
సాక్షి, అమరావతి : మంత్రి జవహర్‌పై సొంత పార్టీలోనే వ్యతిరేకత మొదలైంది. వచ్చే ఎన్నికల్లో మంత్రి జవహర్‌కు టికెట్ ఇస్తే చిత్తుగా ఓడిస్తామని కొవ్వూరు టీడీపీ నాయకులు పార్టీ అధిష్టానానికి తెలియజేశారు. గ్రూప్ రాజకీయాలను ప్రొత్సహిస్తూ పార్టీని నాశనం చేస్తున్నారని అధిప్టానానికి ఫిర్యాదు చేశారు. పార్టీలో మొదటి నుంచి ఉన్న నేతలకు జవహర్ గౌరవం ఇవ్వడంలేదని మండిపడ్డారు. బ్రాందీ షాపుల్లో పనిచేసే వారే కొవ్యూరులో పార్టీని నడుపుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. జవహర్‌కు వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వోద్దని అధిష్టానాన్ని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment