మంత్రి శిద్దా రాఘవరావుకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలంటూ టీడీపీ కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గురువారం దర్శి టీడీపీ కార్యకర్తలు చంద్రబాబు నివాసానికి వచ్చారు. ‘శిద్దాకు ఎంపీ వద్దు.. ఎమ్మెల్యే’ ముద్దు అంటూ ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. మంత్రి శిద్దా రాఘవరావును పార్లమెంట్ బరిలో నిలబెట్టాలని చంద్రబాబు నాయుడు నిర్ణయించిన సంగతి తెలిసిందే. గతంలో దర్శి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించిన శిద్దాను..