వైఎస్‌ఆర్‌సీపీలోకి జవహర్
జగన్‌మోహన్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరిన టీడీపీ సీనియర్ నాయకుడు
వైఎస్‌ఆర్‌సీపీ విధి విధానాలు నచ్చాయన్న జవహర్
పాకాల: 30 సంవత్సరాలుగా టీడీపీలో ఉన్న సీనియర్ నాయకుడు, ఎంపీటీసీ మాజీ సభ్యుడు, పాకాల మండల మాజీ కో-ఆప్షన్ మెంబర్, జిల్లా మైనారిటీ విభాగం మాజీ జారుుంట్ కన్వీనర్ జవహర్ వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సమక్షంలో వైఎస్‌ఆర్‌సీపీలో చేరారు. బుధవారం చంద్రగిరి విచ్చేసిన ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి పార్టీ కండువా కప్పి జవహర్‌ను పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా జవహర్ మాట్లాడుతూ వైఎస్‌ఆర్‌సీపీ విధి విధానాలు నచ్చడం వల్ల, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కార్యక్రమాలకు ఆకర్షితులై పార్టీలో చేరినట్లు తెలిపారు.
జవహర్ రాకతో మండలంలో పార్టీ బలపడుతుందని ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తెలిపారు. ఆయనకు ఈ పార్టీలో మంచి భవిష్యత్తు ఉంటుందని హామీ ఇచ్చారు. జవహర్ పార్టీలో చేరడంపై వైఎస్‌ఆర్‌సీపీ మండల కన్వీనర్ నంగాబాబురెడ్డి, రాష్ట్రీ సేవాదళ్ సయుక్త కార్యదర్శి చెన్నకేశవరెడ్డి, రాష్ట్రీయ కార్యదర్శి విక్రమ్‌రెడ్డి తదితరులు హర్షం వ్యక్తం చేశారు.