రాజమండ్రి :రాజధాని హైదరాబాద్ ప్రయూణం జిల్లావాసులకు అదనపు భారం కాబోతోంది. తెలంగాణ ప్రభుత్వం వాహనాల ప్రవేశపన్ను విధించడంతో ఆ భారాన్ని ప్రయాణికులపై మోపేందుకు ప్రైవేట్ ట్రావెల్స్ యజమానులు సిద్ధమవుతున్నారు. త్వరలోనే టిక్కెట్ రేటును రూ.100 వరకు పెంచనున్నట్టు సమాచారం. రాష్ట్ర విభజన జరిగినా హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంది. అంతే కాక జిల్లాలో దాదాపు ప్రతి ఊరూ ఆ నగరంతో అనుబంధం కలిగి ఉంది. అందుకే అక్కడికి నిత్యం వేలాది మంది వెళుతుంటారు. ఇక వేసవి సెలవుల్లో అరుుతే చెప్పనక్కర లేదు. పరిమిత సంఖ్యలో ఉన్న రైళ్లు, ఆర్టీసీ బస్సులు జిల్లా నుంచి రాజధానికి వెళ్లే వారి అవసరాలు తీర్చలేకపోవడంతో 70 శాతం మంది ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపైనే ఆధారపడుతున్నారు. జిల్లాలో ఆర్టీసీ కూడా సర్వీసులు వేయని మారుమూల ప్రాంతాల నుంచి సైతం ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు హైదరాబాద్ సర్వీసులు నడుపుతున్నారుు. జిల్లా నుంచి హైదరాబాద్‌కు రోజుకు 150 నుంచి 170 వరకు బస్సులు వెళ్తుంటాయి. ఆర్టీసీ అమలాపురం నుంచి హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాలకు 12 బస్సులు నడుపుతుంటే, 20 పైగా ప్రైవేట్ సర్వీసులున్నాయి.
పన్ను బరువు.. ప్రయూణికులపైనే..
తెలంగాణ ప్రభుత్వం ఈనెల ఒకటి నుంచి వాహనాలపై ప్రవేశ పన్ను విధించడంతో ప్రైవేట్ ఆపరేటర్లు ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. ఇలా అయితే బస్సులు తిప్పలేమని మూడొంతుల సర్వీసులు నిలిపివేశారు. కోర్టు సైతం పన్ను కట్టాలని చెప్పడంతో విధిలేక ఇప్పుడిప్పుడే పూర్తిస్థాయిలో బస్సు సర్వీసులు నడుపుతున్నారు. అయితే తమపై పడుతున్న పన్నుభారాన్ని ప్రయాణికులపై మోపేందుకు సిద్ధమవుతున్నారు. టిక్కెట్ ధర రూ.100 వరకు పెంచే ఆలోచనలో ఉన్నారు. అమలాపురం నుంచి హైదరాబాద్‌కు ఇప్పటి వరకు రూ.500 నుంచి రూ.550 వరకు ఉం డగా త్వరలో ఇది రూ.600 నుంచి రూ.650 వరకు, కాకినాడ నుంచి రూ.650 నుంచి రూ.700 వరకు ఉన్న చార్జిలు రూ.750 నుంచి రూ.800 వరకు, రాజమండ్రి నుంచి రూ.610 నుంచి రూ.660 వరకు ఉన్న చార్జిలు రూ.710 నుంచి రూ.760 వరకు, తుని నుంచి రూ.650 -రూ.700 మధ్య ఉన్న ధరలు రూ.750 నుంచి రూ.800 వరకు పెరగనున్నారుు. ఈ పెంపు రెండు మూడు రోజుల్లోనే విధించే అవకాశముందని ప్రైవేట్ ఆపరేటర్లు చెబుతున్నారు.
ప్రత్యేక బస్సులు, రైళ్ల సంఖ్య పెంచాలి..
వేసవి సెలవుల్లో జిల్లా నుంచి హైదరాబాద్ వెళ్లేవారు ఎక్కువ. ఇప్పటికే ఇంటర్, పది, డిగ్రీ పరీక్షలు పూర్తికాగా, పాఠశాలల్లో మిగిలిన తరగతుల పరీక్షలు కూడా పూర్తి కావస్తున్నాయి. జిల్లాలో ఈనెల 24 నుంచి పాఠశాలలకు వేసవి సెలవులు ఇస్తున్నారు. దీనితో కుటుంబమంతా కలిసి హైదరాబాద్ వెళ్లే వారి సంఖ్య గణనీయంగానే ఉంటుంది. జిల్లా మీదుగా హైదరాబాద్‌కు వెళ్లే రైళ్లలో రిజర్వేషన్లు దాదాపు నెలరోజుల వరకూ ఇప్పటికే భర్తీ అయిపోయూయి. గౌతమి, గోదావరి, విశాఖ ఎక్స్‌ప్రెస్ వంటివే కాక నాగావళి వంటి వారానికి మూడుసార్లు నడిచే రైళ్లలో సైతం మే 25 వరకు ఖాళీలు లేవు. అదే రోజుల్లో ఆర్టీసీ బస్సుల్లో సైతం టిక్కెట్లు దాదాపు రిజర్వ్ అరుుపోరుున పరిస్థితి ఉంది. దీనితో అనేకులకు ప్రైవేట్ బస్సులే శరణ్యమవుతున్నాయి. ఈ సమయంలోనే ప్రైవేట్ ఆపరేటర్లు టిక్కెట్ ధరలు పెంచడంతో సరదాగా సెలవులు గడిపేందుకు హైదరాబాద్ వెళ్లాలనే వారికి ప్రయూణం భారంగా మారనుంది. దీనికి విరుగుడుగా వేసవిలో ఆర్టీసీ మరిన్ని ప్రత్యేక బస్సులు, రైల్వే మరిన్ని ప్రత్యేక రైళ్లు నడిపేలా ప్రభుత్వం పూనుకోవాలి.
హైదరా బాదుడే
Published Tue, Apr 21 2015 3:44 AM | Last Updated on Sun, Sep 3 2017 12:35 AM
Advertisement