30 బస్సులపై కేసులు... 20 బస్సులు సీజ్ | Private travels buses seized in Andhra Pradesh | Sakshi
Sakshi News home page

అధిక ఛార్జీలు వసూలు చేస్తున్న ట్రావెల్స్పై కేసులు

Published Thu, Oct 2 2014 9:20 AM | Last Updated on Sat, Sep 2 2017 2:17 PM

Private travels buses seized in Andhra Pradesh

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ వివిధ జిల్లాలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై ఆర్టీఏ అధికారులు గురువారం తెల్లవారుజామున  ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా అధిక ఛార్జీలు వసూలు చేస్తున్న 30 బస్సులపై కేసులు నమోదు చేశారు. అలాగే సరైన పత్రాలు లేకుండా ప్రయాణికులను తరలిస్తున్న చేస్తున్న 20 బస్సులను సీజ్ చేశారు.

కృష్ణా జిల్లా గరికపాడు వద్ద 7 ప్రైవేట్ బస్సులు, నెల్లూరు జిల్లాలో 5, గుంటూరు జిల్లాలో 5, విశాఖపట్నం జిల్లాలో 2 బస్సులపై కేసులు నమోదు చేశారు. దసరా పండగ సమయంలో రేట్టింపు ఛార్జీలను ప్రయాణికుల నుంచి వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఏకకాలంలో ఆర్టీఏ అధికారులు దాడులు నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement