koteswar rao
-
పోలీస్ పహారాలో కొత్తపాలెం
గుంటూరు: వాహనాల సైరన్, పోలీసుల రాకపోకలతో మొన్నటి వరకు ప్రశాంతంగా ఉన్న కొత్తపాలెం హడావుడిగా మారింది. కొండ ప్రాంతంలో నిత్యం పండ్లు, పూల తోటల పనుల్లో నిమగ్నమయ్యే గ్రామస్తులు గత రెండు రోజులుగా చోటు చేసుకుంటున్న ఘటనలపై ఎప్పుడు ఏం జరుగుతుందోననే భయాందోళన నడుమ జీవిస్తున్నారు. మాకు ఇదేం ఖర్మరా బాబూ..అంటూ తలలు పట్టుకుంటున్నారు. పోలీస్ పహారాలో గ్రామం ఉండటంతో అసహనానికి గురవుతున్నారు. తెల్లవారు జాము నుంచేఖాకీల హడావుడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిజ నిర్ధారణ కమిటీ బుధవారం కొత్తపాలెం గ్రామంలో పర్యటిస్తున్నట్లు తెలుసుకున్న పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. రాత్రికి రాత్రే రూరల్ జిల్లా పరిధిలోని పోలీసులను అప్రమత్తం చేసి తెల్లవారుజాముకు గ్రామానికి చేరుకున్నారు. ఘటన జరిగిన ప్రాంతం, అటు వైపు వెళ్లే మార్గాల్లో పోలీసు బలగాలను మోహరించారు. ఉదయం మంత్రి పత్తిపాటి పుల్లారావు కూడా అక్కడ పర్యటించనున్న నేపథ్యంలో పూర్తిస్థాయిలో ఆ ప్రాంతంలో నిఘా పెట్టారు. రెండు రోజుల అనంతరం మళ్లీ గ్రామంలోకి, గ్రామ ప్రధాన రహదారి వద్దకు వరుసగా పోలీసుల వాహనాలు వచ్చి నిలవడంతో ఏం జరిగిందోనని ఆందోళనలో పడ్డారు. గ్రామంలోకి వెళ్లకుండా అడ్డుకుంటున్న ఖాకీలు చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పోలీసు అధికారులు, సిబ్బంది రంగంలోకి దిగారు. ఇంటెలిజెన్స్, స్పెషల్ బ్రాంచ్ అధికారులు అక్కడ జరిగే ప్రతి చిన్న విషయాన్ని సైతం సెల్ఫోన్లలో, పోలీసుల వద్ద ఉన్న బాడీవార్న్ కెమెరాలలో చిత్రీకరించారు. ఇంటెలిజెన్స్ సిబ్బంది అయితే మీడియా ప్రతినిధులను సైతం వీడియోలు తీసి ఉన్నతాధి కారులకు చేరవేశారంటే పరిస్థితిని అర్థ చేసుకోవచ్చు. ఫిరంగిపురం నుంచి కొండవీడు వెళ్లే ప్రధాన మార్గంలో ఫిరంగిపురం గ్రామ శివారులో చెక్‌పోస్టు ఏర్పాటు చేశారు. అక్కడ రాకపోకలు కొనసాగించే ప్రతి ఒక్కరినీ నిలువరించి వారి వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు చేయడంతో పాటు వివరాలు అడిగి తెలుసుకొని మరీ అనుమతిస్తున్నారు.కొండవీడు గ్రామం వద్ద, కొత్తపాలెం వెళ్లే ప్రధాన రహదారి వద్ద చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు కొనసాగించారు. అదనపు ఎస్పీలు ఎస్.వరదరాజు, ప్రసాద్‌తో పాటు డీఎస్పీలు రవివర్మ, శ్రీహరిబాబు, పోలీసుల ఏర్పాటు చేసిన క్యాంపు నుంచి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అధికారులు, సిబ్బందికి సూచనలు జారీ చేశారు. పోలీసుల హడావుడి పెరగడంతో వ్యవసాయ పనులకు, వ్యక్తి గత పనులపై వెళ్లేవారు ఎన్నడూ లేని విధంగా రోడ్లుపై తనిఖీలు ఏంటంటూ అసహనం వ్యక్తం చేశారు. నిజ నిర్ధారణకు అడుగడుగునా ఆటంకాలు చిలకలూరిపేట/యడ్లపాడు: రైతు పిట్టల కోటేశ్వరరావు(కోటయ్య) మృతిపై ఏర్పాటైన