
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ జనసమితిలో పార్టీ టికెట్లను అమ్ముకుంటున్నారని ఆ పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు తిరునగరి జ్యోత్స్న ఆరోపించారు. సోమవారం హైదరాబాద్‌లో మాట్లాడుతూ.. టికెట్ల అమ్మకాన్ని, వసూళ్ల వ్యవహారాన్ని మాజీ ఎమ్మెల్సీ దిలీప్‌కుమార్ నడుపుతున్నారని ఆరోపించారు. టీజేఎస్ రాజకీయపార్టీగా కాకుండా, వ్యాపార సంస్థగా నడస్తోందని విమర్శించారు. పార్టీ టికెట్ ఇవ్వకపోవడంతోనే పార్టీని వీడుతున్నట్లు వార్తలు రాయించారని, అది సరికాదన్నారు. టీజేఎస్‌లో దిలీప్‌తో పాటు మరో ఆరుగురు నేతలు వసూళ్లకు పాల్పడుతున్నారన్నారు. దిలీప్‌కుమార్‌కు రూ.2 లక్షలు ఇచ్చానని, దీనికి ఆధారాలు ఉన్నాయని పేర్కొన్నారు. టీజేఎస్ ప్రాథమిక సభ్యత్వానికి, పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
టికెట్లే ఖరారు కాలేదు: దిలీప్‌కుమార్
టికెట్లను పార్టీ ఇంకా ఖరారు చేయలేదని, డబ్బుల వసూళ్లంటూ ఆరోపణలు చేయడం సరికాదని టీజేఎస్ నేత దిలీప్‌కుమార్ అన్నారు. పార్టీ అవసరాలకోసం ఒక ఎన్‌ఆర్‌ఐ నుంచి 1.8 లక్షలు తనకు అందిన విషయం వాస్తవమేనని, వాటికి సంబంధించిన అన్ని లెక్కలు తన దగ్గర ఉన్నాయన్నారు.
Comments
Please login to add a commentAdd a comment