జైపూర్: ఈ ఏడాది చివరలో ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీలు ప్లాన్ చేస్తున్నాయి. ఈ క్రమంలో రాజస్థాన్‌లోని బీజేపీలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. తన తండ్రికి టికెట్ ఇవ్వొదంటూ బీజేపీ మాజీ ఎమ్మెల్యే కూతురు నిరసనలు తెలిపింది. దీంతో, అక్కడ పొలిటికల్ వాతావరణం హాట్ టాపిక్‌గా మారింది.
వివరాల ప్రకారం.. రాజస్థాన్‌లో అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల ప్రకటనకు ముందే బీజేపీలో ట్విస్ట్ చోటుచేసుకుంది. మాజీ ఎమ్మెల్యే అయిన తన తండ్రికి పార్టీ టిక్కెట్ ఇవ్వద్దంటూ ఆయన కుమార్తెనే అధిష్ఠానానికి అల్టిమేటం ఇచ్చింది. ఒకవేళ టిక్కెట్ ఇస్తే తన తండ్రిపై రెబల్ అభ్యర్థిని బరిలోకి దింపి, ఇతర టిక్కెట్ ఆశావహులతో కలిసి ఓడిస్తానని హెచ్చరించడం రాజస్థాన్ రాజకీయాల్లో ప్రస్తుతం సంచలనంగా మారింది. మాజీ ఎమ్మెల్యే జయరామ్ జాటవ్ కూతురు మీనా జాటవ్ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిసి తన తండ్రికి టిక్కెట్ ఇవ్వవద్దని కోరారు. దీంతో, వీరి వ్యవహారం రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
మరోవైపు.. తన ఆస్తులను కొట్టేసేందుకు స్వయానా తన తండ్రే కుట్రలు చేస్తున్నారని ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు. అలాంటి వ్యక్తి సామాన్య ప్రజలకు ఏం న్యాయం చేస్తాడని ప్రశ్నించారు. అంతేకాకుండా తన కొడుకును కూడా చంపించాలని చూస్తున్నాడని మీనా జాటవ్ ఆరోపించారు.
ఇదిలా ఉండగా, కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాజస్థాన్‌లో గెలుపే లక్ష్యంగా బీజేపీ ప్రణాళిక రచిస్తోంది. ఇప్పటికే ప్రధాని మోదీ సహా బీజేపీలోని పలువురు సీనియర్ నేతలు రాజస్థాన్‌లో పర్యటించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని ప్రజలకు కోరారు. ఇక, కాంగ్రెస్ నేతలు కూడా రాజస్థాన్‌లో పర్యటిస్తున్నారు. అక్కడ గెలుపే లక్ష్యంగా హస్తం నేతలు ప్లాన్స్ చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: గగన్‌యాన్‌లో కీలక ప్రయోగానికి ఇస్రో సిద్ధం
Comments
Please login to add a commentAdd a comment