అల్వాల్: ఇటీవల చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణ రూపకల్పన కోసం పార్టీ శ్రేణులు, అనుచరులతో శనివారం మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు సమీక్ష సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. నాలుగు రోజుల క్రితం తిరుపతిలో ఆయన చేసిన వ్యాఖ్యలతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. తనతోపాటు కుమారుడికి ఎమ్మెల్యే టికెట్ కేటాయించాలని డిమాండ్ చేస్తూ మంత్రి హరీశ్ వైఖరి పట్ల ఘాటు విమర్శలు చేసిన సంగతి విదితమే.
ఈ వ్యాఖ్యల పట్ల మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత తమదైన శైలిలో స్పందించారు. పార్టీ అభ్యర్థుల ప్రకటన అనంతరం జరుగున్న ఈ సమావేశంలో తాను తీసుకునే నిర్ణయాన్ని పార్టీ శ్రేణులు, అనుచరులకు మైనంపల్లి వెల్లడించే అవకాశం ఉంది. పార్టీ మారుతారనే ఊహగానాలు వస్తున్న నేపథ్యంలో జరుగుతున్న సమావేశంపై అంతటా ఆసక్తి నెలకొంది. శనివారం 10 గంటలకు దూపల్లిలోని తన నివాసం వద్ద ఉదయం 10 గంటలకు సమావేశం నిర్వహించనున్నట్లు అందరు హాజరు కావాలని పార్టీ శ్రేణులకు ఆయన సమాచారం అందించారు. దీంతోపాటు మైనంపల్లికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న సొంత పార్టీ నేతలపై మైనంపల్లి అనుచరులు ఎదురు దాడికి దిగుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment