► రేసింగ్‌లకు పాల్పడుతున్న పలువురు అరెస్ట్
► 13 స్పోర్ట్ బైక్స్ స్వాధీనం
హైదరాబాద్: నగరంలోని బంజారాహిల్స్ కేబీఆర్ పార్క్ సమీపంలో శుక్రవారం అర్ధరాత్రి పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. మితిమీరిన వేగంతో వాహనాలు నడుపుతూ.. ఇతర వాహనదారులను భయబ్రాంతులకు గురిచేస్తున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
బైక్ రేసింగ్‌లకు పాల్పడుతున్న పలువురిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 13 స్పోర్ట్స్ బైక్‌లు, ఓ కారు స్వాధీనం చేసుకున్నారు. అదుపులో తీసుకున్న వారిలో పలువురు మైనర్లు ఉన్నారు. వారందరికి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు బంజారాహిల్స్ సీఐ విద్యాసాగర్ తెలిపారు.
బంజారాహిల్స్‌లో స్పెషల్ డ్రైవ్
Published Sat, May 6 2017 8:21 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement
Advertisement