
సాక్షి, విశాఖపట్నం: సంక్రాంతి పండుగ సీజన్‌లో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ.. ప్రయాణికుల నుంచి భారీ మొత్తంలో చార్జీలు వసూలు చేస్తున్న ప్రైవేటు ట్రావెల్స్‌పై అధికారులు కొరడా ఝళిపించారు. గాజువాక సమీపంలోని అగనంపూడి టోల్‌గేట్ వద్ద ఆర్టీఏ అధికారులు బుధవారం తెల్లవారుజాము నుంచి దాడులు నిర్వహించారు. ప్రవేటు ట్రావెల్స్ బస్సులు నిబంధనలు పాటిస్తున్నాయా? లేదా? అన్నది తనిఖీ చేశారు. మొత్తం 59 బస్సుల్లో తనిఖీలు నిర్వహించారు. నిబంధనలు పాటించని ఐదు బస్సులపై ఆర్టీఏ అధికారులు కేసు నమోదు చేశారు.