మూసాపేట, న్యూస్‌లైన్: రంగారెడ్డి జిల్లా, హైదరాబాద్‌ల్లో అనుమతులు లేని మొత్తం 665 ప్రైవేట్ బస్సులు సీజ్ చేశామని డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ రమేశ్ తెలిపారు. బుధవారం కూకట్‌పల్లిలోని ఆర్టీసీ డిపోలో సికింద్రాబాద్ రీజనల్ ఇంధన పొదుపు పక్షోత్సవాల ముగింపు కార్యక్రమం నిర్వహించారు. మొత్తం 11 డిపోల ఆర్టీసీ కార్మికులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముంబై, ఇతర రాష్ట్రాల కన్నా ఏపీఎస్‌ఆర్టీసీ ఎక్కువ 5.3 కేఎంపీఎల్ తీసుకువస్తుందని అన్నారు. ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ కోటేశ్వర్‌రావు మాట్లాడుతూ ప్రజల జీవన విధానంలో ఆర్టీసీ మమేకమైందని, గ్రేటర్ హైదరాబాద్‌లో నిత్యం 6వేల బస్సులు నడుస్తున్నాయన్నారు. కార్యక్రమంలో ఆర్టీసీ రీజనల్ మేనేజర్ సత్యనారాయణ, అశోక్ లేలాండ్ సంస్థ సీనియర్ మేనేజర్ సూర్యనారాయణ, సనత్‌నగర్, సికిం ద్రా బాద్ డీవీఎం రాజారాం, విమల, కూకట్‌పల్లి ఆర్టీసీ డిపో మేనేజర్ ప్రసాద్, కూకట్‌పల్లి మెకానికల్ ఫోర్‌మెన్ కె.కె.కుమార్, అసిస్టెంట్ మోటా ర్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్ వాసు, ఆర్టీసీ కార్మికులు, యూనియన్ నాయకులు పాల్గొన్నారు.
ఆర్టీసీ కేఎంపీఎల్ అవార్డు డ్రైవర్లు వీరే....
కూకట్‌పల్లి డిపో నుంచి పి.ఎస్. రెడ్డి, సయాజు ద్దీన్, అంజయ్య, రాణిగంజ్ డిపో-1 నుంచి ఎస్.మల్లయ్య, పి.గోపాల్, ఎం.ఎం రెడ్డి, మి యాపూర్-డిపో నుంచి యాదగిరి, అబ్ధుల్‌ఖా న్, రాజిరెడ్డి, జీడిమెట్ల డిపో నుంచి వైఎస్ సుం దర్, మహేందర్, వెంకటేశ్వర్లుకు అవార్డులు అందజేశారు.
అనుమతుల్లేని 665 ప్రైవేట్ బస్సులు సీజ్ : డీటీసీ రమేష్
Published Wed, Jan 29 2014 10:58 PM | Last Updated on Wed, Mar 28 2018 10:59 AM
Advertisement
Advertisement