undi
-
కొంప ముంచిన రఘురామ...ఉండిలో టీడీపీ క్లోజ్..
-
భీమవరానికి కొత్త శోభ.. 2 కోట్లతో సుందరీకరణ పనులు
భీమవరం(ప్రకాశం చౌక్): నూతన పశ్చిమగోదావరి జిల్లా కేంద్రం భీమవరం కొత్త శోభ సంతరించుకోనుంది. పట్టణ సుందరీకరణ దిశగా అధికారులు చర్యలు చేపట్టారు. జిల్లా కలెక్టర్ ఇటీవల పట్టణ సుందరీకరణపై అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వ హించారు. మున్సిపల్ అధికారులకు సృష్టమైన ఆదేశాలు జారీచేశారు. దాంతో పట్టణ సుందరీకణ పనులపై ఆగమేఘాలపై చర్యలు తీసుకుంటున్నారు. ఈ పనులకు సంబంధించి డ్రాయింగ్స్, నమూనాలు, నిధులు, అంచనాలు తదితర వాటితో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఇప్పటికే భీమవరంలో మల్టీప్లెక్స్‌లు, షాపింగ్ మాల్స్, హోటల్స్, పెద్ద పెద్ద బట్టల దుకాణాలు, బంగారం షాపులు ఉన్నాయి. అలాగే ఆకర్షణీయమైన లైటింగ్స్, డైకరేషన్‌తో భీమవరం కళకళలాడుతోంది. చిన్న సైజు నగరాన్ని తలపిస్తోంది. పట్టణాన్ని మరింత అభివృద్ధి చేసి ఆకర్షణీయంగా చేసేందుకు వాటర్ ఫౌంటెన్లు, వాల్ బ్యాక్‌గ్రౌండ్ ఫౌంటెన్స్, పచ్చదనం, వెల్కమ్ ఆర్చ్‌లు ఏర్పాటు చేసి మరింత అందంగా తీర్చిదిద్దనున్నారు. వాటర్ ఫౌంటెన్లకు రూ. 45 లక్షల ఖర్చు పట్టణ సుందరీకరణ పనులకు పలు రకాల నిధులు వాడేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. మున్సిపల్ సాధారణ నిధులు, సీడిఎంఏ, సీఎస్ఆర్ నిధులు ఉపయోగించుకుని అభివృద్ధి పనులు చేస్తారు. పట్టణంలోని ప్రకాశం చౌక్ సెంటర్, పోట్టి శ్రీరాములు విగ్రహం సెంటర్, బీవీ రాజు విగ్రహం సెంటర్లలో లైటింగ్ విత్ వాటర్ ఫౌంటెన్లును ఏర్పాటు చేస్తారు. ఇందుకు సీఎస్ఆర్ నిధులు రూ.45 లక్షలు వెచ్చిస్తారు. ఒక్కొక్క ఫౌంటెన్‌కు రూ.15 లక్షలు ఖర్చు చేయనున్నారు. త్వరలోనే ఈ పనులు చేపడతారు. 6 చోట్ల స్వాగత ఆర్చ్‌లు భీమవరం పట్టణానికి ఇతర ప్రాంతాల నుంచి ప్రవేశించే ప్రధాన రోడ్లపై ఆర్చ్‌లు ఏర్పాటు చేస్తున్నారు. ఉండి రోడ్డు, బీవీ రాజు రోడ్డు, గొల్లవానితిప్ప, పాలకొల్లు, జువ్వలపాలెం రోడ్డు, తణుకు రోడ్డులో ఈ ఆర్చ్‌లు ఏర్పాటు చేస్తుండగా.. వాటి నిర్మాణం కోసం మున్సి పల్ నిధులు రూ.90 లక్షలు ఖర్చు చేయనున్నారు. ఒక్కొక్క ఆర్చ్‌కు రూ.15 లక్షలు ఖర్చు చేస్తారు. పచ్చదనం కోసం రూ. 54 లక్షలు పట్టణంలో పచ్చదనం (గ్రీనరీ) కోసం సీడీఎంఏ నిధులు రూ.54 లక్షలు ఉపయోగించుకోనున్నారు. పట్టణంలో ప్రధాన రహదారుల వెంట ప్రత్యేకమైన, అందమైన మొక్కలు నాటే కార్యక్రమం చేపడుతు న్నారు. పట్టణంలోని అంబేద్కర్ సెంటర్లో యమనదుర్రు వంతెనకు అనుకుని గోడకు అందమైన చిత్రాలు వేయనున్నారు. అలాగే వాల్ ఫౌంటెన్ లేదా లైటింగ్ విత్ భీమవరం అని బోర్డు ఏర్పాటు చేస్తారు. ఇందుకు రూ.20 లక్షలు మున్సిపల్ నిధులు ఖర్చు చేస్తారు. స్థానిక ప్రకాశం చౌక్ సెంటర్ నుంచి పోలీసు బొమ్మ సెంటర్ వరకు పీపీ రోడ్డు మధ్యలో రూ.15 లక్షల ఖర్చుతో డివైడర్ నిర్మించి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటారు. ఎల్ఈడీ స్క్రీన్ల ఏర్పాటు ప్రకాశం చౌక్ సెంటర్, అంబేద్కర్ సెంటర్లో భీమవరానికి సంబంధించి విషయాలు తెలియచెప్పేలా ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకు సీఎస్ఆర్ నిధులు రూ.15 లక్షలు ఖర్చు చేస్తారు. (క్లిక్: పోలీసుల అదుపులో కోనసీమ అల్లర్ల కేసు అనుమానితుడు?) సుందరీకరణ పనులకు ప్రతిపాదనలు పంపాం కలెక్టర్ అదేశాలతో భీమవరం పట్టణం సుందరీకరణ పనులకు సంబంధించి అన్నీ సిద్ధం చేసి ప్రతిపాదనలు ప్రభుత్వానికి, మున్సిపల్ శాఖకు, భీమవరం ప్రత్యేక అధికారికి పంపాం. పట్టణంలో మూడు చోట్ల ఫౌంటెన్స్ నిర్మాణం పనులు ప్రారంభించడానికి చర్యలు తీసుకున్నాం. మిగిలిన పనులకు సంబంధించి ప్రణాళికలను రూపొందించి వాటి నిర్మాణానికి కూడా చర్యలు తీసుకుంటాము. – పి.శ్రీకాంత్, భీమవరం మున్సిపల్ ఇంజనీర్ -
అప్పుడు బాబులోని అన్న చచ్చిపోయాడా?
సాక్షి, పశ్చిమగోదావరి జిల్లా : ‘ఐదేళ్లలో మహిళల కోసం ఏమి చంద్రబాబు ఇప్పుడు ఎన్నికలు వచ్చేసరికి నేను మీ అన్నను. మీరు నా అక్కాచెల్లెళ్లు. నాకు ఓటెయ్యండి అని అడుగుతున్నారు. అన్నా అంటే ఎవరు? తోబుట్టువుకి తోడుగా ఉండేవాడే అన్న. అక్కచెల్లెకి కష్టకాలంలో తోడుగా ఉండేవాడు అన్న. ఇచ్చిన మాట తప్పని వాడే అన్న. ఐదేళ్ల అయింది రుణమాఫి చేస్తా అని చెప్పి. ఇప్పటి వరకూ ఒక్క రూపాయి కూడా మాఫీ చేయని వాడు అన్న అవుతాడా? వనజాక్షి చంద్రబాబుకు చెల్లెలులాంటిది కాదా? నడిరోడ్డున చింతమనేని ప్రభాకర్ జుట్టుపట్టుకొని రోడ్డుపై ఈడ్చుకెల్లారు. అప్పుడు ఏమైంది చంద్రబాబులోని అన్న. చచ్చిపోయాడా? మళ్లీ నిస్సిగ్గుగా అదే చింతమనేనికి టికెట్ ఇచ్చారు. రిషితేశ్వరి కాలేజీ విద్యార్థి చంద్రబాబుకు చెల్లి కాదా? చంద్రబాబు మనిషి అయిన బాబురావు మనిషి వల్ల ఆ బిడ్డ ఆత్మహత్య చేసుకుంది. అప్పుడు చంద్రబాబులోని అన్న చచ్చిపోయాడా? ఇప్పుడు వచ్చి ఓట్లు వేయండి అని మహిళలను అడిగితే ఎవరు నమ్ముతారు’ అని వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ సోదరి వైఎస్ షర్మిల ప్రశ్నించారు. బస్సు యాత్ర నిర్వహిస్తున్న షర్మిల గురువారం పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గ ఎన్నికల ప్రచార సభలో మాట్లాడారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే... చంద్రబాబు అన్న ఎలా అవుతారు? ఉండి నియోజకవర్గప్రజలకు, ఇక్కడు చేరివచ్చిన ప్రతి అమ్మకు, ప్రతి అయ్యకు, ప్రతి చెల్లికి , ప్రతి అన్నకు మీ రాజన్న కూతురు, మీ జగనన్న చెల్లెలు మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటోంది. రాజన్న రాజ్యం ఎలా ఉండేది? ప్రతి పేదవాడి అండగా, ప్రతి రైతుకు ధైర్యంగా కలిగించేలా, ప్రతి మహిళకు భరోసా కలిగించే ఉండేది. మన పర తేడా లేకుండా ప్రతి ఒక్క వర్గానికి మేలు చేసిన వ్యక్తి ఒక్క వైఎస్సార్ మాత్రమే. ఒక్క రూపాయి పన్ను పెంచకుండా గొప్ప పరిపాలన అందించిన రికార్డు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిది. కానీ ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి ఎలా ఉన్నారు? ఒక ముఖ్యమంత్రి ఎలా ద్రోహం చేయకూడదో ఈ ఐదేళ్లలో చంద్రబాబు మనకు చూపించారు. రైతు రుణమాఫీ అంటూ చేసిన మొదటి సంతకానికే దిక్కులేదు. డ్వాక్రామహిళలకు రుణమాఫీ చేస్తానన్నారు. ఒక్క రూపాయి కూడా మాఫీ కాలేదు. ఐదేళ్లు ఏమి చేయకుండా పసుపు కుంకుమ అంటూ భిక్షం వేస్తున్నట్లు ఇస్తున్నారు. ఎంగిలి చేయి విదిలిస్తున్నారు. అక్కా చెల్లెళ్లు మోసపోకండమ్మా. కేవలం మహిళలను మభ్యపెట్టడానికి చంద్రబాబు డబ్బులు ఇస్తున్నారు. చింతమనేని బెదిరింపులకి భయపడొద్దు : వైఎస్ షర్మిల ఐదేళ్లు ఏమి చేయలేదు. ఇప్పుడు నేను మీ అన్నను, మీరు మాకు ఓటేయ్యండి అని అడుక్కుంటున్నారు చంద్రబాబు. అన్నా అంటే ఎవరు? తోబుట్టువుకి తోడుగా ఉండేవారే అన్నా. అక్కచెల్లెకి కష్టకాలంలో తోడుగా ఉండేవాడు అన్న. ఇచ్చిన మాట తప్పని వాడే అన్న. ఐదేళ్లలో ఒక్క రూపాయి కూడా మాఫీ చేయని వాడు అన్న అవుతాడా? వనజాక్షి చంద్రబాబుకు చెల్లెలులాంటిది కాదా? నడిరోడ్డున చింతమనేని ప్రభాకర్ జుట్టుపట్టుకొని రోడ్డుపై ఈడ్చుకెల్లారు. అప్పుడు ఏమైంది చంద్రబాబులోని అన్న చచ్చిపోయాడా? మళ్లీ నిస్సిగ్గుగా అదే చింతమనేనికి టికెట్ ఇచ్చారు. రిషితేశ్వరి కాలేజీ విద్యార్థి చంద్రబాబుకు చెల్లి కాదా? చంద్రబాబు మనిషి అయిన బాబురావు మనిషి వల్ల ఆ బిడ్డ ఆత్మహత్య చేసుకుంది. అక్వాకల్చర్ ప్రాసెసింగ్ యూనిట్ వల్ల కాలుష్యం కలుగుతుందని మహిళలు ఆందోళన చేస్తే వాళ్లను పోలీసులతో కొట్టించి జైల్లో పెట్టించారు. అప్పుడు ఈయనలోని అన్న చచ్చిపోయాడా? అంగనీవాడి మహిళలు జీతాలు సరిపోవడంలేదదని ధర్నాలు చేస్తే లాఠీచార్జీ చేయించారు. జైల్లో పెట్టించారు. అప్పుడు ఈయనలోని అన్న చచ్చిపోయాడా? మధ్యాహ్నం బోజనం స్కీంలో ఆడవాళ్లు పనిచేస్తుంటే వాళ్ల ఉద్యోగాలు తీసేస్తామని చంద్రబాబు అంటే ఆ మహిళలు దర్నాలు చేశారు. అప్పుడు లాఠీచార్జీ చేసి మహిళలను జైల్లో పెట్టించారు. అప్పుడు ఆయనలోని అన్న చనిపోయాడా? చంద్రబాబు లాంటి అన్న ఉంటే అంతకు మించిన దురదృష్టవంతురాలే ఉండదు. ఒక్క పర్మినెంట్ బిల్డింగ్ అయినా కట్టారా? ఆరోగ్యశ్రీలో కార్పొరేట్ ఆస్పత్రులను తీసేశారు. చంద్రబాబు కుటుంబ సభ్యులు అయితే కార్పొరేట్ ఆస్పత్రిలో చికిత్స చేసుకోవాలట. సామాన్యులు అయితే ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యం చేయించుకోవాలట. ఇదెక్కడి న్యాయం?ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వడం లేదు. పిల్లలకు ఫీజు కట్టలేక తల్లిదంద్రులు కట్టలేక అప్పులు పాలు అవుతున్నారు. తల్లిదంద్రులను అప్పుల పాలు చేయకుండా మధ్యలోనే చదువులు ఆపేస్తున్నారు. పోలవరం.. కేంద్రం కట్టాల్సిన ప్రాజెక్టు. ఈయన కమిషన్ మింగొచ్చనని ప్రాజెక్టును తీసుకున్నారు. 15వేల కోట్లు ఉన్న పోలవరం ప్రాజెక్టును 60వేలకోట్లకు పెంచారు. మూడేళ్లలో పూర్తి చేస్తా అన్నారు. చేశారా? చిత్తశుద్ది ఉంటే పోలవరాన్ని నిర్మించేవారు. అమరావతిలో ఒక్క పర్మినెంట్ బిల్డింగ్ అయినా కట్టారా? కేంద్ర ప్రభుత్వం 2500 కోట్ల రూపాయలు ఇస్తే ఒక్క బిల్డింగ్ కట్టలేదు. ఏమైంది ఆ డబ్బంతా? అమ్మకు అన్నం పెట్టనోడు చిన్నమ్మకు బంగారు గాజులు పెట్టిస్తాడట. ఐదేళ్లు సీఎంగా ఉండి అమరావతి ఒక్క పర్మినెంట్ బిల్డింగ్ కట్టలేదు కానీ ఇంకో ఐదేళ్లు ఇస్తే అమెరికా చేస్తారాట. మన చెవిలో పూలు పెడతాడట. పప్పుకు మూడు ఉద్యోగాలు బాబు వస్తే జాబు వస్తుందన్నారు. ఎవరికి వచ్చింది? కేవలం చంద్రబాబు గారి కొడుకు లోకేష్‌కు మాత్రమే వచ్చింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు శాఖలకు మంత్రిని చెశారు. ఈ పప్పు లోకేష్‌కు కనీసం వర్ధంతికి , జయంతికి తేడా కూడా తెలియదు. అఆలు రావు గానీ అగ్ర తాంబూలం నాకే కావాలన్నాడట ఎవరో. పప్పు తీరు కూడా అలాగే ఉంది. ఒక్క ఎన్నికలో కూడా గెలవని పప్పుకు ఏ అర్హత ఉందని చంద్రాబాబు ఇన్ని ఉద్యోగాలు ఇచ్చారు. ఇది పుత్ర వాత్సల్యం కాదా? చంద్రబాబు గారి కొడుకు ఏమో మూడు ఉద్యోగాలు అట. మాములు ప్రజలకు ఏమో ఉద్యోగాలు లేవు. ఉద్యోగ నోటిఫికేషన్లు లేవు. చంద్రబాబు వల్లే హోదా రాలేదు ప్రత్యేక హోదా ఎంత అవసరం. ప్రత్యేక హోదా ఏపీకి ఊపిరి వంటింది. అలాంటి హోదాన్ని నీరు గార్చిన వారు చంద్రబాబు. ఈ రోజు రాష్ట్రానికి హోదా రాలేదంటే చంద్రబాబే కారణం. బీజేపీతో కుమ్మకై ప్యాకేజీకి ఒప్పకున్నారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హోదా కోసం చేయని పోరాటం లేదు. హోదా కోసం రాష్ట్రంలో రోజుల తరబడి నిరాహార దీక్షలు చేశారు. బంద్‌లు, రాస్తారోకోలు, ధర్నాలు, మానవహారాలు, కొవ్వొత్తుల ర్యాలీలు.. ఇలా ఈ ఐదేళ్లలో ఎన్నో కార్యక్రమాలు చేశారు. అఖరికి వైఎస్సార్సీపీ ఎంపీలతో రాజీనామా కూడా చెయించారు. చంద్రబాబు ఇవాళ యూటర్న్ తీసుకొని హోదా అంటున్నాడు అంటే దానికి కారణం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కాదా? గత ఎన్నికల ముందు హోదా అన్నారు. పదేళ్లు కాదు 15 ఏళ్లు కావాలన్నారు. తర్వత ప్యాకేజీ అన్నారు. ఇప్పుడు మళ్లీ హోదా అంటున్నారు. రేపు ఏమి అంటారో అతనికే తెలియదు. గత ఎన్నికల్లో బీజేపీతో పొత్తు.. ఇప్పుడు కాంగ్రెస్‌తో పొత్తు అంటున్నాడు. అంటే చంద్రబాబు ఎప్పుడు ఎలా మాట మారుస్తారో ఆయనకే తెలియదు. రోజుకో మాట..పూటకో వేషం చంద్రబాబుది. సింహం సింగిల్ గానే వస్తుంది చంద్రబాబు అబద్దాలు ప్రచారం చేస్తూ కేసీఆర్‌తో పొత్తు పెట్టుకుంటున్నామని ఆరోపిస్తున్నారు. మాకు ఎవరితో పొత్తు అవసరం లేదు. సింహం సింగిల్ గానే వస్తుంది. నక్కలే గుంపులుగా వస్తాయి. అందుకే చంద్రబాబు కాంగ్రెస్, జనసేనతో కలిసి వస్తున్నారు. ఏ పొత్తు లేకుండా చంద్రబాబు ఇంతవరకు ఎన్నికలకే రాలేదు. 11వతేది ఎన్నికలు ఉన్నాయి. ఓటు వేసే సమయంలో ఒక్కసారి రాజన్నను తలచుకోండి. రాజన్న రాజ్యం రావాలంటే జగనన్న సీఎం కావాలి. జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి రైతుకి పెట్టుబడి సాయం కింద ప్రతి మే మాసంలో రూ. 12500 రూపాయలు ఇస్తారు. గిట్టుబాటు ధరకై మూడు వేల కోట్ల రూపాయలతోతో ఒక నిధి ఏర్పాటు చేస్తారు. డ్వాక్రా రుణాలు నాలుగు విడతల్లో మాఫీ చేస్తారు. సున్నా వడ్డికే రుణాలు ఇస్తారు. కాలేజీ విద్యార్థులు ఏ కోర్సు అయినా చదవచ్చు. ఏ కోర్సు చదివిన ప్రభుత్వం ఉచితంగా చదివిస్తుంది. ఆరోగ్య శ్రీలో కార్పొరేట్ ఆస్పత్రిలను చేరుస్తాం. పిల్లలను బడికి పంపించడానికి తల్లిదండ్రులకు రూ. 15వేలు ఇస్తాం. అవ్వలకు తాతలకు పెన్షన్లు రూ. రెండు వేల నుంచి క్రమంగా మూడు వేలకు పెంచుతాం. వికలాంగులకు పెన్షన్లు మూడు వేలు ఇస్తాం. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీ మహిళలకు ఆర్థికసాయంగా రూ.75వేలు ఇస్తాం. మీ సేవ చేసే అవకాశం జగనన్నకు ఇవ్వండి. వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండి ఎమ్మెల్యే అభ్యర్థిగా నర్సింహరాజు, ఎంపీ అభ్యర్థిగా రఘురాంరాజును జగనన్న నిలబెట్టారు. మీ అమూల్యమైన ఓటు ఫ్యాన్ గుర్తుపై వేసి జగనన్నకు ఒక్క అవకాశం ఇవ్వండి’ అని వైఎస్ షర్మిల ప్రజలను కోరారు. -
‘అందుకే జనసేన నుంచి బయటికి వచ్చా’
సాక్షి, పశ్చిమగోదావరి : ఉండి నియోజకవర్గంలో భారీ మెజార్టీతో గెలుస్తామని ఆ నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పీవీఎల్ నరసింహరాజు ధీమా వ్యక్తం చేశారు. అకివీడు మండలం పెదకాపవరం, చినకాపవరంలలో వైఎస్సార్ సీపీ నేతలు పాతపాటి సర్రాజు, యర్రా నవీన్, దిరిశాల కృష్ణ శ్రీనివాస్ తదితరులతో కలిసి నరసింహరాజు మంగళవారం ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా... వైఎస్ జగన్ సీఎం అయితేనే అందరికీ మేలు జరుగుతుందని అన్ని వర్గాల ప్రజలు భావిస్తున్నారన్నారు. తాగునీరు, ఇళ్ల నిర్మాణాలే తన తొలి ప్రాధాన్యమని.. ఎమ్మెల్యేగా తనను గెలిపించాలని ప్రజలను కోరారు. అందుకే జనసేన నుంచి బయటికి.. జనసేనలో విలువలు లేవు కాబట్టే.. ఆ పార్టీ నుంచి బయటికి వచ్చానని యర్రా నవీన్ అన్నారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారని ఆరోపించారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చంద్రబాబుకు పవన్ తెరవెనుక నుంచి సాయం చేస్తున్నారని విమర్శించారు. దమ్ముంటే ముసుగు తీసి చంద్రబాబు, పవన్ కలిసి పోటీచేయాలని సవాల్ విసిరారు. పవన్‌కు ఓటేస్తే చంద్రబాబుకు వేసినట్లేనని.. కాబట్టి అటువంటి తప్పిదం చేయవద్దని ప్రజలకు విఙ్ఞప్తి చేశారు. వైఎస్ జగన్‌తోనే ఏపీ అభివృద్ధి సాధ్యమని, అందుకే ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలని కోరారు. -
ఉండి ఎమ్మార్వో కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత
సాక్షి, పశ్చిమ గోదావరి : ఉండి ఎమ్మార్వో కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. వైఎస్సార్ సీపీ అభిమానులు, కార్యకర్తలపై పోలీసులు లాఠీ చార్జ్ చేయటంతో పరిస్థితులు అదుపతప్పాయి. వివరాల్లోకి వెళితే.. శుక్రవారం వైఎస్సార్ సీపీ, టీడీపీ కార్యకర్తలు అభ్యర్థుల వెంట నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనటానికి ఉండి ఎమ్మార్వో ఆఫీసు వద్దకు ఒకేసారి చేరుకున్నారు. దీంతో ఒకరికొకరు ఎదురుపడి పోటాపోటీగా నినాదాలు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఇరువర్గాలను చెల్లా చెదురు చేయటానికి పోలీసులు లాఠీ చార్జ్ చేయటంతో ఉద్రిక్తత నెలకొంది. అభ్యర్థి వెంట ఎక్కువ మంది రాకూడదంటూ వైఎస్సార్ సీపీ అభిమానులపై, కార్యకర్తలపై పోలీసులు లాఠీ చార్జ్ చేయటం గమనార్హం. గోపాలపురం ఎమ్మార్వో కార్యాలయం వద్ద ఉద్రిక్తత గోపాలపురం : గోపాలపురం ఎమ్మార్వో కార్యాలయం వద్ద సైతం ఉద్రిక్తత నెలకొంది. వైఎస్సార్ సీపీ అభ్యర్థి నామినేషన్ వేస్తుండగా టీడీపీ అభ్యర్థి నామినేషన్ గదిలోపలికి దూసుకురావటం ఉద్రిక్తతకు దారి తీసింది. వివరాల్లోకి వెళితే.. శుక్రవారం నామినేషన్ దాఖలు చేయటానికి వైఎస్సార్ సీపీ అభ్యర్థి తలారి వెంకట్రావు, టీడీపీ అభ్యర్థి ముప్పిడి వెంకటేశ్వరరావు కార్యకర్తలతో కలిసి ఎమ్మార్వో కార్యాలయం వద్దకు చేరుకున్నారు. వైఎస్సార్ సీపీ అభ్యర్థి తలారి వెంకట్రావు నామినేషన్ వేస్తుండగా టీడీపీ అభ్యర్థి ముప్పిడి వెంకటేశ్వర రావు గదిలోపలికి దూసుకు వచ్చారు. అయినప్పటికి గోపాలపురం అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి కరుణ కుమారి పక్షపాత వైఖరితో పట్టించుకోలేదు. అంతకు ముందు స్వతంత్ర అభ్యర్థి నామినేషన్ వేస్తుండడంతో వైఎస్సార్ సీపీ అభ్యర్థిని రిటర్నింగ్ అధికారి కరుణ కుమారి నిలిపివేశారు. అయితే టీడీపీ అభ్యర్థి వైఖరిపై రిటర్నింగ్ అధికారి స్పందించకపోవటం గమనార్హం. -
ఉద్దండుల నిలయం ఉండి
కోటేశ్వరరావు, ఆకివీడు :సముద్ర తీరం వెంబడి, పశ్చిమ గోదావరి జిల్లాకు పడమర వైపున సరిహద్దుగా ఉండి నియోజకవర్గం ఉంది. పచ్చని పైరు పొలాలతో, పక్షుల కిలకిలారావాలతో ఆహ్లాదకరమైన వాతావరణం ఓ పక్క, ఆక్వాతో కాలుష్య బెడద మరోపక్క నియోజకవర్గాన్ని బెంబేలెత్తిస్తుంది. పట్టణ వాతావరణానికి దగ్గరగా ఉన్న ఉండి నియోజకవర్గం రాజకీయ, ఆధ్యాత్మిక, సామాజిక, సేవా,ఉద్యమ రంగాలకు ఊతం ఇస్తూ గత చరిత్రను సంతరించుకుంది. 1955లో ఏర్పడిన నియోజకవర్గం 17వ సార్వత్రిక ఎన్నికలకు సిద్ధమవుతోంది. అక్షరాయుధాలందించిన ఘనత స్వాతంత్య్రోద్యమం కాలం నుంచి ఉండి నియోజకవర్గానికి ఎంతో చరిత్ర ఉంది. అప్పట్లో ఉద్యమానికి ఊపిరిగా ఉండే ప్రసార సాధనాలైన పత్రికల్ని రహస్యంగా ముద్రించి, పడవలు, దోనెల్లో ప్రజలకు చేరవేసిన ఘనత ఈ నియోజకవర్గానికి ఉంది. దండి సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాల్లో పాల్గొనడమే కాకుండా, ఉద్యమానికి రహస్యంగా అక్షరాయుధాల్ని అందించిన ఘనత కూడా ఉంది. ప్రత్యేకాంధ్ర ఉద్యమం వంటి ఎన్నో ఉద్యమాలకు చేయూతనిచ్చి చరిత్రకెక్కింది. అల్లూరి సీతారామరాజు జన్మించిన మోగల్లు ఈ నియోజకవర్గంలోనే ఉంది. సర్దార్ దండు నారాయణరాజు, దండు సత్యనారాయణరాజు, ఉద్దరాజు రామం, పల్లి లక్ష్మీనర్శింహారెడ్డి, దండు విశ్వనాథరాజు, దాట్ల సూర్యనారాయణరాజు ఇలా ఎంతోమంది ఆ నాటి స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్నారు. హైదరాబాద్ ఈసీఐఎల్ ప్రాంతంలో ఏఎస్రావు నగర్ ఆవిర్భావానికి ఆద్యుడు అయ్యగారి సాంబశివరావు, స్వామి జ్ఞానానంద వంటి శాస్త్రవేత్తలు ఈ ప్రాంతానికి చెందినవారే. శ్రీవారి సేవలో పునీతం ఎక్కడో ఉన్న ఏడుకొండల వాడికి ఉండి నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు సేవ చేయడం ఎంతో అదృష్టమనే చెప్పాలి. ఒకరు కాదు, ఇద్దరు కాదు ఏకంగా ఐదుగురు చైర్మన్లుగా పనిచేసి టీటీడీ కీర్తి ప్రతిష్టల్ని ఇనుమడింపజేశారు. గాదిరాజు జగన్నాథరాజు, గోకరాజు రంగరాజు, కనుమూరి బాపిరాజు, పాందువ్వ కనకరాజు, కనుమూరి అబ్బాయిరాజు టీటీడీ చైర్మన్లుగా పనిచేశారు. ఆకివీడు మండలంలోని అయిభీమవరం గ్రామంలో టీటీడీ ఆధ్వరం్యలో వేద పాఠశాల ఉంది. ఉండి నియోజకవర్గానికి ఇప్పటివరకు 15 సార్లు ఎన్నికలు జరగ్గా ఏడుసార్లు కాంగ్రెస్, కాంగ్రెస్ ఐ గెలుపొందగా, మరో ఏడుసార్లు టీడీపీ విజయం సాధించింది. ఒక్కసారి ఇండిపెండెంట్ గెలుపొందారు. ఈ స్థానం నుంచి కలిదిండి రామచంద్రరాజు 1983 నుంచి 1999 వరకు ఐదు సార్లు టీడీపీ అభ్యర్థిగా గెలుపొందారు. ఈ నియోజకవర్గం మరో ప్రత్యేకత ఏమిటంటే 1952 నుంచి 1983 వరకు ఏ ఒక్క అభ్యర్థి రెండోసారి గెలుపొందకపోవడమే. టీడీపీ – వైఎస్సార్సీపీ మధ్య పోటీ ఉండి నియోజకవర్గంలో ఎన్నికల గాలి ఈ సారి ఫ్యాన్ వైపు వీస్తోంది. అధికార పార్టీ లో వర్గపోరు, కుమ్ములాటలు, ప్రభుత్వ వ్యతిరేకత, అవినీతి, జన్మభూమి కమిటీల రాక్షసత్వం, అసమర్థ పాలనతో ప్రజలు విరక్తి చెందారు. వైఎస్సార్సీపీ తరఫున పీవీఎల్ నర్సింహరాజు, తెలుగుదేశం తరఫున శివరామరాజుల మధ్య ప్రధాన పోటీ ఉంటుంది. జనసేన అభ్యర్థిగా అభ్యర్థి బరిలోకి దిగే అవకాశాలున్నాయి. టీడీపీ అరాచకాలు తట్టుకోలేక టీడీపీకి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు వైఎస్సార్సీపీలో చేరారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పాదయాత్రతో ఈ ప్రాంతంలో పార్టీ మరింతగా బలపడింది. అగ్రగణ్యుల బరి నియోజకవర్గానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్తలు, రాజకీయవేత్తలు, ఆర్థికవేత్తలు ఈ ప్రాంతానికి కీర్తి ప్రతిష్టల్ని తీసుకువచ్చారు. రాజకీయ ప్రముఖులు స్వర్గీయ పీవీఎల్, తిమ్మరాజు, కనకరాజు, రామచంద్రరాజు, కుసుమేశ్వరరావు, గోకరాజు రంగరాజు, యర్రా నారాయణస్వామి, కనుమూరు బాపిరాజు, సర్రాజు, పేరయ్య, వెంకట్రాజు, కలిదిండి రామచంద్రరాజు(అబ్బాయిరాజు), విజయ నర్శింహరాజు, విజయకుమార్‌రాజు, సుబ్బతాతరాజు, గాదిరాజు జగన్నాథరాజు తదితరులు ఈ ప్రాంతానికి చెందినవారే. పారిశ్రామికవేత్తలైన సిరీస్ రాజు, గంగతాతరాజు, కె.ఎస్.రాజు, రఘురామకృష్ణంరాజు, కెవీఎస్ రాజు, ‘సత్యం’ రామలింగరాజు, బాబూరావు, నేరెళ్ల రామ్మోహనరావు తదితరులున్నారు. గుండె శస్త్రచికిత్స నిపుణుడు భూపతిరాజు సోమరాజు(కేర్ అధినేత), క్యాన్సర్ వైద్య నిపుణులు సూర్యనారాయణరాజు, డాక్టర్ ఎం.ఆర్.రాజు వంటి ప్రముఖులు కూడా ఈ నియోజకవర్గానికి చెందినవారే. తాండవిస్తోన్న సమస్యలు ఉండి నియోజకవర్గంలో అనేక సమస్యలు తాండవిస్తోన్నాయి. ఆరు దశాబ్దాలుగా నియోజకవర్గంలో పేదల సొంత ఇంటి కలను ప్రభుత్వాలు నిజం చేయలేకపోతున్నాయి. తరాలు వెళ్లినా వారి సొంత ఇంటి తల రాత మారలేదు. కొన్ని కాలనీలు ఏర్పడినప్పటికీ వాటిలో సరైన వసతులు లేవు. మురుగు కూపంలో కాలనీల వాసులు కాలం గడుపుతున్నారు. అలాగే మున్సిపాలిటీ స్థాయికి ఎదిగిన ఆకివీడులో పారిశుధ్యం అధ్వానంగా ఉంది. సరైన డ్రైనేజీ వ్యవస్థ లేదు. కోపల్లె, ఉండి, గరగపర్రులో పురాతన వంతెనలకు మోక్షం లేదు. ఉండిలో ఇప్పటికీ ప్రభుత్వ జూనియర్ కాలేజీ ఏర్పాటు కాలేదు. గుక్కెడు నీటి కోసం చెరువైన గుండెలు ఒక పక్క మంచినీటి సరస్సు.. పంట కాలువల పరవళ్లు, ఇంకో పక్క సముద్రం. అయితే గొంతు తడిచేసుకునేందుకు తాగునీటికి మాత్రం కటకటలాడాల్సిందే. ఆక్వా రంగం నుంచి వచ్చే వ్యర్థాల వల్ల పంట కాల్వలు, మంచినీటి చెరువులు, బోదెలు, భూగర్భ జలాలు, బావులు, బోరుల్లోని జలాలు కలుషితమై మంచినీటి కోసం స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఇక్కడ నెలకొంది. ప్రజలు మంచినీటిని కొనుగోలు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. కృష్ణా, గోదావరి నదుల మధ్య ఉన్న ఈ ప్రాం తం మంచినీటికోసం వెంపర్లాడాల్సిన పరిస్థితి. బావుల్లో ఉప్పునీరు ఊరి తాగడానికి పనికిరాకుండా పోతోంది. సముద్రతీర ప్రాంతం కావడంతో భూగర్భ జలాలు పూర్తిగా ఉప్పుమయమైపోయాయి. గోదావరి నదిపైనే ఆధారపడి జీవించాలి. తాగునీటి కోసం రానున్న రోజుల్లో మరింత ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి ఉంది. -
చిరంజీవి హోల్ సేల్.. పవన్ కల్యాణ్ రిటైల్
ఉండి: పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం యండగండిలో ఏర్పాటు చేసిన గ్రామ దర్శిని-గ్రామ వికాసం కార్యక్రమంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై మంత్రి జవహర్ తీవ్ర విమర్శలు చేశారు. కార్యక్రమంలో మంత్రి జవహర్ మాట్లాడుతూ..సినీ నటుడు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టి హోల్‌సేల్‌గా కాంగ్రెస్‌కు అమ్మితే..తమ్ముడు పవన్ కల్యాణ్ రిటైల్‌గా జనసేనను అమ్మడానికి సిద్ధమయ్యారని తీవ్రంగా విమర్శించారు. పవన్ కల్యాణ్ వారసత్వం గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. పవన్ కల్యాణ్ ఏమైనా ప్రభాస్ లాగా లేక ఇంకొకరి లాగా ఆరడుగుల అందగాడా, ఆజానుబాహుడా అని ప్రశ్నించారు. తన అన్న నుంచి వచ్చిన వారసత్వం ద్వారానే కదా పైకొచ్చిందని సూటిగా అడిగారు. ఊరికి ఇరవై మంది పవన్ కల్యాణ్ కన్నా అందంగా ఉన్నవాళ్లు ఉన్నారని వ్యాఖ్యానించారు. వారసత్వ రాజకీయాల గురించి మాట్లాడే పవన్ కల్యాణ్ ఒక్కసారి ఆలోచించాలని హితవు పలికారు. చిరంజీవి సినిమా యాక్టర్ కాకపోతే పవన్ కల్యాణ్ ఎవరు, ఎక్కడుండేవారని ప్రశ్నించారు. చిరంజీవి కుటుంబంలో తొమ్మిదో, పదో సినిమా యాక్టర్లు వచ్చారు..అది సినీ వారసత్వం కాదా అని ప్రశ్నించారు. రాజకీయ వారసత్వం గురించి మాట్లాడే అర్హత పవన్ కల్యాణ్‌కు లేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. -
దేవాలయాలు ప్రభుత్వ అధీనంలో ఉండటం తప్పు
ఉండి: దేవాలయాలు ప్రభుత్వ అధీనంలో ఉండటం చాలా పెద్ద తప్పని దేవాదాయశాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు అభిప్రాయపడ్డారు. మాజీ ఎమ్మెల్యే, జిల్లా రైస్‌మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు చెరుకువాడ శ్రీరంగనాథరాజు సొంత నిధులు రూ.కోటి ఖర్చుతో నిర్మించిన శివాలయం రాజగోపురం, కలశస్థాపన కార్యక్రమాలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సినీ నటుడు తనికెళ్ళ భరణి స్వామికి అభిషేకాలు నిర్వహించారు. ముఖ్య అతిథి పాల్గొన్న మంత్రి పైడికొండల మాణిక్యాలరావు మాట్లాడుతూ దేవాలయాలు దేవుడి సొత్తని, దానిపై ప్రభుత్వ అజమాయిషీ తగదని అన్నారు. తనే స్వయంగా నిర్మించిన ఒక దేవాలయ కమిటీ అధికారులతో కుమ్మక్సై 10 ఎకరాలు అమ్ముకున్న ఘటన ఆలస్యంగా వెలుగుచూసిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అటువంటి నాయకులపై వెంటనే చర్యలు తీసుకుంటామన్నారు. నాయకులు దేవాలయాలను కేంద్రంగా చేసుకుని రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. ఆలయాల పునఃనిర్మాణంలో ప్రజలు, దాతలు పాలుపంచుకోవాలని పిలుపు నిచ్చారు. రంగనాథరాజు సుమారు రూ.కోటి సొంత ఖర్చుతో ఇంతటి గొప్ప కార్యం చేయడం అభినందనీయమన్నారు. ఆలయ «నిర్వాహకుడు రంగనాథరాజు మాట్లాడుతూ ఎంత సంపాదించినా కలగని ప్రశాంతత దైవభక్తితో సమకూరుతుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సినీ నటుడు తనికెళ్ల భరణిని బంగారు కంకణంతో, ప్రముఖ గజల్స్ గాయకుడు గజల్ శ్రీనివాస్, శతావధాని కోటలక్ష్మీనరసింహంలను బంగారు గొలుసులతోనూ మంత్రి మాణిక్యాలరావు, చెరుకువాడ శ్రీరంగనాథరాజులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ, మాజీ ఎమ్మెల్యే పసల కనకసుందరరావు తదితరులు పాల్గొన్నారు. అంతా శివోహం.. జగమంతా శివోహం.19 ఏళ్ల నుంచి నాటకరంగంపై మక్కువతో ఇంకా ప్రదర్శనలిస్తున్నాను. ఆధ్యాత్మికతపై మక్కువతో శివ భక్తుడిగా ఎన్నో కార్యక్రమాలు నిర్వహించాను. మా పూర్వీకులు యండగంగి వాస్తవ్యులు కావడం, తెలుగు జాతి గర్వించదగ్గ కవులు కావడం నాకు చాలా ఆనందం. -తనికెళ్ల భరణి, సినీ నటుడు సంస్కృతీ సంప్రదాయాలు కాపాడాలి దేశంలో చాలా వరకు హిందూ దేవాలయాలు పాడుపడ్డ స్థితిలో ఉన్నాయి. వాటి పునఃనిర్మాణానికి ప్రజలు, దాతలు ,ప్రభుత్వం ముందుకు రావాలి. భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను కాపాడాలి. అలాగే పెద్దపెద్ద చదువులు చదివిన వారంతా విదేశాల బాటపట్టి భారతదేశంలో హిందుత్వానికి దూరమవుతున్నా. అలాంటి వారంతా దేవాలయాల అభివృద్ధికి సాయమందించాలి. నిర్మించిన ఆలయాలను ఆయా గ్రామాల ప్రజలంతా కాపాడుకోవాలి.-గజల్ శ్రీనివాస్, గజల్ గాయకుడు -
పర్యాటక రంగ అభివృద్ధికి కృషి
ఆకివీడు(ఉండి) : కాటన్ పార్కుతోపాటు కొల్లేరు ప్రాంతాన్ని పర్యాటక రంగంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ కార్యదర్శి జవహర్‌రెడ్డి , కలెక్టర్ కాటమనేని భాస్కర్ చెప్పారు. మంగళవారం పార్కును వారు సందర్శించారు. పార్కులో జరుగుతున్న నిర్మాణ పనులను ఎమ్మెల్యే వి.వి.శివరామరాజు వారికి వివరించారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మోటుపల్లి ప్రసాద్, దాసరి సత్యనారాయణ, పిన్నమరాజు శ్రీనివాసరాజు, పలువురు స్థానికులు పాల్గొన్నారు. ఉండి డంపింగ్ యార్డు రాష్ట్రానికే ఆదర్శం ఉండి : ఉండిలో నిర్మిస్తున్న డంపింగ్‌యార్డు రాష్ట్రానికే ఆదర్శంగా ఉందని పంచాయతీ రాజ్ శాఖ రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ జవహర్‌రెడ్డి చెప్పారు. మంగళవారం ఉండిలోని డంపింగ్ యార్డును ఆయన కలెక్టర్ భాస్కర్‌తో కలిసి పరిశీలించారు. ఢిల్లీలో జరిగే సమావేశాల్లో ఈ డంపింగ్‌యార్డును నమూనాగా ప్రదర్శిస్తామని చెప్పారు. -
ఒకే కాన్పులో ముగ్గురు
ఆకివీడు : ఉండి గ్రామానికి చెందిన ఆళ్ల రామలక్ష్మి ఒకే కాన్పులో ముగ్గురు బిడ్డలకు జన్మనిచ్చింది. రామలక్షి్మకి 8 నెలలు నిండగ నొప్పులు రావడంతో బుధవారం రాత్రి స్థానిక లక్ష్మీ ఆసుపత్రిలో చేర్చారు. ఈ క్రమంలో వైద్యురాలు కవిత గురువారం తెల్లవారుజామున రామలక్షి్మకి ఆపరేషన్ చేశారు. ఒకే కాన్పులో ఒక మగబిడ్డ, ఇద్దరు ఆడపిల్లలు జన్మించినట్టు చెప్పారు. తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నారని చెప్పారు. ఇది ఇలా ఉండగా రామలక్షి్మకి ఇది రెండో కాన్పు.. తొలి కాన్పులో ఆమె ఆడ పిల్లకు జన్మనిచ్చింది. రామలక్ష్మి భర్త శ్రీనివాస్ తాపీ మేస్రి్తగా పనిచేస్తున్నాడు. -
స్వగ్రామం చేరిన నూర్జహాన్ మృతదేహం
ఉండి : ఉపాధి నిమిత్తం ఖతార్ వెళ్లి అక్కడి వారి అకృత్యాలకు బలైన ఉండికి చెందిన షేక్ నూర్జహాన్ మృతదేహం శుక్రవారం స్వగ్రామం చేరుకుంది. ఆమె మృతదేహంతో నూర్జహాన్ కుటుంబ సభ్యులు, బంధువులు జాతీయ రహదారిపై రాస్తారోకో చేస్తారనే సమాచారంతో ఉండి, ఆకివీడు, కాళ్ల, పాలకోడేరు, భీమవరం 1టౌన్, 2 టౌన్ పోలీస్స్టేషన్ల నుంచి పోలీసులను ముందు జాగ్రత్తగా ఉండికి రప్పించారు. దీంతో పరిస్థితి ఒక్కసారిగా వేడెక్కింది. నూర్జహాన్ మృతదేహం ఉండికి రావడంతో కుటుంబీకులు, బంధువులను పిలిపించి భీమవరం రూరల్ సీఐ ఆర్జి జయసూర్య, భీమవరం 1 టౌన్ సీఐ డి.వెంకటేశ్వరరావుల పర్యవేక్షణలో ఆ ప్రాంతాన్ని తమ స్వాధీనంలోకి తీసుకుని మృతదేహాన్ని అప్పగించారు. నూర్జహాన్ మృతికి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు నినాదాలు చేశారు. అనంతరం నూర్జహాన్ మృతదేహాన్ని ఆమె అత్తవారిల్లయిన భీమడోలు మండలం పాతూరుకు తీసుకువెళ్లిపోయారు. దీంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. -
వ్యభిచార గృహాలపై పోలీసులు దాడులు
ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా భీమవరం, ఉండిలోని వ్యభిచార గృహాలపై శుక్రవారం పోలీసులు ముకుమ్మడి దాడులు చేశారు. ఈ సందర్భంగా 19 మంది మహిళలు, ఓ విటుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని పోలీసుస్టేషన్‌కు తరలించారు. వీరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. భీమవరం, ఉండి పరిసర ప్రాంతాల్లో ఇటీవల కాలంలో వ్యభిచారం జోరుగా సాగుతుంది. ఈ నేపథ్యంలో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు శుక్రవారం దాడులు నిర్వహించారు. -
తోట సీతారామలక్ష్మి నివాసాన్ని ముట్టడించిన టీడీపీ కార్యకర్తలు!
భీమవరం: సీట్లు ఆశించి భంగపడ్డ తెలుగు తమ్ముళ్ల నిరసన జోరు పెరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా టీడీపీ అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి ఇంటిని టీడీపీ కార్యకర్తలు ముట్టడించారు. తలపూడి శివరామరాజుకు సీటు కేటాయించాలని కార్యకర్తలు డిమాండ్ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండీ అసెంబ్లీ సీటును తలపూడి శివరామరాజుకు కేటాయించాలంటూ టీడీపీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. అయితే మీ డిమాండ్ ను పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తానని సీతారామలక్ష్మి కార్యకర్తలను బుజ్జగించారు. ఇంకా జిల్లాలోని కొవ్వూరు, గోపాలపురం, చింతలపూడి, నరసాపురం, ఉంగుటూరు నియోజకవర్గాలను ఎవరికిస్తారనే దానిపైనా స్పష్టత రాలేదు. దీంతో టీడీపీ నేతలెవరికీ సీటు ధీమా కనిపించడం లేదు. తమ పేర్లు జాబితాలో ఉంటాయో లేదోననే ఉత్కంఠ వారిలో కనిపిస్తోంది. ఈ కారణంగానే నేతలు నామినేషన్ల గురించి ఆలోచించే పరిస్థితి లేకుండా పోయింది. -
మునిగిపోతున్న ఎమ్మెల్యేను రక్షించిన గన్‌మన్
జగ్గయ్యపేట, న్యూస్‌లైన్: నదిలో మునిగిపోతున్న ఎమ్మెల్యేను గన్‌మన్ రక్షించాడు. ఈ సంఘటన కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మండలం వేదాద్రిలో ఆదివారం జరిగింది. పశ్చిమగోదావరి జిల్లా ఉండిఎమ్మెల్యే వేటుకూరి వెంకటశివరామరాజు కుటుంబసభ్యులతో కలసి వేదాద్రిలోని శ్రీయోగానంద లక్ష్మీనరసింహా స్వామి సన్నిధికి వచ్చారు. కృష్ణానదిలో ఉన్న సాలగ్రహ నరసింహాస్వామి (నామాలు) వద్దకు నీటిలో ఈదుకుంటూ వెళ్లారు. స్వామిని దర్శించుకుని తిరిగి వస్తుండగా ఒక్కసారిగా నీటిలో మునిగిపోయారు. ఒడ్డున ఉన్న గన్‌మన్ గమనించి నదిలోకి దూకి ఎమ్మెల్యేను రక్షించాడు. -
ఎమ్మెల్యే శివ జలదీక్ష భగ్నం
సమైక్యాంధ్ర ఆందోళనలో భాగంగా ఉండి ఎమ్మెల్యే వేటుకూరి వెంకట శివరామరాజు సోమవారం వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ఉండి సెంటర్ వద్ద పంటకాలువలో నీళ్లలో నిలబడి జలదీక్ష చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం దిగివచ్చేవరకు దీక్ష కొనసాగిస్తానని ప్రకటించారు. సీమాంధ్రలో ఉద్యమం రోజురోజుకి తీవ్రమవుతున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే జలదీక్ష విషయం తెలుసుకున్న నరసాపురం డీఎస్పీ రఘువీరారెడ్డి, భీమవరం రూరల్ సీఐ శివాజీరావు ఘటనా స్థలానికి చేరుకుని దీక్ష విరమించాలని కోరగా, ప్రాణం పోయినా దీక్షను విరమించేది లేదని శివ భీష్మించారు. ఉదయం 11.20 గంటలకు ప్రారంభమైన దీక్ష రాత్రి 8.30 గంటల వరకు కొనసాగింది. సమైక్యవాదులు అధిక సంఖ్యలో వచ్చి జలదీక్షను తిలకించారు. రాత్రి చీకటిలో కాలువలో దీక్ష కొనసాగించడం సరికాదని, విరమించాలని పోలీసులు ఎమ్మెల్యేకు చెప్పినా వినిపించుకోలేదు. దీంతో రాత్రి 8.30 గంటలకు పోలీసులు ఎమ్మెల్యేను బలవంతంగా కాలువ నుంచి బయటకు తీసుకువచ్చి దీక్షను భగ్నం చేశారు. అనంతరం 108లో భీమవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె.ప్రభాకర్ ఆయనకు వైద్య పరీక్షలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే కోరిక మేరకు పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.