అనంతపురంలో 8 ప్రైవేటు బస్సులు సీజ్ | 8 private buses seized in anantapuram district | Sakshi
Sakshi News home page

అనంతపురంలో 8 ప్రైవేటు బస్సులు సీజ్

Published Mon, Dec 30 2013 11:20 AM | Last Updated on Fri, Jun 1 2018 8:31 PM

హైదరాబాట్ -బెంగళూరు మధ్య నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న 8 ప్రైవేటు బస్సులను అధికారులు సీజ్ చేశారు.

అనంతపురం : ఆర్టీఏ అధికారులు దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా అనంతపురం జిల్లాలో ప్రైవేటు బస్సులపై ఆర్టీఏ అధికారుల కొరడా ఝళిపించారు. సోమవారం  ఉదయం అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు.  హైదరాబాట్ -బెంగళూరు మధ్య నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న 8 ప్రైవేటు బస్సులను అధికారులు సీజ్ చేశారు.

 

నగర శివార్లలో ఎన్హెచ్ 44 జాతీయ రహదారిపై బస్సులను ఆపి తనిఖీ చేశారు. ప్రైవేటు బస్సుల్లో ఉన్న ప్రయాణికులను ఆర్టీసి వారి సహకారంతో  గమ్యస్థానాలకు తరలించారు. బస్సులను సీజ్ చేసిన సమయంలో ప్రయాణికులు ఇబ్బంది పడాల్సి వస్తోందని, వారు ఆర్టీసి బస్సుల్లోనే ప్రయాణించాలని అధికారులు విజ్ణప్తి చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement