ticket rate
-
'కల్కి' సినిమా టికెట్ ధరల పెంపునకు గ్రీన్ సిగ్నల్
-
National Cinema Day: మల్టీఫ్లెక్సుల్లో రూ.75కే టికెట్!
ముంబై: ఓటీటీల కాలంలో.. కరోనా తర్వాత సాధారణ థియేటర్లతో పోలిస్తే మల్టీఫ్లెక్స్‌లకే ప్రేక్షకుల తాకిడి పెరుగుతోంది. ఈ క్రమంలో.. తాజాగా మల్టీ ఫ్లెక్స్ అసోసియేషన్ ఆసక్తికర నిర్ణయం ఒకటి తీసుకుంది. వంద రూపాయలలోపు టికెట్ రేటుతో ప్రేక్షకుడికి సినిమా అనుభూతిని అందించాలని నిర్ణయించుకుంది. అయితే ఇక్కడో విషయం ఉందండోయ్. సెప్టెంబర్ 16న నేషనల్ సినిమా డే. ఈ సందర్భంగా.. ప్రేక్షకులకి ఈ బంపరాఫర్ ప్రకటించింది మల్టీఫ్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(MAI). కరోనా లాక్డౌన్ తర్వాత ఆదరిస్తున్న ప్రేక్షకుల గౌరవార్థం ఆ ఒక్కరోజు ఈ పని చేస్తున్నట్లు ప్రకటించింది ఎంఏఐ. పీవీఆర్, ఐనాక్స్, సినీపోలీస్, కార్నివాల్, మిరాజ్, ఏషియన్.. ఇలా పలు మల్టీఫ్లెక్స్ ఫ్రాంచైజీల్లో ఆరోజున కేవలం రూ.75కే సినిమా చూడొచ్చు. ఇందుకోసం దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన 4000 స్క్రీన్స్‌లో సినిమా చూడొచ్చని మల్టీఫ్లెక్స్ అసోషియేషన్ ఆఫ్ ఇండియా ఒక ప్రకటనను ట్విటర్లో పోస్ట్ చేసింది. ఈ డిస్కౌంట్ ద్వారా అయిన ఆడియొన్స్‌ను ఆ ఒక్కరోజు రప్పించ వచ్చనే ఆలోచనలో ఉంది. అయితే ఇప్పటికే బాయ్‌కాట్‌ట్రెండ్ మోజులో ఉన్న ఆడియెన్స్.. ఈ బంపరాఫర్‌ను స్వీకరిస్తారా? తిరస్కరిస్తారా? అనేది తెలియాల్సి ఉంది. అయితే.. మల్టీఫ్లెక్స్ ఫ్రాంచైజీలు మాత్రం ఫ్యామిలీ ఆడియొన్స్ రావొచ్చనే ఆశాభావం వ్యక్తం చేస్తోంది. Cinemas come together to celebrate ‘National Cinema Day’ on 16th Sep, to offer movies for just Rs.75. #NationalCinemaDay2022 #16thSep — Multiplex Association Of India (@MAofIndia) September 2, 2022 ఇదీ చదవండి: బీజేపీలో ఉంటూనే ‘ఆప్’ కోసం పని చేయండి -
సినీ నిర్మాత వినతిపై నిర్ణయం తీసుకోండి
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని సినిమా థియేటర్లలో టికెట్ రేట్లను ఖరారు చేస్తూ ప్రభుత్వం ఈ ఏడాది ఏప్రిల్ 8న జారీ చేసిన జీవో–35 అమలు కోరుతూ సినీ నిర్మాత నట్టి కుమార్ ఇచ్చిన వినతి పత్రంపై తగిన నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఏపీ సినిమాస్ రెగ్యులేషన్స్ చట్టం 1995లోని సెక్షన్ 9, 10, 11లను అనుసరించి ఆయన వినతిపై నిర్ణయం తీసుకోవాలంది. న్యాయమూర్తి జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ రాయ్ సోమవారం మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. మునిసిపాలిటీలు, నగరాలు, నగర పంచాయతీ, గ్రామ పంచాయతీ పరిధుల్లోని థియేటర్లలో టికెట్ల రేట్లను ఖరారు చేస్తూ ప్రభుత్వం ఈ ఏడాది ఏప్రిల్ 8న జీవో 35 జారీ చేసింది. అయితే, జీవోకు విరుద్ధంగా సినిమా థియేటర్ల యాజమాన్యాలు ఎక్కువ ధరకు టికెట్లు విక్రయిస్తున్నారని, ఇదే రీతిలో విశాఖపట్నంలోని శ్రీలక్ష్మి థియేటర్ యాజమాన్యం అధిక ధరకు టికెట్లు అమ్ముతోందంటూ నట్టి కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జీవో 35 అమలు కోసం తగిన నిర్ణయం తీసుకునేలా ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని ఆయన కోరారు. -
కస్సు ‘బస్సు’
తాత్కాలిక సిబ్బందికి వరంలా మారిన ఆర్టీసీ సమ్మె {పయాణికుల నుంచి ఇష్టానుసారం వసూలు సంస్థకు వస్తున్నది నామమాత్రపు ఆదాయం ఏడు రోజులవుతున్నా గాడిలో పడని టికెట్ రేట్లు {పమాదాలు, అక్రమ వసూళ్లపై లోపించిన పర్యవేక్షణ విశాఖపట్నం: పిల్లికి చెలగాటం..ఎలుకకు ప్రాణసంకటమన్నట్లుగా తయారైంది ఆర్టీసీ సమ్మె వల్ల ప్రయాణికుల పరిస్థితి. బస్కెక్కాలంటేనే జనం వెనుకడుగేస్తున్నారు. తాత్కాలిక సిబ్బంది ‘టికెట్ రేట్’కు అంతూపొంతూ లేకుండా పోతోంది. రోజుకు వెయ్యి రూపాయల వేతనం కోసం వచ్చిన వారు వేలాది రూపాయలు ఆర్జిస్తున్నారు. ఎక్కువ చెల్లించలేక ప్రయాణికులడిగితే సిబ్బంది తిరగబడుతున్నారనే ఫిర్యాదులు పెరిగిపోతున్నాయి. బస్సు దించేస్తున్న సంఘటనలూ ఉంటున్నాయి. నివారించాల్సిన అధికారులు పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. టిక్కెట్లు కూడా లేకపోవడంతో తనిఖీలు కూడా మానేసి కార్యాలయాలకు పరిమితమవున్నారు. ఫలితంగా అటు సంస్థకు,ఇటు ప్రయాణీకులకు ఆర్ధిక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. జిల్లాలో ఆర్టీసీకి 1016 బస్సులున్నాయి. అరకు, సింహాచలం వంటి ప్రాంతాలకు ప్రతి రోజూ వందలాది బస్సు సర్వీసులు తిరుగుతాయి. కాకినాడ, రాజమండ్రి, శ్రీకాకుళం, నర్శీపట్నం, విజయనగరం వంటి నగరాలకు నాన్‌స్టాప్ సర్వీసులు నడుపుతున్నారు. దాదాపు 500 బస్సులు సిటీ సర్వీసులున్నాయి. దీంతో ఆదాయం కూడా అదే స్థాయిలో వస్తోంది. సాధారణ రోజుల్లో రూ.70 లక్షల రాబడి ఉంటే ప్రస్తుతం వేసవి సెలవులు కావడంలో రోజుకి రూ.1.04 కోట్లు ఆదాయం వస్తోంది. సమ్మె ప్రారంభానికి ముందు రోజు వరకూ ఉన్న పరిస్థితి ఇది. కానీ ఇప్పుడలా లేదు. సమ్మె ఏడు రోజులుగా జరుగుతోంది. అధికారులు 150 అద్దె బస్సులను రంగంలోకి దించారు. అందుబాటులో ఉన్న టైనీ డైవర్లను వినియోగించారు. అవి ఏ మూలకు సరిపోకపోవడంతో ప్రైవేట్ బస్సులకు గేట్లు తెరిచారు. తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లుగా