వైఎస్సార్ సీపీ నిజ నిర్ధారణ కమిటీకి పోలీసులు అడుగడుగునా ఆటంకాలు కల్పించారు. గుంటూరు జిల్లాలోని కొండవీడు ఉత్సవాల సందర్భంగా ఈనెల 18న ముఖ్యమంత్రి చంద్రబాబు సభ నిర్వహించారు. దీనికి ఏర్పాట్ల పేరుతో పోలీసులు ఓ బడుగు రైతు ప్రాణాలు బలి తీసుకున్న సంఘటన విదితమే. ఈ విషయమై శాసన మండలిలో ప్రతిపక్ష నేత ఉమ్మారెడ్డి నేతృత్వంలోని కమిటీ బుధవారం కొత్తపాలెం గ్రామాన్ని సందర్శించి, మృతుడు కోటయ్య కుటుంబాన్ని కలసి వివరాలు సేకరించింది. కమిటీలోని సభ్యులైన ఎమ్మెల్యేలు ఆళ్ల రామకృష్ణారెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మొహమ్మద్ ముస్తఫా, వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి కొలుసు పార్థసారథి, నర్సరావుపేట, బాపట్ల, గుంటూరు అంబటి రాంబాబు, మోపిదేవి వెంకటరమణ, లేళ్ల అప్పిరెడ్డి, నర్సరావుపేట పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్త లావు శ్రీకృష్ణదేవరాయలు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మర్రి రాజశేఖర్, ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జున, పార్టీ గుంటూరు నగర అధ్యక్షుడు పాదర్తి రమేష్‌గాంధీ, చిలకలూరిపేట నియోజకవర్గ సమన్వయకర్త విడదల రజని పలువురు పార్టీ నాయకులతో కలసి వచ్చారు. జాతీయ రహదారి నుంచి బోయపాలెం మీదుగా కొత్తపాలేనికి వెళ్లేందుకు బయలుదేరిన నాయకులకు ఆదిలోనే పోలీసులు అడ్డుకున్నారు. తాము శాంతియుతంగా నిజ నిర్ధారణ చేసేందుకు వెళ్తుంటే ఎలా అడ్డుకుంటారని ప్రశ్నించడంతో కొద్దిమందే ఉన్న పోలీసులు నాయకులను వెళ్లనిచ్చారు. తిరిగి కోట గ్రామం వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి భారీగా చేరుకున్న పోలీసులు పార్టీ నాయకుల వాహనాలను అడ్డుకున్నారు. ఈ దశలో ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, కొలుసు పార్థసారథి తదితర నాయకులు పోలీసుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. విడదల రజని, లేళ్ల అప్పిరెడ్డి, మేరుగ నాగార్జున, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి శాంతియుతంగా వెళుతున్న క్రమంలో అడ్డుకోవటం ఏంటని ప్రశ్నించారు. పోలీసుల తీరు సరికాదంటూ..సమస్యను మీరే సృష్టిస్తున్నారని విడదల రజని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు ఏకపక్ష వైఖరితో వాహనాలను అడ్డుకోవటంతో పార్టీ నేతలు, కార్యకర్తలు వాహనాలను వదలి కాలినడకన ముందుకు సాగారు. కొండవీడు వరకు నడక కొనసాగించారు. దీంతో పోలీసులు అక్కడి నుంచి నుంచి కొత్తపాలెం జంక్షన్‌కు „చేరుకుని గ్రామం వైపు, బైపాస్‌లో వెళ్లకుండా బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. కొండవీడు వరకు కాలినడకన వచ్చిన నాయకులు పోలీసులు వెళ్లిపోయాక వచ్చిన తమ వాహనాల్లో ఎక్కిరాగా.. తిరిగి కొత్తపాలెం జంక్షన్ వద్ద అగ్ర నాయకుల వాహనాలను మాత్రం వదిలి పార్టీ కార్యకర్తలను అడ్డుకున్నారు. -
జాయింట్ కలెక్టర్‌గా కోటేశ్వరరావు
సాక్షి, కడప : జిల్లా జాయింట్ కలెక్టర్ (జేసీ)గా పులిపాటి కోటేశ్వరరావును నియమిస్తూ రాష్ట్రప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యదర్శిగా పనిచేస్తున్న ఆయనను ప్రభుత్వం జిల్లా జాయింట్ కలెక్టర్‌గా బదిలీ చేసింది. ఈయనకు తొలుత రంగారెడ్డి జిల్లాలో పోస్టింగ్ ఇచ్చారు. తర్వాత గవర్నర్ పేషీలో పనిచేశారు. అనంతరం హైదరాబాద్‌లో బీసీ కార్పొరేషన్ విభాగంలో పనిచేసిన ఆయనకు 2009లో ఐఏఎస్ క్యాడర్ ఇచ్చిన ప్రభుత్వం జేసీగా పదోన్నతి కల్పించింది. తర్వాత మూడు సంవత్సరాల మూడు నెలల పాటు పశ్చిమ గోదావరి జేసీ పనిచేశారు. నిజాయితీ గల అధికారిగా ఆయనకు పేరుంది. ఏపీపీఎస్సీ కార్యదర్శిగా కేవలం నెలన్నర రోజులు మాత్రమే పనిచేశారు. ఈలోపే కడపకు బదిలీచేశారు. అంతేకాకుండా వివాదాలకు దూరంగా ఉండడంతోపాటు పేదల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూ అందరికీ న్యాయం చేసే వ్యక్తిగా కోటేశ్వరరావు మంచిపేరు గడించారు. ఎన్నాళ్లకెన్నాళ్లకు..: జిల్లాకు సంబం ధించి చాలారోజుల తర్వాత ప్రభుత్వం జేసీని నియమించింది. నెలన్నర రోజుల కిందట కమర్షియల్ ట్యాక్స్ కమిషనర్‌కు సెక్రటరీగా పనిచేస్తున్న నాగరాణిని జేసీగా బదిలీ చేసినప్పటికీ ఆమె విధుల్లో చేరలేదు. అంతకుముందు ఇక్కడ జేసీగా పనిచేస్తున్న శ్వేత మార్చిలో సెలవులపై వెళ్లి తర్వాత బదిలీ అయ్యారు. అప్పటి నుంచి జేసీగా ఎవరినీ నియమించలేదు. జేసీగా నాగరాణిని నియమించినా రాకపోవడంతో ప్రభుత్వం తాజాగా కోటేశ్వరరావును నియమించింది. గత నెలలో ఇన్చార్జి జేసీగా పనిచేస్తున్న జేసీ–2 శివారెడ్డి విదేశీ పర్యటన నిమిత్తం వెళ్లడంతో అప్పటినుంచి ఇన్చార్జి జేసీగా కడప స్పెషల్ కలెక్టర్ నాగేశ్వరరావు బాధ్యతలు నిర్వర్తిస్తూ వస్తున్నారు. కోటేశ్వరరావు మంగళవారం కడపకు చేరుకుని జేసీగా బాధ్యతలు చేపట్టే అవకాశాలు ఉన్నాయి. -
చాంపియన్ కోటేశ్వర్ రావు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఓపెన్ సెయిలింగ్ చాంపియన్‌షిప్‌లో రాష్ట్రానికి చెందిన కుర్రాళ్లు సత్తా చాటారు. హుస్సేన్ సాగర్‌లో నాలుగు రోజుల పాటు జరిగిన ఈ టోర్నీలో పతకాలతో మెరిశారు. తెలంగాణకు చెందిన సెయిలర్లు కోటేశ్వర్ రావు, ఎం. సాయిబాబా, కె. గౌతమ్ జూనియర్స్ లేజర్ 4.7 విభాగంలో తొలి మూడు స్థానాల్లో నిలిచి వరుసగా పసిడి, రజతం, కాంస్య పతకాలను గెలుచుకున్నారు. ఓపెన్ లేజర్ 4.7 విభాగంలోనూ కోటేశ్వర్ రావు రాణించాడు. మొత్తం 69 పాయింట్లు సాధించి కాంస్య పతకాన్ని సాధించాడు. ఈ విభాగంలో మధ్య ప్రదేశ్‌కు చెందిన రామ్ మిలన్ యాదవ్ (26 పాయింట్లు) విజేతగా నిలవగా, తమిళనాడు సెయిలర్ చిత్రేశ్ (63 పాయింట్లు) రన్నరప్‌గా నిలిచాడు. సీనియర్ లేజర్ స్టాండర్డ్ విభాగంలో మహారాష్ట్రకు చెందిన అజయ్‌సింగ్ రాజ్‌పుత్ 19 పాయింట్లు సాధించి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు. అవినాశ్ యాదవ్ (మహారాష్ట్ర, 30 పాయింట్లు), లిమ్ జాన్ (కర్ణాటక, 33 పాయింట్లు) వరుసగా రజత, కాంస్య పతకాలను సాధించారు. బాలికల విభాగంలో హైదరాబాద్ యాట్ క్లబ్‌కు చెందిన సెయిలర్ జూహి దేశాయ్ తెలంగాణ రాష్ట్ర జూనియర్ బాలికల చాంపియన్‌గా నిలిచింది. ఆమె మొత్తం 145 పాయింట్లు సాధించి ఓవరాల్ చాంపియన్‌షిప్‌ను దక్కించుకుంది. పోటీల అనంతరం జరిగిన టోర్నీ ముగింపు కార్యక్రమంలో హెచ్ఎండీఏ కమిషనర్ చిరంజీవులు ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ టోర్నీలో 6 రాష్ట్రాలకు చెందిన 45 మంది సెయిలర్లు పాల్గొన్నారు. -
మూడో స్థానంలో కోటేశ్వర్ రావు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఓపెన్ సెయిలింగ్ చాంపియన్‌షిప్‌లో రెండోరోజు రాష్ట్రానికి చెందిన క్రీడాకారులు రాణించారు. హుస్సేన్ సాగర్‌లో జరుగుతోన్న ఈ టోర్నీలో సోమవారం జరిగిన జూనియర్స్ లేజర్ 4.7 విభాగంలో నగరానికి చెందిన కోటేశ్వర్ రావు మూడో స్థానంలో నిలవగా, కె. గౌతమ్ ఆరో స్థానాన్ని దక్కించుకున్నాడు. ఈ విభాగంలో సోమవారం నాటికి ఆరు రేసులు ముగిసేసరికి మధ్యప్రదేశ్‌కు చెందిన రామ్ మిలన్ యాదవ్ 21 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. తమిళనాడు సెయిలర్ మహేశ్ బాలచందర్ 31 పాయింట్లతో రెండో స్థానంలో, కోటేశ్వర్ రావు 40 పాయింట్లతో మూడో స్థానాన్ని దక్కించుకున్నారు. యూత్ లేజర్ రేడియల్ విభాగంలో మధ్యప్రదేశ్ సెయిలర్ శిఖర్ గార్గ్ (22 పాయింట్లు), గోవింద్ బైరాగి (28 పాయింట్లు, మహారాష్ట్ర), శేఖర్ సింగ్ యాదవ్ (29 పాయింట్లు, మహారాష్ట్ర) వరుసగా తొలి మూడు స్థానాలను దక్కించుకున్నారు. ఈ విభాగంలో జరిగిన ఐదో రేసులో తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్ విద్యార్థి ఏ. సంజయ్ రెడ్డి విజేతగా నిలిచాడు. సీనియర్ లేజర్ స్టాండర్డ్ కేటగిరీలో అజయ్ సింగ్( 10పా. మహారాష్ట్ర) అగ్రస్థానంలో ఉండగా, అవినాశ్ యాదవ్ (17 పా., మహారాష్ట్ర), జీసీకే రెడ్డి (21 పా., ఆంధ్రప్రదేశ్) వరుసగా రెండు, మూడు స్థానాల్లో కొనసాగుతున్నారు. -
అనుమతుల్లేని 665 ప్రైవేట్ బస్సులు సీజ్ : డీటీసీ రమేష్
మూసాపేట, న్యూస్‌లైన్: రంగారెడ్డి జిల్లా, హైదరాబాద్‌ల్లో అనుమతులు లేని మొత్తం 665 ప్రైవేట్ బస్సులు సీజ్ చేశామని డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ రమేశ్ తెలిపారు. బుధవారం కూకట్‌పల్లిలోని ఆర్టీసీ డిపోలో సికింద్రాబాద్ రీజనల్ ఇంధన పొదుపు పక్షోత్సవాల ముగింపు కార్యక్రమం నిర్వహించారు. మొత్తం 11 డిపోల ఆర్టీసీ కార్మికులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముంబై, ఇతర రాష్ట్రాల కన్నా ఏపీఎస్ఆర్టీసీ ఎక్కువ 5.3 కేఎంపీఎల్ తీసుకువస్తుందని అన్నారు. ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ కోటేశ్వర్రావు మాట్లాడుతూ ప్రజల జీవన విధానంలో ఆర్టీసీ మమేకమైందని, గ్రేటర్ హైదరాబాద్‌లో నిత్యం 6వేల బస్సులు నడుస్తున్నాయన్నారు. కార్యక్రమంలో ఆర్టీసీ రీజనల్ మేనేజర్ సత్యనారాయణ, అశోక్ లేలాండ్ సంస్థ సీనియర్ మేనేజర్ సూర్యనారాయణ, సనత్‌నగర్, సికిం ద్రా బాద్ డీవీఎం రాజారాం, విమల, కూకట్పల్లి ఆర్టీసీ డిపో మేనేజర్ ప్రసాద్, కూకట్పల్లి మెకానికల్ ఫోర్‌మెన్ కె.కె.కుమార్, అసిస్టెంట్ మోటా ర్ వెహికిల్ ఇన్స్పెక్టర్ వాసు, ఆర్టీసీ కార్మికులు, యూనియన్ నాయకులు పాల్గొన్నారు. ఆర్టీసీ కేఎంపీఎల్ అవార్డు డ్రైవర్లు వీరే.... కూకట్పల్లి డిపో నుంచి పి.ఎస్. రెడ్డి, సయాజు ద్దీన్, అంజయ్య, రాణిగంజ్ డిపో-1 నుంచి ఎస్.మల్లయ్య, పి.గోపాల్, ఎం.ఎం రెడ్డి, మి యాపూర్-డిపో నుంచి యాదగిరి, అబ్ధుల్ఖా న్, రాజిరెడ్డి, జీడిమెట్ల డిపో నుంచి వైఎస్ సుం దర్, మహేందర్, వెంకటేశ్వర్లుకు అవార్డులు అందజేశారు. -
గడువులోగా ఫిర్యాదులను పరిష్కరించాలి
కలెక్టరేట్, న్యూస్‌లైన్: ప్రజావాణిలో అందిన ఫిర్యాదులను 30 రోజుల నిర్దిష్ట గడువులోగా పరిష్కరించాలని కలెక్టర్ స్మితా సబర్వాల్ జిల్లా అధికారులను ఆదేశించారు. గడువు పూర్తయిన కార్మిక శాఖ అధికారులు 10 ఆర్జీలపై ఎలాంటి సమాచారం ఇవ్వక పోవడంపై డిప్యూటీ కమిషనర్ కోటేశ్వర్‌రావుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. లైన్ సర్వే, బీసీ వెల్ఫేర్, పొల్యూషన్, ఫారెస్టు అధికారులు సకాలంలో తమ ఆర్జీలను పరిశీలించి పరిష్కరించాల్సిందిగా హెచ్చరించారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో ప్రజావాణిలో అందిన ఫిర్యాదులపై కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పరిష్కార ప్రక్రియను వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా 7,053 ఫిర్యాదులు అందగా ఇందులో 6,500 పరిష్కారం కాగా 195 ఫిర్యాదులు తిరస్కరణకు గురయ్యాయన్నారు. 30 రోజుల్లోగా పరిష్కరించాల్సినవి 207, 30 రోజుల పైబడి 29 దరఖాస్తులు ఉన్నాయన్నారు. 3 నెలలు పైబడినవి 81, ఆరు నెలలు పైబడి 16 దరఖాస్తులు ఆయా శాఖల్లో పెండింగ్‌లో ఉన్నాయన్నారు. పంచాయతీ నిధులు సక్రమంగా ఉపయోగించి గ్రామాల్లోని సమస్యలు పరిష్కరించాలని తనను కలిసిన సర్పంచ్‌లకు సూచించారు. పంచాయతీ నిధుల దుర్వినియోగం చేస్తే చట్ట రీత్యా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ సర్పంచ్‌లకు తెలిపారు. గ్రామాలలో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించి అంటు వ్యాధులు ప్రబల కుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. సర్పంచ్‌లు పనిచేసే ప్రతి పనికి సంబంధించి ఖచ్చితమైన రికార్డులను నిర్వహించాలని సూచించారు. వీఆర్ఏ నుంచి వీఆర్ఓలుగా పదోన్నతులు పొందిన 47 మందికి కలెక్టర్ ప్రోసిడింగ్ అందజేశారు. ఈ సమావేశంలో జేసీ శరత్, ఏజేసీ మూర్తి, డీఆర్ఓ సాయిలు, ఆర్డీఓ సాయిలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.