ఆర్టీఏ తనిఖీలు: 12 బస్సులు సీజ్ | RTA Officials seize 12 private buses | Sakshi
Sakshi News home page

ఆర్టీఏ తనిఖీలు: 12 బస్సులు సీజ్

Published Sat, Nov 16 2013 12:42 AM | Last Updated on Wed, Mar 28 2018 10:56 AM

RTA Officials seize 12 private buses

శంషాబాద్, న్యూస్‌లైన్: ఇటీవల వోల్వో బస్సుల్లో తరచూ ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో ఆర్టీఏ అధికారులు తనిఖీలు కొనసాగిస్తున్నారు. శుక్రవారం ఉదయం గగన్‌పహాడ్ చౌరస్తా వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను నిలిపి తనిఖీలు చేశారు. మొత్తం పన్నెండు బస్సులను సీజ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. బస్సుల్లో సామర్థ్యానికి మించి ప్రయాణికులను తరలిస్తున్నారని, కొన్ని బస్సుల్లో నిబంధనలకు విరుద్ధంగా ఒకే డ్రైవర్ ఉండడంతో సీజ్ చేశారు. అధికారులు వాహనాలను సీజ్ చేయడంతో బస్సుల్లో ఉన్న కొందరు ప్రయాణికులు వారితో తీవ్ర వాగ్వాదానికి దిగారు. తనిఖీలతో తాము తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని వారు వాపోయారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement