్లి, వరంగల్ తూర్పు సీట్లను ఆశిస్తున్న తమకు భూపాలపల్లి సీటు కుదరని సీఎం చెప్పమన్నారని కొండా సురేఖ వివరించారు. ‘మీరు నిలబడతారా? మీ పాప నిలబడతారా’అని కేటీఆర్ అడగ్గా తానే పోటీ చేస్తానని క్యాంపు ఆసీసుకు వెళ్లి సంతోష్‌కు చెప్పడంతోపాటు అక్కడి నుంచే కేటీఆర్‌కు వాట్సాప్ చేశానన్నారు. కానీ ఈ రోజు తననే బదనాం చేస్తున్నారని, రెండు అడిగి ఒక్కటీ తీసుకోలేదని చెబుతున్నారని ఆరోపించారు. తాము ఏమి చేస్తున్నామో, ఎక్కడ ఉన్నామో తెలుసుకునేందుకు ఫోన్లు టాప్ చేయడం, ఇంటెలిజెన్స్ నివేదికలు తెప్పించుకోవడం వంటివి చేశారని విమర్శించారు. తాము పార్టీ నుంచి వెళ్లాలనుకుంటే బహిరంగంగా లేఖ రాసి కారణాలు చెప్పి నిర్ణయం తీసుకుంటామన్నారు. కేటీఆర్ కోటరీ తయారు చేసుకుంటున్నారు... టీఆర్ఎస్ జాబితా వచ్చాక కేటీఆర్, హరీశ్‌రావు, సంతోష్‌లకు ఫోన్లు చేస్తే ఎత్తలేదని కొండా సురేఖ చెప్పుకొచ్చారు. హరీశ్‌రావుకు తాము పార్టీ లోకి రావడం ఇష్టంలేకున్నా అన్ని విధాలుగా అం డగా నిలిచారని, కానీ పార్టీలోకి తమను తీసుకుకొచ్చిన కేసీఆర్ మాత్రం తమ వెంట ఎప్పుడూ లేరన్నారు. నియోజకవర్గంలో తమకు వ్యతిరేకంగా కేటీఆర్ పది మందిని తయారు చేశారని, తమకు టికెట్ రాకుండా చేసింది ఆయనేనని ఆరోపిం చారు. ఎంపీ బాల్క సుమన్, ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డికి మాత్రం ఎమ్మెల్యే టికెట్లు ఖరారు చేసి ఒక కోటరీని తయారు చేసుకుంటున్నారని సురేఖ దుయ్యబట్టారు. మళ్లీ అధికారంలోకి వస్తే వారిని మంత్రులను చేసుకుని తెలంగాణను ఆగం చేసుకునేందుకు టీమ్‌ను తయారు చేసుకుంటున్నారని మండిపడ్డారు. తాము స్వత్రంగానైనా పోటీ చేస్తామని, రెండు చోట్ల, అవసరమైతే మూడు చోట్ల పోటీ చేస్తామన్నారు. -
రేణుక మోసం చేశారని గాంధీభవన్ ఎదుట ధర్నా
ఖమ్మంసహకారనగర్ : కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరి తన భర్త రాంజీకి గత సాధారణ ఎన్నికలప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున వైరా ఎమ్మెల్యే టిక్కెట్ ఇప్పిస్తానని కోటీ 20లక్షలు తీసుకున్నారని, టికెట్ రాలేదని తన భర్త మరణించారని, ఆ డబ్బును వెనక్కి ఇచ్చి న్యాయం చేయాలని కోరుతూ రాంజీ భార్య కళావతి శుక్రవారం హైదరాబాద్ గాంధీభవన్ ఎదుట ధర్నా చేశారు. గిరిజన సంఘం నాయకులతో కలిసి ఆందోళన చేశారు. ఈ సందర్భంగా కళావతి, గిరిజన సంఘం నాయకుడు రవిచంద్ర చౌహాన్లు మాట్లాడుతూ..2014లో వైరా టిక్కెట్ ఇస్తామని చెప్పి డబ్బులు తీసుకుని..టిక్కెట్ ఇవ్వకుండా మోసం చేశారని ఆరోపించారు. రాంజీ చనిపోతే కనీసం చూడ్డానికి కూడా రాలేదని, తీరా ఇంటికి వెళ్తే కేసులు పెట్టించారని ఆరోపించారు. నాలుగేళ్లు గడుస్తున్నా తమకు న్యాయం జరగట్లేదని, ఈ నెల 14వ తేదీన రాహుల్ గాంధీని కలిసి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. అనంతరం ఢిల్లీలో కూడా ధర్నా చేస్తామని వెల్లడించారు. ఏఐసీసీ కార్యదర్శికి, టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి వినతిపత్రాలు అందజేశారు. ఇన్ని సంవత్సరాలుగా వివిధ దశల్లో పోరాడామని, అయినా స్పందించకపోవడం రేణుకకు తగదని, తమ డబ్బును వెనక్కిప్పించాలని కోరారు. -
రేణుకా చౌదరిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి
ఖమ్మం, మామిళ్లగూడెం : డాక్టర్ రాంజీనాయక్ మరణానికి కారకురాలైన మాజీ మంత్రి రేణుకచౌదరిని కాంగ్రేస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని ఎల్‌హెచ్‌పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కేలోతు రవిచంద్రచౌహాన్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఖమ్మం ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైరా, ఇల్లందు నియోజకవర్గాలలో ఎమ్మెల్యే సీటు ఇప్పిస్తానని, ఒక్కొక్క సీటుకు ఐదుగురు పోటీ పడేవిధంగా చేసి, మాయమాటలతో రూ.కోటి పై చిలుకు తీసుకొని సీటు ఇవ్వకుండా మోసంచే చేశారని ఆరోపించారు. దీంతో మనస్తాపానికి గురైన రాంజీనాయక్ చనిపోయారని అన్నారు. అతని భార్య పిల్లలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని, తీసుకున్న డబ్బు అతని భార్యా పిల్లలకు ఇప్పించాలని డిమాండ్ చేశారు. పార్టీ పెద్దలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జానారెడ్డి, కుంతియా, భట్టి విక్రమార్క, దిగ్విజయ్‌సింగ్‌ను కలిసి వినతులు అందించినప్పటికీ ఫలితం లేకుండా పోయిందన్నారు. కాంగ్రెస్ పార్టీ పెద్దలు రాంజీ కుటుంబానికి న్యాయం చేయని పక్షాన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను కలుపుకొని రానున్న ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను ఓడించేందుకు ఇంటింటి ప్రచారం చేపడతామని హెచ్చరించారు. విలేకరుల సమావేశంలో సంఘ నాయకులు భీమానాయక్,మైనార్టీ నాయకురాలు నజీమా తదితరులు పాల్గొన్నారు. -
రాహుల్ ఇంటి ముందు దీక్ష చేస్తా
హైదరాబాద్ : తన భర్తకు వైరా ఎమ్మెల్యే టిక్కెట్ ఇస్తానని చెప్పి నమ్మించి, రూ.కోటి 20 లక్షలు తీసుకుని టిక్కెట్ ఇప్పించకపోగా తీవ్ర మానసిక వేదనతో చనిపోయేలా చేసిన కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరిపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ పెద్దలను ఖమ్మం జిల్లాకు చెందిన కళావతి డిమాండ్ చేశారు. గురువారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశంలో బంజారా, లంబాడ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు కోళోత్ రవిచంద్ర చౌహాన్‌తో కలిసి పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ.. తన భర్త డాక్టర్ భూక్యా రాంజీ, ఖమ్మంలో శ్రీ హర్షిణి నర్సింగ్‌హోం సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్వహిస్తూ పేదలకు, గిరిజనులకు ఎంతో సేవ చేశారని చెప్పారు. ప్రజల్లో మంచి పేరున్న తన భర్తకు 2014 ఎన్నికల్లో ఖమ్మం జిల్లా వైరా ఎమ్మెల్యే టిక్కెట్ ఇప్పిస్తానని నమ్మబలికి కోటీ 20 లక్షలను రేణుకాచౌదరి తీసుకున్నారని, వివిధ సమావేశాల నిర్వహణకు మరో కోటి వరకు అదనంగా ఖర్చు చేయించారని చెప్పారు. టిక్కెట్ ఇప్పించకపోగా, ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలని అడిగితే కులం పేరుతో దూషించారని, గన్‌మెన్‌తో బయటకు వెళ్లగొట్టించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మనో వేదనతోనే తన భర్త మృతిచెందారని చెప్పారు. ఆ తరువాత పలు మార్లు గిరిజన సంఘాల నాయకులతో, స్థానికులతో కలిసి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ముందు ధర్నా చేసినట్టు చెప్పారు. పోలీసులను ఆశ్రయించడంతో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారని, రాజకీయ ఒత్తిడితో దానిని నిర్వీర్యం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో తాను న్యాయస్థానాన్ని ఆశ్రయించినట్టు చెప్పారు. కేసును రీఓపెన్ చేసి విచారించాలని గత నెల 6న కోర్టు ఆదేశించిందన్నారు. తనకు జరిగిన అన్యాయంపై ఎన్నోసార్లు కాంగ్రెస్ పెద్దలు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, జానారెడ్డి, మల్లు భట్టు విక్రమార్క, కుంతియాకు వివరించినట్టు చెప్పారు. వారు ఏమాత్రం పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రేణుకాచౌదరిని పార్టీ నుంచి సస్పెండ్ చేసి, తాము మోసపోయిన నగదును వెంటనే ఇప్పించాలని కోరారు. ప్రస్తుతం ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ తన పిల్లలని సాదుకుంటున్నానని అన్నారు. ఇప్పటికైనా తనకు న్యాయం చేయకపోతే ఖమ్మం కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఎదురుగా, హైదరాబాద్ గాంధీభవన్ ఎదురుగా ధర్నా చేస్తానన్నారు. అప్పటికీ స్పందించకపోతే, ఢిల్లీలోని రాహుల్ గాంధీ ఇంటి ఎదురుగా దీక్ష చేస్తానని హెచ్చరించారు. ఢిల్లీలో రాహుల్‌గాంధీ ఇంటి ముందు ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని హెచ్చరించారు. బంజారా లంబాడ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు కేళోత్ రవిచంద్ర చౌహాన్ మాట్లాడుతూ .. గిరిజనులు, లంబాడీలు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంటారని చెప్పారు. కేవలం రేణుకాచౌదరి కారణంగా గిరిజనులను కాంగ్రెస్ పార్టీ దూరం చేసుకోవడం సరికాదన్నారు. రేణుకాచౌదరిని పార్టీ నుంచి వెంటనే సస్పెండ్ చేసి, బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేనట్టయితే, ఇంటింటికీ తిరిగి కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తామని, తండాల్లోకి ఆ పార్టీ నాయకులను రానివ్వబోమని, అన్ని గిరిజన సంఘాలతో కలిసి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. -
వచ్చే ఎన్నికల్లో జమ్మలమడుగు టికెట్ నాదే
వైఎస్సార్ జిల్లా : జమ్మలమడుగులో రాజకీయం వేడెక్కుతోంది. టీడీపీ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి వ్యాఖ్యలకు మంత్రి ఆదినారాయణ రెడ్డి శుక్రవారం కౌంటర్ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో జమ్మలమడుగు అసెంబ్లీ టిక్కెట్ తనదేనంటూ మంత్రి ఆదినారాయణ రెడ్డి కుండబద్దలు కొట్టి చెప్పారు. తాను ఎమ్మెల్యేగా, మంత్రిగా సీనియర్ నాయకుడినని చెప్పారు. ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి మంత్రి ఆదినారాయణరెడ్డిపై ఈ నెల 2న తనదైన శైలిలో విరుచుకుపడిన సంగతి తెల్సిందే. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జిల్లాలో ఎమ్మెల్యే టికెట్లు ప్రకటించడానికి ఆదినారాయణ రెడ్డి ఎవరని ప్రశ్నించారు . ‘జమ్మలమడుగులో పోటీ చేసేది తానేనని ఆదినారాయణరెడ్డి ఎలా ప్రకటిస్తారు? ఎమ్మెల్సీ ఇచ్చే సమయంలో సీఎం చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశాలు లేకపోలేదని హామీ ఇచ్చారు. ఎన్టీఆర్ హయాం నుంచి టీడీపీలో టికెట్స్ ప్రకటించే హక్కు మంత్రులకు, జిల్లా అధ్యక్షులకు లేదు. పార్టీ క్రమశిక్షణకు తూట్లు పొడుస్తున్నారు. లేని పోనీ ప్రకటనలు చేసి నియోజకవర్గంలో వర్గపోరు పెంచుతున్నారు’ అని ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి వ్యాఖ్యానించిన సంగతి తెల్సిందే. ఇద్దరూ పరస్పరం బహిరంగ వ్యాఖ్యలు చేసుకోవడంతో అదిష్టానానికి కూడా ఎవరికి టికెట్ కేటాయించాలో పాలుపోవడం లేదు. గత ఫ్యాక్షన్ గొడవలతో ఇద్దరూ ఒకరికొకరు సహకరించుకునే పరిస్థితి ప్రస్తుతం లేదు. -
స్థానికులకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలి
తుంగతుర్తి : స్థానిక పరిస్థితులపై అవగాహన ఉన్న స్థానిక నాయకులకే ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని ఎంఎస్ఎఫ్ నియోజకవర్గ ఇన్చార్జ్ తడకమల్ల రవికుమార్ కోరారు. శనివారం మండల కేంద్రంలో ఆయన విలేకరులో మాట్లాడారు. స్థానికేతరులకు టికెట్ ఇస్తే వారు నియోజకవర్గంపై అవగాహనలేక అభివృద్ధికి కృషి చేయడంలేదని అన్నారు. ఈ సమావేశంలో ఎంఎస్ఎఫ్ నాయకులు కొండగడ్పుల శ్రీకాంత్, రాంబాబు, నరేష్, వెంకటేష్, సురేష్, పరశురాములు, శ్రీను, మహేష్ పాల్గొన్నారు. -
అధికార పార్టీ నేతల్లో అప్పుడే సర్వే గుబులు
సాక్షి ప్రతినిధి, కర్నూలు: అధికార పార్టీ నేతల్లో అప్పుడే సర్వే గుబులు మొదలయ్యింది. కర్నూలు ఎమ్మెల్యే టికెట్ తెలుగుదేశం పార్టీ నుంచి ఎవరికిస్తే బాగుంటుందో తెలపాలని ఐవీఆర్ఎస్ (ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్) ద్వారా ఓటర్ల నుంచి తెలుసుకుంటుండడం చర్చనీయాంశమైంది. గురు, శుక్రవారాల్లో కర్నూలు నగరంలోని ఓటర్లకు హైదరాబాద్‌లోని 9140–38119985 నంబరు నుంచి ఫోన్లు వచ్చాయి. టీడీపీ నుంచి ఎమ్మెల్యే టికెట్ టీజీ భరత్‌కు ఇవ్వాలనుకుంటే ఒకటి నొక్కండి... ఎస్వీ మోహన్ రెడ్డికి అయితే రెండు నొక్కండంటూ ఫోన్లు రావడం గమనార్హం. రిలయన్స్‌కు చెందిన ఈ ల్యాండ్‌లైన్ నంబరు అడ్రెస్ మాత్రం ‘ట్రూ కాలర్’లో అపోలో క్లినిక్‌కు చెందినదిగా చూపిస్తుండడం గమనార్హం. మొత్తమ్మీద సమయం, సందర్భం లేకుండా ఈ సర్వే చేపట్టడం చర్చనీయాంశమైంది. సీటు నాదంటే..నాదే! కర్నూలు ఎమ్మెల్యే సీటు విషయంలో అధికార పార్టీలో అప్పుడే గొడవ మొదలయ్యింది. సీటు నాదంటే నాదే అంటూ అటు ఎస్వీ మోహన్ రెడ్డి, ఇటు టీజీ భరత్ చెప్పుకుంటున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా తనకే వస్తుందని ఎస్వీ మోహన్‌రెడ్డి.. తాను లోకల్ కావున అవకాశం దక్కుతుందని భరత్ అంటున్నారు. అంతేకాకుండా సర్వేలో ఎవరు గెలుస్తారని తేలితే వారికే టికెట్ దక్కుతుందని భరత్ ముక్తాయించారు. మరోవైపు ఎస్వీ మోహన్‌రెడ్డి తాను మాత్రం టీడీపీ నుంచే పోటీ చేస్తానని, భరత్ ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారో తనకు తెలియదని పేర్కొనడంతో చర్చ మరింత ఆసక్తికరంగా మారింది. ఇదే నేపథ్యంలో తాజాగా సర్వే జరగడంతో మరోసారి సీటు విషయం చర్చనీయాంశమయ్యింది. ఇదిలావుండగా.. సర్వేలో టీజీ భరత్‌కు అయితే ఒకటి నొక్కండి... ఎస్వీ మోహన్ రెడ్డికి అయితే రెండో నంబరు నొక్కండని పేర్కొనడంపై ఎస్వీ వర్గీయులు మండిపడుతున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే ఆప్షన్‌కు రెండో నంబరు ఇవ్వడం ఏంటని వాపోతున్నారు. సర్వే చేస్తోంది ఎవరు? ఇప్పటికిప్పుడే అసెంబ్లీ ఎన్నికలు లేవు. ఏడాదికిపైగా సమయం ఉంది. అయినప్పటికీ ఇప్పుడే సర్వే నిర్వహించడంపై అధికార పార్టీలోనే అనేకానేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇంతకూ అపోలో క్లినిక్‌కు చెందిన ఈ నంబరు నుంచి సర్వే చేయడం ఏమిటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా సర్వే ద్వారానే ఎవరు పోటీ చేస్తారనే అంశాన్ని అధిష్టానం నిర్ణయిస్తుందన్న టీజీ భరత్ వ్యాఖ్యల నేపథ్యంలో ఈ సర్వే జరగడం మరింత చర్చనీయాంశమవుతోంది. ఇప్పటికే కర్నూలు నియోజకవర్గంలోని పార్టీ పదవులన్నీ ఎస్వీ మోహన్‌రెడ్డి వర్గానికే దక్కాయి. ఈ పరిస్థితుల్లో ఈ సర్వే జరగడం కూడా మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ఏదిఏమైనా సర్వే నేపథ్యంలో ఎవరి బలమేమిటో తెలిసిపోనుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
టీడీపీలో టిక్కెట్ల పోరు
సాక్షి ప్రతినిధి, కడప: వైఎస్సార్సీపీ కంచుకోట అయిన జిల్లాలో గట్టి పోటీ అయినా ఇవ్వాలని ఉవ్విళ్లూరుతున్న టీడీపీ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు గత ఎన్నికల్లో పోటీ చేసిన వారందరి స్థానంలో కొత్తవారిని బరిలోకి దించే ప్రయోగం చేయబోతున్నట్లు తెలిసింది. 2014 ఎన్నికల్లో టీడీపీ గెలిచిన రాజంపేటతో పాటు ఆ పార్టీ ఓటమి చెందిన మిగిలిన 9 స్థానాల్లో కూడా పాతవారిని పక్కన పెట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పార్టీలో నలుగుతున్న అంతర్గత కలహాలు, కొన్ని నియోజకవర్గాల్లో గట్టిగా పనిచేసే వారు లేకపోవడం లాంటి అంశాలను ఇందుకు అనుకూలంగా మలుచుకోవడానికి నిఘా విభాగం నుంచి నివేదికలు తెప్పించుకుంటున్నారు. దీంతో పాటు శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీకి చెందిన విద్యార్థుల బృందం పలువురు నాయకుల అభ్యర్థిత్వాల గురించి జనాభిప్రాయం సేకరించే పనిలో పడ్డారు. దీంతో జిల్లాలో టీడీపీ నేతల మధ్య రాబోయే ఎన్నికల కోసం అప్పుడే టిక్కెట్ల పోరు ప్రారంభమైంది. మార్పుచేర్పులు ఇలా.. ⇔ జమ్మలమడుగు నుంచి పోటీచేసిన పి. రామసుబ్బారెడ్డి రాబోయే ఎన్నికల్లో కూడా శాసనసభకు పోటీ చేయాలని కోరుకుంటున్నారు. వైఎస్సార్సీపీ నుంచి పార్టీ ఫిరాయించి మంత్రి అయిన ఆదిని ఇక్కడి నుంచి పోటీ చేయించడానికి సీఎం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ఈ రెండు వర్గాలు కలసి పనిచేసేలా చేయడం కోసమే రామసుబ్బారెడ్డికి ఎమ్మెల్సీ ఇచ్చారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఆది విజయం కోసం పీఆర్ మద్దతుదారులు పనిచేసే ప్రసక్తే ఉండదని, ఇది విఫల ప్రయోగమే అవుతుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ⇔ బద్వేలులో టీడీపీ ముఖ్య నేతలుగా వ్యవహరిస్తున్న ఎమ్మెల్యే జయరాములు, మాజీ ఎమ్మెల్యే విజయమ్మ, గత ఎన్నికల్లో పోటీ చేసిన విజయజ్యోతి మూడు దారులుగా ఉన్నారు. ఒకరితో ఇంకొకరికి ఏ మాత్రం పొసగడం లేదు. దీంతో ఇక్కడ పార్టీ పరిస్థితి దారుణంగా తయారైందని టీడీపీ అధిష్టానం గుర్తించింది. ఈ కారణంతో రాబోయే ఎన్నికల్లో కొత్త అభ్యర్థిని బరిలోకి దించాలని వెదుకులాట ప్రారంభించింది. ⇔ మైదుకూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసిన పుట్టా సుధాకర్‌యాదవ్‌ను తప్పించి మాజీమంత్రి డీఎల్ రవీంద్రరెడ్డిని బరిలోకి దించడం దాదాపు ఖాయమైందని పార్టీ ముఖ్యనేతలు చెబుతున్నారు. డీఎల్‌కు బాబు టిక్కెట్ హామీ ఇచ్చారని, అందువల్లే పుట్టాను నామినేటెడ్ పదవితో శాంతపరచే ఆలోచన జరుగుతోందని టీడీపీ నేతలు చెబుతున్నారు. రాబోయే ఎన్నికల్లో కూడా తానే పోటీలో ఉంటానని పుట్టా చెబుతున్నప్పటికీ ఆయన ఆశ నెరవేరే అవకాశాలు మాత్రం కనిపించడం లేదు. ⇔ కడపలో టీడీపీకి బలమైన అభ్యర్థే కనిపించడం లేదు. గత ఎన్నికల్లో రెబల్‌గా బరిలోకి దిగిన దుర్గాప్రసాద్‌ను పార్టీ సస్పెండ్ చేసినా పార్టీతో ఆయన అనుబంధం కొనసాగిస్తూనే ఉన్నారు. ఈసారి ఎన్నికల్లో టీడీపీ అధికారిక అభ్యర్థిగా బరిలోకి దూకాలని ఉత్సాహపడుతున్నారు. అయితే ఈ స్థానం నుంచి తమకు అవకాశం ఇవ్వాలని పార్టీ నాయకుడు హరిప్రసాద్, మైనారిటీ కోటాలో తనకు చాన్స్ ఇవ్వాలని సుభాన్‌బాషా విన్నవించుకుంటున్నారు. వీరి వల్ల ఉపయోగం లేదని, కొత్త అభ్యర్థిని అన్వేషించాలని టీడీపీ నాయకత్వం భావిస్తోంది. ⇔ రాజంపేటలో ఎమ్మెల్యేగా గెలిచిన మేడా మల్లికార్జునరెడ్డికి ఈ సారి టిక్కెట్ అనుమానమేనని చాలాకాలంగా ప్రచారం జరుగుతోంది. ఈ స్థానం నుంచి బలిజ సామాజికవర్గాన్ని పోటీ చేయించాలని పార్టీ నిర్ణయించినట్లు నాయకులు చెబుతున్నారు. ఈ కోటాలో ఇప్పటికే ఇద్దరు, ముగ్గురు నాయకులు టిక్కెట్ కోసం ప్రయత్నాల్లో ఉన్నారు. ⇔ రైల్వేకోడూరు నుంచి పోటీచేసి ఓడిన ఓబిలి సుబ్బరామయ్య ఎన్నికల తర్వాత పార్టీ వ్యవహారాల్లో కనిపించకుండానే పోయారు. దీంతో ఈసారి ఎన్నికలకు కొత్త అభ్యర్థిని చూడాలని నాయకత్వం భావిస్తోంది. అయితే ఎప్పటి నుంచో ఇక్కడ పార్టీ వ్యవహారాలు చూస్తున్న విశ్వనాథనాయుడు, ఇటీవలే పార్టీలో చేరిన ఎమ్మెల్సీ బత్యాల తమ వర్గీయుడిని అభ్యర్థిగా చేసుకునే రాజకీయం చేస్తున్నారు. ⇔ కమలాపురంలో పోటీ చేసి ఓడిపోయిన పుత్తా నరసింహారెడ్డికి ఈసారి టిక్కెట్ దక్కదని పార్టీలో ప్రచారం జరుగుతోంది. మాజీ ఎమ్మెల్యే జి.వీరశివారెడ్డిని పోటీకి దించితే గానీ అక్కడ గట్టి పోటీ ఇవ్వలేమనే అభిప్రాయంతోనే పార్టీ ఈ ఆలోచన చేస్తోందనే వాదన వినిపిస్తోంది. ఇందుకు తగ్గట్టుగానే వీరశివారెడ్డి ఇటీవల మీడియా స మావేశం ఏర్పాటు చేసి తాను ప్రజల్లోనే ఉంటానని, టిక్కె ట్ ఇస్తే పోటీ చేస్తానని ప్రకటించడం పుత్తా అవకాశాలను దెబ్బతీయడమేననే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ⇔ రాయచోటి నుంచి ఎన్నికల్లో పోటీచేసిన మాజీ ఎమ్మెల్యే ఆర్.రమేష్‌రెడ్డికి మాజీ ఎమ్మెల్యే సుగవాసి పాలకొండ్రాయుడుకు మధ్య తీవ్రస్థాయిలో విభేదాలు నడుస్తున్నాయి. రాబోయే ఎన్నికల్లో పాలకొండ్రాయుడు మద్దతు లేకుండా గెలవడం సాధ్యం కాదని టీడీపీ నాయకత్వం అంచనా వేసింది. రమేష్‌రెడ్డికి టిక్కెట్ ఇస్తే పాలకొండ్రాయుడు సహకరించే పరిస్థితి లేనందువల్ల కొత్త వ్యక్తిని బరిలోకి దించాలని ఆలోచన చేస్తోంది. ⇔ పులివెందుల నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసిన మాజీ ఎమ్మెల్సీ సతీష్‌రెడ్డికి టిక్కెట్ విషయంలో ఈసారి పోటీ నెలకొంది. టిక్కెట్ తనకేనని ఆయన ధీమాగా చెబుతున్నప్పటికీ జిల్లా టీడీపీ వర్గ సమీకరణాలు, ఆధిపత్య పోరాటాల వల్ల ఇక్కడ కూడా అభ్యర్థి మారొచ్చని అంటున్నారు. ఎమ్మెల్సీ బీటెక్ రవి, పార్టీ నాయకుడు పేర్ల పార్థసారధిరెడ్డి, రాంగోపాల్‌రెడ్డి తమ పేర్లు పరిశీలించాలని అధిష్టానాన్ని కోరుతున్నారు. ⇔ ప్రొద్దుటూరు నుంచి ఈసారి తాను పోటీకి దిగాలని రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ చాలాకాలం నుంచి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. 2014 ఎన్నికల్లో పోటీ చేసిన మాజీ ఎమ్మెల్యే వరదరాజులురెడ్డికి ఈసారి టిక్కెట్ దక్కే అవకాశం లేదని సీఎం రమేష్ వర్గం ప్రచారం చేస్తోంది. రాబోయే ఎన్నికల అవసరాలను దృష్టిలో ఉంచుకునే పౌరసరఫరాల సంస్థ చైర్మన్ లింగారెడ్డితో రమేష్ స్నేహం నడుపుతున్నారు. సొంతంగా సామాజిక సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. సీఎం రమేష్‌కు టిక్కెట్ ఇవ్వడానికి సీఎం ఆమోదం తెలిపారని ఆయన వర్గీయులు ప్రచారం చేసుకుంటున్నారు. -
కొత్త బంధంతో కేంద్ర పదవికి దూరం
⇒ కనీస వేతన సలహా సంఘ చైర్మన్ పదవికి జనార్దన్‌రెడ్డి రాజీనామా సాక్షి, హైదరాబాద్: కనీస వేతన సలహా సంఘం కేంద్ర చైర్మన్‌గా నియమితులైన బెక్కరి జనార్దన్‌రెడ్డి పదవీ బాధ్యతలు స్వీకరించకుండానే రాజీనామా చేశారు. అందుకు కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయతో తాజాగా ఏర్పడిన బంధుత్వమే కారణం కావడం విశేషం. బీజేపీలో సీనియర్ నాయకుడిగా ఉన్న జనార్దన్‌రెడ్డి ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే టికెట్ ఆశించారు. కానీ ఆయనకు కేంద్రంలో సముచిత పదవి ఇస్తామన్న హామీ మేరకు గతంలో పంపిన ప్రతిపాదనలు అనేక దశలు దాటి రెండు రోజుల క్రితం దేశస్థాయిలో కనీస వేతన చట్టం అమలును పర్యవేక్షించే సలహా సంఘానికి చైర్మన్‌గా ఉత్తర్వులు వెలువడ్డాయి. అయితే కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ కుమార్తెతో తన కుమారుడికి వివాహం జరుగుతున్న సమయంలో విమర్శలకు తావివ్వకూడదన్న ఉద్దేశంతో ఆయన బుధవారం రాజీనామా లేఖను కేంద్రానికి పంపారు. -
'రేణుకా హటావో కాంగ్రెస్ బచావో'
ఖమ్మం: కాంగ్రెస్‌కు మంచిరోజులు రావాలంటే రేణుకా చౌదరి లాంటి వాళ్లను పార్టీ నుంచి తొలగించాలని గిరిజన సంఘాలు ఆరోపించాయి. ఖమ్మం జిల్లాలో జరుగుతున్న సభ్యత్వ నమోదు ప్రక్రియలో భాగంగా రాష్ట్ర నాయకులు మల్లు భట్టివిక్రమార్క, షబ్బీర్‌అలీతో పాటు రాష్ట్ర కాంగ్రెస్ ఇన్చార్జ్ కుంతియతో ఏర్పాటు చేసిన సమావేశం రసాభాసగా మారింది. 'సాధారణ ఎన్నికల్లో వైరా ఎమ్మెల్యే టికెట్ ఇప్పిస్తానని నమ్మించి తన భర్త నుంచి కోటి 20 లక్షలు తీసుకున్నారని.. అయినా టికె ట్ ఇప్పించలేదని.. తిరిగి డబ్బులివ్వమంటే ఇవ్వకుంటా మనోవేదనకు గురిచేయడంతో.. మనస్థాపానికి గురై నా భర్త మృతిచెందాడని' డాక్టర్ రాంజీ భార్య అన్నారు. గతంలో పలు మార్లు రేణుకా చౌదరిని సంప్రదించిన ఎలాంటి ఫలితం రాలేదని ఆమె వాపోయారు. మంగళవారం ఖమ్మం జిల్లాలో జరుగుతున్న సభ్యత్వ నమోదు కార్యక్రమానికి కుంతియ ముఖ్య అతిధిగా వస్తున్నారని తెలుసుకున్న రాంజీ భార్య, బంధువులతోపాటు గిరిజన నాయకులు పార్టీ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రేణుకా హటావో కాంగ్రెస్ బచావో అనే ఫ్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. కాగా పోలీసులు రంగప్రవేశం చేసి ఆందోళనకారులను చెదరగొట్టారు. తీవ్ర ఉద్రిక్తతల నడుమ రాంజీ భార్య కుంతియాకు వినతి పత్రం అందించారు. -
కాంగ్రెస్‌లో గలాట
⇒ టికెట్‌కు డబ్బులు తీసుకున్నారని మొన్న రేణుకపై ఆగ్రహం ⇒ మోసం చేశారని మాజీ ఎంపీ బలరాంపై నిన్న రేగా ఫైర్ ⇒ మణుగూరులో పార్టీ కార్యాలయానికి రాకుండా అడ్డగింత ⇒ కాంగ్రెస్‌లో రోజురోజుకూ ముదురుతున్న వర్గపోరు సాక్షి, ఖమ్మం: సార్వత్రిక ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీలో రాజుకున్న ఎమ్మెల్యే టికెట్ల అగ్గి ఇంకా చల్లారలేదు. పార్టీ అధిష్టానం సయోధ్య కోసం జిల్లాకు పంపే దూతల ముందు నేతలు, కార్యకర్తలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూనే ఉండడం గమనార్హం. వైరా ఎమ్మెల్యే టికెట్ కోసం డబ్బులు తీసుకొని ఎంపీ రేణుకాచౌదరి మోసం చేశారని ప్రముఖ వైద్యులు రాంజీ భార్య చంద్రకళ, ఎల్‌హెచ్‌పీఎస్ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇది మరువక ముందే తనకు అన్యాయం చేశారని మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు మణుగూరులో మాజీ ఎంపీ పొరికె బలరాంనాయక్‌ను పార్టీ కార్యాలయంలోకి రాకుండా అడ్డుకున్నారు. ఇప్పటి వరకు చాపకింద నీరులా ఉన్న కాంగ్రెస్ పార్టీలో గలాట ప్రస్తుతం తారస్థాయికి చేరింది. ఎమ్మెల్యే టికెట్ల కేటాయింపు అంశం సార్వత్రిక ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీలో చిచ్చుపెట్టింది. పార్టీ నేతలంతా ఎవరికి వారు టికెట్ల కోసం ప్రయత్నించి కొందరు సఫలం కాగా, మరి కొందరికి నిరాశే ఎదురైంది. అప్పటినుంచి జిల్లా పార్టీని ఒక్క తాటిపైకి తీసుకొచ్చేందుకు అధిష్టానం చేస్తున్న ప్రయత్నాలు బెడిసికొడుతున్నాయి. ఎమ్మెల్యే టికెట్, నామినేటెడ్ పదవులు ఇప్పిస్తామని రేణుకాచౌదరి డబ్బులు తీసుకున్నారని డాక్టర్ రాంజీ భార్య, ఎల్‌హెచ్‌పీఎస్ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తూ.. జిల్లా పర్యటనకు వచ్చిన ఏఐసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ కొప్పుల రాజుకు వినతిపత్రం అందజేసిన విషయం తెలిసిందే. డబ్బులు తీసుకొని టికెట్ ఇవ్వకపోవడంతోనే మనోవేదనతో రాంజీ మృతిచెందారని వారు రేణుకపై నిప్పు లు చెరిగారు. ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని పార్టీ అధినేత సోనియాగాంధీ దృష్టికి తీసుకెళ్తానని కొప్పుల రాజు వారికి హామీ ఇవ్వడంతో రేణుకపై ఈ విషయంలో అధిష్టానం ఎలా స్పందిస్తుందోనని నేతల్లో చర్చ జరుగుతోంది. కాగా, జిల్లాలోని రేణుకాచౌదరి వ్యతిరేక వర్గం కూడా ఆమెపై చర్యలు తీసుకోవాల్సిందేనన్న అభిప్రాయంతో ఏఐసీసీకి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. షెట్టర్ వేసి అడ్డుకున్న రేగా.. ఈ వివాదం మరువక ముందే బుధవారం మణుగూరులో మాజీ ఎంపీ పొరిక బలరాంనాయక్ పర్యటనను మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు అడ్డుకున్నారు. తనకు టికెట్ ఇవ్వకుండా మోసం చేశారని బలరాంపై తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు. మణుగూరు మండల పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఉందని, అక్కడికి రావాలని బలరాంనాయక్ స్థానిక కార్యకర్తలకు సమాచారం అందించారు. ఈ విషయం తెలుసుకున్న రేగా, ఆయన వర్గీయులు ముందుగానే కార్యాలయానికి చేరుకున్నారు. ఇక్కడ ప్రెస్‌మీట్ ఉందా అని విలేకరులు రేగాను ప్రశ్నించగా.. ‘ఇక్కడికి ఎవరూ రారు.. మాకు సమాచారం లేదు’ అనిఆయన సమాధానమిచ్చారు. ఇంతలోనే అక్కడకు బలరాంనాయక్ చేరుకోవడంతో రేగా పార్టీ కార్యాలయం షెట్టర్ వేసి అడ్డుకున్నారు. ‘ఎన్నికల ముందు పార్టీ కార్యాలయానికి రాకుండా బయట తిరిగిన నీకు ఇప్పుడు కార్యాలయానికి వచ్చే అర్హత లేదు’ అంటూ బలరాంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరువురు నేతల వాగ్వాదంతో పాటు వారి అనుచరులు ఒకరిపై ఒకరు దూషణలకు దిగడంతో తోపులాట జరిగింది. ‘నాకు టికెట్ ఇవ్వకుండా మోసం చేశారని.. నీ వల్లే ఇలా జరిగింది’ అని రేగా.. బలరాంపై ధ్వజమెత్తారు. ఎన్నికల సమయంలో ఏదో జరిగిపోయిందని ఇప్పుడు సయోధ్యతో పనిచేద్దామని బలరాం కాంతారావును పలుమార్లు బుజ్జగించే ప్రయత్నం చేశారు. గతంలో జరిగిన తప్పులకు బహిరంగ క్షమాపణ చెబుతున్నానని ఆయన అనడంతో ఇద్దరూ పార్టీ కార్యాలయంలో కూర్చొని మాట్లాడుకున్నారు. మాజీ ఎంపీ వెంట ఉన్న వారు తనపై దాడికి చేయడానికి వచ్చారని, వారిపై కేసు పెడతానని, వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని రేగా విలేకరులతో అన్నారు. భద్రాచలంలోనూ బయటపడ్డ వర్గపోరు.. మాజీ ఎంపీ బలరాంనాయక్ భద్రాచలం పర్యటనలోనూ స్థానిక పార్టీ నేతల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు బొలిశెట్టి రంగారావు, మాజీ పట్టణ అధ్యక్షుడు నక్కా ప్రసాద్ మధ్య ఉన్న విభేదాలు ఒక్కసారిగా బహిర్గతమయ్యాయి. బలరాంనాయక్ సారపాక బీపీఎల్ గెస్ట్‌హౌస్ నుంచి భద్రాచలానికి బయలుదేరగా, ఆయన వెనుకనే పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు బొలిశెట్టి రంగారావు, మాజీ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు నక్కా ప్రసాద్ వేర్వేరు వాహనాలపై వస్తున్న క్రమంలో ఒకరికొకరు వాహనాలను తప్పించే ప్రయత్నం చేశారు. వారు బ్రిడ్జి సెంటర్లోని ఇందిరాగాంధీ విగ్రహం వద్దకు వచ్చే సరికి రెండు వాహనాలు ఢీ కొన్నాయి. రెండు వాహనాలూ కూడా కొంత మేర ధ్వంసమయ్యాయి. దీంతో ఇరువురూ వాదనకు దిగారు. పోలీస్ స్టేషన్‌కు చేరిన వీరి పంచాయితీ అంతటితో ఆగకుండా పరస్పర ఫిర్యాదులు చేసుకునేవరకు వెళ్లింది. తనను చంపేందుకే ఇలా చేశారని ఒకరిపై మరొకరు ఫిర్యాదు చేసుకున్నారు. -
సుగుణకే ఎమ్మెల్యే టికెట్
తిరుపతి కార్పొరేషన్: తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థిగా వెంకటరమణ సతీమణి సుగుణను ఖరారు చేసినట్టు తెలిసింది. దివంగత ఎమ్మెల్యే వెంకటరమణ అనారోగ్యంతో మృతి చెందడంతో తిరుపతికి ఉప ఎన్నిక అనివార్యమైంది. అయితే ఆయన స్థానంలో ఎమ్మెల్యే టికెట్ ఎవరికి ఇస్తారనే అంశంపై రెండు రోజులుగా నగరంలో పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. చంద్రబాబు నాయుడితో సన్నిహిత సంబంధాలు ఉన్న టీడీపీలోని కొందరు నాయకులు వెంకటరమణ వారసులం తామేనని, టికెట్ తమకే వస్తుందని ఎవరికి వారే తమ అనుచరుల ద్వారా ప్రచారాలు చేసుకుంటున్నారు. ఈనేపథ్యంలో ఊహాగానాలకు తెరదించుతూ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. గురువారం హైదరాబాద్‌లో చంద్రబాబును కలిసిన జిల్లా టీడీపీ ఎమ్మెల్యేలు తిరుపతి టికెట్ అంశంపై చర్చించినట్టు తెలిసింది. దీంతో ఆయన స్పందిస్తూ తిరుపతిపై తాను ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. వెంకటరమణ సతీమణి సుగుణకే టికెట్ ఇవ్వనున్నట్టు మనసులో మాటను చెప్పారని తెలిసింది. ఆమెను అభ్యర్థిగా ప్రకటించడం వల్ల ఆ కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందన్న సంకేతాలు ఇవ్వవచ్చని అభిప్రాయడ్డారని తెలిసింది. అంతేగాకుండా సుగుణకు టికెట్ ఇవ్వడం వల్లఇతర పార్టీలు తమ అభ్యర్థులను పోటీకి దింపకపోవచ్చని.. తద్వారా ఆమె ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశం ఉందని చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేసినట్టు విశ్వసనీయ సమాచారం. -
ఎమ్మెల్యే టికెట్‌పై కార్పొరేటర్ల కన్ను
సాక్షి, ముంబై: లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో మోడీ హవా స్పష్టంగా ప్రతిబింబించిన నేపథ్యంలో శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయాలని బీజేపీకి చెందిన కొందరు కార్పొరేటర్లు భావిస్తున్నారు. తాము కూడా ఎమ్మెల్యేలు కావాలని వారంతా ఉవ్విళ్లూరుతున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో మోడీ ప్రభంజనం కారణంగా నగరంలోని మొత్తం ఆరు లోక్‌సభ స్థానాలు కాంగ్రెస్, ఎన్సీపీ నుంచి చేజారిపోయాయి. శివసేన, బీజేపీ అభ్యర్థులు భారీ మెజారిటీతో విజయఢంకా మోగించారు. ఈ ఫలితాలు సీనియర్ నాయకులు, సిట్టింగ్‌లు, మాజీ కార్పొరేటర్లతోపాటు కార్యకర్తల్లోనూ నూతనోత్తేజాన్ని నింపింది. దీంతో వీరంతా శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల ప్రచార సభల్లో మోడీ తనదైన ప్రసంగాలతో ప్రజలను మరింత జాగృతం చేశారు. ఓటర్లను తనవైపు తిప్పుకోవడంలో సఫలీకృతులయ్యారు. దీంతో బీజేపీని విజయలక్ష్మి వరించింది. ఈ ఎన్నికల్లో కొన్ని స్థానాల్లో మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎమ్మెన్నెస్) ప్రభావం కారణంగా సీట్లు చేజారిపోవచ్చని బీజేపీ, శివసేన నాయకులు తొలుత భావించారు. అయితే శివసేన అభ్యర్థులకు భారీగా ఓట్లు రావడంతో బీజేపీ కార్పొరేటర్లు, కార్యకర్తల్లో మనోధైర్యం మరింత బలపడింది. త్వరలో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. లోక్‌సభ ఎన్నికల ఫలితాల ప్రభావం ఈ ఎన్నికలపైకూడా పడే అవకాశముంది. ఈ నేపథ్యంలో శాసనసభ ఎన్నికల బరిలోకి దిగి ఎమ్మెల్యే కావాలని సీనియర్ నాయకులు, సిట్టింగ్, మాజీ కార్పొరేటర్లు, కార్యకర్తలు భావిస్తున్నారు. ఇందులోభాగంగా వారంతా ఇప్పటికే తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. సాధారణ కార్యకర్తగా పార్టీలో చేరిన కొందరు పదాధికారులు, కార్పొరేటర్లు అయ్యారు. ఇక గల్లీ నుంచి ఢిల్లీకి వెళ్లాలని కలలు కంటున్నారు. టికెట్ దొరికితే విజయం అత్యంత సునాయాసమనే ధీమాతో ఉన్నారు. ఇలా పెద్ద సంఖ్యలో సీనియర్లు, కార్పొరేటర్లు, కార్యకర్తలు టికెట్ ఆశిస్తున్న నేపథ్యంలో సిట్టింగ్, మాజీ ఎమ్మెల్యేల పరిస్థితి ఏమిటనేది బీజేపీకి తలనొప్పిగా మారే అవకాశముంది. భవిష్యత్తులో కొత్త కొత్త సమస్యలు తలెత్తే ప్రమాదముందని బీజేపీ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి.