హైదరాబాద్: నిబంధనలను తుంగలో తొక్కి ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటాలాడుతున్న ప్రైవేటు బస్సులపై ఆర్‌టీఏ అధికారులు కొరడా ఝళిపించారు. శనివారం అర్ధరాత్రి ఎల్బీ నగర్ సమీపంలో 65వ నంబర్ జాతీయ రహదారిపై దాడులు నిర్వహించిన అధికారులు నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న 13 బస్సులను గుర్తించి వాటిపై కేసులు నమోదు చేశారు.