జిల్లాలోని కొవ్వూరు నియోజకవర్గం టీడీపీలో నెలకొన్న వర్గ విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్ల మధ్య కుమ్ములాట రోడ్డుకెక్కింది. స్థానిక టీడీపీ నేతలు.. మంత్రి జవహర్ అనుకూల వర్గం, వ్యతిరేక వర్గంగా విడిపోయారు. టీడీపీ అధిష్టానం జవహర్‌కు టికెటు కేటాయించవద్దంటూ ఆయన వ్యతిరేక వర్గం బుధవారం భారీ ర్యాలీ చేపట్టింది.