కొనసాగుతున్న ఆర్టీఏ దాడులు, 52 బస్సులు స్వాధీనం | RTA attacks still continued, 52 Private buses seized | Sakshi
Sakshi News home page

కొనసాగుతున్న ఆర్టీఏ దాడులు, 52 బస్సులు స్వాధీనం

Published Sat, Nov 23 2013 2:31 AM | Last Updated on Sat, Sep 2 2017 12:52 AM

RTA attacks still continued, 52 Private buses seized

సాక్షి, హైదరాబాద్: నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న ప్రైవేట్ బస్సులపై రవాణాశాఖ చేస్తున్న దాడులు శుక్రవారం కూడా కొనసాగాయి. బెంగళూరు జాతీయ రహదారిపై నిర్వహించిన దాడుల్లో నిబంధనలు పాటించని 52 బస్సులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు హైదరాబాద్ డీటీసీ టీ రఘునాథ్ పాత్రికేయులకు తెలిపారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల అధికారులు దాడుల్లో పాల్గొన్నారని, పట్టుబడిన బస్సులు స్టేజి క్యారేజీలుగా తిరుగుతున్నవేనని ఆయన వివరించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement