సాక్షి, పశ్చిమగోదావరి జిల్లా : ‘ఐదేళ్లలో మహిళల కోసం ఏమి చంద్రబాబు ఇప్పుడు ఎన్నికలు వచ్చేసరికి నేను మీ అన్నను. మీరు నా అక్కాచెల్లెళ్లు. నాకు ఓటెయ్యండి అని అడుగుతున్నారు. అన్నా అంటే ఎవరు? తోబుట్టువుకి తోడుగా ఉండేవాడే అన్న. అక్కచెల్లెకి కష్టకాలంలో తోడుగా ఉండేవాడు అన్న. ఇచ్చిన మాట తప్పని వాడే అన్న. ఐదేళ్ల అయింది రుణమాఫి చేస్తా అని చెప్పి. ఇప్పటి వరకూ ఒక్క రూపాయి కూడా మాఫీ చేయని వాడు అన్న అవుతాడా? వనజాక్షి చంద్రబాబుకు చెల్లెలులాంటిది కాదా? నడిరోడ్డున చింతమనేని ప్రభాకర్ జుట్టుపట్టుకొని రోడ్డుపై ఈడ్చుకెల్లారు. అప్పుడు ఏమైంది చంద్రబాబులోని అన్న. చచ్చిపోయాడా? మళ్లీ నిస్సిగ్గుగా అదే చింతమనేనికి టికెట్ ఇచ్చారు. రిషితేశ్వరి కాలేజీ విద్యార్థి చంద్రబాబుకు చెల్లి కాదా? చంద్రబాబు మనిషి అయిన బాబురావు మనిషి వల్ల ఆ బిడ్డ ఆత్మహత్య చేసుకుంది. అప్పుడు చంద్రబాబులోని అన్న చచ్చిపోయాడా? ఇప్పుడు వచ్చి ఓట్లు వేయండి అని మహిళలను అడిగితే ఎవరు నమ్ముతారు’ అని వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ సోదరి వైఎస్ షర్మిల ప్రశ్నించారు. బస్సు యాత్ర నిర్వహిస్తున్న షర్మిల గురువారం పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గ ఎన్నికల ప్రచార సభలో మాట్లాడారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే...
చంద్రబాబు అన్న ఎలా అవుతారు?
ఉండి నియోజకవర్గప్రజలకు, ఇక్కడు చేరివచ్చిన ప్రతి అమ్మకు, ప్రతి అయ్యకు, ప్రతి చెల్లికి , ప్రతి అన్నకు మీ రాజన్న కూతురు, మీ జగనన్న చెల్లెలు మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటోంది. రాజన్న రాజ్యం ఎలా ఉండేది? ప్రతి పేదవాడి అండగా, ప్రతి రైతుకు ధైర్యంగా కలిగించేలా, ప్రతి మహిళకు భరోసా కలిగించే ఉండేది. మన పర తేడా లేకుండా ప్రతి ఒక్క వర్గానికి మేలు చేసిన వ్యక్తి ఒక్క వైఎస్సార్ మాత్రమే. ఒక్క రూపాయి పన్ను పెంచకుండా గొప్ప పరిపాలన అందించిన రికార్డు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిది. కానీ ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి ఎలా ఉన్నారు? ఒక ముఖ్యమంత్రి ఎలా ద్రోహం చేయకూడదో ఈ ఐదేళ్లలో చంద్రబాబు మనకు చూపించారు. రైతు రుణమాఫీ అంటూ చేసిన మొదటి సంతకానికే దిక్కులేదు. డ్వాక్రామహిళలకు రుణమాఫీ చేస్తానన్నారు. ఒక్క రూపాయి కూడా మాఫీ కాలేదు. ఐదేళ్లు ఏమి చేయకుండా పసుపు కుంకుమ అంటూ భిక్షం వేస్తున్నట్లు ఇస్తున్నారు. ఎంగిలి చేయి విదిలిస్తున్నారు. అక్కా చెల్లెళ్లు మోసపోకండమ్మా. కేవలం మహిళలను మభ్యపెట్టడానికి చంద్రబాబు డబ్బులు ఇస్తున్నారు.
చింతమనేని బెదిరింపులకి భయపడొద్దు : వైఎస్ షర్మిల
ఐదేళ్లు ఏమి చేయలేదు. ఇప్పుడు నేను మీ అన్నను, మీరు మాకు ఓటేయ్యండి అని అడుక్కుంటున్నారు చంద్రబాబు. అన్నా అంటే ఎవరు? తోబుట్టువుకి తోడుగా ఉండేవారే అన్నా. అక్కచెల్లెకి కష్టకాలంలో తోడుగా ఉండేవాడు అన్న. ఇచ్చిన మాట తప్పని వాడే అన్న. ఐదేళ్లలో ఒక్క రూపాయి కూడా మాఫీ చేయని వాడు అన్న అవుతాడా? వనజాక్షి చంద్రబాబుకు చెల్లెలులాంటిది కాదా? నడిరోడ్డున చింతమనేని ప్రభాకర్ జుట్టుపట్టుకొని రోడ్డుపై ఈడ్చుకెల్లారు. అప్పుడు ఏమైంది చంద్రబాబులోని అన్న చచ్చిపోయాడా? మళ్లీ నిస్సిగ్గుగా అదే చింతమనేనికి టికెట్ ఇచ్చారు. రిషితేశ్వరి కాలేజీ విద్యార్థి చంద్రబాబుకు చెల్లి కాదా? చంద్రబాబు మనిషి అయిన బాబురావు మనిషి వల్ల ఆ బిడ్డ ఆత్మహత్య చేసుకుంది. అక్వాకల్చర్ ప్రాసెసింగ్ యూనిట్ వల్ల కాలుష్యం కలుగుతుందని మహిళలు ఆందోళన చేస్తే వాళ్లను పోలీసులతో కొట్టించి జైల్లో పెట్టించారు. అప్పుడు ఈయనలోని అన్న చచ్చిపోయాడా? అంగనీవాడి మహిళలు జీతాలు సరిపోవడంలేదదని ధర్నాలు చేస్తే లాఠీచార్జీ చేయించారు. జైల్లో పెట్టించారు. అప్పుడు ఈయనలోని అన్న చచ్చిపోయాడా? మధ్యాహ్నం బోజనం స్కీంలో ఆడవాళ్లు పనిచేస్తుంటే వాళ్ల ఉద్యోగాలు తీసేస్తామని చంద్రబాబు అంటే ఆ మహిళలు దర్నాలు చేశారు. అప్పుడు లాఠీచార్జీ చేసి మహిళలను జైల్లో పెట్టించారు. అప్పుడు ఆయనలోని అన్న చనిపోయాడా? చంద్రబాబు లాంటి అన్న ఉంటే అంతకు మించిన దురదృష్టవంతురాలే ఉండదు.
ఒక్క పర్మినెంట్ బిల్డింగ్ అయినా కట్టారా?
ఆరోగ్యశ్రీలో కార్పొరేట్ ఆస్పత్రులను తీసేశారు. చంద్రబాబు కుటుంబ సభ్యులు అయితే కార్పొరేట్ ఆస్పత్రిలో చికిత్స చేసుకోవాలట. సామాన్యులు అయితే ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యం చేయించుకోవాలట. ఇదెక్కడి న్యాయం?ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వడం లేదు. పిల్లలకు ఫీజు కట్టలేక తల్లిదంద్రులు కట్టలేక అప్పులు పాలు అవుతున్నారు. తల్లిదంద్రులను అప్పుల పాలు చేయకుండా మధ్యలోనే చదువులు ఆపేస్తున్నారు. పోలవరం.. కేంద్రం కట్టాల్సిన ప్రాజెక్టు. ఈయన కమిషన్ మింగొచ్చనని ప్రాజెక్టును తీసుకున్నారు. 15వేల కోట్లు ఉన్న పోలవరం ప్రాజెక్టును 60వేలకోట్లకు పెంచారు. మూడేళ్లలో పూర్తి చేస్తా అన్నారు. చేశారా? చిత్తశుద్ది ఉంటే పోలవరాన్ని నిర్మించేవారు. అమరావతిలో ఒక్క పర్మినెంట్ బిల్డింగ్ అయినా కట్టారా? కేంద్ర ప్రభుత్వం 2500 కోట్ల రూపాయలు ఇస్తే ఒక్క బిల్డింగ్ కట్టలేదు. ఏమైంది ఆ డబ్బంతా? అమ్మకు అన్నం పెట్టనోడు చిన్నమ్మకు బంగారు గాజులు పెట్టిస్తాడట. ఐదేళ్లు సీఎంగా ఉండి అమరావతి ఒక్క పర్మినెంట్ బిల్డింగ్ కట్టలేదు కానీ ఇంకో ఐదేళ్లు ఇస్తే అమెరికా చేస్తారాట. మన చెవిలో పూలు పెడతాడట.
పప్పుకు మూడు ఉద్యోగాలు
బాబు వస్తే జాబు వస్తుందన్నారు. ఎవరికి వచ్చింది? కేవలం చంద్రబాబు గారి కొడుకు లోకేష్‌కు మాత్రమే వచ్చింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు శాఖలకు మంత్రిని చెశారు. ఈ పప్పు లోకేష్‌కు కనీసం వర్ధంతికి , జయంతికి తేడా కూడా తెలియదు. అఆలు రావు గానీ అగ్ర తాంబూలం నాకే కావాలన్నాడట ఎవరో. పప్పు తీరు కూడా అలాగే ఉంది. ఒక్క ఎన్నికలో కూడా గెలవని పప్పుకు ఏ అర్హత ఉందని చంద్రాబాబు ఇన్ని ఉద్యోగాలు ఇచ్చారు. ఇది పుత్ర వాత్సల్యం కాదా? చంద్రబాబు గారి కొడుకు ఏమో మూడు ఉద్యోగాలు అట. మాములు ప్రజలకు ఏమో ఉద్యోగాలు లేవు. ఉద్యోగ నోటిఫికేషన్లు లేవు.
చంద్రబాబు వల్లే హోదా రాలేదు
ప్రత్యేక హోదా ఎంత అవసరం. ప్రత్యేక హోదా ఏపీకి ఊపిరి వంటింది. అలాంటి హోదాన్ని నీరు గార్చిన వారు చంద్రబాబు. ఈ రోజు రాష్ట్రానికి హోదా రాలేదంటే చంద్రబాబే కారణం. బీజేపీతో కుమ్మకై ప్యాకేజీకి ఒప్పకున్నారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హోదా కోసం చేయని పోరాటం లేదు. హోదా కోసం రాష్ట్రంలో రోజుల తరబడి నిరాహార దీక్షలు చేశారు. బంద్‌లు, రాస్తారోకోలు, ధర్నాలు, మానవహారాలు, కొవ్వొత్తుల ర్యాలీలు.. ఇలా ఈ ఐదేళ్లలో ఎన్నో కార్యక్రమాలు చేశారు. అఖరికి వైఎస్సార్‌సీపీ ఎంపీలతో రాజీనామా కూడా చెయించారు. చంద్రబాబు ఇవాళ యూటర్న్ తీసుకొని హోదా అంటున్నాడు అంటే దానికి కారణం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కాదా? గత ఎన్నికల ముందు హోదా అన్నారు. పదేళ్లు కాదు 15 ఏళ్లు కావాలన్నారు. తర్వత ప్యాకేజీ అన్నారు. ఇప్పుడు మళ్లీ హోదా అంటున్నారు. రేపు ఏమి అంటారో అతనికే తెలియదు. గత ఎన్నికల్లో బీజేపీతో పొత్తు.. ఇప్పుడు కాంగ్రెస్‌తో పొత్తు అంటున్నాడు. అంటే చంద్రబాబు ఎప్పుడు ఎలా మాట మారుస్తారో ఆయనకే తెలియదు. రోజుకో మాట..పూటకో వేషం చంద్రబాబుది.
సింహం సింగిల్ గానే వస్తుంది
చంద్రబాబు అబద్దాలు ప్రచారం చేస్తూ కేసీఆర్‌తో పొత్తు పెట్టుకుంటున్నామని ఆరోపిస్తున్నారు. మాకు ఎవరితో పొత్తు అవసరం లేదు. సింహం సింగిల్ గానే వస్తుంది. నక్కలే గుంపులుగా వస్తాయి. అందుకే చంద్రబాబు కాంగ్రెస్, జనసేనతో కలిసి వస్తున్నారు. ఏ పొత్తు లేకుండా చంద్రబాబు ఇంతవరకు ఎన్నికలకే రాలేదు. 11వతేది ఎన్నికలు ఉన్నాయి. ఓటు వేసే సమయంలో ఒక్కసారి రాజన్నను తలచుకోండి. రాజన్న రాజ్యం రావాలంటే జగనన్న సీఎం కావాలి. జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి రైతుకి పెట్టుబడి సాయం కింద ప్రతి మే మాసంలో రూ. 12500 రూపాయలు ఇస్తారు. గిట్టుబాటు ధరకై మూడు వేల కోట్ల రూపాయలతోతో ఒక నిధి ఏర్పాటు చేస్తారు. డ్వాక్రా రుణాలు నాలుగు విడతల్లో మాఫీ చేస్తారు. సున్నా వడ్డికే రుణాలు ఇస్తారు. కాలేజీ విద్యార్థులు ఏ కోర్సు అయినా చదవచ్చు. ఏ కోర్సు చదివిన ప్రభుత్వం ఉచితంగా చదివిస్తుంది. ఆరోగ్య శ్రీలో కార్పొరేట్ ఆస్పత్రిలను చేరుస్తాం. పిల్లలను బడికి పంపించడానికి తల్లిదండ్రులకు రూ. 15వేలు ఇస్తాం. అవ్వలకు తాతలకు పెన్షన్లు రూ. రెండు వేల నుంచి క్రమంగా మూడు వేలకు పెంచుతాం. వికలాంగులకు పెన్షన్లు మూడు వేలు ఇస్తాం. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీ మహిళలకు ఆర్థికసాయంగా రూ.75వేలు ఇస్తాం. మీ సేవ చేసే అవకాశం జగనన్నకు ఇవ్వండి. వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండి ఎమ్మెల్యే అభ్యర్థిగా నర్సింహరాజు, ఎంపీ అభ్యర్థిగా రఘురాంరాజును జగనన్న నిలబెట్టారు. మీ అమూల్యమైన ఓటు ఫ్యాన్ గుర్తుపై వేసి జగనన్నకు ఒక్క అవకాశం ఇవ్వండి’ అని వైఎస్ షర్మిల ప్రజలను కోరారు.
Comments
Please login to add a commentAdd a comment