jawahar
-
జవహర్ తీరు.. కార్యకర్తల్లో బేజారు
కొవ్వూరు: తూర్పుగోదావరి జిల్లా టీడీపీ అధ్యక్షుడు, మాజీ మంత్రి కేఎస్ జవహర్‌కు మరోసారి అసమ్మతి సెగ తగిలింది. ఫ్లెక్సీల ఏర్పాటుపై దొమ్మేరు గ్రామంలో ఆ పార్టీ నాయకులు శుక్రవారం సమావేశమై ఆయనపై బహిరంగంగా విమర్శనా్రస్తాలు సంధించగా.. ఇప్పుడు అధిష్టానం పెద్దలకు శనివారం రాత పూర్వకంగా ఫిర్యాదు చేయడం చర్చనీయాంశమైంది. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నవేళ టికెట్ ఖరారయ్యే అభ్యర్థుల జాబితాలో ఈయన పేరు పరిశీలనకు వచ్చిన తరుణంలో ఈ పరిస్థితి తలెత్తడం విశేషం. కొవ్వూరు పట్టణంలోని ఓ కల్యాణ మండపంలో శనివారం సాయంత్రం నిర్వహించిన టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో నియోజకవర్గ ద్విసభ్య కమిటీకి స్థానిక నాయకులు రాత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. పార్టీ జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి జవహర్ స్థానిక నాయకత్వాన్ని సంప్రదించకుండా నియోజకవర్గంలో కొందరికి పదవులు కట్టబెట్టారని, అధిష్టానం ఆదేశాలను కూడా లెక్క చేయకుండా కార్యక్రమాలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఇప్పటికే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, జోన్–2 ఇన్చార్జి మందలపు రవి, నియోజకవర్గ పరిశీలకుడు గొర్రెల శ్రీధర్‌కు ఫిర్యాదు చేయగా, నియోజకవర్గ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దంటూ ఆదేశించారని, అయినప్పటికీ ఆయన నాయకుల మధ్య కలహాలు పెడుతున్నారని ఆరోపించారు. తన పుట్టిన రోజు సందర్భంగా స్థానిక నాయకుల ప్రమేయం లేకుండా నియోజకవర్గంలో జవహర్ శుక్రవారం ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారని చెప్పారు. ఇకపై కొవ్వూరు నియోజకవర్గంలో ఆయన ప్రమేయం లేకుండా చూడాలని కోరారు. ఈ సందర్భంగా జవహర్ అనుకూల, ప్రతికూల నాయకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ పరిణామాలపై ఆ పార్టీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. -
ఏం ఖర్మో.. లీడర్లని మారుస్తున్నా.. అక్కడ పార్టీ తలరాత మారడంలే!
అసలే పార్టీ పాతాళం వైపు చూస్తోంది. ఈ సీటు గెలుస్తామని ఏ జిల్లాలోనూ చెప్పేంత ధీమా కనిపించడంలేదు. కానీ పార్టీలో గ్రూపులు, కుమ్ములాటలు షరా మామూలే. ఏ నియోజకవర్గంలో చూసినా పచ్చ పార్టీలో తన్నులాటలు కామన్‌గా మారాయి. తూర్పుగోదావరి జిల్లాలో అయితే చంద్రబాబు పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలోనే తమ్ముళ్ళు తన్నుకున్నారు. కొవ్వూరు నియోజకవర్గం టీడీపీలో గొడవలకు కారణమేంటో చదవండి.. అనుకూలం x వ్యతిరేకం గతంలో తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్న తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో ప్రస్తుతం పార్టీ అంపశయ్యపైకి చేరింది. వంగల పూడి అనిత, కొత్తపల్లి జవహర్ అంటూ... నియోజకవర్గంలో నేతల్ని మారుస్తున్నా పార్టీ రాత మారడంలేదని అక్కడి కేడర్ ఆందోళన చెందుతోంది. మంత్రిగా ఉన్న కాలంలో జవహర్ రాజేసిన గ్రూపుల కుంపటి సెగలు నేటికీ చల్లార లేదు. మొన్న అమరావతి రైతుల యాత్ర సన్నాహక సమావేశంలో కుమ్ములాడుకున్న జవహర్ అనుకూల, వ్యతిరేక వర్గాలు.. మరోసారి చంద్రబాబు పర్యటన ఏర్పాట్ల సమావేశంలోనూ సేమ్ సీన్ రిపీట్ చేశాయి. నియోజకవర్గ నాయకులు బాబు పర్యటన ఏర్పాట్ల పై కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశం సజావుగా సాగుతున్న సమయంలో మాజీ మంత్రి కొత్తపల్లి జవహర్ సమావేశానికి వచ్చారు. జవహర్ ను చూసిన వ్యతిరేకవర్గం కేడర్ ఒక్కసారిగా ఆగ్రహానికి గురయ్యారు. కొవ్వూరు నియోజకవర్గంలో మాజీ మంత్రి జవహర్‌కు పని ఏంటంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాబు దింపుడు కళ్లెం ఆశలు చంద్రబాబు హయాంలో జవహర్ మంత్రిగా పనిచేసినపుడు ఒక వర్గాన్ని దూరంగా పెట్టారు. తనవర్గం వారిని వారిపై రెచ్చగొట్టారు. అప్పటినుంచి కొందరు నేతలు, కార్యకర్తలు జవహర్ వ్యతిరేక వర్గంగా నియోజకవర్గంలో గట్టిగా పనిచేస్తున్నారు. గత ఎన్నికల్లో జవహర్‌కు కొవ్వూరు టిక్కెట్ రాకుండా చంద్రబాబు దగ్గర చక్రం తిప్పారు వ్యతిరేక వర్గం నాయకులు. తనవారి మాట కాదనలేక.. అప్పట్లో కొత్తపల్లి జవహర్‌ను చంద్రబాబు నాయుడు తిరువూరు స్థానానికి పంపించారు. పాయకరావుపేట ఎమ్మెల్యేగా పనిచేసి అక్కడ అక్కడ గ్రూప్ తగాదాల్లో కూరుకుపోయిన వంగలపూడి అనితను కొవ్వూరు నుండి పోటీ చేయించారు. ఘోర పరాజయం పాలైన వంగలపూడి అనిత ఎన్నికల అనంతరం కొవ్వూరు నియోజకవర్గం వైపు కన్నెత్తి చూడలేదు. దీంతో తిరిగి కొవ్వూరు నియోజకవర్గంలో పట్టు సాధించేందుకు పలుమార్లు జవహర్ ప్రయత్నించినా వ్యతిరేకవర్గం అడ్డుపడడంతో ఆయన ఆశలు అడియాశలే అవుతున్నాయి. చదవండి: (టికెట్‌కి వెల కడతారా?.. మా కుటుంబాన్ని కరివేపాకులా తీసేస్తారా?) గోరంట్లకు జవహర్ సెగ ప్రస్తుతం రాజమండ్రి జిల్లా ఇన్ఛార్జిగా జవహర్ కొనసాగుతున్నారు. కొవ్వూరు నియోజకవర్గంలో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పర్యటన సందర్భంగా సమావేశం ఏర్పాటు చేశారు. పర్యటనకు ఇన్చార్జిగా నియమితులైన టిడిపి పోలిట్ బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి అధ్యక్షతన సమావేశం జరుగుతుండగా మాజీ మంత్రి కొత్తపల్లి జవహర్ రావడంతో ఒక్కసారిగా.. జవహర్ గోబ్యాక్ అంటూ పై నినాదాలు మొదలయ్యాయి. దీంతో జవహర్ అనుకూల వర్గం వారు వ్యతిరేకవర్గం వారితో ఘర్షణకు దిగారు. ఇరువర్గాల మధ్య గంట సేపు వాగ్వాదం జరిగింది. ఘర్షణను ఆపేందుకు ఎంత ప్రయత్నించినా ఎవరికీ సాధ్యం కాలేదు. నాయకులు, కార్యకర్తలతో గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతున్న సమయంలో సైతం గొడవ కంటిన్యూ అవుతుండటంతో బుచ్చయ్య చౌదరి వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరువర్గాల మధ్య ఘర్షణ తారస్థాయికి చేరడంతో సమావేశాన్ని అర్థాంతరంగా ముగించారు. ఎన్నికకు ఏడాదిన్నర ముందే ఇలా ఉంటే.. తీరా అసలు సమయానికి పరిస్థితి ఎలా ఉంటుందోనన్న బెంగ ఇద్దరు బాబులకు పట్టుకుందని తెలుగు తమ్ముళ్లు అనుకుంటున్నారు. - పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
టీడీపీలో వర్గపోరు.. బుచ్చయ చౌదరి ఎదుటే బాహాబాహీ!
సాక్షి, తూర్పుగోదావరి: కొవ్వూరు టీడీపీలో మరోసారి వర్గ విబేధాలు బయటపడ్డాయి. టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో రసాభాస చోటుచేసుకుంది. అయితే, టీడీపీ ఏర్పాటు చేసిన సభలో బుచ్చయ్య చౌదరి ఎదుటే జవహర్ అనుకూల, వ్యతిరేక వర్గాలు బాహాబాహికి దిగాయి. కాగా, రెండు వర్గాల ఆందోళనలతో సమావేశం అర్థాంతరంగానే ముగిసింది. ఈ ఘటనతో బుచ్చయ్య చౌదరి అసహనం చెందినట్టు సమాచారం. ఇక, ఈ నియోజకవర్గానికి జవహర్ వచ్చిన ప్రతీసారి వ్యతిరేక వర్గం అడ్డుకుంటున్నట్టు తెలుస్తోంది. -
తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు టీడీపీలో వర్గ విభేదాలు
-
కొవ్వూరు నియోజకవర్గంలో టీడీపీ నాయకుల బాహాబాహీ
సాక్షి, కొవ్వూరు: తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం టీడీపీలో వర్గ విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. అమరావతి రైతుల పాదయాత్ర నేపథ్యంలో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ రెండు వర్గాలకు చెందిన టీడీపీ నాయకులు బాహాబాహీకి దిగారు. కొవ్వూరులో మాజీ మంత్రి జవహర్‌కు సంబంధం ఏంటని వ్యతిరేక వర్గం నిరసనకు దిగింది. ద్విసభ్య కమిటీ ముందే ఇరువర్గాలు ఘర్షణకు దిగాయి. చదవండి: (మహా పాదయాత్రతో టీడీపీ ముసుగు తొలిగి పోయింది: మంత్రి కారుమూరి) -
రాజ్యసభకు టీఎంసీ అభ్యర్థిగా జవహర్ సర్కార్
కోల్‌కతా: ఆగస్టు 9వ తేదీన పశ్చిమబెంగాల్ రాజ్యసభ సీటుకు జరగనున్న ఉప ఎన్నికకు రిటైర్డు ప్రభుత్వాధికారి జవహర్ సర్కార్(69)ను తమ అభ్యర్థిగా టీఎంసీ ఎంపిక చేసింది. అధికారిగా ప్రజలకు అమూల్యమైన సేవలందించిన సర్కార్ దేశానికి మరింతగా సేవ చేసేందుకు సహాయపడతారని ఆశిస్తూ ఎంపిక చేసినట్లు టీఎంసీ అధినేత్రి, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పేర్కొన్నారు. కాగా, టీఎంసీ నేత దినేశ్ త్రివేది రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి, బీజేపీలో చేరడంతో సీటు ఖాళీ అయింది. టీఎంసీకి పోటీగా బీజేపీ కూడా అభ్యర్థిని బరిలోకి దించితే ఉప ఎన్నిక అనివార్యమవుతుంది. లేకుంటే రాజ్యసభకు జవహర్ సర్కార్ పోటీ లేకుండానే ఎన్నికవుతారు. సర్కార్ ప్రభుత్వ ఉద్యోగిగా 42 ఏళ్లపాటు పనిచేశారు. -
ఉన్న పరువు కాస్తా పాయే..!
సాక్షి, ఒంగోలు ప్రతినిధి: పాయే.. ఉన్న పరువు కాస్తా పాయే..! ఏదో చేద్దామనుకుంటే మరేదో జరిగింది. టీడీపీ త్రీమెన్ కమిటీ పేరుతో హడావిడి చేయాలని చూసి బొక్కబోర్లా పడ్డారు. పార్టీ జిల్లా శ్రేణుల్లో భరోసా మాట అటుంచితే.. ముఖ్య నేతల్లోనే నమ్మకం కలిగించలేక పోయారు. త్రీమెన్ కమిటీ మొట్టమొదటి సమావేశానికే కమిటీలోని ఒక సభ్యుడు డుమ్మాకొట్టాడు. ఇక జిల్లా సమన్వయ కమిటీ సమావేశాన్ని సైతం మమః అనిపించేశారు. సమావేశానికి ఇద్దరు నియోజకవర్గ ఇన్చార్జిలు మినహా మిగతా వారంతా మొహం చాటేశారు. పట్టుమని పది మంది ముఖ్యనేతలు కూడా రాకపోవడంతో సమావేశాన్ని పది నిముషాల్లోనే ముగించేశారు. ఇలా వచ్చి అలా వెళ్లారు.. అన్న చందంగా త్రిసభ్య కమిటీ పర్యటన సాగింది. నిన్నమొన్నటి వరకూ పార్టీ జిల్లా నేతలపై ఉన్న చిన్నపాటి నమ్మకం సైతం నేటితో పోయిందని టీడీపీ శ్రేణులు తీవ్ర నైరాశ్యంలోకి వెళ్లాయి. శుక్రవారం జిల్లాకు వచ్చిన త్రిసభ్య కమిటీ విలేకర్ల సమావేశం పెట్టి వైఎస్సార్ సీపీ నేతలను తిట్టడం మినహా కార్యకర్తలకు పార్టీ తరఫున ఎటువంటి భరోసా ఇవ్వకపోవడంపై టీడీపీ కార్యకర్తలు మండిపడుతున్నారు. పార్టీని బలోపేతం చేయడం మాట అటుంచితే త్రిసభ్య కమిటీ రాకతో జిల్లాలో పార్టీ మరింత దిగజారిందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే... జిల్లాలో టీడీపీ శ్రేణులకు భరోసా కల్పిస్తామంటూ వచ్చిన త్రీమెన్ కమిటీ నిర్వాకంతో పార్టీ పరువు బజారునపడిందని ఆ పార్టీ శ్రేణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలకు జిల్లాలోని పార్టీ నేతలు, కార్యకర్తలను సమాయత్తం చేసేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇద్దరు మాజీమంత్రులు, ఓ ఎమ్మెల్సీతో త్రిసభ్య కమిటీని నియమించిన విషయం తెలిసిందే. ఆ కమిటీ శుక్రవారం ఒంగోలులో పర్యటించింది. త్రిసభ్య కమిటీ మొట్టమొదటి సమావేశానికి కమిటీ సభ్యుడు, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న డుమ్మా కొట్టారు. మిగతా ఇద్దరు సభ్యులైన దేవినేని ఉమామహేశ్వరరావు, కొత్తపల్లి జవహర్‌లు ఇలా వచ్చి అలా వెళ్లారే తప్ప పార్టీ కార్యకర్తలతో మాట్లాడటంగానీ, వారి సమస్యలను తెలుసుకోవడంగానీ చేయకపోవడంపై పార్టీ శ్రేణులు మండిపడుతున్నాయి. తొలుత ఒంగోలు రిమ్స్‌లో చికిత్స పొందుతున్న పార్టీ కార్యకర్తను పరామర్శించిన నేతలు అనంతరం టీడీపీ జిల్లా కార్యాలయంలో జిల్లా సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. మొహం చాటేసిన టీడీపీ ముఖ్య నేతలు... జిల్లా టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం అంటే జిల్లాలోని ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జిలు, టీడీపీ రాష్ట్ర, జిల్లా కమిటీ సభ్యులు హాజరుకావాల్సి ఉంది. అయితే, శుక్రవారం పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన సమన్వయ కమిటీ సమావేశానికి పట్టుమని పదిమంది ముఖ్య నాయకులు కూడా హాజరుకాకపోవడం గమనార్హం. టీడీపీ జిల్లా అధ్యక్షుడు, ఒంగోలు నియోజకవర్గ ఇన్చార్జి దామచర్ల జనార్దన్, కనిగిరి ఇన్చార్జి డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి, ఒంగోలు పార్లమెంట్ ఇన్చార్జి శిద్దా రాఘవరావు మినహా ఎవరూ హాజరుకాలేదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. సమావేశానికి నలుగురు ఎమ్మెల్యేలు, ఆరుగురు నియోజకవర్గ ఇన్చార్జిలు డుమ్మా కొట్టడం చూస్తుంటే.. జిల్లాలో టీడీపీ పరిస్థితి ఎంత దయనీయంగా మారిందో అర్థమవుతోంది. జిల్లా సమన్వయ కమిటీ సమావేశానికి నేతల నుంచి స్పందన కరువవడంతో త్రిసభ్య కమిటీ సభ్యులు పది నిముషాల్లో ముగించి మమః అనిపించేశారు. -
నటుడు నాజర్‌పై ఆరోపణలు
