ఆ అవినీతి మంత్రి .. మాకొద్దు | TDP Leaders Fight For MLA Ticket Amaravati | Sakshi
Sakshi News home page

ఆ అవినీతి మంత్రి .. మాకొద్దు

Published Fri, Mar 1 2019 1:21 PM | Last Updated on Sat, Mar 2 2019 8:19 AM

TDP Leaders Fight For MLA Ticket Amaravati

సాక్షి, అమరావతి: ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ఏపీ అధికార టీడీపీలో టిక్కెట్ల రగడ రోజు రోజుకు ముదురుతోంది. పశ్చిగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గంలో శుక్రవారం టీడీపీ సమీక్షా సమావేశం నిర్వహించింది. సభలో మంత్రి జవహర్‌కు వ్యతిరేకంగా టీడీపీ శ్రేణులు, కార్యకర్తలు నినాదాలు చేయడంతో సభలో గందరగోళం  నెలకొంది.

జవహర్‌కు టిక్కెట్ ఇవ్వొద్దని టీడీపీ శ్రేణులు, కార్యకర్తలు డిమాండ్‌ చేశారు. మంత్రి  జవహర్‌కు టిక్కెట్ ఇస్తే కేటాయిస్తే అతడిని ఖచ్చితంగా ఓడిస్తామని హెచ్చరించారు. జిల్లాలోమంత్రి జవహర్‌ భారీగా అవినీతికి పాల్పడ్డారని అన్నారు. ఇసుక, మద్యం కుంభకోణల్లో కోట్ల రూపాయలు సంపాదించారు. దీంతో సమావేశంలో అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement