‘కోట్ల’ కిరికిరి | Private buses illegal danda | Sakshi
Sakshi News home page

‘కోట్ల’ కిరికిరి

Published Mon, Apr 28 2014 2:27 AM | Last Updated on Sat, Sep 2 2017 6:36 AM

‘కోట్ల’ కిరికిరి

‘కోట్ల’ కిరికిరి

  •    ప్రైవేట్ బస్సుల అక్రమదందా
  •   సర్కారు ఆదాయానికి కేశినేని గండి
  •   ఆయనో విజయవాడ టీడీపీ ఎంపీ అభ్యర్థి ... ఈ టికెట్ చేజిక్కించుకోవడానికి చంద్రబాబుతోనే  తలపడటమే కాకుండా పత్రికలకెక్కి నానా రాద్ధాంతం చేశారు. కోట్ల రూపాయలు వెదజిమ్మగలనని అధిష్ఠానాన్ని బలవంతంగా ఒప్పించి ఎన్నికల బరిలోకి దిగారీయన. ఈయన గతాన్ని ఓసారి పరిశీలిస్తే అడుగడుగునా అవినీతిమయం. చిత్తశుద్ధితో సాగే సమైక్య ఉద్యమాన్ని కూడా తన స్వార్థానికి ఉపయోగించుకున్నారు.
     
    సాక్షి, విజయవాడ : కేశినేని నాని వ్యవహారం గురివింద గింజ సామెతలా ఉంది. ప్రచారపర్వంలో ప్రత్యర్థులపై ఆరోపణలు చేయడమే పనిగా పెట్టుకున్న ఆయన తాను చేస్తున్న అక్రమ ట్రావెల్స్ వ్యాపారం గురించి అస్సలు మాట్లాడరు. టూరిస్టు పర్మిట్ తీసుకుని నిబంధనలకు వ్యతిరేకంగా స్టేజి కేరియర్లుగా బస్సులను తిప్పుతూ ప్రభుత్వానికి కోట్ల రూపాయల్లో గండి కొడుతున్నారు.  సమైక్య ఉద్యమ సమయంలో పైకి మద్దతు ఇచ్చినట్లు నటించి.. దొంగచాటుగా బస్సులను తిప్పుకొన్న సంగతి తెలిసిందే. ఉద్యమాన్ని అడ్డం పెట్టుకుని కోట్ల రూపాయలు జనం నుంచి దోచేశారు.
     
    అడ్డదారుల్లో బస్సులు నడిపింది ఇలా..

    పాలెం దుర్ఘటనతో అప్పట్లో  ప్రైవేటు బస్సులు కొంతకాలం నడవలేదు.
     
    కేశినేని నాని మాత్రం తన బస్సులను డొంకదారుల్లో తిప్పారు.
     
    విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లాల్సిన బస్సులను  కంచికచర్ల నుంచి ఖమ్మం జిల్లా మీదుగా రాజధానికి  నడిపారు. ప్రయాణికులను విజయవాడ నుంచి ఇన్నోవాలో కంచికచర్ల వరకు తీసుకువెళ్లి అక్కడ వారిని బస్సులు ఎక్కించారు.
     
    కొన్ని బస్సుల్ని ఇక్కడి నుంచి ఖాళీగా తీసుకువెళ్లి గుంటూరు మార్గంలో చెక్‌పోస్టు దాటిన తర్వాత ప్రయాణికులను ఎక్కించారు.
     
    విశాఖపట్నం వెళ్లే బస్సులను పామర్రులో నిలిపి అక్కడి నుంచి హనుమాన్‌జంక్షన్ మీదుగా తీసుకువెళ్లారు.
     
    హైకోర్టు స్టేతో దందా మళ్లీ  మొదలు..

    ప్రభుత్వ అధికారులు ఒత్తిడి తెచ్చినా నాని మాత్రం తన దందా మానలేదు. పలు బస్సులను సీజ్ చేశారు. కొన్నింటి పర్మిట్లను సస్పెండ్ చేశారు. దీనిపై కేశినేని హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు. బస్సులను మార్గం మధ్యలో సీజ్ చేయవద్దంటూ  హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో కేశినేని ట్రావెల్స్ దందా మళ్లీ మొదలైంది.  నెల రోజులుగా అధికారులు ఎన్నికల విధుల్లో ఉండడంతో కేశినేని ట్రావెల్స్ నుంచి అక్రమ సర్వీసులను నడుపుతున్నారు.

    దొంగ పర్మిట్లు, నకిలీ నంబర్లతో బస్‌లను దొంగట్రిప్పులు వేసి సొమ్ముచేసుకుంటున్నారు. 70 బస్సులను స్టాపేజి చూపించి వాటిని నడుస్తున్న బస్సుల నంబర్లతో తిప్పుతున్నట్లు సాటి ట్రావెల్స్ యాజమాన్యాలే ఆరోపిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఎప్పటికప్పుడు కొన్ని బస్సులను తాత్కాలికంగా ఆపినట్లు చూపిస్తారు. ఆపిన బస్సులకు ఆ త్రైమాసికానికి ఒక్కో బస్సుకు లక్షన్నర రూపాయల పన్ను ఎగ్గొడుతున్నారు.

    స్టాపేజి చూపించిన బస్సులకు ప్రస్తుతం తిరుగుతున్న బస్సు నంబర్లు వేసి ఒక బస్సును హైదరాబాద్‌కు పంపితే, మరో బస్సును విశాఖపట్నం పంపుతారు. ప్రతి టోల్‌గేట్ వద్ద బస్సు నంబర్లు నమోదు అయినా, రాష్ట్రవ్యాప్తంగా తిరుగుతున్న వాహనాల డేటాను క్రోడీకరించే అవకాశం లేకపోవడంతో ఇష్టారాజ్యంగా దొంగ నంబర్లతో బస్సులను తిప్పుతున్నారు.
     
    బినామీపేర్లతో..
     
    హైదరాబాద్, విజయవాడ, బెంగళూరు, విశాఖ, షిర్డీ మధ్య సుమారు 140 బస్సులను నాని తిప్పుతున్నారు. ఈ బస్సులన్నీ కేశినేని ట్రావెల్స్ పేరుతో కాకుండా కేశినేని నాని, ఆయన భార్యతో పాటు సిబ్బంది బినామీ పేర్లతో నడుస్తున్నాయి. ఆలిండియా పర్మిట్ సీటుకు ప్రతి మూడు నెలలకు రూ. 3650, స్టేట్ పర్మిట్‌కు రూ. 2650  చెల్లించి తీసుకోవాల్సి ఉంటుంది. పది బస్సులకు పర్మిట్ తీసుకుంటే ఆ నంబర్లతో వీటికి రెట్టింపు బస్సులు నడపుతారు.

    పర్మిట్ నిబంధనల ప్రకారం ఒక చోటి నుంచి ఇంకో చోటికి ప్రయాణీకులను తీసుకువెళ్లవచ్చు. అదికూడా విడివిడిగా ప్రయాణికులకు టికెట్లు ఇవ్వకూడదు. అయితే ఎలాంటి నిబంధనలు పాటించరు. ఆర్టీసీకి పోటీగా సమాంతర వ్యవస్థను నడుపుతూ ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నారు. మన రాష్ట్రంలో ప్రభుత్వ రంగంలో ఆర్టీసీ ఉండటంతో స్టేజి కేరియర్‌గా బస్సులు తిప్పేందుకు అనుమతి లేదు.  తనకున్న ధన బలంతో బస్సులను యథేచ్ఛగా తిప్పుతున్నారు.
     
     పగలు ఉద్యమం... రాత్రి వ్యాపారం

     సమైక్య ఉద్యమం జరిగినన్ని రోజులు నాని సమైక్యవాది ముసుగులో ఉదయం బంద్‌లు చేయించారు.  రాత్రి అయ్యేసరికి కేశినేని ట్రావెల్స్‌కు చెందిన  బస్సుల్ని యథావిధిగా నడిపించారు.  విజయవాడ నుంచి హైదరాబాద్, చెన్నై, కోయంబత్తూరు, బెంగ ళూరు, విశాఖపట్నం తదితర ప్రాంతాలకు తిప్పి వ్యాపారం చేశారు. ఆర్టీసీ బస్సులు లేకపోవడంతో ప్రవేటు దందా నడిపారు.   విజయవాడ నుంచి బెంగళూరుకు రూ.1000 నుంచి రూ.1200  చార్జీ ఉంటే, ప్రైవేటు బస్సుల్లో  రూ.3000 వరకు వసూలు చేశారు.  విజయవాడ నుంచి హైదరాబాద్‌కు ఓల్వో బస్సు చార్జీ   రూ.1000  వరకు వసూలు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement