‘ఆమ్నీ’స్పీడుకు బ్రేకులు
Published Sun, Nov 24 2013 4:09 AM | Last Updated on Sat, Sep 2 2017 12:54 AM
సాక్షి, చెన్నై : ఆమ్నీ బస్సుల అతివేగానికి బ్రేక్ వేయడానికి రవాణా శాఖ చర్యలు చేపట్టింది. మితి మీరిన వేగానికి పంచ సూత్రాల ఆంక్షలు విధిం చింది. ప్రతి 150 కి.మీ దూరానికి ఒక డ్రైవర్ మారాలన్న షరతు పెట్టింది. రాష్ట్ర రాజధాని నగరం చెన్నైలో అతి పెద్ద బస్ టెర్మినల్‌గా కోయంబేడు ప్రఖ్యాతి గాంచింది. ఇక్కడి నుంచి ప్రభుత్వ బస్సులు నిత్యం ఉరకలు తీస్తుంటాయి. ఈ టెర్మినల్‌కు కూత వేటు దూరంలో ఆమ్నీ(ప్రైవేటు) బస్టాండ్ ఉంది. రాష్ట్రంలోని అన్ని నగరాలకు, పట్టణాలకు, జిల్లా కేంద్రాలకు, పక్క రాష్ట్రాలైన బెంగళూరు, మైసూరు, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, కర్నూలు వంటి నగరాలకు ముంబై వంటి ఉత్తరాది నగరాలకు ఇక్కడి నుంచి ప్రతి రోజు బస్సులు వెళుతుంటాయి. ఓల్వో, హైటెక్, డీలక్స్, సూపర్, సెమి డీలక్స్ ఇలా ప్రైవేటు హంగులతో ఉండే ఈ బస్సుల్లో చార్జీలు వసతులకు తగ్గట్టుగానే ఉంటాయి. ఈ బస్సుల్ని ఆశ్రయించే వారి సంఖ్యా ఎక్కువే.
మితిమీరిన వేగం
సాయంత్రం సరిగ్గా ఏడు గంటలు దాటితే చాలు ఆమ్నీ బస్సులు రోఢ్డెక్కుతాయి. దక్షిణాది జిల్లాల వైపుగా వెళ్లే బస్సులు వండలూరు దాటితే చాలు వేగానికి అడ్డూ అదుపూ ఉండ దు. బెంగళూరు, పూందమల్లి హైవే మీద ఈ బస్సులు మెరుపు తీగల్లాగా ప్రయూణిస్తుంటా యి. ఉదయాన్నే గమ్యస్థానాలకు ప్రయాణికుల్ని చేర్చడం లక్ష్యంగా దూసుకెళ్లే ఈ బస్సులు ప్రమాదాలకు గురవుతున్నాయి. దీంతో ప్రయాణికులకు భద్రత కరువు అవుతోంది. ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మహబూబ్ నగర్ వద్ద, కర్నాటక రాష్ట్రంలోని బెంగళూరు సమీపంలో ఓల్వో బస్సులు ప్రమాదానికి గురి కావడంతో అందులోని ప్రయాణికులు సజీవ దహనం అయ్యూరు. దీంతో రాష్ట్ర రవాణా శాఖ ముందస్తు చర్యల్లో పడింది. ప్రమాదాల నివారణా లక్ష్యంగా ఆమ్నీ యాజమాన్యాలతో చర్చలు జరిపింది. బస్సుల్లో, ప్రయాణికులకు కల్పించాల్సిన సౌకర్యాలపై చర్చించి నిర్ణయం తీసుకున్నారు.
స్పీడ్‌కు బ్రేక్
ఆమ్నీ వేగాన్ని కట్టడి చేస్తూ ప్రధానంగా నిర్ణ యం తీసుకున్నారు. పంచ సూత్రాలతో కూడిన చిట్టాను రవాణా శాఖ వర్గాలు ప్రకటించాయి. గంటకు 80 కి.మీ మించి వేగంతో బస్సును నడిపేందుకు వీలు లేదు. బస్సు బయలు దేరేందు కు ముందుగా బస్సులోని సౌకర్యాలు, భద్రతా ఏర్పాట్ల గురించి లఘు చిత్రాన్ని ప్రయాణికులకు ప్రదర్శించాలి. బస్సుల్లో ఎమర్జన్సీ డోర్‌లు ఎక్కడున్నాయో, అగ్నినిరోధక పరికరాలు ఉన్న ప్రదేశాలు, ఏ డోర్‌ను సుల భంగా పగుల కొట్టవచ్చో ప్రయాణికులకు వివరించాలి. ప్రమాదం జరిగిన పక్షంలో ఎలా తప్పించుకోవాలో తెలి యజేయూలి. డ్రైవర్లు మద్యం తాగి ఉన్నారా లేదా..? అని టోల్ ప్లాజాలు, చెక్ పోస్టుల్లో తని ఖీలు చేయించుకుని, అక్కడి సిబ్బంది సంతకం తీసుకోవాలి. ప్రతి 150 కి.మీ దూరానికి ఒక డ్రైవర్ మారాలి. 150 కి.మీ కంటే ఎక్కువ దూరం ప్రయూణించే ప్రతి బస్సులోనూ ఇద్దరు డ్రైవర్లు తప్పని సరిగా ఉండాలి. రవాణా శాఖ నిబంధనల్ని ఏ ఒక్క ట్రావెల్స్ ఉల్లంఘించినా, బస్సుల రిజిస్ట్రేషన్ రద్దు చేస్తారు. ఓల్వో బస్సులకు ప్రత్యేక ఆంక్షలు విధించారు. బస్సు ప్రమాదానికి గురైన సమయంలో డీజిల్ ట్యాంక్ పేలడం ఇటీవల చోటు చేసుకున్న ఘటనలు స్పష్టం చేస్తున్నారుు. దీంతో ఓల్వో బస్సుల్లో మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రయాణికుల భద్రతకు తగ్గట్టుగా బస్సుల్ని తీర్చిదిద్దాలని సూచించారు.
అమలు సాధ్యమే
రవాణా శాఖ నిబంధనల్లో కొన్నింటిని ఇది వరకు ఆమ్నీ బస్సుల్లో పాటిస్తూ వస్తున్నామని ఆ బస్సుల యజమానుల సమాఖ్య నాయకుడు అఫ్జల్ పేర్కొన్నారు. మూడు నుంచి నాలుగు నిమిషాలతో కూడిని వీడియో టేపును అధికారులు తమకు ప్రదర్శించారన్నారు. ఇందులో భద్రతా చర్యల్ని వివరించారని, వీటిని తూచా తప్పకుండా పాటిస్తామన్నారు. అన్ని బస్సుల్లో ఇద్దరు చొప్పున డ్రైవర్లు ఇప్పటికే ఉన్నారని పేర్కొంటూ, ఇక అన్ని బస్సుల్లోనూ ప్రభుత్వ నిబంధనలు పాటించి తీరుతామన్నారు.
Advertisement
Advertisement