టీడీపీ మంత్రి జవహర్
ఉండి: పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం యండగండిలో ఏర్పాటు చేసిన గ్రామ దర్శిని-గ్రామ వికాసం కార్యక్రమంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై మంత్రి జవహర్ తీవ్ర విమర్శలు చేశారు. కార్యక్రమంలో మంత్రి జవహర్ మాట్లాడుతూ..సినీ నటుడు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టి హోల్‌సేల్‌గా కాంగ్రెస్‌కు అమ్మితే..తమ్ముడు పవన్ కల్యాణ్ రిటైల్‌గా జనసేనను అమ్మడానికి సిద్ధమయ్యారని తీవ్రంగా విమర్శించారు. పవన్ కల్యాణ్ వారసత్వం గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. పవన్ కల్యాణ్ ఏమైనా ప్రభాస్ లాగా లేక ఇంకొకరి లాగా ఆరడుగుల అందగాడా, ఆజానుబాహుడా అని ప్రశ్నించారు.
తన అన్న నుంచి వచ్చిన వారసత్వం ద్వారానే కదా పైకొచ్చిందని సూటిగా అడిగారు. ఊరికి ఇరవై మంది పవన్ కల్యాణ్ కన్నా అందంగా ఉన్నవాళ్లు ఉన్నారని వ్యాఖ్యానించారు. వారసత్వ రాజకీయాల గురించి మాట్లాడే పవన్ కల్యాణ్ ఒక్కసారి ఆలోచించాలని హితవు పలికారు. చిరంజీవి సినిమా యాక్టర్ కాకపోతే పవన్ కల్యాణ్ ఎవరు, ఎక్కడుండేవారని ప్రశ్నించారు. చిరంజీవి కుటుంబంలో తొమ్మిదో, పదో సినిమా యాక్టర్లు వచ్చారు..అది సినీ వారసత్వం కాదా అని ప్రశ్నించారు. రాజకీయ వారసత్వం గురించి మాట్లాడే అర్హత పవన్ కల్యాణ్‌కు లేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment