
మెదక్ జోన్: కాంగ్రెస్ పార్టీలో అవినీతి రాజ్యమేలుతోందని, ఎమ్మెల్యే టికెట్ అడిగితే రూ.3 కోట్లు డిమాండ్ చేశారని మెదక్ మున్సిపల్ మాజీ చైర్మన్ తొడుపునూరి చంద్రపాల్ ఆరోపించారు. ఆదివారం మెదక్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. 38 ఏళ్లపాటు పార్టీకి సేవ చేశానని, అసెంబ్లీ ఎన్నికల్లో మెదక్ ఎమ్మెల్యే టికెట్ అడిగితే ఓ రాష్ట్రస్థాయి నేత రూ.3 కోట్లు డిమాండ్ చేశారన్నారు. ఎవరు డబ్బులిస్తే వారికి అంగడి సరుకుల్లా టికెట్లు అమ్ముకోవడం బాధాకరమన్నారు.
లోక్‌సభ ఎన్నికల్లోనూ ధనవంతులకే పార్టీ టికెట్ దక్కిందన్నారు. ఇందిరా గాంధీ, జవహర్‌లాల్ నెహ్రూ, పీవీ నర్సింహారావు, వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలోనే కాంగ్రెస్ పార్టీకి పేరుండేదని, ప్రస్తుతం సరైన నాయకుడే లేకుండా పోయాడన్నారు. సీఎం కేసీఆర్ దేశంలో ఎక్కడా లేనివిధంగా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారన్నారు. బంగా రు తెలంగాణలో తాము సైతం భాగస్వాములం కావాలన్న తపనతో మాజీ మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి సమక్షంలో సోమవారం టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు ప్రకటించార
Comments
Please login to add a commentAdd a comment