కడప: వైఎస్సార్ జిల్లా కడప నగర శివారులో ఆర్టీఏ అధికారులు గురువారం ఉదయం తనిఖీలు నిర‍్వహించారు. అనుమతి లేకుండా అక్రమంగా తిరుగుతున‍్న 67 ప్రైవేటు బస్సుల యజమానులపై కేసులు నమోదుచేశారు. అధిక చార్జీలు వసూలు చేస‍్తున‍్న మూడు బస్సులను ఈ తనిఖీలలో భాగంగా సీజ్ చేశారు. అలాగే టాక్స్ చెల్లించకుండా సర్వీసులు నడుపుతున్న 13 బస్సులపై కేసులు నమోదుచేయడంతో పాటు రూ.6లక్షల రూపాయల జరిమానా వసూలుచేశారు.