పర్యాటక రంగ అభివృద్ధికి కృషి
ఆకివీడు(ఉండి) : కాటన్ పార్కుతోపాటు కొల్లేరు ప్రాంతాన్ని పర్యాటక రంగంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ కార్యదర్శి జవహర్‌రెడ్డి , కలెక్టర్ కాటమనేని భాస్కర్ చెప్పారు. మంగళవారం పార్కును వారు సందర్శించారు. పార్కులో జరుగుతున్న నిర్మాణ పనులను ఎమ్మెల్యే వి.వి.శివరామరాజు వారికి వివరించారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మోటుపల్లి ప్రసాద్, దాసరి సత్యనారాయణ, పిన్నమరాజు శ్రీనివాసరాజు, పలువురు స్థానికులు పాల్గొన్నారు.
ఉండి డంపింగ్ యార్డు రాష్ట్రానికే ఆదర్శం
ఉండి : ఉండిలో నిర్మిస్తున్న డంపింగ్‌యార్డు రాష్ట్రానికే ఆదర్శంగా ఉందని పంచాయతీ రాజ్ శాఖ రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ జవహర్‌రెడ్డి చెప్పారు. మంగళవారం ఉండిలోని డంపింగ్ యార్డును ఆయన కలెక్టర్ భాస్కర్‌తో కలిసి పరిశీలించారు. ఢిల్లీలో జరిగే సమావేశాల్లో ఈ డంపింగ్‌యార్డును నమూనాగా ప్రదర్శిస్తామని చెప్పారు.