సాక్షి, పశ్చిమగోదావరి : ఉండి నియోజకవర్గంలో భారీ మెజార్టీతో గెలుస్తామని ఆ నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పీవీఎల్ నరసింహరాజు ధీమా వ్యక్తం చేశారు. అకివీడు మండలం పెదకాపవరం, చినకాపవరంలలో వైఎస్సార్ సీపీ నేతలు పాతపాటి సర్రాజు, యర్రా నవీన్, దిరిశాల కృష్ణ శ్రీనివాస్ తదితరులతో కలిసి నరసింహరాజు మంగళవారం ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా... వైఎస్ జగన్ సీఎం అయితేనే అందరికీ మేలు జరుగుతుందని అన్ని వర్గాల ప్రజలు భావిస్తున్నారన్నారు. తాగునీరు, ఇళ్ల నిర్మాణాలే తన తొలి ప్రాధాన్యమని.. ఎమ్మెల్యేగా తనను గెలిపించాలని ప్రజలను కోరారు.
అందుకే జనసేన నుంచి బయటికి..
జనసేనలో విలువలు లేవు కాబట్టే.. ఆ పార్టీ నుంచి బయటికి వచ్చానని యర్రా నవీన్ అన్నారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారని ఆరోపించారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చంద్రబాబుకు పవన్ తెరవెనుక నుంచి సాయం చేస్తున్నారని విమర్శించారు. దమ్ముంటే ముసుగు తీసి చంద్రబాబు, పవన్ కలిసి పోటీచేయాలని సవాల్ విసిరారు. పవన్‌కు ఓటేస్తే చంద్రబాబుకు వేసినట్లేనని.. కాబట్టి అటువంటి తప్పిదం చేయవద్దని ప్రజలకు విఙ్ఞప్తి చేశారు. వైఎస్ జగన్‌తోనే ఏపీ అభివృద్ధి సాధ్యమని, అందుకే ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment