పట్నం.. పల్లెకు పయనం | Over two lakhs people 'extra' journey in two days | Sakshi
Sakshi News home page

పట్నం.. పల్లెకు పయనం

Published Sun, Aug 13 2017 2:28 AM | Last Updated on Wed, Sep 19 2018 6:29 PM

పట్నం.. పల్లెకు పయనం - Sakshi

పట్నం.. పల్లెకు పయనం

వరుస సెలవులతో పోటెత్తిన ప్రయాణికులు
- సొంతూళ్లు, పర్యాటక ప్రాంతాలకు తరలివెళ్లిన హైదరాబాద్‌ వాసులు
రెండు రోజుల్లో రెండు లక్షల మందికి పైగా ‘అదనపు’ ప్రయాణం
 
సాక్షి, హైదరాబాద్‌: వరుస సెలవుల నేపథ్యంలో హైదరాబాద్‌ మహానగరం మాన్‌సూన్‌ టూరేసింది. శనివారం నుంచి మంగళవారం వరకు వరుసగా 4 రోజుల పాటు సెలవులు రావడంతో నగరవాసులు పర్యాటక ప్రాంతాలకు, సొంతూళ్లకు తరలివెళ్లారు. దీంతో నగరం నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే రైళ్లు, బస్సులు, ఇతర ప్రైవేటు వాహనాలు కిక్కిరిసి పోయాయి. ప్రయాణికుల రద్దీతో బస్, రైల్వే స్టేషన్లు పోటెత్తాయి. వాహనాల రద్దీ కారణంగా వరంగల్, విజయవాడ, ముంబై జాతీయ రహదారు ల్లోని టోల్‌గేట్ల వద్ద భారీగా వాహనాలు స్తంభిం చాయి. సాధారణ రోజుల్లో మహాత్మాగాంధీ బస్‌స్టేషన్‌ (ఎంజీబీఎస్‌) నుంచి రోజుకు 1,500 బస్సులు దూర ప్రాంతాలకు వెళ్తుండగా, తాజా గా  200 బస్సులు అదనంగా బయలుదేరాయి.

విజయవాడ, తిరుపతి, బెంగళూరు, భద్రాచలం, కాకినాడ, కర్నూలు మార్గాల్లో పెద్ద సంఖ్యలో బస్సులు బయలుదేరాయి. రోజూ ఎంజీబీఎస్‌ నుంచి 1.20 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుండగా, శనివారం ఒక్క రోజే మరో 50 వేల మంది వివిధ ప్రాంతాలకు తరలివెళ్లారు. జూబ్లీ బస్‌ స్టేషన్‌ నుంచి కరీంనగర్, మెదక్, నిజామాబాద్, వరం గల్, సిద్దిపేట, ఆదిలాబాద్‌ తదితర జిల్లాలకు మరో యాభై వేల మంది ప్రయాణికులు బయ లుదేరి వెళ్లారు. వాహనాలన్నీ ఒకేసారి రోడ్డుపైకి రావడంతో నగరంలోని రహదారులతోపాటు ఎల్బీనగర్, ఉప్పల్, మెహదీపట్నం, శివరాంపల్లి, జేబీఎస్, సాగర్‌రింగ్‌ రోడ్డులోని ప్రధాన కూడళ్లన్నీ రద్దీగా మారాయి.
 
కిక్కిరిసిన రైళ్లు
సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వేస్టేషన్ల నుంచి బయలుదేరిన రైళ్లు ప్రయాణికులతో కిటకిటలాడాయి. రిజర్వేషన్లు లభించకపోవ డంతో ప్రయాణికులు జనరల్‌ బోగీల్లో ప్రయా ణించాల్సి వచ్చింది. 75 మంది వెళ్లాల్సిన జనరల్‌ బోగీలో 200 మందికిపైగా వెళ్తున్నారు. సాధారణంగా సికింద్రాబాద్‌ స్టేషన్‌ నుంచి రోజూ 80 ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు, వంద ప్యాసింజర్‌ రైళ్లు రాకపోకలు సాగిస్తాయి. 2.5 లక్షల మంది ప్రయాణిస్తారు. సికింద్రాబాద్‌ నుంచి 30 నుంచి 40 వేల మంది అదనంగా వెళ్లినట్లు దక్షిణ మధ్య రైల్వే అంచనా వేసింది. కాచిగూడ, నాంపల్లి స్టేషన్ల నుంచి సాధారణ రోజుల్లో 50 వేల మంది చొప్పున ప్రయాణిస్తుండగా, తాజాగా రెండు స్టేషన్లలో మరో 20 వేల మంది అదనంగా బయలుదేరినట్లు అంచనా.
 
‘ప్రైవేటు’ నిలువు దోపిడీ
వరుస సెలవులను ప్రైవేటు బస్సులు సొమ్ము చేసుకున్నాయి. రైళ్లు, ఆర్టీసీ బస్సుల్లో సీట్లు లభించని వారు ప్రైవేటు బస్సులను ఆశ్రయించారు. చార్జీలను రెట్టింపు చేసి ప్రైవేటు ఆపరేటర్లు ప్రయాణికులపై నిలువు దోపిడీకి దిగారు. సాధారణంగా హైదరాబాద్‌ నుంచి విజయవాడకు రూ.450 ఉండగా, ఏకంగా రూ.800కి పెంచారు. వైజాగ్‌కు ఏసీ బస్సు చార్జీ రూ.950 కాగా, ఏకంగా రూ.1,850కిపైగా వసూలు చేశారు. అన్ని రూట్లలోనూ ఇదే పరిస్థితి కన్పించింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement