‘మీసేవ’లపై విజిలెన్స్ దాడి
తాళ్లపూడి : తాళ్లపూడిలోని మీసేవా కేంద్రాలను విజిలెన్స్ అధికారులు, రెవెన్యూ అధికారులు మంగళవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. బస్టాండ్ సెంటర్‌లో గల ఏపీ ఆన్‌లైన్ మీసేవా కేంద్రంపై పలు ఆరోపణలు రావడంతో మీ సేవా ఏడీ అదేశాలతో విచారణ చేయడానికి వచ్చినట్టు విజిలెన్స్ మేనేజర్ భగత్ తెలిపారు. మీ సేవలో పౌర సేవలకు నిర్ణయించిన దాని కంటే అధిక ధరలు వసూలు చేస్తున్నట్టు ఆరోపణలు వచ్చాయన్నారు. కేంద్రం నిర్ణయించిన ప్రదేశంలో లేదని, రికార్డులు సక్రమంగా నిర్వహించడంలేదని, కంప్లెంట్ రిజిస్టర్ లేదని తెలిపారు. పౌరసేవల వివరాల చార్ట్ లేదని, సొంత వ్యాపారం మాదిరిగా నిర్వహిస్తున్నారన్నారని అన్నారు. నిర్వాహుకుడు అప్పన చంద్రగుప్త నుంచి వివరాలు సేకరించారు. చర్యల కోసం ఉన్నతా«ధికారులకు నివేదిక పంపిస్తామన్నారు. అనంతరం మరో కేంద్రాన్ని పరిశీలించారు. ఆయన వెంట డీటీ నాగ లక్ష్మమ్మ, ఆర్‌ఐ భరతి, వీఆర్వో ప్రవీణ్, కొండబాబు ఉన్నారు.