సాక్షి, చెన్నై : వృద్ధాప్యంలో, అనారోగ్యంతో బాధపడుతున్న తల్లిదండ్రులను నటుడు నాజర్ పట్టించుకోవడం లేదని, వారికి ఆర్థిక సాయం చేయకున్నా కనీసం పరామర్శించడానికి కూడా రావడం లేదని ఆయన సోదరులు ఆరోపించారు. ఈ విషయంలో నాజర్‌పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని శుక్రవారం చెన్నైలో మీడియా సమావేశంలో వెల్లడించారు. నటుడు నాజర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. దక్షిణాదిలో పలు చిత్రాల్లో వివిధ రకాల పాత్రల్లో నటించి పేరు తెచ్చుకున్న నటుడు. ఈయన నిర్మాతగా, దర్శకుడిగా కూడా చిత్రాలు చేశారు. ప్రస్తుతం దక్షిణ భారత నటీనటుల సంఘం అధ్యక్షుడిగాను పదవిలో ఉన్నారు. అంతేకాదు. నాజర్ భార్య కమల్ మక్కల్ నీది మయ్యం పార్టీ తరఫున లోక్‌సభ ఎన్నికల్లో సెంట్రల్ చెన్నై స్థానం నుంచి పోటీ చేశారు. కాగా, నాజర్ తమకు ఎలాంటి సాయం చేయడం లేదని, తల్లిదండ్రులను కూడా పట్టించుకోవడం లేదని ఆయన సోదరులు ఆరోపించారు. గతంలోనూ ఇలాంటి ఆరోపణలతో మీడియా ముందుకు వచ్చిన వీరు తాజాగా మరోసారి నాజర్‌పై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సందర్భంగా నాజర్ తమ్ముళ్లు జవహర్, ఆయుబ్ శనివారం మీడియాతో మాట్లాడుతూ తాము నలుగురు అన్నదమ్ములమని అందులో నాజర్నే పెద్ద వాడని తెలిపారు. వివాహనంతరం తమ కుటుంబానికి దూరంగా వెళ్లిపోయాడని చెప్పారు. మిగిలిన ముగ్గురిలో చివరి సోదరుడు మానసికంగా వ్యాధిగ్రస్తుడని తెలిపారు. దీంతో తామిద్దరమే కుటుంబ భారాన్ని మోసుకొస్తున్నట్లు చెప్పారు. తమ తల్లిదండ్రులు వృద్ధాప్యంతో, అనారోగ్యానికి గురయ్యారన్నారు. కాగా, నటుడిగా బాగా సంపాదించిన నాజర్ తన భార్య పిల్లలకే ఖర్చు చేసుకుంటున్నాడు గానీ, తమకెలాంటి సాయం అదించడం లేదన్నారు. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను ఆదుకోకపోగా, కనీసం వారిని చూడడానికి కూడా రావడంలేదని ఆవేదనను వ్యక్తం చేశారు. ఈ విషయంలో నాజర్ స్పందించకపోతే అతనిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
సీఎం ఇంటివద్దే ‘తమ్ముళ్ల’ తన్నులాట
సాక్షి, అమరావతి: ఎన్నికల వేళ అధికార తెలుగుదేశం పార్టీలో ముఠా కుమ్ములాటలు తీవ్రమయ్యాయి. ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసం వద్దే తెలుగు తమ్ముళ్లు పరస్పరం ఘర్షణకు దిగారు. అరుపులు, కేకలతో తన్నులాటకు దిగగా.. ఈ ఘర్షణలో పలువురికి స్వల్ప గాయాలైనట్టు సమాచారం. శుక్రవారం ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసం వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన టెంట్లలో పశ్చిమగోదావరి జిల్లాలోని కొవ్వూరు, నిడదవోలు అసెంబ్లీ నియోజకవర్గాల నాయకుల సమావేశాలు జరిగాయి. ఈ నేపథ్యంలో కొవ్వూరు, నిడదవోలు సిట్టింగ్ ఎమ్మెల్యేలైన కేఎస్ జవహర్, బూరుగుపల్లి శేషారావులకు సీట్లు ఇవ్వొద్దని అక్కడి క్యాడర్, స్థానిక నాయకత్వం ఆందోళనకు దిగింది. నిడదవోలు నియోజకవర్గ సమావేశంలో ఎమ్మెల్యే అనుకూల, వ్యతిరేక వర్గాల నాయకులు ఒకరిపై ఒకరు దాడి చేసి కొట్టుకున్నట్లు సమాచారం. సిట్టింగ్ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావుకు సీటిస్తే టీడీపీ గోదారిలో కలిసిపోయినట్లేనంటూ ఆయన్ను వ్యతిరేకించే నాయకులు ఆందోళనకు దిగారు. రెండు వర్గాల నాయకులు అరుపులు, కేకలతో తన్నులాటకు దిగగా.. పలువురు నేతలకు స్వల్ప గాయాలైనట్లు తెలుస్తోంది. ఇసుక క్వారీల్లో బూరుగుపల్లి తీవ్ర అవినీతికి పాల్పడ్డారని, గ్రామాల్లో తమను పట్టించుకోకుండా అణచివేశారని పలువురు ఆరోపించారు. సమావేశానంతరం వారంతా టెంట్లనుంచి బయటికొచ్చి బూరుగుపల్లికి వ్యతిరేకంగా ఆందోళన చేశారు. వారిని ఆపేందుకు పరిశీలకులుగా ఉన్న పార్టీ నేతలు నానాతంటాలు పడ్డారు. సమావేశంలో జరిగిన విషయాల్ని చంద్రబాబుకు వివరిస్తామని, ప్రశాంతంగా ఉండాలని సర్దిచెప్పినా అసమ్మతివర్గం వినిపించుకోలేదు. మంత్రి జవహర్‌ను నిలదీసిన వైరివర్గం.. మరోవైపు కొవ్వూరు నియోజకవర్గంపై నిర్వహించిన సమావేశంలో మంత్రి కేఎస్ జవహర్ ఎదుటే ఆయన అసమ్మతి వర్గం ఆందోళనకు దిగింది. పరిశీలకుల ఎదుటే జవహర్‌ను నిలదీయడమేగాక.. అవినీతికి పరాకాష్టగా మారిన ఆయనకు సీటిస్తే ఓడిస్తామని పలువురు నాయకులు హెచ్చరించారు. ఇందుకు జవహర్ అనుకూల వర్గం అభ్యంతరం చెప్పడంతో గొడవ జరిగి రెండు వర్గాలు తోపులాటకు దిగాయి. పరిశీలకులు ఆపినా పట్టించుకోని కార్యకర్తలు జవహర్‌కు వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. జవహర్ డౌన్ డౌన్, అవినీతిపరుడు జవహర్‌కు సీటివ్వొద్దు అంటూ నినాదాలు చేశారు. రెండు నియోజకవర్గాల సమావేశాలు రసాభాసగా మారడంతో సీఎం నివాస ప్రాంతం వద్ద గందరగోళం నెలకొంది. పోలీసులు వచ్చి ఆందోళన చేసిన వారిని అడ్డుకుని దూరంగా పంపించివేశారు. కొవ్వూరు నుంచే పోటీ చేస్తా: జవహర్ సమావేశానంతరం మంత్రి జవహర్ మీడియాతో మాట్లాడుతూ తాను మళ్లీ కొవ్వూరు నుంచే పోటీ చేస్తానని, కొందరు నాయకులు అహంకారంతో కావాలని తనకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నారని చెప్పారు. తనకు వ్యతిరేకంగా ఉన్నవారిని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. -
ఆ అవినీతి మంత్రి .. మాకొద్దు
సాక్షి, అమరావతి: ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ఏపీ అధికార టీడీపీలో టిక్కెట్ల రగడ రోజు రోజుకు ముదురుతోంది. పశ్చిగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గంలో శుక్రవారం టీడీపీ సమీక్షా సమావేశం నిర్వహించింది. సభలో మంత్రి జవహర్‌కు వ్యతిరేకంగా టీడీపీ శ్రేణులు, కార్యకర్తలు నినాదాలు చేయడంతో సభలో గందరగోళం నెలకొంది. జవహర్‌కు టిక్కెట్ ఇవ్వొద్దని టీడీపీ శ్రేణులు, కార్యకర్తలు డిమాండ్ చేశారు. మంత్రి జవహర్‌కు టిక్కెట్ ఇస్తే కేటాయిస్తే అతడిని ఖచ్చితంగా ఓడిస్తామని హెచ్చరించారు. జిల్లాలోమంత్రి జవహర్ భారీగా అవినీతికి పాల్పడ్డారని అన్నారు. ఇసుక, మద్యం కుంభకోణల్లో కోట్ల రూపాయలు సంపాదించారు. దీంతో సమావేశంలో అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. -
కొవ్వూరు టీడీపీలో వర్గ విభేదాలు
-
అవినీతి మంత్రి మాకొద్దంటూ టీడీపీ నేతల ర్యాలీ