పని చేయడానికి వస్తే రోజుకి రూ.1000 చొప్పున చెల్లిస్తామన్నారు. దీంతో నిరుద్యోగులు క్యూకట్టారు. వెయ్యి రూపాయలకు ఇంత మంది వస్తున్నారేమిటని అధికారులే ఆశ్చర్యపోయారు. కానీ వారి ఆలోచన తర్వాత అర్ధమైంది. ప్రయాణీకుల అవసరాలను సొమ్ము చేసుకోవడం ప్రారంభించారు. ఆర్టీసీ డిపోల్లోని బంకుల్లోనే తమ బస్సులకు ఆయిల్ కొట్టించుకుని మరీ తీసుకువెళ్లిన బస్సుల్లో సాయంత్రానికి రెండు మూడు వేల రూపాయలకు మించి ఆదాయం చూపించడం లేదు. సమ్మె వల్ల ఆర్టీసీకి రోజుకి రూ.85లక్షల నష్టం వాటిల్లుతోందని అధికారులు చెబుతున్నారు. అదే సమయంలో 60 శాతం బస్సులను నడుపుతున్నామంటున్నారు. అంటే కోటి రూపాయల ఆదాయం వచ్చే ఆర్టీసీ 40 శాతం బస్సులను నడపకపోవడం వల్ల ఆ నలభై శాతం మాత్రమే ఆదాయం కోల్పోవాలి. ఈ లెక్కన రూ.60లక్షల ఆదాయం సమకూరాలి. కానీ వస్తున్నది కేవలం రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల మధ్య మాత్రమే మిగతా రూ.40 లక్షలు ఏమవుతున్నట్టు.? ఈ ప్రశ్నకు అధికారుల వద్ద సమాధానం లేదు. ఎక్కువ వసూలు చేస్తే చర్యలు ‘‘కార్మికుల సమ్మె వల్ల ప్రైవేటు బస్సులను తాత్కాలిక సిబ్బందిని తీసుకున్నాం. అయితే టిక్కెట్లు కొట్టే పరిస్థితి లేదు. దీంతో వారికి టిక్కెట్టు ధరల చార్టు ఇచ్చాం. దాని ప్రకారమే తీసుకోమని చెప్పాం. ఎక్కువ వసూలు చేసినట్టు తెలిస్తే విధుల నుంచి తప్పిస్తామని,తర్వాత ఎప్పుడూ అవకాశం ఇవ్వమని కూడా హెచ్చరించాం. అంతకు మించి తనిఖీలు నిర్వహించడానికి ప్రస్తుతం అధికారులెవరూ అందుబాటులో లేరు. -వై.జగదీష్‌బాబు, ప్రాంతీయాధికారి, ఆర్టీసీ, విశాఖ -
హైదరా బాదుడే
రాజమండ్రి :రాజధాని హైదరాబాద్ ప్రయూణం జిల్లావాసులకు అదనపు భారం కాబోతోంది. తెలంగాణ ప్రభుత్వం వాహనాల ప్రవేశపన్ను విధించడంతో ఆ భారాన్ని ప్రయాణికులపై మోపేందుకు ప్రైవేట్ ట్రావెల్స్ యజమానులు సిద్ధమవుతున్నారు. త్వరలోనే టిక్కెట్ రేటును రూ.100 వరకు పెంచనున్నట్టు సమాచారం. రాష్ట్ర విభజన జరిగినా హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంది. అంతే కాక జిల్లాలో దాదాపు ప్రతి ఊరూ ఆ నగరంతో అనుబంధం కలిగి ఉంది. అందుకే అక్కడికి నిత్యం వేలాది మంది వెళుతుంటారు. ఇక వేసవి సెలవుల్లో అరుుతే చెప్పనక్కర లేదు. పరిమిత సంఖ్యలో ఉన్న రైళ్లు, ఆర్టీసీ బస్సులు జిల్లా నుంచి రాజధానికి వెళ్లే వారి అవసరాలు తీర్చలేకపోవడంతో 70 శాతం మంది ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపైనే ఆధారపడుతున్నారు. జిల్లాలో ఆర్టీసీ కూడా సర్వీసులు వేయని మారుమూల ప్రాంతాల నుంచి సైతం ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు హైదరాబాద్ సర్వీసులు నడుపుతున్నారుు. జిల్లా నుంచి హైదరాబాద్‌కు రోజుకు 150 నుంచి 170 వరకు బస్సులు వెళ్తుంటాయి. ఆర్టీసీ అమలాపురం నుంచి హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాలకు 12 బస్సులు నడుపుతుంటే, 20 పైగా ప్రైవేట్ సర్వీసులున్నాయి. పన్ను బరువు.. ప్రయూణికులపైనే.. తెలంగాణ ప్రభుత్వం ఈనెల ఒకటి నుంచి వాహనాలపై ప్రవేశ పన్ను విధించడంతో ప్రైవేట్ ఆపరేటర్లు ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. ఇలా అయితే బస్సులు తిప్పలేమని మూడొంతుల సర్వీసులు నిలిపివేశారు. కోర్టు సైతం పన్ను కట్టాలని చెప్పడంతో విధిలేక ఇప్పుడిప్పుడే పూర్తిస్థాయిలో బస్సు సర్వీసులు నడుపుతున్నారు. అయితే తమపై పడుతున్న పన్నుభారాన్ని ప్రయాణికులపై మోపేందుకు సిద్ధమవుతున్నారు. టిక్కెట్ ధర రూ.100 వరకు పెంచే ఆలోచనలో ఉన్నారు. అమలాపురం నుంచి హైదరాబాద్‌కు ఇప్పటి వరకు రూ.500 నుంచి రూ.550 వరకు ఉం డగా త్వరలో ఇది రూ.600 నుంచి రూ.650 వరకు, కాకినాడ నుంచి రూ.650 నుంచి రూ.700 వరకు ఉన్న చార్జిలు రూ.750 నుంచి రూ.800 వరకు, రాజమండ్రి నుంచి రూ.610 నుంచి రూ.660 వరకు ఉన్న చార్జిలు రూ.710 నుంచి రూ.760 వరకు, తుని నుంచి రూ.650 -రూ.700 మధ్య ఉన్న ధరలు రూ.750 నుంచి రూ.800 వరకు పెరగనున్నారుు. ఈ పెంపు రెండు మూడు రోజుల్లోనే విధించే అవకాశముందని ప్రైవేట్ ఆపరేటర్లు చెబుతున్నారు. ప్రత్యేక బస్సులు, రైళ్ల సంఖ్య పెంచాలి.. వేసవి సెలవుల్లో జిల్లా నుంచి హైదరాబాద్ వెళ్లేవారు ఎక్కువ. ఇప్పటికే ఇంటర్, పది, డిగ్రీ పరీక్షలు పూర్తికాగా, పాఠశాలల్లో మిగిలిన తరగతుల పరీక్షలు కూడా పూర్తి కావస్తున్నాయి. జిల్లాలో ఈనెల 24 నుంచి పాఠశాలలకు వేసవి సెలవులు ఇస్తున్నారు. దీనితో కుటుంబమంతా కలిసి హైదరాబాద్ వెళ్లే వారి సంఖ్య గణనీయంగానే ఉంటుంది. జిల్లా మీదుగా హైదరాబాద్‌కు వెళ్లే రైళ్లలో రిజర్వేషన్లు దాదాపు నెలరోజుల వరకూ ఇప్పటికే భర్తీ అయిపోయూయి. గౌతమి, గోదావరి, విశాఖ ఎక్స్‌ప్రెస్ వంటివే కాక నాగావళి వంటి వారానికి మూడుసార్లు నడిచే రైళ్లలో సైతం మే 25 వరకు ఖాళీలు లేవు. అదే రోజుల్లో ఆర్టీసీ బస్సుల్లో సైతం టిక్కెట్లు దాదాపు రిజర్వ్ అరుుపోరుున పరిస్థితి ఉంది. దీనితో అనేకులకు ప్రైవేట్ బస్సులే శరణ్యమవుతున్నాయి. ఈ సమయంలోనే ప్రైవేట్ ఆపరేటర్లు టిక్కెట్ ధరలు పెంచడంతో సరదాగా సెలవులు గడిపేందుకు హైదరాబాద్ వెళ్లాలనే వారికి ప్రయూణం భారంగా మారనుంది. దీనికి విరుగుడుగా వేసవిలో ఆర్టీసీ మరిన్ని ప్రత్యేక బస్సులు, రైల్వే మరిన్ని ప్రత్యేక రైళ్లు నడిపేలా ప్రభుత్వం పూనుకోవాలి.