సాక్షి, పశ్చిమ గోదావరి: జిల్లాలోని కొవ్వూరు నియోజకవర్గం టీడీపీలో నెలకొన్న వర్గ విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్ల మధ్య కుమ్ములాట రోడ్డుకెక్కింది. స్థానిక టీడీపీ నేతలు.. మంత్రి జవహర్ అనుకూల వర్గం, వ్యతిరేక వర్గంగా విడిపోయారు. టీడీపీ అధిష్టానం జవహర్‌కు టికెటు కేటాయించవద్దంటూ ఆయన వ్యతిరేక వర్గం బుధవారం భారీ ర్యాలీ చేపట్టింది. ఈ సందర్భంగా అవినీతి మంత్రి మాకొద్దంటూ జవహర్‌కు వ్యతిరేకంగా టీడీపీ నేతలు నినాదాలు చేశారు. జవహర్ నుంచి పార్టీని రక్షించాలని డిమాండ్ చేశారు. కొవ్వూరు పట్టణంతో పాటు రూరల్ గ్రామాల్లో జవహర్‌కు వ్యతిరేకంగా బైక్ ర్యాలీలు చేపడుతున్నారు. జవహర్ వ్యతిరేక వర్గానికి కొవ్వూరు మున్సిపాలిటీ మాజీ చైర్మన్ సూరపునేని రామ్మోహన్రావు, సీనియర్ నాయకులు ఉప్పులూటి నారాయణరావు నాయకత్వం వహిస్తున్నారు. జవహర్‌కు టికెట్ కేటాయిస్తే పార్టీ దారుణంగా ఓడిపోతుందని హెచ్చరిస్తున్నారు. కాగా, మంగళవారం రోజున ప్రజా దీవెన యాత్ర పేరుతో జవహర్ అనుకూల వర్గం ర్యాలీ నిర్వహించింది. అందులో జవహర్ కూడా పాల్గొన్నారు. అయితే నిన్న జవహర్ చేపట్టిన ర్యాలీకి వ్యతిరేకంగానే ఆయన వ్యతిరేక వర్గం నేతలు ఈ ర్యాలీ చేపట్టినట్టుగా తెలుస్తోంది. -
మంత్రి జవహర్‌కి వ్యతిరేకంగా ఆందోళనలు
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఎన్నికల షెడ్యూల్ రాకముందే అధికార పార్టీలో వేడి మొదలైంది. అసమ్మతి నాయకులు రోడ్డెక్కుతున్నారు. ప్రస్తుత ఎమ్మెల్యేలకు సీటు ఇవ్వద్దంటూ ప్రదర్శనలు ర్యాలీలు చేస్తున్నారు. మరోవైపు అసమ్మతి నేతలు రాజీనామాల బాట పడుతున్నారు. తాజాగా నరసాపురం మండలం సీతారాంపురం నార్త్ ఎంపీటీసీ సభ్యుడిగా వ్యవహరిస్తున్న మాదాసు నరసింహారావు తెలుగుదేశం పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల్లో స్థానిక ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు తనకు ప్రాతినిధ్యం ఇవ్వక పోవడంతో 1982లో పార్టీ స్థాపించిన నాటి నుంచి పార్టీలో కొనసాగుతున్న తనకు గౌరవం లేకుండా వ్యవహరిస్తున్నారని, అందుకే రాజీనామా చేస్తున్నానని పేర్కొన్నారు. మరోవైపు ప్రజలు కూడా అధికార పార్టీ ప్రజా ప్రతినిధులను నిలదీస్తుండటం కలకలం రేపుతోంది. ముప్పిడికి చుక్కెదురు తాజాగా ద్వారకాతిరుమల మండలంలోని వేంపాడు గ్రామంలో గోపాలపురం ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావుకు చుక్కెదురైంది. స్థానిక ఎస్సీ ఏరియాలో కొత్తగా నిర్మించిన మంచినీటి ట్యాంకు (ఓహెచ్ఎస్ఆర్)ను ప్రారంభించేందుకు వచ్చిన ఆయన్ను స్థానికులు శుక్రవారం అడ్డుకున్నారు. తమ గ్రామాన్ని ఏం అభివృద్ధి చేశారో చూపాలని నిలదీశారు. ఇప్పుడు మోటారు లేని వాటర్ ట్యాంకును ప్రారంభించడం వల్ల తమకు ఒరిగేదేమిటని ప్రశ్నించారు. దీంతో ఎమ్మెల్యే అక్కడి నుంచి వెనుదిరగాల్సి వచ్చింది. మంత్రికి వ్యతిరేకంగా ఆందోళనలు కొవ్వూరులో మంత్రి జవహర్‌కి వ్యతిరేకంగా ఆందోళనలు రెండోరోజు హోరెత్తాయి. మంత్రి కేఎస్ జవహర్, ఆయన ముఖ్య అనుచరుడు జొన్నలగడ్డ సుబ్బరాయచౌదరిలకు వ్యతిరేకంగా పార్టీలోని ఒక వర్గం శుక్రవారం చేపట్టిన బైక్ ర్యాలీ అసమ్మతి మంటలు రేపింది. ఇప్పటికే మంత్రికి వ్యతిరేకంగా కొవ్వూరులో పార్టీ ముఖ్య నాయకులు యూవీఎస్ నారాయణ, మాజీ మున్సిపల్ చైర్మన్ సూరపనేని చిన్నిల ఆధ్వర్యంలో రెండో పార్టీ కార్యాలయం ప్రారంభించడం తెలిసిందే. వ్యతిరేక వర్గం మంత్రి జవహర్‌కు టిక్కెట్టు కేటాయించవద్దని, అవినీతి నాయకులు మాకొద్దు అంటూ బైక్ ర్యాలీ చేపట్టడం నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. పార్టీలో మాల సామాజికవర్గాన్ని పూర్తిగా విస్మరించారని, ఆ సామాజిక వర్గం నేతలు రెండురోజులుగా నిరసన దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. టీడీపీకి చెందిన మండల పరిషత్ ఉపాధ్యక్షుడు ఎలిపే ప్రభాకరరాజు, తాళ్లపూడి ఎంపీటీసీ సభ్యుడు పెదపాటి కృష్ణమోహన్, గజ్జరం తాజా మాజీ సర్పంచ్ శెట్టిమాలి భీమయ్యలతో పాటు పలువురు ఆ పార్టీకి చెందిన మాల సామాజిక వర్గం నేతలు మంత్రి జవహర్ వైఖరిపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. గతంలో సొంత పార్టీ కార్యకర్తలపై చేయి చేసుకోవడం నుంచి నిత్యం ఏదొక వివాదంతో మంత్రి తరచూ వార్తల కెక్కుతున్నారు. పార్టీ అధిష్టానానికి పలుమార్లు స్థానిక నాయకులు మంత్రిపై రాతపూర్వక ఫిర్యాదులు కూడా చేశారు. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో టీడీపీలో నెలకొన్న అంతర్గత పోరు తారాస్థాయికి చేరడంతో ఆ పార్టీ శ్రేణులు అయోమయంలో పడ్డాయి. మంద కృష్ణ మాదిగతో జవహర్ చర్చలు గతంలో ఎమ్మార్పీఎస్ సభకు వెళ్లకుండా అడ్డుకునే ప్రక్రియలో భాగంగా మంత్రి జవహర్ తన సామాజికవర్గానికి చెందిన 17 మంది కార్యకర్తలపై అప్పట్లో కేసు నమోదు చేయించారు. దీంతో అప్పటి నుంచి ఆ సామాజికవర్గానికి చెందిన కొందరు నాయకులు మంత్రికి దూరంగా ఉంటున్నారు. దీంతో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మళ్లీ ఆ సామాజిక వర్గాన్ని దగ్గర చేర్చుకునేందుకు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందా కృష్ణ మాదిగతో గురువారం మంత్రి స్వగృహంలో అంతరంగికంగా చర్చలు చేసినట్లు తెలిసింది. 19న అమరావతిలో నిర్వహించే మాదిగల విశ్వరూప మహాసభ ఆహ్వానం పేరుతో గురువారం ఇద్దరూ రహస్యంగా భేటీ అయ్యి చర్చించినట్లు తెలిసింది. మరోవైపు మంత్రి అనుకూల వర్గం మాల సామాజిక వర్గం చేస్తున్న దీక్షకు వ్యతిరేకంగా పోటీగా కార్యక్రమం నిర్వహించింది. -
మంత్రి జవహర్‌పై పెరుగుతున్న వ్యతిరేకత
సాక్షి, కొవ్వూరు/ పశ్చిమగోదావరి : మంత్రి జవహర్‌కు తన నియోజకవర్గంలో రోజురోజుకీ వ్యతిరేకత పెరిగిపోతోంది. ఇప్పటికే ఆయన తీరుపై సొంత పార్టీ నేతలే విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. నియోజకవర్గ నాయకుల పట్ల జవహర్ అహంభావ వైఖరి ప్రదర్శిస్తున్నారంటూ టీడీపీ నేతలు గతంలో కొవ్వూరులో మరో టీడీపీ కార్యాలయం ఏర్పాటు చేసి నిరసన వ్యక్తం చేశారు. తాజాగా ఆయనకు మరోసారి నిరసన సెగ తగిలింది. మంత్రి జవహర్ మాలల పట్ల వివక్ష చూపుతున్నారంటూ మాల నాయకులు తాళ్లపూడిలో నిరసన చేపట్టారు. రానున్న ఎన్నికల్లో కొవ్వూరు నియోజకవర్గం నుంచి మాల సామాజిక వర్గానికే టికెట్ కేటాయించాలంటూ వారు డిమాండ్ చేశారు. -
‘జవహర్‌కు టికెట్ ఇస్తే చిత్తుగా ఓడిస్తాం’
సాక్షి, అమరావతి : మంత్రి జవహర్‌పై సొంత పార్టీలోనే వ్యతిరేకత మొదలైంది. వచ్చే ఎన్నికల్లో మంత్రి జవహర్‌కు టికెట్ ఇస్తే చిత్తుగా ఓడిస్తామని కొవ్వూరు టీడీపీ నాయకులు పార్టీ అధిష్టానానికి తెలియజేశారు. గ్రూప్ రాజకీయాలను ప్రొత్సహిస్తూ పార్టీని నాశనం చేస్తున్నారని అధిప్టానానికి ఫిర్యాదు చేశారు. పార్టీలో మొదటి నుంచి ఉన్న నేతలకు జవహర్ గౌరవం ఇవ్వడంలేదని మండిపడ్డారు. బ్రాందీ షాపుల్లో పనిచేసే వారే కొవ్యూరులో పార్టీని నడుపుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. జవహర్‌కు వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వోద్దని అధిష్టానాన్ని కోరారు. -
టీడీపీలో భగ్గుమన్న వర్గ విభేదాలు
సాక్షి, పశ్చిమగోదావరి : జిల్లాలోని కొవ్వూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకుల మధ్య వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. మంత్రి జవహర్‌కు వ్యతిరేకంగా ఓ వర్గం మీడియా సమావేశం నిర్వహించడం చర్చనీయాంశమైంది. ఈ సందర్భంగా మంత్రి తీరును తీవ్రంగా తప్పుబట్టిన స్థానిక నాయకులు నిరసన వ్యక్తం చేశారు. నాయకుల పట్ల జవహర్ అహంభావ వైఖరి ప్రదర్శిస్తున్నారంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అంతేకాకుండా ఆయనకు వ్యతిరేకంగా కొవ్వూరులో మరో టీడీపీ కార్యాలయం ఏర్పాటు చేసి ఆగ్రహం వెళ్లగక్కారు. ‘గతంలో పనిచేసిన ఎమ్మెల్యేల వల్ల నియోజకవర్గంలో ఎటువంటి గొడవలు తలెత్తలేదు. కానీ మంత్రి జవహర్ మాత్రం ఉన్న నాయకులు పోయినా పర్వాలేదని మాట్లాడటం బాధాకరం’ అని జడ్పీటీసీ గారపాటి శ్రీదేవి ఆవేదన వ్యక్తం చేశారు. వ్యక్తిగత కక్షలు ఉంటే... మంత్రికి ఎవరితోనైనా వ్యక్తిగత కక్షలు ఉంటే బహిరంగంగా మాట్లాడాలే తప్ప.. అందుకోసం నియోజకవర్గం పేరును అడ్డుపెట్టుకోవడం సరికాదని మాజీ మున్సిపల్ చైర్మన్ సూరపనేని రామ్మోహనరావు అన్నారు. ఇక్కడ గతంలో పనిచేసిన ఎమ్మెల్యేలు నియోజకవర్గం పేరును పాడుచేసినందు వల్లే కొవ్వూరును.. కోవూరుగా మార్చామని జవహర్ అనడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. కౌన్సిల్ తీర్మానం మేరకే పేరు మార్చిన సంగతి గుర్తుపెట్టుకోవాలని సూచించారు. ఇలా చేయడం ద్వారా అన్ని వర్గాల ప్రజల మనోభావాలను మంత్రి దెబ్బతీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధర్మవరంలో క్రైస్తవ వివాహ వేదిక నిర్మాణానికి 60 లక్షల రూపాయలు మంజూరు అయితే.. ఆ నిధి రాకుండా జవహర్ అడ్డుపడ్డారని సూరపనేని ఆరోపించారు. ఆయన తీరును అధిష్టానం దృష్టికి తీసుకువెళ్తామని పేర్కొన్నారు. -
చిరంజీవి హోల్ సేల్.. పవన్ కల్యాణ్ రిటైల్
ఉండి: పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం యండగండిలో ఏర్పాటు చేసిన గ్రామ దర్శిని-గ్రామ వికాసం కార్యక్రమంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై మంత్రి జవహర్ తీవ్ర విమర్శలు చేశారు. కార్యక్రమంలో మంత్రి జవహర్ మాట్లాడుతూ..సినీ నటుడు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టి హోల్‌సేల్‌గా కాంగ్రెస్‌కు అమ్మితే..తమ్ముడు పవన్ కల్యాణ్ రిటైల్‌గా జనసేనను అమ్మడానికి సిద్ధమయ్యారని తీవ్రంగా విమర్శించారు. పవన్ కల్యాణ్ వారసత్వం గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. పవన్ కల్యాణ్ ఏమైనా ప్రభాస్ లాగా లేక ఇంకొకరి లాగా ఆరడుగుల అందగాడా, ఆజానుబాహుడా అని ప్రశ్నించారు. తన అన్న నుంచి వచ్చిన వారసత్వం ద్వారానే కదా పైకొచ్చిందని సూటిగా అడిగారు. ఊరికి ఇరవై మంది పవన్ కల్యాణ్ కన్నా అందంగా ఉన్నవాళ్లు ఉన్నారని వ్యాఖ్యానించారు. వారసత్వ రాజకీయాల గురించి మాట్లాడే పవన్ కల్యాణ్ ఒక్కసారి ఆలోచించాలని హితవు పలికారు. చిరంజీవి సినిమా యాక్టర్ కాకపోతే పవన్ కల్యాణ్ ఎవరు, ఎక్కడుండేవారని ప్రశ్నించారు. చిరంజీవి కుటుంబంలో తొమ్మిదో, పదో సినిమా యాక్టర్లు వచ్చారు..అది సినీ వారసత్వం కాదా అని ప్రశ్నించారు. రాజకీయ వారసత్వం గురించి మాట్లాడే అర్హత పవన్ కల్యాణ్‌కు లేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. -
ఏపీ మంత్రులకు షాకిచ్చిన మహిళ
-
ఏపీ మంత్రులకు షాకిచ్చిన మహిళ
సాక్షి, ఏలూరు : ఏపీ మంత్రులు జవహర్, ప్రత్తిపాటి పుల్లారావులకు చేదు అనుభవం ఎదురైంది. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు ఫైర్ స్టేషన్ సెంటర్లో జరిగిన బాబు జగ్జీవన్‌రామ్ విగ్రహావిష్కరణ సభలో భాగంగా ఓ మహిళ ఇద్దరు మంత్రులకు షాకిచ్చారు. వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మంత్రి జవహార్ విమర్శలు, తప్పుడు ఆరోపణలు చేస్తుండగా కార్యక్రమంలో పాల్గొన్న ఓ మహిళ ధైర్యంగా మంత్రి ప్రసంగాన్ని అడ్డుకున్నారు. అవినీతి గురించి మాట్లాడే అర్హతే మీకు లేదంటూ సభలో నిలదీశారు. దీంతో అవాక్కవ్వడం వేదిక మీదున్న మంత్రుల వంతయింది. వైఎస్ జగన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేసిన ఆ మహిళ.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి గానీ, వైఎస్ జగన్ గానీ ఎలాంటి అవినీతికి పాల్పడలేదని పేర్కొన్నారు. వైఎస్ జగన్ నిజాయితీ పరుడు, ఆయన గురించి తప్పుడు ఆరోపణలు, విమర్శలు చేస్తే ఊరుకునేది లేదంటూ మంత్రులను సభలోనే కడిగిపారేశారు. వైఎస్ జగన్ ఎలాంటి తప్పు చేయలేదని, జై జగన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేయడంతో దిక్కుతోచని పరిస్థితుల్లో మంత్రులు జవహర్, ప్రత్తిపాటి పుల్లారావుతో పాటు స్థానిక ఎమ్మెల్యే బుజ్జి సభ నుంచి అర్ధాంతరంగా వెళ్లిపోయారు. -
ముగ్గురూ ముగ్గురే
సాక్షి ప్రతినిధి, ఏలూరు : జిల్లాలో పేరుకు ముగ్గురు మంత్రులు ఉన్నారు. అందులో ఒకరు బీజేపికి చెందిన వారు కాగా ఇద్దరు టీడీపీకి చెందిన వారు. బీజేపీ నుంచి గెలిచిన పైడికొండల మాణిక్యాలరావు తనను అంటరానివారిగా టీడీపీ నాయకులు చూస్తున్నారని చెబుతున్నారు. మిగిలిన ఇద్దరు మంత్రులది వారి పంథా వారిదే. జనం గోడు పట్టించుకోవడం లేదు. జిల్లాలో సాగునీరు అందక వరిపైరు ఎండిపోతోందని రైతులు రోడ్డెక్కి ఉద్యమాలు చేస్తున్నా.. కనీసం ఆ విషయమై సమీక్ష జరిపే ప్రయత్నం కూడా ఆ ఇద్దరు మంత్రులు చేయకపోవడం విమర్శలకు తావిస్తోంది. పితాని సత్యనారాయణ నియోజకవర్గంలో పంటలు ఎండిపోయే పరిస్థితి ఉంది. ఆయన ఇప్పటి వరకూ ఆ ప్రాంతాల్లో పర్యటించిన పాపాన పోలేదు. ఇక మరోమంత్రి కేఎస్ జవహర్‌ది కూడా ఇదే తీరు. పచ్చని పొలాలతో కళకళలాడే పశ్చిమలో మునుపెన్నడూ లేనివిధంగా కరువు ఛాయలు అలముకుంటున్నాయి. మార్చి మొదటివారంలోనే పంట పొలాలు బీటలు వారిపోతున్నాయి. వెరసి అన్నదాతకు తీవ్ర సాగునీటి కష్టం వచ్చింది. ఆరుగాలం శ్రమించే రైతులు ఇప్పుడు రబీ గట్టెక్కేదెలాగా అని మధనపడుతున్నారు. వంతుల వారీ విధానంతో సాగునీరు అందిస్తామన్న పాలకుల హామీలు గాలిలో కలిసిపోవడంతో చుక్క నీరు అందక రైతన్నలు రబీపై ఆశలు వదిలేసుకుంటున్నారు. జిల్లాలో నరసాపురం, యలమంచిలి, మొగల్తూరు, ఆచంట, పెనుమంట్ర, అత్తిలి, భీమవరం, వీరవాసరం, పాలకోడేరు, పాలకొల్లు, పెంటపాడు, దెందులూరు, ఉంగుటూరు, భీమడోలు, నిడమర్రు, గణపవరం మండలాల్లో ఎప్పుడూ లేని విధంగా సాగునీటి ఎద్దడి నెలకొంది. గోదావరి డెల్టాలో నీటిమట్టం గణనీయంగా తగ్గిపోవడంతో శివారు పొలాలకు నీరు అందే పరిస్థితి లేదు. కొన్ని ప్రాంతాల్లో ఏకంగా పచ్చని పంట పొలాలకు నెర్రలు వచ్చాయి. పాలకులు ఏం చేస్తున్నట్టు? సాగునీటి సమస్యపై రైతులు అల్లాడుతున్నా, ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించి అండగా నిలవాల్సిన పాలకులు కనీసం స్పందించడం లేదని రైతు సంఘాల నేతలు నిప్పులు చెరుగుతున్నారు. కనీసం జిల్లాలోని ఇరిగేషన్ అధికారులను కూర్చోబెట్టి ఏం జరుగుతోంది, ఏం చేస్తే ఈ పరిస్థితి నుంచి గట్టెక్కుతామన్న ఆలోచన కూడా చేయకపోవడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. మూడు నెలల క్రితం జరిగిన నీటిపారుదల సలహామండలి సమావేశంలో పట్టిసీమ నుంచి నీరు తరలించడం ద్వారా గోదావరి డెల్టా నష్టపోతోందన్న విషయాన్ని మంత్రి పితాని సత్యనారాయణ దృష్టికి తీసుకువచ్చారు. గోదావరి నీటి లభ్యతను దృష్టిలో పెట్టుకుని వెంటనే పట్టిసీమ నుంచి నీటి సరఫరా నిలిపివేయాలని కోరారు. అయితే తర్వాత దానిపై దృష్టి పెట్టలేదు. ఒకవైపు గోదావరిలో నీరు అడుగంటినా రికార్డుల కోసం 105 టీఎంసీలను తరలించేశారు. పట్టిసీమ కట్టేసే సమయానికే గోదావరిలో నీటి లభ్యత చాలా తక్కువ ఉందని తేలింది. అయినా డెల్టాను కాపాడే దిశగా చర్యలు చేపట్టలేదు. దీంతో ప్రస్తుత సాగునీటి సంక్షోభం తీవ్రస్థాయిలో ముందుకు వచ్చింది. మంత్రులు కేవలం తమ స్వప్రయోజనాలు, సొంత నియోజకవర్గాలకే పరిమితం అయిన పరిస్థితి గతంలో ఎప్పుడూ లేదని రైతుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
మంత్రికి తృటిలో తప్పిన ప్రమాదం
పశ్చిమగోదావరి జిల్లా : ఏపీ మంత్రి కేఎస్ జవహర్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. నల్లజర్ల మండలం దూబచర్ల వద్ద ఎక్సైజ్, ప్రొహిబిషన్ శాఖామంత్రి జవహర్ కారు ప్రమాదానికి గురైంది. అనంతపురం జన్మభూమి పర్యటన ముగించుకుని కొవ్వూరు తిరిగివెళ్తున్న మంత్రి కాన్వాయ్‌ని వెనక నుంచి స్విఫ్ట్ డిజైర్ కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎస్కార్ట్ జీపు, మంత్రి ప్రయాణిస్తోన్న వాహనం పాక్షికంగా దెబ్బతిన్నాయి. అదృష్టవశాత్తూ మంత్రి జవహర్ స్వల్పగాయాలతో బయటపడ్డారు. -
మంత్రి తీరుపై చినబాబు సీరియస్
కొవ్వూరులో మంత్రి కేఎస్ జవహర్, టీడీపీ నాయకుల మధ్య చోటు చేసుకున్న వివాదాన్ని అధిష్టానం సీరియస్‌గా తీసుకుంది. మంత్రికి వ్యతిరేకంగా తెలుగు తమ్ముళ్లు పార్టీ జెండాలు పట్టుకుని ధర్నా, నిరసన ప్రదర్శన చేయడం, అదే రోజు మంత్రి వర్గీయులు పోటీగా ర్యాలీ నిర్వహించడంతో కొవ్వూరులో పార్టీ ప్రతిష్ట దెబ్బతిందని మంత్రిని మందలించినట్టు తెలిసింది. పశ్చిమగోదావరి, ఏలూరు, సాక్షిప్రతినిధి / కొవ్వూరు : సోషల్ మీడియాలో తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారని మంత్రి తన పీఆర్ఓతో ఇటీవల కొవ్వూరు పోలీసు స్టేషన్లో కేసు పెట్టించడం, నిందితుడిగా పేర్కొన్న అన్నదేవరపేట మాజీ ఉప సర్పంచి కాకర్ల సత్యేంద్రప్రసాద్కు నోటీసు ఇవ్వడం, పార్టీ నేత అల్లూరి విక్రమాదిత్య కలుగ జేసుకుని ఈ సమస్యను సీఎం తనయుడు నారా లోకేష్ దృష్టి తీసుకెళ్లడం తెలిసిందే. లోకేష్ పీఏ స్వయంగా మంత్రి జవహర్‌కి ఫోన్ చేసి పార్టీ శ్రేయస్సు దృష్టిలో ఉంచుకుని రాజీ చేసుకోవాలని సూచించినట్టు తెలిసింది. దీనిలో భాగంగా మంత్రి ఇంటికి వెళ్లిన సత్యేంద్ర ప్రసాద్‌ను, అతని వెంట వెళ్లిన అన్నదేవరపేట ఉప సర్పంచి కూచికూడి గణపతి కృష్ణలపై చెయ్యి చేసుకున్నట్టు సమాచారం. దీంతో మంత్రి వైఖరిపై లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. రాజీ చేసుకోమని పంపితే చెయ్యి చేసుకుని సమస్యను జటిలం చేయడంతో పాటు పార్టీని రోడ్డెక్కించారని మందలించినట్టు సమాచారం. బీరు హెల్త్ డ్రింక్ అని మంత్రి జవహర్ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై వేల మంది పోస్టింగ్‌లు పెట్టారు. వీళ్లెవ్వరిపై కేసు నమోదు చేయని మంత్రి తనకు వ్యతిరేకం వర్గంగా ముద్రపడిన అల్లూరి విక్రమాదిత్య అనుచరులపై కేసు నమోదు చేయించడం దుమారానికి కారణమైంది. ఇంటెలిజెన్స్ వర్గాలు ఆరా ఈ వివాదంతో కొవ్వూరు టీడీపీలో నాయకులు రెండు వర్గాలుగా చీలిపోయారు. మంత్రి ఇరువురు నాయకుల్ని కొట్టినట్టు ఇంటెలిజెన్స్ వర్గాలు సైతం «ధృవీకరించాయని సమాచారం. దీనిపై లోకేష్ వ్యక్తిగతంగా నిఘావర్గాల నుంచి నివేదిక తెప్పించుకున్నట్లు చెబుతున్నారు. మంత్రి కొట్టడం వాస్తవమేనని ధృవీకరించినట్టు సమాచారం. దీంతో అధిష్టానం ఈ సమస్యకు తెరవేయకపోతే పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లుతుందని గుర్తించి నష్ట నివారణ చర్యలు ప్రారంభించింది. జిల్లా ఇన్చార్జ్ మంత్రి పత్తిపాటి పుల్లారావుకు ఈ సమస్యను సర్దుబాటు చేయాలని సూచించినట్టు తెలిసింది. బుధవారం మళ్లీ మంత్రి జవహర్ వర్గీయులు పట్టణంలో ర్యాలీ చేసేందుకు సన్నద్ధమవడంతో పత్తిపాటి ఫోన్ చేసి చీవాట్లు పెట్టడంతో విరమించుకున్నట్టు తెలిసింది. ఇది ఇలా ఉంటే గురువారం అల్లూరి విక్రమాదిత్యతోపాటు ఇతర నాయకులు రాజధానిలో పత్తిపాటి పుల్లారావును కలిసి ఇప్పటి వరకు జరిగిన పరిణామాలు వివరించినట్టు తెలిసింది. జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి, పార్టీ నేత పెండ్యాల అచ్చిబాబుతో పత్తిపాటి స్వయంగా ఫోన్లో మాట్లాడినట్టు చెబుతున్నారు. ఇరువర్గాల మధ్య రాజీ కుదిర్చి పార్టీలో నెలకొన్న విభేదాలకు తెరవేయాలని పత్తిపాటి కోరినట్టు తెలిసింది. అవసరమైతే ఒక కమిటీని ఏర్పాటు చేసి రాజీ చేద్దామని కోరినట్టు చెబుతున్నారు. పార్టీలో తీవ్ర దుమారం రేపిన ఈ విభేదాలు అధిష్టానం పెద్దల సూచనలతోనైనా సమసి పోతాయా ? లేదా? అన్నది వేచి చూడాల్సిందే. దిగివచ్చిన మంత్రి : పార్టీలో రేగిన వివాదంపై అధిష్టానం సీరియస్ కావడంతో మంత్రి జవహర్ పెట్టించిన కేసును వెనక్కి తీసుకునేందుకు అంగీకరించినట్టు సమాచారం. ఇప్పటికే పట్టణ పోలీసులు ప్రత్యర్ధులకు ఫోన్ చేసి కేసు విరమించుకుంటామని మంత్రి చెప్పారని వర్తమానం పంపినట్లు తెలిసింది. మంత్రిపై పెట్టిన కేసును కూడా వెనక్కి తీసుకోవాలని పోలీసులు సూచించినట్టు సమాచారం. మంత్రిపై దాడి చేసినట్టు ఫిర్యాదు? మంత్రి ఇంటికి పిలిపించుకుని టీడీపీ నాయకులు కాకర్ల సత్యేంద్ర ప్రసాద్, కూచికూడి గణపతికృష్ణలను కొట్టడంపై టీడీపీ శ్రేణులు ఆందోళన చేసి డీఎస్పీకి వినతిపత్రం ఇచ్చినరోజే పోటీగా మంత్రి వర్గీయులు డీఎస్పీకి మరో ఫిర్యాదు ఇచ్చారు. దీంట్లో డిసెంబర్ 31న అన్నదేవరపేటలో సమావేశానికి వెళ్లిన మంత్రి జవహర్‌పై సత్యేంద్ర ప్రసాద్, గణపతి కృష్ణలు దాడి చేసి కులం పేరుతో దూషించినట్టు ఫిర్యాదు చేశారు. వాస్తవంగా ఈ సమావేశం జరిగే రోజున ఈ ఇరువురు నాయకులు కర్నూలులోనే ఉన్నారని చెబుతున్నారు. పోలీసులు 30వ తేదీన 41 (సీ) నోటీసుపై సంతకం చేయించుకోవడమే అందుకు ప్రత్యక్ష సాక్ష్యమని ఆ నాయకులు చెబుతున్నారు. వాస్తవంగా 31వ తేదీన మంత్రిపై దాడి చేసి, కులం పేరుతో దూషించి ఉంటే జనవరి 2వ తేదీ వరకు మంత్రి వర్గీయులు డీఎస్పీకి ఎందుకు ఫిర్యాదు చేయలేదనేనది ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది. వందల మంది హాజరైన సమావేశంలో మంత్రిపై దాడి చేసినట్టు, కులం పేరుతో దూషించినట్టు ఫిర్యాదు చేయడం నమ్మశక్యంగా లేదు. ఆ సమావేశంలో మంత్రి ఎస్కార్ట్‌గా వచ్చిన పోలీసులున్నారు. తక్షణం ఆ వ్యక్తులను అక్కడే అరెస్టు చేయించవచ్చు. నిజంగా దాడి చేసినా, కులం పేరుతో దూషించినా మంత్రి హోదా ఉన్న వ్యక్తి రెండు రోజుల వరకు ఎందుకు ఫిర్యాదు చేయాలేదన్నది అంతు చిక్కని ప్రశ్నగా చెప్పవచ్చు. సొంత పార్టీ నాయకులపై మంత్రి చెయ్యి చేసుకున్నాడన్న అంశం టీడీపీలో దుమారం రేపింది. మంత్రికి వ్యతిరేకంగా కార్యకర్తలు రోడ్డెక్కిన తరుణంలో ప్రతిష్టను కాపాడుకునే ప్రయత్నంలో ఈ ఫిర్యాదు చేయించి ఉంటారని అర్ధమవుతోంది. -
జవహర్ జవదాటు
చెప్పుల కాళ్లతో శివుడు, వినాయకుడు, నందీశ్వరుడి విగ్రహాల తొలగింపుపై చింతిస్తున్నాం. కమిటీ రాతపూర్వకంగా వినతి పత్రం అందజేస్తే విగ్రహాల ఏర్పాటుకు స్థలం కేటాయించేందుకు చర్యలు తీసుకుంటాం. హిందువుల మనోభావాలను గౌరవిస్తాం. – కేఎస్ జవహర్, రాష్ట్ర పొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రి (శుక్రవారం మాట్లాడిన మాటలివీ..) శ్రీనివాస స్నాన ఘట్టంలో నీటిపారుదల శాఖ స్థలంలో అనుమతి లేకుండా పూజలు, ఇతర కార్యక్రమాలు, సభలు, సమావేశాలు నిర్వహించరాదు. నిర్వహిస్తే శాంతిభద్రతల దృష్ట్యా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. – ఎస్బీవీ శుభాకర్, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసు, పట్టణ పోలీసు స్టేషన్, కొవ్వూరు (ఈ మేరకు నోటీసూ జారీ చేశారు) కొవ్వూరు: జవహర్ అన్నమాట జవదాటారా? హిందువుల మనోభావాలను పట్టించుకోవడం లేదా.. తాజా పరిణామాలు చూస్తుంటే అవుననే సమాధానమే వస్తోంది. శ్రీనివాస స్నానఘట్టంలో నిషేధాజ్ఞలు విధిస్తూ.. పోలీసులు తాజాగా జారీ చేసిన నోటీసు హిందువుల్లో ఆగ్రహం రేపుతోంది. కానరాని ప్రభుత్వ చొరవ కొవ్వూరు శ్రీనివాస స్నానఘట్టంలో చెప్పుల కాళ్లతో శివుడు, వినాయకుడు, నందీశ్వరుడి విగ్రహాల తొలగింపు వ్యవహారంపై ప్రభుత్వం నుంచి స్పందన కరువైంది. హిందువుల మనోభావాలను దెబ్బతీసే ఈ దుశ్చర్యను పార్టీలకు అతీతంగా అందరూ ఖండించారు. భక్తులకు మద్దతు తెలిపారు. సున్నితమైన ఈ సమస్య పరిష్కారానికి చొరవచూపాల్సిన ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదు. పైపెచ్చు సమస్యను మరింత జఠిలం చేసేలా యత్నిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గుర్తుకొచ్చిన శాంతిభద్రతలు ఓ మత విశ్వాసాలను దెబ్బతీస్తూ.. విగ్రహాలు తొలగించిన రోజున గుర్తుకురాని శాంతిభద్రతలు ప్రభుత్వానికి ఇప్పుడు గుర్తుకొచ్చాయి. విగ్రహాల తొలగింపును నిరసిస్తూ.. శుక్రవారం భక్తులు శివలింగానికి 108 బిందెలతో అభిషేకాలు చేశారు. మంత్రి కేఎస్ జవహర్‌కు, ప్రభుత్వానికి మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుతూ గణపతి హోమం చేశారు. దీంతో ప్రభుత్వ పెద్దలకు చిర్రెత్తుకు వచ్చింది. శాంతి భద్రతలు గుర్తుకు వచ్చాయి. స్నానఘట్టంలో అనుమతిలేకుండా ఎలాంటి పూజలు, ఇతర కార్యక్రమాలు, సభలు, సమావేశాలు నిర్వహించరాదని, అలాచేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసుల ద్వారా తాఖీదులు జారీ చేసింది. ఈ చర్య సమస్యకు ఆజ్యం పోసినట్టయింది. శాంతియుతంగానే ఆందోళన హిందూ సంప్రదాయంలో కార్తీక మాసంలో శివరాధనకు అంత్యంత ప్రాముఖ్యం ఉంది. విగ్రహాలు తొలగించిన ప్రదేశంలోనే పునః ప్రతిష్ఠించాలని కొద్దిరోజుల నుంచి భక్తులు డిమాండ్ చేస్తున్నారు. దీనికి వైఎస్సార్ సీపీ, కాంగ్రెస్, బీజేపీ, సీపీఎంలు మద్దతు ప్రకటించాయి. భక్తులకు అండగా నిలిచాయి. చేతికి సంకెళ్లు వేసుకుని, నోటికి æనల్ల రిబ్బ న్లు కట్టుకుని అఖిలపక్షం ఆధ్వర్యంలో శాంతియుతంగా నిరసన ర్యాలీ కూడా నిర్వహించారు. అధికారులకు, దేవాదాయ శాఖ మంత్రికి వినతిపత్రాలు సమర్పిం చారు. ఇప్పటి వరకు ఎక్కడా శాంతిభద్రతలకు విఘాతం కలిగించిన దాఖాలాల్లేవు. విగ్రహాలు తొలగించిన రోజున ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నా.. అనంతరం నిర్వహించిన కార్యక్రమాలన్నీ శాంతియుత మార్గంలోనే నడిచాయి. ఇలాంటి తరుణంలో పోలీసులు తాఖీదులు ఇవ్వడం దూమారం రేపుతోంది. విగ్రహాలు ప్రతిష్ఠించాలి : సోము వీర్రాజు ఇదిలా ఉంటే ఆదివారం సాయంత్రం బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు, నాయకులతో కలిసి విగ్రహాలు తొలగింపు ప్రాంతాన్ని సందర్శించారు. వెంటనే విగ్రహాల ప్రతిష్ఠకు అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విగ్రహాలను పునః ప్రతిష్ఠించి తీరుతామని ఆయన ప్రకటించడం, శాసనమండలిలోనూ ఈ అంశాన్ని ప్రస్తావిస్తానని ఆయన ప్రకటించడం చర్చనీయాంశమైంది. స్నానఘట్టంలో పోలీసులు మోహరించడంపై ఆయన మండిపడ్డారు. ఇంతమంది పోలీసుల అవసరమేముందని, తమను అరెస్టు చేస్తారా అని ఘాటుగా ప్రశ్నించారు. టెంపుల్ టూరిజం అభివృద్ధి చేయాలి ఈ సందర్భంగా ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడుతూ.. ఆధ్యాత్మిక కేంద్రమైన కొవ్వూరులో టెంపుల్ టూరిజం అభివృద్ధి చేయాలని, రిసార్ట్‌ల పేరుతో భక్తికి విరుద్ధమైన బార్లు ఏర్పాటు చేయకూడని డిమాండ్ చేశారు. గోదావరి పవిత్రతను దృష్టిలో ఉంచుకుని నదీతీరంలో చెత్త డంపింగ్ చేయడం, పందుల ఆవాసాలు ఏర్పాటు చేయడం వంటి వాటిపై అధికారులు సత్వరం చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ప్రాంతాన్ని రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. టెంపుల్ టూరిజం అభివృద్ధిపై కలెక్టర్, మంత్రి జవహర్, దేవదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావులతో మాట్లాడతానన్నారు. ఆయన వెంట బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోడూరి లక్ష్మీనారాయణ, జిల్లా ఉపాధ్యక్షుడు ముప్పరాజు శ్రీనివాసరావు, పట్టణ పార్టీ అధ్యక్షుడు బీవీ ముత్యాలరావు, నాయకులు పరిమి రా«ధాకృష్ణ, పిల్లలమర్రి మురళీకృష్ణ, సలాది సందీప్‌కుమార్, దేవగుప్తాపు లక్ష్మణరావు, ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు పిక్కి నాగేంద్ర, కొండపల్లి రత్నసాయి, మాసా ఆనంద్, వీరమాచినేని చైతన్య, పెరుగు పోతురాజు, మండల పార్టీ అధ్యక్షుడు గన్నమని భాస్కరరావు, వైఎస్సార్ సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పరిమి హరిచరణ్, దళిత విభాగం రాష్ట్ర కార్యదర్శి ముప్పిడి విజయరావు, పట్టణ పార్టీ అధ్యక్షుడు రుత్తల ఉదయభాస్కరరావు, నాయకులు నగళ్లపాటి శ్రీనివాస్, అడ్డూరి సుబ్బారావు,స్ధానికులు అనపర్తి శివరామ కృష్ణ, ఉప్పులూరి కృష్ణారావు, ఆర్యాద్యుల రాధాదేవి తదితరులు వెంట ఉన్నారు. ఇదిలా ఉంటే ఇప్పటి వరకు ఘటనా స్థలానికి రాని టీడీపీ నాయకులూ విగ్రహాలు తొలగించిన ప్రాంతాన్ని సందర్శించి చెప్పులతో విగ్రహాలు తొలగింపును ఖండిస్తున్నట్టు ప్రకటించారు. -
డ్రగ్స్ కేసు: అసలు నిందితులు వేరే ఉన్నారు!
హైదరాబాద్: డ్రగ్స్ రాకెట్ కేసులో ప్రధాన సూత్రధారి, పోలీసులు అరెస్టు చేసిన కెల్విన్ అమాయకుడని అతడి తండ్రి జవహర్ అన్నారు. కెల్విన్ డ్రగ్స్‌కు బానిసైన విషయం వాస్తవమేనని చెప్పారు. అయితే ఈ డ్రగ్స్ రాకెట్ వ్యవహారంలో అతడికి డ్రగ్స్ సరఫరా చేసిన వారిని అరెస్ట్ చేసి విచారిస్తే అసలు నిందితులు బయటకు వస్తారని మీడియాతో ఆయన వాపోయారు. కెల్విన్‌ను సిట్ అధికారులు శనివారం కస్టడీలోకి తీసుకున్నారు. రెండు రోజులపాటు కెల్విన్‌ను సిట్ అధికారులు విచారించనున్నారు. డ్రగ్స్ సరఫరా చేసే కెల్విన్ కాల్‌లిస్ట్ ఆధారంగా 12మంది సినీ ప్రముఖులకు నోటీసులు జారీచేసిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు 13 మంది అరెస్ట్ డ్రగ్స్ కేసులో ఇప్పటివరకు 13మందిని ఎక్సైజ్ ఎన్ఫోర్సుమెంట్ అధికారులు అరెస్టు చేశారు. వీరిలో ఏ-1గా కెల్విన్ ఉన్నారు. మిగతావారు వరుసగా అబ్దుల్ కుదుస్, అబ్దుల్ వాయిద్, ఆమెన్ నాయుడు, నిఖిల్ శెట్టి, కుందన్ సింగ్, అనిరుధ్, సంతోష్ దీప్, మహ్మద్ జీ అలీఖాన్, బెర్లాండ్ విల్సన్, అనిష్, రీతుల్ అగర్వాల్, పీయూష్‌లు ఉన్నారు. కాగా, వీరిలో మొదటిసారి అరెస్టు చేసిన ముగ్గురు నిందితులను విచారించేందుకు ఎక్సైజ్ ఎన్ఫోర్సుమెంట్ అధికారులు చర్లపల్లి జైలు నుంచి రెండు రోజుల తమ కస్టడీకి తీసుకున్నారు. -
వైఎస్ఆర్సీపీలోకి జవహర్
జగన్మోహన్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరిన టీడీపీ సీనియర్ నాయకుడు వైఎస్ఆర్సీపీ విధి విధానాలు నచ్చాయన్న జవహర్ పాకాల: 30 సంవత్సరాలుగా టీడీపీలో ఉన్న సీనియర్ నాయకుడు, ఎంపీటీసీ మాజీ సభ్యుడు, పాకాల మండల మాజీ కో-ఆప్షన్ మెంబర్, జిల్లా మైనారిటీ విభాగం మాజీ జారుుంట్ కన్వీనర్ జవహర్ వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరారు. బుధవారం చంద్రగిరి విచ్చేసిన ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి పార్టీ కండువా కప్పి జవహర్‌ను పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా జవహర్ మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ విధి విధానాలు నచ్చడం వల్ల, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కార్యక్రమాలకు ఆకర్షితులై పార్టీలో చేరినట్లు తెలిపారు. జవహర్ రాకతో మండలంలో పార్టీ బలపడుతుందని ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తెలిపారు. ఆయనకు ఈ పార్టీలో మంచి భవిష్యత్తు ఉంటుందని హామీ ఇచ్చారు. జవహర్ పార్టీలో చేరడంపై వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్ నంగాబాబురెడ్డి, రాష్ట్రీ సేవాదళ్ సయుక్త కార్యదర్శి చెన్నకేశవరెడ్డి, రాష్ట్రీయ కార్యదర్శి విక్రమ్‌రెడ్డి తదితరులు హర్షం వ్యక్తం చేశారు.